అచ్చం గజనీలాగే కనిపిస్తున్నా.. | This really hot male model thinks his face tattoos will take him to the next level | Sakshi
Sakshi News home page

అచ్చం గజనీలాగే కనిపిస్తున్నా....

Published Sat, Jul 19 2014 2:36 PM | Last Updated on Sat, Sep 2 2017 10:33 AM

అచ్చం గజనీలాగే కనిపిస్తున్నా..

అచ్చం గజనీలాగే కనిపిస్తున్నా..

ఫోటోలో ఇతడ్ని చూస్తుంటే ‘గజనీ’ గుర్తుకొస్తున్నాడు కదూ? కెనడాలోని మోంట్రియల్‌కు చెందిన ఈ అభినవ గజనీ పేరు విన్ లాస్. వయసు 24 ఏళ్లు. అచ్చం గజనీలాగే కనిపిస్తున్నా.. ఇతడికి షార్ట్ టెర్మ్ మెమరీ లాస్ లేదండోయ్. మరి ఒళ్లంతా ఆ టాటూలు ఎందుకు వేయించుకున్నాడనేగా మీ డౌట్? సినిమాలో గజనీ ఏ విషయాన్నీ మరచిపోకుండా గుర్తుంచుకోవడం కోసం పచ్చబొట్లు పొడిపించుకుంటే.. విన్ లాస్ మాత్రం జనమంతా తనను గుర్తించాలని ఇలా టాటూలమీద టాటూలు వేయించేసుకుంటున్నాడు.

పైగా రకరకాల సైజుల్లో రకరకాల పదాలు.. ఒకదాని కొకటి సంబంధం ఉండదు.. అసలు ఆ పదం ఎందుకు వేయిం చుకున్నాడో అర్థం కాదు. ఒక్క ముఖంపైనే ఏకంగా 24 పదాలున్నాయి. అర్థంపర్థం లేకుండా ఏమిటా పదాలు అని అడిగితే.. ‘‘అద్భుతమైన పెయింటింగ్స్‌లో మనకు ఏమైనా అర్థమవుతుందా? ఇది కూడా అంతే’’ అని తెలివిగా సమాధానం చెబుతాడు. 16వ ఏట తొలి టాటూ పొడిపించుకున్న విన్ అసలు లక్ష్యం.. ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ కావడమేనట. మరి ఫేమస్ కావాలంటే ఏదో ప్రత్యేకత ఉండాలి కదా? అందుకే ఈ మార్గాన్ని ఎంచుకున్నానని చెబుతున్నాడు. వాటేన్ ఐడియా..!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement