Tattoos
-
శరీరంపై 800 టాటూలు.. అక్కడే చిక్కొచ్చి పడింది..!
టాటూ.. శరీరాన్ని మరింత అందంగా ఫ్యాషన్‌గా కనిపించేలా చేస్తుంది. అందరి కళ్లూ మనమీదే ఉండేలా ఆకర్షణీయంగా ఉంటాయి. కానీ బ్రిటన్‌కు చెందిన ఓ మహిళకు మాత్రం టాటూలే తన పాలిట శాపంగా మారాయి. టాటూల కారణంగానే ఎక్కడకు వెళ్లినా.. దిక్కరింపులే ఎదురవుతున్నాయట. జీవనోపాధి కూడా లభించట్లేదట. ఎందుకంటే..? ఆమె పేరు మెలిస్సా స్లోన్(46) యూకేకు చెందిన మహిళ. ఇంతకు ముందు తనకు కనీసం టాయిలెట్ క్లీనింగ్ ఉద్యోగమైనా లభించేది. కానీ ఇప్పుడు అది కూడా దొరకట్లేదు. ఎందుకంటే ఆమె తన శరీరంపై ఏకంగా 800 టాటూలను వేయించుకుంది. శరీరమంతా టాటూలతో నిండిపోయింది. దీంతో ఎక్కడకు వెళ్లినా ఉద్యోగం ఇవ్వకుండా యజమానులు తిరస్కరిస్తున్నారట. మెలిస్సాకు తన 20వ ఏట నుంచి టాటూలను శరీరంపై వేయించుకునే అలవాటు ఉండేది. మొదట్లో ప్రతి వారం రెండు నుంచి మూడు టూటూలు వేయించుకుంటే.. ఇక రాను రాను పరిస్థితి మారిపోయింది. వాటికి అలవాటు పడి శరీరమంతా పచ్చబొట్లను పొడిపించుకుంది. దీంతో చూడటానికి ఇబ్బందికరంగా మారిపోయింది. మెలిస్సాకు ప్రస్తుతం ఇద్దరు పిల్లలు ఉన్నారు. టూటూల కారణంగా శరీరం నీలం రంగులో మారిపోయిందని ఆమె చెబుతున్నారు. కానీ అవంటే తనకు ఎంతో ఇష్టమని చెబుతోంది. బహుశా ప్రపంచంలో తన కంటే ఎక్కువ టాటూలు ఎవరి శరీరంపై ఉండబోవని ఆమె అన్నారు. ఇదీ చదవండి: గిన్నీస్ రికార్డ్: చేతులపై 25 సెకన్లలో 75 మెట్లు దిగి.. -
కోహ్లి చేతిపై 11 పచ్చబొట్ల వెనుక రహస్యం ఏంటంటే..
విరాట్ కోహ్లి.. టీమిండియా మాజీ కెప్టెన్.. స్టార్ క్రికెటర్. ఈ ఒక్క పదం అతనికి సరిపోదు. ఎందుకంటే సచిన్ తర్వాత బ్యాటింగ్‌లో టీమిండియా కింగ్‌లా మారిన కోహ్లి ఎన్నో ఘనతలు అందుకున్నాడు. మానసికంగా, శారీరకంగా ఎంతో ఫిట్‌గా కనిపించే కోహ్లి మైదానంలోనే అంతే అగ్రెసివ్‌గా ఉంటాడు. అంతర్జాతీయ క్రికెట్లో లెక్కలేనన్ని రికార్డులు సాధించిన కోహ్లి ఇప్పటి యూత్‌కు ఒక ఐకాన్. మరి అంత పాపులారిటీ సాధించిన కోహ్లి చేతిపై ఉన్న 11 పచ్చబొట్ల గురించి ఎప్పుడైనా తెలుసుకోవాలనిపించిందా. అయితే ఇది చదివేయండి. కోహ్లి రెండు చేతులకు 11 పచ్చబొట్లు ఉంటాయి. ఒక్కో పచ్చబొట్టుకు ఒక్కో అర్థం దాగి ఉంటుంది. పచ్చబొట్లుగా తల్లిదండ్రుల పేర్లు.. తొలి పచ్చబొట్టు కోహ్లి తల్లిదండ్రులది. సరోజ్, ప్రేమ్ అని కోహ్లి ఎడమ చేతిపై భుజ భాగంలో రాసి ఉంటుంది. 18వ ఏటనే అతని తండ్రి మరణించాడు. తండ్రి అంటే చాలా ఇష్టమున్న కోహ్లి తండ్రి గుర్తుగా ఈ పచ్చబొట్టును పొడిపించుకున్నాడు. ''మాటల్లో చెప్పలేని ఒక కనెక్షన్ నా తల్లిదండ్రులతో ఉంది. అది అనుభూతి చెందడానికే వారిపేర్లు పచ్చబొట్టు వేయించుకున్నా. నేను చనిపోయేవరకు వారి పేర్లు నా చేతిపై శాశ్వతం'' అని ఒక సందర్బంలో కోహ్లి చెప్పుకొచ్చాడు. ►కోహ్లి అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన సందర్బాలను పచ్చబొట్టుగా వేయించుకున్నాడు. 2008లో శ్రీలంకతో మ్యాచ్ ద్వారా వన్డేల్లో అరంగేట్రం చేసిన కోహ్లి టీమిండియా తరపున 175వ క్యాప్ అందుకున్నాడు. ఇక 2011లో టెస్టుల్లో అరంగేట్రం ఇచ్చిన కోహ్లి 269వ ఆటగాడిగా అడుగుపెట్టాడు. వన్డే, టెస్టు అరంగేట్రానికి గుర్తుగా 175, 269లను పచ్చబొట్టుగా పొడిపించుకున్నాడు. గాడ్స్ హై టాటూ.. కోహ్లి మూడో పచ్చబొట్టు దేవుడి కన్నుగా ఉంటుంది. దేవుడు ఆ కన్నుతో తనను చూస్తున్నాడని.. ఈ పచ్చబొట్టు సారాంశం ఏంటంటే.. ఒక మనిషిగా జీవితాన్ని అర్థం చేసుకోవడంతో పాటు నేను ఏం చేయాలి అనేది చూపిస్తుంది అని కోహ్లి ఒక సందర్బంలో వివరించాడు. ఓం శబ్దం పచ్చబొట్టుగా.. ఓంకార శబ్దం వింటే చాలు భక్తుల పులకించిపోతారు. నన్ను కూడా ఓం అంతలా ఆకట్టుకుంది. విశ్వంలో ఓం అనే పదానికి చాలా అర్థం ఉందని కోహ్లికి నమ్మకం. అంతేకాదు ఓం అనే పచ్చబొట్టు కోహ్లికి ఎంత ఎదిగినా తన మూలాలు గుర్తుచేస్తుందట. స్కార్పియో టాటు.. విరాట్ కోహ్లి రాశి వృశ్చికం. నవంబర్‌లో పుట్టిన కోహ్లి రాశి అదేనంట. వృశ్చిక రాశి ఉన్నవారు జీవితంలో స్రాంగ్‌గా ఉంటారని.. ఎలాంటి చాలెంజ్‌నైనా సమర్థంగా ఎదుర్కొంటారని కోహ్లి నమ్మకం. అందుకే వృశ్చిక రాశికి ఇంగ్లీష్ పదమైన స్కార్పియోనూ పచ్చబొట్టుగా వేయించుకున్నాడు. ►కోహ్లి చేతికి ఉన్న ఆరో పచ్చబొట్టు జపనీస్ సమురాయ్. జపనీస్ సమురాయ్ అంటే ఒక మిలటరీ అధికారి ఒక యుద్దం తర్వాత మరొక యుద్దానికి వెళుతుంటారు. అయితే ఈ యుద్దానికి వెళ్లేటప్పుడు ఏడు ధర్మాలు పాటిస్తారంట. అవి న్యాయం, ధైర్యం, నిజాయితీ, నిబద్ధత, పరోపకారం, మర్యాద.. ఈ ఏడు తన జీవితంలో కూడా ఉండేలా చూసుకునేవాడినని .. అందుకే పచ్చబొట్టుగా పొడిపించుకున్నానని చెప్పుకొచ్చాడు. రోజు ఉదయం లేవగానే కోహ్లి మొదట చూసుకునేది జపనీస్ సమురాయ్ అంట. లార్డ్ శివ.. కోహ్లికి శివుడు అంటే చాలా ఇష్టం. తనకు ఏం కష్టమొచ్చినా చిన్నప్పటి నుంచి శివుడినే ఆరాధించేవాడు. అందుకే శివుడి రూపాన్ని పచ్చబొట్టుగా వేయించుకున్నాడు. ఇవేగాక కోహ్లి చేతిపై మొనాస్ట్రీ(ఏ విషయంలోనైనా ఫోకస్‌గా ఉండేలా), ట్రైబల్ ఆర్ట్(తనపై తనకు నమ్మకం) పచ్చబొట్లు ఉంటాయి. చదవండి: 'కోహ్లికి ధోని అండ.. పాక్‌లో పుట్టడం నా దురదృష్టం' -
టాటూ చెప్పే ‘డ్రగ్స్’ కథ
సాక్షి, హైదరాబాద్/బంజారాహిల్స్: రాడిసన్ బ్లూప్లాజా హోటల్లోని పుడ్డింగ్ అండ్ మింక్ పబ్‌లో వెలుగులోకి వచ్చిన రేవ్ పార్టీ వ్యవహారంతో నిఘా వర్గాలు అప్రమత్తమయ్యాయి. స్థానిక పోలీసుల నుంచి ప్రాథమిక వివరాలు సేకరించిన ఇంటెలిజెన్స్ అధికారులు.. పబ్బుల్లో జరుగుతున్న కార్యకలాపాలపై రహస్య విచారణ చేపట్టారు. డ్రగ్స్ సరఫరాలో టాటూలు, కోడ్ వర్డ్స్ సహా పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ► విలాసాలకు నెలవుగా మారిన బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజగుట్ట, గచ్చిబౌలి, మాదాపూర్ తదితర ప్రాంతాల్లోని పబ్‌లలో డ్రగ్స్ దందా సాగుతున్నట్టు పోలీసు వర్గాలు చెప్తున్నాయి. ► కొన్ని పబ్‌లు సొంతంగా యాప్స్, వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపులు నిర్వహిస్తూ కస్టమర్లకు రహస్యంగా రేవ్ పార్టీలపై సమాచారం అందిస్తున్నాయని అధికారులు గుర్తించారు. ► యాప్‌లు, గ్రూపుల ద్వారా రిజిస్టర్ చేసుకుని పార్టీకి హాజరయ్యే వారికి నిర్వాహకులు టాటూలు వేస్తున్నారు. కస్టమర్ల మణికట్టుపై ఉండే ఈ టాటూ ఆధారంగానే ఏ డ్రగ్ ► కుడి చేయి మణికట్టుపై టాటూ ఉంటే.. వారికి గంజాయి, హష్ ఆయిల్ సరఫరా చేయాలని అర్థం. ఎడమ చేతి మణికట్టుపై ఉంటే కొకైన్, ఎండీఎంఏ వంటి డ్రగ్స్ సరఫరా చేస్తారు. ► కొన్ని రేవ్ పార్టీల్లో గంజాయి, హష్ ఆయిల్‌ను నేరుగా సరఫరా చేయట్లేదు. పార్టీ ప్రారంభంకావడానికి ముందే నిర్వాహకులు.. ఈ డ్రగ్స్‌ను నింపిన సిగరెట్లు సిద్ధం చేసి ఉంచుతున్నారు. వాటినే కస్టమర్లకు అందిస్తున్నారు. ► కొందరు పబ్ నిర్వాహకులు రేవ్ పార్టీలకు సంబంధించి ‘స్పెషల్’, ‘ఆఫర్’, ‘స్కీమ్’, ‘లిమిటెడ్’పేరుతో ప్రత్యేక కోడ్ భాషను వాడుతున్నారు. భారీగా డబ్బు వసూలు చేసే ఈ ► హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో తెల్లవారుజామున జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు, ఘర్షణలకు.. ఈ పార్టీలకు సంబంధం ఉన్నట్టు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఈ కోణంలో శాంతిభద్రతలు, ట్రాఫిక్ విభాగం అధికారులను అప్రమత్తం చేశాయి. -
ChaySam Divorce: ప్రేమకు గుర్తుగా టాటూలు...ఇప్పుడు విడాకులు!
టాలీవుడ్లో రొమాంటిక్ కపుల్‌గా గుర్తింపు పొందిన అక్కినేని నాగ చైతన్య – స్టార్ హీరోయిన్ సమంతల నాలుగేళ్ల వివాహ బంధానికి తెర పడింది. తామిద్దరం విడాకులు తీసుకోనున్నట్లు చైతన్య, సమంత సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఎంతో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ న్యూస్ టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. అసలు ఇలాంటి వార్త వినాల్సి వస్తుందని అక్కినేని అభిమానులు అస్సలు ఊహించలేదు. ఏడేళ్ల పాటు ప్రేమించుకున్న ఈ జంట.. పెద్దలను ఒప్పించి 2017లో పెళ్లి చేసుకున్నారు. నాలుగేళ్ల పాటు ఒకరి మీద ఒకరి ప్రేమను ఎన్నో రకాలుగా చూపించారు. తమ ప్రేమను జీవితాంతం గుర్తుండిపోవాలని శరీరంపై టాటూలు కూడా వేయించుకున్నారు. చైతూ తో తన బంధాన్ని గుర్తు చేసేలా సమంత మూడు టాటూలు వేయించుకుంది. తమ ప్రేమకు పునాది వేసిన ‘ఏం మాయ చేశావే’ సినిమా పేరుకు షార్ట్ ఫామ్ YMC అనే అక్షరాలు తన మెడ వెనుక భాగంలో టాటూ వేయించుకుంది. ఇక చైతన్య-సామ్‌లు కలిసి ఒకే రకమైన టాటూని కుడిచేతి మణికట్టుపై వేయించుకున్నారు. ఇవే కాదు చై మీద ప్రేమను ఓ సీక్రెట్ టాటూతో చూపించింది సమంత. ఏకంగా చైతన్య సంతకాన్ని తన తన నడుము మీద ఉన్న టాటూగా వేయించుకున్నారు. ఇలా తమ ప్రేమను టాటూ రూపంలో పదిలం చేసుకున్న సమంత… ఇప్పుడు విడాకులు తీసుకోవడం అక్కినేని అభిమానులకి విస్మయానికి గురిచేస్తుంది. చై-సామ్ పెళ్లినాటి ఫోటోలు -
బాయ్‌ఫ్రెండ్ పేరును మెడపై టాటూ వేసుకున్న నటి
నటి, గాయని శిబానీ దండేకర్ కొత్త టాటూ వేయించుకున్నారు. బాయ్‌ఫ్రెండ్ ఫర్హాన్ అక్తర్ పేరును ఆమె మెడమీద పచ్చబొట్టు వేసుకున్నారు. ఈ విషయాన్ని శిబానీనే స్వయంగా వెల్లడించారు. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో మెడపైన ఉన్న ఫర్హాన్ అక్తర్ అని ఉన్న టాటూ చిత్రాన్ని పంచుకున్నారు. ముందుగా దీనిని టూటూ ఆర్టిస్ట్ కే షేర్ చేయగా అనంతరం శిబానీ రీపోస్టు చేశారు. ఈ ఫోటోలో ఆమె ముఖం పూర్తిగా కనిపించపోయిన మెడపై పచ్చబొట్టు మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. కాగా శిబానీ, పర్హాన్ గత మూడేళ్లుగా రిలేషన్షిప్లో ఉన్న విషయం తెలిసిందే. చదవండి: షూటింగ్లో గాయపడ్డ ప్రియాంక! ఆందోళనలో ఫ్యాన్స్.. అయితే తమ ప్రేమ విషయాన్ని ఎప్పుడూ దాచేందుకు ప్రయత్నించలేదు ఈ జంట. కొన్నేళ్ల క్రితమే తామ బంధాన్ని సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించారు. అప్పటి నుంచి శిబానీ దండేకర్, ఫర్హాన్ అక్తర్ తరచూ ఇన్‌స్టాగ్రామ్‌లో తమకు చెందిన విషయాలను షేర్ చేస్తూ ఉంటారు. కాగా గత ఫిబ్రవరిలో షీబానీ, ఫర్హాన్ ప్రేమ ప్రయాణానికి మూడేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఫర్హాన్.. శిబానీని ముద్దు పెట్టుకుంటున్న ఫోటోను షేర్ చేశాడు. ఇక ఇటీవల వీరి పెళ్లి ప్రస్తావన రాగా.. వివాహం గురించి ఇంకా ప్లాన్ చేసుకోలేదని, ఎప్పుడూ ఈ టాపిక్ మాట్లాడుకోలేదని నటి పేర్కొన్నారు. ఒకవేళ ప్లాన్ చేసుకుంటే తప్పకుండా చెబుతామని వెల్లడించారు. ఇదిలా ఉండగా ఫర్హాన్ అక్తర్ ఇంతకముందే హెయిర్‌స్టైలిస్ట్ అధునా భబానీని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అతనికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇక సినిమా విషయానికొస్తే రాకేష్ ఓంప్రకాష్ మెహ్రా దర్శకత్వంలో ఫర్హాన్ నటించిన తుఫాన్ చిత్రం జూలై 16న ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైంలో విడుదల అయింది. చదవండి: టాలీవుడ్లోకి మరో వారసురాలు.. హీరోయిన్గా మేధ శ్రీకాంత్! View this post on Instagram A post shared by Farhan Akhtar (@faroutakhtar) -
ఆపాదమస్తకం.. రామనామం
సాక్షి, భద్రాచలం: ‘ఓ రామ.. శ్రీరామ.. నీ నామమెంతో రుచిరా’అంటూ వేనోళ్ల కీర్తించాడు భక్త రామదాసు. కానీ ఆ గ్రామంలోని అందరూ వయో, లింగ భేదం లేకుండా ఆపాదమస్తకం రామనామాన్ని పచ్చబొట్టుగా పొడిపించుకుని తమ దేహాన్నే దేవాలయం గా మార్చుకున్నారు. మనసును, దేహాన్ని శ్రీరామమయంగా మలుచుకున్నారు. అపర రామదాసుల్లా శ్రీరాముడిని నిత్యం కీర్తిస్తుంటారు. ఛత్తీస్‌గఢ్‌లోని రాయగఢ్ జిల్లా సారంగడ్ తాలూకాలో నందేలి అటవీ ప్రాంతంలో ‘శ్రీరామనామి’తెగ వారు జీవిస్తుంటారు. వారి సంస్కృతి సంప్రదాయాలు చాలా వినూత్నంగా ఉంటాయి. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు శిరస్సు నుంచి పాదం వరకు శ్రీరామ నామాలను పచ్చబొట్టుతో పొడిపించుకుంటారు. శ్రీరాముడిని ఆవహించుకున్నట్లు భక్తిభావంతో ప్రతిరోజూ శ్రీరామ నామాన్ని జపిస్తుంటారు. ఈ తెగలోని వారు మాంసాహారం, ధూమపానం, మద్యపానం సేవించకుండా నియమ నిష్టలతో రాముడిని పూజిస్తుంటారు. తమ పనులు, ఇళ్లలో శుభకార్యాలు జరిగినా శ్రీరామనామంతోనే ప్రారంభిస్తారు. ఇది తరతరాలుగా వస్తున్న ఆనవాయితీ. దేహాన్నే ఆలయంగా మార్చుకుని.. 19వ శతాబ్దంలో నాటి సామాజిక పరిస్థితుల వల్లే ‘శ్రీరామనామి’తెగ ఆవిర్భవించినట్లు ప్రచారంలో ఉంది. అప్పటి ఉన్నత తెగల వారు దేవాలయాల్లోకి కింది వర్గాల వారిని అనుమతించకపోయేవారు. దీంతో 1890వ దశకంలో పరశురామ్ అనే వ్యక్తి తన నుదిటిపై శ్రీరామ నామాన్ని పచ్చబొట్టు పొడిపించుకున్నాడని ప్రచారంలో ఉంది. ఆయనే ‘శ్రీరామనామి సమాజ్’కు ఆద్యుడు అని చెబుతుంటారు. అప్పటి నుంచి ఆ తెగకు చెందిన వారు శ్రీరామనామాన్ని చెరిగిపోని ముద్రగా భక్తి భావంతో ఉంచుకొని తమ దేహాన్నే దేవాలయంగా మలుచుకొని శ్రీరాముడిని కొలుస్తున్నట్లు చెబుతారు. ఒంటిపైనే కాకుండా వస్త్రాలను, నెమలి ఈకలతో చేసిన శిరస్త్రానంపై కూడా శ్రీరామ నామమే ఉంటుంది. ఏటా మూడ్రోజులు భజన రామనామి తెగ ఆధ్వర్యంలో ఏటా అక్కడ డిసెంబర్, జనవరిలో మూడు రోజుల పాటు భజన మేళా నిర్వహిస్తారు. అక్కడి తెగ వారి సంస్కృతీ సంప్రదాయాలకు విలువిచ్చి ఆ రాష్ట్రంలో ప్రభుత్వ నేతలు ఈ మేళాకు హాజరవుతారు. జాతరకు పెద్ద సంఖ్యలో తెగకు చెందిన వారు హాజరుకావడంతో పాటు ఆ తెగకు చెందిన యువతీ యువకులకు పెళ్లిళ్లు జరిపిస్తుంటారు. -
ఒళ్లంతా పచ్చబొట్లే.. ఇదేం పిచ్చిరా నాయనా
పారిస్ : పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పే ఉపాధ్యాయుడి వేషధారణ ఎంత సక్రమంగా ఉంటే పిల్లలు కూడా అలాగే ఉంటారు. టీచర్ ఎంత పద్దతిగా ఉంటే విద్యార్థులు కూడా అంత బాగుంటారని ప్రతీ తల్లిదండ్రులు భావిస్తారు. కానీ ఇక్కడ ఒక టీచర్ మాత్రం ఒకటి, రెండు కాదు ఏకంగా శరీరమంతా పచ్చబొట్లు పొడిపించుకున్నాడు. చివరికి కంట్లోని గుడ్డు పక్కన ఉన్న పొరను కూడా తొలిగించుకొని టాటూ వేయించుకున్నాడు.. అతని అవతారం చూసిన పిల్లల తల్లిదండ్రులు స్కూల్ యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. దీంతో స్కూల్ యాజమాన్యం అతన్ని ఉద్యోగం నుంచి తీసేశారు. (చదవండి : పార్లమెంట్‌లోని బార్లలో పొంగుతున్న బీర్లు) వివరాలు.. సిల్వైన్ అనే వ్యక్తి ఫ్రాన్స్ దేశంలోని పలైసేలోని డాక్టూర్ మోరే ఎలిమెంటరీ స్కూల్లో టీచర్‌గా పనిచేస్తున్నాడు. తల నుంచి కాలు వరకు టాటూలు వేయించుకున్నాడు. 35 ఏండ్ల సిల్వైన్ ఆరు సంవత్సారాల వయసున్న పిల్లల నుంచి మొదలుపెట్టి పెద్దలకు బోధిస్తున్నాడు. దీంతో అతనిని ఫ్రెంచ్ కిండర్ గార్టెన్‌లో బోధించకుండా విధుల నుంచి తొలగించారు. 'త్వరలో నా ప్రొఫెషన్‌ను మళ్లీ కొనసాగిస్తా. పిల్లలకు, నాకు మధ్య మంచి అనుబంధం ఉంది. వారి తల్లిదండ్రులు కూడా నాతో బాగానే ఉంటారు. కాకాపోతే నన్ను దూరం నుంచి చూసి తప్పుగా అర్థం చేసుకున్నారంటూ' సిల్వైన్ చెప్పుకొచ్చాడు. కాగా సిల్వైన్కు 27 ఏండ్ల వయసు నుంచే టాటూల మీద ఇష్టం ఏర్పడింది. ఈ 8 సంవత్సరాల్లో అతని చెవులు, నాలుకతో సహా దాదాపు మొత్తం శరీరాన్ని సిరాతో కప్పేశాడు. (చదవండి : ఆర్మేనియా– అజర్బైజాన్ మధ్య ఘర్షణ) -
‘చంద్రయాన్’ పై ప్రేమతో ఓ యువతి..
సూరత్ : దేశవ్యాప్తంగా విజయదశమి పండుగ సంబరాలు జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో బతుకమ్మ, దేవీ నవరాత్రుల ఉత్సవాలతో సందడి వాతావరణం మొదలైంది. చూడముచ్చటగా తీర్చిదిద్దిన మండపాల్లో అమ్మవారి ప్రతిమలను ప్రతిష్టించి భక్తులు నవరాత్రి పూజలు జరుపుకుంటున్నారు. పిండి వంటలు, భజనలు, పూజలుతో పండుగ జరుపుకుంటుంటే.. గుజరాత్ యువతులు మాత్రం ఈ నవరాత్రుల్ని కాస్త వింతగా జరుపుకుంటున్నారు. దేశ భక్తి పరిమళించేలా శరీరాలపై టాటూలను వేయించుకుంటున్నారు. వివరాలు.. సూరత్ లోని మహిళలంతా పండుగ సందర్భంగా అక్కడి మహిళలంతా టాటూలు వేసుకుంటున్నారు. ఒకరేమో చంద్రయాన్ 2 అని వేసుకుంటే, ఇంకొకరేమో మరో మహిళ జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తూ.. బీజేపీ ప్రభుత్వం తీసుకున్న ఆర్టికల్ 370 ను రద్దు నిర్ణయాన్ని టాటూగా వేయించుకుంది. మరొకరేమో ఫాలో ట్రాఫిక్ రూల్స్ అంటూ.. ఈ మధ్యనే అమలైన ట్రాఫిక్ నిబంధనలను పచ్చబొట్టు వేయించుకుంటున్నారు. ప్రజలకు ఉపయోగపడే ఏ పని చేసినా తప్పు లేదని ఆ యువతులు చెబుతున్నారు. ప్రస్తుతం వీరు వేయించుకున్న టాటూ ఫోటోలు వైరల్‌గా మారాయి. -
మా ఇంట్లో వాళ్లు నన్ను వదిలేశారు
ముంబైకి చెందిన 21 ఏళ్ల తేజస్వీ ప్రభుల్కర్ తన ఒంటి మీద 103 పచ్చబొట్లతో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకుంది. అయితే దాని ప్రతిఫలంగా సమాజం నుంచి ఎదుర్కొంటున్న స్పందన అంత ప్రోత్సాహకరంగా లేదు. ఇదే ఏ అమెరికాయో, ఫ్రాన్సో అయితే పెద్ద పట్టించుకునేవారు కాదేమో కాని భారతదేశంలో పచ్చబొట్టును ఆడపిల్ల వేసుకోవడం మచ్చగానే భావిస్తారు. అదీ ఒకటో రెండో కాకుండా ఏకంగా 103 సార్లంటే గుండెలు బాదుకుంటారు. అయినప్పటికీ తేజస్వీ అలా ఎందుకు చేసింది? ‘నేను చిన్నప్పటి నుంచి బొమ్మలు వేసేదాన్ని. మా అమ్మ ఈ కళను ఉపయోగించుకో అని చెప్పింది. 17 ఏళ్ల వయసులో మొదటిసారి నా పేరును పచ్చబొట్టు వేయించుకున్నా. ఆ తర్వాత పచ్చబొట్ల మీద మోజు పెరిగింది. నేనే టాటూ ఆర్టిస్ట్‌గా మారుదామని నిశ్చయించుకున్నా. టాటూ ఆర్టిస్ట్‌కు డిగ్రీతో ఏం పని అని మానేశా.చదువు మానేసి 20 ఏళ్లకు దాదాపు 30 పచ్చబొట్లతో తయారయ్యేసరికి మా ఇంట్లో వాళ్లు దాదాపు నన్ను వదిలేశారు. ఇరుగు పొరుగు పిచ్చిదాన్నని అనుకున్నారు. చాలామంది ఇలాగైతే నీకు పెళ్లెలా అవుతుంది అని దిగులు పడుతుంటారు. ముందు కొంత ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు అలవాటైపోయింది’ అంటుంది తేజస్వి. తేజస్వి పూర్తి బట్టలు ధరించి వెళ్లినా ఆమె మిగిలిన శరీరంలో ఉన్న పచ్చబొట్లు జనాన్ని ఆకర్షిస్తాయి. ఇక తక్కువ బట్టలు వేసుకొని వెళితే దారిన పోయేవారంతా ఆమెనే చూస్తూ ఉంటారు.‘చాలామంది నన్ను ఈ దేశం అమ్మాయిని కాదనుకుంటారు. తెలిశాక చీవాట్లు పెడతారు. కొందరైతే ఇంత నొప్పిని ఎలా తట్టుకుంటావ్ అంటారు. నాకు మాత్రం పచ్చబొట్లతో ఉన్న నా శరీరం ఇష్టం. నన్ను ఇలాగే చూడండి. నా రూపం ద్వారా నన్ను జడ్జ్ చేయకండి’ అంటుంది తేజస్వి. తేజస్వి ఇంకా కొన్ని శరీర భాగాలను మరిన్ని పచ్చబొట్ల కోసం వదిలేసిందట. వాటిని కూడా పచ్చబొట్లతో నింపుతాను అంటోంది. ‘నేనూ అందరిలాంటి అమ్మాయినే. వంట చేస్తాను. నా పనులు నేను చేసుకుంటాను. నా జీవితం ఇప్పుడే మొదలైంది. ముగిసిపోలేదు. నా టాటూలు నా వ్యక్తిగత విషయంగా వదిలేయండి’ అంటుంది తేజస్వి.భారతదేశంలో ఇలాంటి విషయాలు అంత తొందరగా మింగుడు పడవు. ఆమె వార్తల్లోకి ఎక్కడానికి ఈ పచ్చబొట్లు ఉపయోగపడ్డాయి కాని జీవితంలో స్థిరపడటానికి ఎలా ఉపయోగపడతాయా అని కొందరికి సందేహంగా ఉంది. సందేహాలను జనానికి వదిలి తేజస్వి మాత్రం తాను వేయించుకోబోయే తర్వాతి పచ్చబొట్టు కోసం ఆలోచిస్తూ ఉంది.ఇష్ట కామ్య సిద్ధి రస్తు. -
ఆ పచ్చబొట్లేమిటి?
ఐటీ సిటీలో మహిళలు, అమ్మాయిలపై అరాచకాలకు అదుపు లేదు. వేధింపులు, అత్యాచారాల సంఘటనలు సరేసరి. ఇక భూ దందాలు, హత్యల్లోనూ దేశంలోనే టాప్‌లో ఉంటోందీ ఉద్యాననగరి. ఇలాగైతే కుదరదు, ఓ పట్టు పట్టాల్సిందేనని సీసీబీ పోలీసులు ఆపరేషన్‌ను షురూ చేశారు. సాక్షి, బెంగళూరు: సిలికాన్ సిటీలో నేర కార్యకలాపాలను అడ్డుకట్టవేయడానికి సెంట్రల్ క్రైం బ్రాంచ్ (సీసీబీ) పోలీస్ అధికారులు కొత్తమార్గాలు అన్వేషిస్తున్నారు. నగరంలో రౌడీలు, గూండాలను వెంటాడుతున్న సీసీబీ పోలీసులు తమదైనశైలిలో పబ్‌లు, బార్లపై దాడులు ప్రారంభించారు. ఇక చెవులకు పోగులు, చేతులకు కడియం,విచిత్ర తరహాలో జుట్టు, గడ్డాలు పెంచుకుని తిరిగే యువకులు, నిరంతరం బార్లలో గుంపులుగా కూర్చుని మందుకొట్టేవారిని అదుపులోకి తమదైనశైలిలో విచారిస్తున్నారు. సీసీబీ పోలీసుల కంటికి అనుమానాస్పదంగా కనబడినవారిని బార్లలో నుంచి నేరుగా ఆయా పోలీస్స్టేషన్లు, లేక సీసీబీ కార్యాలయానికి తీసుకెళ్లి విచారిస్తున్నారు. అమాయకులుగా తేలినవారిని వదిలేసి గతంలో ఏమాత్రం నేరచరిత ఉన్నా కౌన్సెలింగ్ ఆరంభిస్తున్నారు. ఆదివారం సాయంత్రం నుంచే ఇలాంటి దాడులకు సీసీబీ పోలీసులు శ్రీకారం చుట్టారు. రాజాజీనగర, మాగడిరోడ్డు, హనుమంతనగర, పోలీస్స్టేషన్లు పరిధిలోని పలుబార్ అండ్ రెస్టారెంట్లపై పోలీసులు దాడులకు, కౌన్సెలింగ్‌కు శ్రీకారం చుట్టారు. ఇప్పటివరకు దొరికినవారిలో 36 మంది రౌడీలు ఉండగా, వారి కార్యకలాపాలపై లోతుగా విచారణ చేపడుతున్నారు. రౌడీలు పట్టివేత హనుమంతనగర పోలీస్‌స్టేషన్ పరిధిలోని బ్లూవిం గ్బార్ పై సీసీబీ పోలీసుల దాడిలో అశోక్‌కుమార్, ప్రదీప్, వసంతకుమార్, దేవరాజు, చేతన్‌కుమార్, కాంతరాజు, విజయ్, రాజశేఖర్, విజయ్‌కుమార్ అనే రౌడీలు దొరికారు. రాజాజీనగర పోలీస్‌స్టేషన్ పరిధిలోని నవరంగ్ బార్ లో సూర్యకుమార్, చంద్రకాంత్, శ్రీకాంత్, మదన్, ఆనంద్, సంజయ్ అనే ఏడుగురుని పట్టుకెళ్లారు. మాగడి కాల్టెల్ బార్లో మద్యం సేవిస్తున్న నవీన్, మంజునాథ్, భరత్, మహేంద్ర, మంజు, విజయ్‌కుమార్, గోపినాయక్, జగదీశ్, జాకీర్, మహీబ్జాన్ అనే 11 మందిని తరలించారు. ముమ్మరంగా నిఘా చర్యలు రౌడీలు తమ ప్రభావాన్ని పెంచుకోవడానికి ఎక్కడెక్కడ గ్యాంగ్‌లు కడుతున్నారు అనే దాని పట్ల సీసీబీ అధికారులు సమాచారం సేకరిస్తున్నారు. నిర్మాణంలో ఉన్న కట్టడాలు, ఖాళీ మైదానాలు, కట్టడాల టెర్రస్‌లపై రౌడీలు చేరుకుని మద్యపానం సేవిస్తూ పార్టీలు చేసుకుంటున్నారని తెలిసి నిఘా పెట్టారు. మునుముందు మరిన్ని కఠిన చర్యలకు సిద్ధమవుతున్నారు. ఆ పచ్చబొట్లేమిటి? ‘చేతులపై కాకి, గుడ్లగూబ, శునకం ఇలా రకరకాల పచ్చబొట్లు వేసుకుని పోజు కొడితే ఊరుకునేదిలేదు. శుభ్రంగా కటింగ్, షేవింగ్ చేసుకుని మనుషుల్లా కనబడాలి. డాక్టర్ రాజ్‌కుమార్ ట్యాటూ వేసుకుని హత్యలకు పాల్పడతారా’ అని అదనపు పోలీస్‌కమిషనర్ అలోక్‌కుమార్ రౌడీలను హెచ్చరించారు. గాంధీ జయంతి సందర్బంగా మంగళవారం సీసీబీ కార్యాలయంలో సుమారు 500 మంది రౌడీలకు పరేడ్ నిర్వహించి తీవ్రంగామందలించారు. డిప్రెషన్లో ఉన్నాను సార్ అని ఒక రౌడీ చెప్పగా, నిన్ను ఎవరైనా అలా అంటారా? అని ఆగ్రహించారు. మళ్లీ ఏదైనా సెటిల్మెంట్లకు దిగితే గూండా చట్టం కింద జైలుకు పంపుతానని హెచ్చరించారు. వైట్‌డ్రెస్ వేసుకుని సంఘవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడతారా అని మండిపడ్డారు. ఒక్కో రౌడీని ఆయన ప్రశ్నించి ప్రవర్తన మార్చుకోవాలని హెచ్చరించారు. -
పచ్చబొట్టు.. పెద్ద ముప్పు
బనశంకరి: అందం, ఆకర్షణీయతను పెంచుకోవడం కోసమంటూ నేటి యువత ట్యాటూ (పచ్చబొట్ల) వెంట పరిగెడుతున్నారు. మధ్యవయస్కులు కూడా ఇందుకు మినహాయింపు కాదనాలి. చేతులు, కాళ్లు, భుజాలు, మెడ.. ఇలా ఎక్కడంటే అక్కడ రంగురంగుల పచ్చబొట్లను వేయించుకుని మురిసిపోతున్నారు. అయితే దాని వెనుక తీవ్రమైన అనారోగ్యాలు దాగి ఉన్నాయనేది ఎంతమందికి తెలుసు? బెంగళూరులో ఈ తరహా కేసులు ఇటీవలికాలంలో పెరుగుతూ వస్తున్నాయి. పచ్చబొట్టు ద్వారా జీవితానికే ప్రమాదం కొనితెచ్చుకోవడం గురించి అప్రమత్తంగా ఉండాలి. పచ్చబొట్లు వేసే సూదుల వల్ల ప్రాణాంతక హెపటైటీస్– బీ, సీ కాలేయ జబ్బులు వస్తాయని చాలామందికి తెలీదు. ఒకరికి వాడిన షేవింగ్ బ్లేడ్‌ను ఇతరులకూ వినియోగిస్తే ఎలాంటి జబ్బులు వస్తాయో, పచ్చబొట్టులోనూ అలాంటి ప్రమాదాలే పొంచి ఉన్నాయి. కేప్‌టౌన్ వర్సిటీ సర్వే హెచ్చరికలు దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్ యూనివర్శిటి నిర్వహించిన పరిశోధల ప్రకారం శుభ్రంచేయని బ్లేడ్లు, పచ్చబొట్టు సూదుల ద్వారా హెపటైటిస్ వైరస్ సోకవచ్చు. అలసత్వం వహిస్తే రక్తంలో ఇన్ఫెక్సన్ చేరి మరణం వరకూ వెళ్లే ప్రమాదముందని నివేదికలో హెచ్చరించారు. ఇటీవల నగర యూత్‌లో క్లీన్షేవ్, ట్యాటూ క్రేజ్ పెచ్చుమీరుతుంది. ఈ సమయాల్లో బ్లేడ్లు, ట్యాటూ సూదుల్ని ఒకరికంటే ఎక్కువమందికి వినియోగిస్తే రకరకాల జబ్బులు సోకే ముప్పు లేకపోలేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం భారతదేశంలో 60 లక్షల నుంచి 1.20 కోటి మంది ప్రజలు హెపటైటిస్ బీ, సీ జబ్బుల బారినపడ్డారని తెలిపింది. హైపటైటిస్ వైరస్ శరీరంలో చేరినా చాలాకాలం వరకు దాని ప్రభావం గుర్తించలేరు. కాలేయం పూర్తిగా దెబ్బతింటుంది. చికిత్స పొందడంలో విఫలమైతే క్యాన్సర్‌గా మారే ప్రమాదముందని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోగ లక్షణాలు ఇవీ మోకాళ్ల నొప్పులు, నలుపురంగులో మూత్ర విసర్జన, జ్వరం, కీళ్లనొప్పులు, ఆకలి మందగించడం, శక్తిహీనత, చర్మ సమస్యలు వంటివి హెపటైటిస్ రోగ లక్షణాలుగా ఉంటాయి. షేవింగ్, ట్యాటూ, చెవులు కుట్టినప్పుడు వినియోగించే సూది, బ్లేడ్ ఇతర సాధనాలను ఒకరికి వాడాలి. ప్రతిసారి కొత్తవాటిని ఉపయోగించాలి. వేసేవారు పరికరాలను, చేతులను క్రిమినాశకాలతో శుభ్రం చేసుకోవాలి. కాబట్టి ఈసారి పచ్చబొట్టు వేయించుకునేటప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం. -
పచ్చ పుట్ట
అంబర్ లూక్‌కు ఇప్పుడు 23 సంవత్సరాలు.కాని యాభై ఏళ్లకు సరిపడా శరీరాన్నికష్టానికి గురి చేసింది. మార్పు చేసుకుంది. ఇంకా చేసుకుంటూనే ఉంది. అంబర్ లూక్‌ను స్నేహితులు ‘బ్లూ ఐస్ వైట్ డ్రాగన్’ అని పిలుస్తారు. కారణం ఏమిటో తెలుసా? అందరూ వంటి మీద పచ్చబొట్టు పొడిపించుకుంటారు. కాని అంబర్ కంటిగుడ్లలో పచ్చబొట్టు పొడిపించుకుంది. అదీ నీలిరంగులో. నీలి రంగు కళ్లతోటి ఈ ప్రపంచంలో ఈ అమ్మాయి మాత్రమే ఉంది. 16వ ఏట నుంచి అంబర్ లూక్ది ఆస్ట్రేలియాలోని తీరప్రాంతం. అందరిలాంటి సాదాసీదా అమ్మాయే (ఫొటో చూడండి). కాని అందరిలా ఉండటం నాకు బోర్ అంటుంది అంబర్ లూక్. నలుగురినీ ఆకర్షించాలి అనుకుంది. దానికి మార్గం పచ్చబొట్టు. 16వ ఏట మొదటిసారి పచ్చబొట్టు వేయించుకుంది. ‘అప్పటి నుంచి ఆ ఇంక్‌కు నేను అడిక్ట్ అయ్యాను’ అని ఆమె అంటోంది. అప్పటి నుంచి అంబర్ ఆగలేదు. శరీరంలోని ఏ భాగాన్ని ఖాళీగా వదల్లేదు. నుదురు, భుజాలు, బాహు మూలాలు, తొడలు, మడమలు, కటి ప్రాంతం... ఇలా ఇప్పటికి యాభై పచ్చబొట్లు పొడిపించుకుంది. అన్నింటి కంటే కష్టమైన పచ్చబొట్టు కంటిలో పొడిపించుకున్నదే. ‘నా టాటూ ఆర్టిస్ట్ నీ కళ్లను నీలి రంగులో మార్చుకో అని చెప్పాడు. ఆ పచ్చబొట్టు వేయడానికి 40 నిమిషాలే పట్టింది. కాని దాని వల్ల నరకం చూశాను. ఆరుసార్లు కంట్లో నీడిల్ని పొడిచారు. పచ్చబొట్టు వేశాక మూడు వారాలు ఏమీ చూడలేకపోయాను. కాని ఇప్పుడు నీలి రంగులో ఉన్న నా కళ్లను చూసుకుంటే నాకు గర్వంగానే ఉంటుంది’ అందామె. అంబర్ లూక్ ఇప్పటికే నాలుకను డ్రాగన్ నాలుకలా మధ్యలో చీలిక తెచ్చుకుంది. ‘ఇక నా పళ్లను డ్రాకులా పళ్లలా మార్చుకోవడమే మిగిలింది’ అంది. అయిదు లక్షల ఖర్చు అంబర్ లూక్ ఇప్పటికి తన పచ్చబొట్ల కోసం అయిదు లక్షల రూపాయలు ఖర్చు చేసింది. ఇంకా ఖర్చు చేయాలనుకుంటోంది. ఆమెకంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ముప్పై వేల మంది ఫాలోయర్స్ తయారయ్యారు. వారంతా ఆమెను అభిమానిస్తున్నారు. కాని అంబర్ లూక్ వెర్రి చేష్టలకు విసుక్కుంటున్న నెటిజన్స్ కూడా చాలామంది ఉన్నారు. ‘నన్ను చూసి చాలామంది చిరాకు పడుతున్నారు. ఏం చేయను? పచ్చబొట్టు వేయించుకోవడం వల్ల నాకు డిప్రెషన్ దూరమైన భావన కలుగుతోంది’ అంటోంది లూక్.డిప్రెషన్‌ను అతిగా తినేవాళ్లు ఉన్నారు. అతిగా నిద్రపోయేవారు అస్సలు నిద్రపోని వారు కూడా ఉన్నారు. కాని ఇలా అతిగా పచ్చబొట్లు వేసుకునేవారు కూడా ఉండటం వింత. అలవాట్లు, వ్యసనాలు అదుపులో ఉండాలి అనడానికి లూక్ ఉదంతం ఒక ఉదాహరణ. -
పిచ్చికి పరాకాష్ట.. అంటే ఇదే!
ప్రతి వ్యక్తి ఇష్టాయిష్టాలు.. అలవాట్లు ఉంటాయి. అందులోనూ అందం విషయంలో ఇది కొంచెం ఎక్కువగానే ఉంటుంది. అందంగా కనిపించేందుకు ఎన్నో సాధనాలను వినియోగిస్తాం.. ఇంకా చిత్రంగా.. చూడగానే గుర్తించేలా ఉండేందుకు ఇప్పుడు టాటూలు వేయించుకోవడం సరదాగా మారింది. టాటూలు అందం పెంచేలా వేయించుకోవడం.. ప్రేమకు సింబల్‌గా పెట్టుకోవడం వరకూ బాగానే ఉందికానీ.. ఇదిగో ఇక్కడ చూడండి.. టాటూలను ఎలా వేయించుకున్నారో. వీళ్లను చూస్తూ భయం, అసహ్యం కలిగేలా.. ముఖం మీద.. చేతుల మీద వీపుమీద.. టాటూలను అత్యంత భీభత్సకరంగా వేయించుకున్నారు. ఈ టాటూలను చూడగానే అందం గుర్తుకు రావడం సంగతి దేవుడెరుగు.. భయం మాత్రం తప్పకుండా కలుగుతుందని జనాలు చెబుతున్నారు. -
టాటూలతో క్యాన్సర్!
లండన్: టాటూలు వేయించుకోవడాన్ని ఈ తరం యువత ఫ్యాషన్ గా భావిస్తోంది. అయితే ఈ టాటూల ద్వారా స్కిన్ ఇన్ఫెక్షన్లు వస్తున్నట్లు తాజా పరిశోధనలో వెల్లడైంది. టాటూలు వేయించుకుంటున్నవారిలో దాదాపు 5 శాతం మంది చర్మానికి సంబంధించిన ఇన్ఫెక్షన్ల బారిన పడుతున్నారని తాజా అధ్యయనంలో తేలింది. టాటూలు ఎక్కువకాలం ఉండేందుకు చర్మంలోకి కొన్నిరకాల రసాయనాలను పంపుతారు. వీటివల్ల ఇన్ఫెక్షన్లు వస్తున్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఇక టాటూల ద్వారా చర్మ క్యాన్సర్ వస్తుందన్న విషయంపై కూడా శాస్త్రవేత్తలు ఎటువంటి క్లారిటీని ఇవ్వలేకపోతున్నారు. కేవలం టాటూల ద్వారానే చర్మ క్యాన్సర్ వస్తుందనేందుకు ఎటువంటి ఆధారాలు లేవని, అయితే రాదనే విషయాన్ని కూడా కొట్టిపారేయలేమని చెబుతున్నారు. టాటూలకు ఉపయోగించే 60 శాతం కలర్లు క్యాన్సర్ కారకాలేనని, లేజర్ కిరణాలను కూడా ఉపయోగించడం ప్రమాదకరమేనని హెచ్చరిస్తున్నారు. ఆకుపచ్చ టాటూలతో పోలిస్తే ఎర్ర, నల్ల టాటూలో ఎక్కువ దుష్ఫలితాలు పొంచి ఉన్నాయని చెబుతున్నారు. -
చంద్రునిపై మచ్చలు ఎలా వచ్చాయో తెలుసా!
వాషింగ్టన్: రాత్రిళ్లు ఆకాశంలోకి చూసినపుడు మనకు ఎప్పుడో ఒక్కసారైన చిన్న అనుమానం వచ్చి ఉంటుంది.. అదే చంద్రుని మీద ఉన్న ఆ మచ్చలు ఎలా వచ్చాయి? అని.. ఆ మచ్చల వెనుక కథను నాసా ఇప్పుడు బయటపెట్టింది. మరీ ఆ మిస్టరీ వెనుక దాగున్న నిజాలను చూద్దాం.. చంద్రుడి గురించి మనకు ఇప్పటివరకు ఏం తెలుసు..? రాత్రి పూట కాకుండా పగలు కూడా చంద్రుడు కనిపిస్తాడనీ, ఇంకా మరికొన్ని చిన్న చిన్న విషయాలు తెలుసు. చంద్రుడి మీద మనకు కనిపించే తెలుపు, నలుపు మచ్చలు దాదాపు వందకు పైగా ఉన్నాయి. నాసా చేపట్టిన లూనార్ రీకొన్నైసెన్స్ ఆర్బిటర్ (ఎల్ఆర్ఓ) మిషన్ కు నేతృత్వం వహించిన కెల్లర్ అనే శాస్త్రజ్ఞడు తెలిపిన వివరాల ప్రకారం చంద్రుడి మీద మచ్చలు చాలా పెద్దవిగా గుంపుగా ఉంటాయి. ఎలా ఏర్పడ్డాయి.. చంద్రునిపై మచ్చలు ఏర్పడానికి రెండు కారణాలు ఉన్నాయి. చంద్రుడు ఏర్పడే పరిణామక్రమంలో అయస్కాంత క్షేత్రంతో మిళితమైపోయాడు. దీని కారణంగా చంద్రుని మీద ఉండే శిలాజాలు నల్లని మచ్చలుగా కనిపిస్తాయి. అలాగని చంద్రుని మీద ఉన్న ప్రతి ఒక్క శిలాజం మచ్చగా కనిపించదు. అయస్కాంత క్షేత్రం బలం ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో మాత్రమే మచ్చలు తయారవుతాయి. చంద్రుడు సూర్యుని నుంచి శక్తిని గ్రహించుకుని రాత్రిపూట వెలుగునిస్తాడని మనకు తెలుసు. అలా సూర్యుని నుంచి వచ్చే వేడి గాలుల వల్ల అయస్కాంత క్షేత్రాలు ప్రభావితం చెంది బలమైన విద్యుత్ క్షేత్రాలను తయారుచేశాయి. ఈ విద్యుత్ క్షేత్రాలు వేడిగాలలతో ప్రభావం చెంది ఎక్కువ కాంతిని బయటకు ప్రసరించేలా చేస్తాయి. అందుకే చంద్రుని మీద మనకు కనిపించే కొన్ని మచ్చలు తెల్లగా ఉంటాయి. -
తాతగారి పచ్చబొట్టు
తిక్క లెక్క పచ్చబొట్లు తాతల కాలం నుంచే ఉన్నాయి కదా ఇందులో వింతేముంది అనుకుంటున్నారా? కచ్చితంగా ఉంది. పచ్చబొట్టు పొడిపించుకుని చిరునవ్వులు చిందిస్తున్న ఈ బ్రిటిష్ తాతయ్య పేరు జాక్ రేనాల్డ్స్. వయసు 104 ఏళ్లు. చెస్టర్‌ఫీల్డ్‌లో ఉంటాడు. ఇన్నాళ్లూ ‘మచ్చ’లేని జీవితం గడిపేసిన ఈ తాతయ్యకు ఉన్నట్టుండి పచ్చబొట్టు పొడిపించుకోవాలనిపించింది. ఈ వయసులో తట్టుకోలేవంటూ ఎందరు వారించినా వినకుండా, సూదిపోటుకు సిద్ధపడ్డాడు. కోరుకున్న విధంగా పచ్చబొట్టు పొడిపించుకున్నాడు. అతిపెద్ద వయసులో తొలి పచ్చబొట్టు పొడిపించుకున్న వృద్ధుడిగా గిన్నెస్ రికార్డు సొంతం చేసుకున్నాడు. -
ఆ ‘మోజు’ పోయింది
కెరీర్ ఆరంభంలో స్టయిల్‌గా ఉండటం, రకరకాల టాటూల మీద మోజు ఉండేదని, ఇప్పుడది పోయిందని భారత స్టార్ విరాట్ కోహ్లి చెప్పాడు. ‘మానసికంగా దృఢంగా ఉండటానికి నేనేం పూజా పునస్కారాలు చేయను. గతంతో పోలిస్తే ఆలోచనా విధానం మారింది. ప్రతిసారీ నెట్స్‌కి వెళ్లినప్పుడు 0.1 శాతమైనా నా ఆటను మెరుగుపరుచుకోవాలనే లక్ష్యంతో వెళుతున్నాను. జట్టు కోసం ఏదైనా చేయాల్సిందే అనే పట్టుదల వల్లే రాటుదేలాను’ అని కోహ్లి చెప్పాడు. -
సెక్స్ బానిసల బ్రాండ్ నేమ్.. టాటూ!
పచ్చబొట్టు అక్కడి యువతుల జీవితాలను చిదిమేసే మాయని మచ్చగా మారింది. అమ్మాయిలను అంగడి బొమ్మలుగా మార్చేందుకు గుర్తుగా నిలుస్తోంది. ఉమెన్ ట్రాఫికింగ్ అంతర్జాతీయంగా విస్తరిస్తూ.. కొన్ని వందలు, వేల కోట్ల రూపాయల వ్యాపారం సాగిస్తోంది. అమెరికాలో టాటూ.. ఈ ముఠాల బారినపడి బానిసత్వంలో మగ్గిపోతున్న యువతుల శరీరాలపై బ్రాండ్‌నేమ్‌గా కూడా చెలామణి అవుతోంది. అవును... ఇటీవల అమెరికాలో వెలుగులోకొచ్చిన నగ్నసత్యమిది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కోట్లాది మంది మహిళలతో కొనసాగుతున్న వ్యాపారంగా పోలీసులు దీన్ని గుర్తించారు. హ్యూమన్ ట్రాఫికింగ్‌తో వ్యభిచార వృత్తిలోకి దించిన మహిళలకు, లైంగిక కార్యకలాపాల్లోకి నెట్టిన పిల్లలకు పచ్చబొట్టు ఓ సింబల్. అమెరికన్ పోలీసుల కంటపడ్డ ఓ అమ్మాయి కథ చూస్తే ఎన్నో మింగుడు పడని నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఆమె మెడ ఎముక దగ్గర, నెక్లెస్ పై భాగంలో అందంగా రాసి ఉన్న రాత వెనుక పెద్ద చరిత్ర కనిపించింది. క్రీమ్ అనే వ్యక్తి ఆధ్వర్యంలో కొనసాగుతున్న హింసాత్మక వ్యాపారంలో లైంగిక బానిసలుగా ఉన్న 8 లక్షల మంది బాధితుల్లో 14 ఏళ్ల ఆడ్రియానా ఒకరు. ఆమె అవసరాన్ని అదనుగా చేసుకుని, పని చూపిస్తామని నమ్మబలికి రొంపిలోకి దింపారు. ఆమె ఒంటిపై టాటూ వేసేశారు. వివిధ దేశాల్లో పచ్చబొట్టు ఆధారంగా కోట్ల సంఖ్యలోనే బానిసలు ఈ బడా వ్యాపారంలో సమిధలు అవుతున్నట్లు పోలీసులు గుర్తించారు. బానిసల చేతులు, పొత్తికడుపు, మెడపై వేసే ఆ టాటూలను బార్కోడ్లుగా కూడా ఉపయోగిస్తున్నారు. తమ శరీరంపై కనిపించే ఈ గుర్తులను తాము 'వార్ ఊండ్స్' గా పిలుస్తామని ఆడ్రియానా చెబుతోంది. ఈ టాటూల సంప్రదాయాన్ని రూపుమాపేందుకు ఇప్పుడు ఓ సంస్థ ముందుకు వచ్చింది. అదే.. సర్వైవర్ ఇంక్. ఈ సంస్థ స్థాపకురాలు జెన్నిఫర్ కెంప్టన్ కూడా ఒకప్పుడు ఈ ఉచ్చునుంచి బయటపడ్డ బాధితురాలే. ప్రస్తుతం ఆమె స్వచ్ఛందంగా టాటూ బాధితులను లైంగిక బానిసత్వం నుంచి కాపాడేందుకు కృషి చేస్తోంది. కెంప్టన్ 12 ఏళ్ల వయసులోనే ట్రాఫికింగ్ ఉచ్చులో చిక్కుకుంది. తన సోదరుడి స్నేహితుడైన సాలెమ్ చేతిలో మోసపోయింది. అతడు ఆమెపై రేప్ చేసి, తర్వాత అక్రమంగా తరలించాడు. తర్వాత ఐదేళ్ల పాటు కెంప్టన్ పలువురి చేతిలో చిత్రవధ అనుభవించింది. కొన్ని ముఠాల బ్రాండ్లతో చిక్కుకుపోయింది. తన సొత్తుగా భావించిన సాలెమ్ తన ముఠా బ్రాండ్ నేమ్ అయిన కింగ్ మంచ్ పేరుతో ఆమె మెడపై టాటూను వేయించాడు. అదే సమయంలో మిగిలిన మరి కొన్ని ముఠాలు వారి వారి పేర్లను ఆమె చేతులు, వీపుపై టాటూలుగా వేయించారు. ఓహియో వాసి అయిన కెంప్టన్... అక్కడి వీధుల్లో బాలికలు, మహిళలు టాటూల బారి నుంచి తప్పించుకోలేక పోతున్నారంటున్నారు. ఆ నరకాన్ని భరించలేక రెండుసార్లు ఆత్మహత్యకు కూడా ప్రయత్నించిన కెంప్టన్ సమయానికి తాడు తెగిపోవడంతో ప్రాణాలతో మిగిలిపోయింది. అప్పుడే ఓ నిర్ణయానికి వచ్చింది. ఇదే తాను తప్పించుకొనేందుకు సమయంగా భావించింది. ఇప్పడామె తన శరీరాన్ని పలు రకాల డిజైన్లతో అలంకరించుకుంది. ఇలా ముఠా బ్రాండ్‌ను తన శరీరం నుంచి చెరిపేయడంతో తనకు విమోచన కలిగిందంటోంది. ఉమెన్ ట్రాఫికింగ్ అంతర్జాతీయంగా ఏటా 1.33 లక్షల కోట్ల రూపాయల వ్యాపారం సాగిస్తోందని ఐక్యరాజ్య సమితి తన నివేదికలో స్పష్టం చేసింది. అంతర్జాతీయ సమాజం మూడో అతిపెద్ద నేరంగా పరిగణించిన ఉమెన్ ట్రాఫికింగ్ ప్రమాదకర స్థాయిలో విస్తరిస్తోంది. -
టాటూ కావాలా బాబూ..
-
పాపాయి అడుగే పచ్చబొట్టు!
టాటూలు వేయించుకోవడం లేటెస్ట్ ట్రెండ్. అందమైన కార్టూన్లు, దేవతలు, దెయ్యాలు, పుర్రె బొమ్మలు..ఇలా రకరకాల డిజైన్ల పచ్చబొట్లు తమ శరీరాలపై వేయించుకుని మురిసిపోతూంటారు. ఆమిర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్ ఓ అడుగు ముందుకు వేశారు. ఓ సందర్భంలో ఇమ్రాన్ ఖాన్ భార్య అవంతిక తమ కూతురు ఇమార చిన్ననాటి పాదముద్రలను భద్రంగా దాచుకోవాలనుకున్నారు. పాపాయి కాలి అడుగులను ఓ కాగితంపై గీసుకున్నారు. ఇది చూసిన ఇమ్రాన్ టాటూకు కాదేది అనర్హం అని అనుకున్నారు కాబోలు... వెంటనే పాపాయి పాదాలను టాటూగా శరీరంపై ముద్రించుకున్నారు. ఏది ఏమైనా... వాట్ యాన్ ఐడియా ఇమ్రాన్‌జీ!. -
‘బ్యాక్’సైడ్ టాటూస్!
అక్కడా ఇక్కడా ఎందుకనుకుందో... ఫ్రంట్ కంటే అదే బెటరనుకుందో... పాప్ స్టార్ లేడీ గాగా వీపుపై టాటూలు వేయించుకుంది. వాటిని వేయించుకుంటున్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో అప్లోడ్ చేసి కుర్రకారుకు కిర్రెక్కిస్తోంది. తన ‘ఆర్ట్పాప్’ టూర్లో భాగంగా యూరప్‌ను చుట్టేస్తున్న ఈ ‘లిటిల్ మాన్స్టర్’... జర్మనీలో టాటూలు దిద్దించుకుందని ఓ ఆంగ్ల పత్రిక కథనం. ఎలాంటి ఆచ్ఛాదన లేని ఆమె వెనుక భాగంపై మాన్స్టర్ బొమ్మలు చిత్రించాడట ప్రముఖ ఆర్టిస్ట్ గేల్ గొంజాల్స్. -
తారల టాట్టూ మోజు
తమిళ సినిమా నటీమణులు పలువురు పచ్చబొట్లు (టాట్టూస్) పొడిపించుకోవడంపై ఆసక్తి చూపుతున్నారు. తమ దేహాలపై వివిధ డిజైన్లలో వీటిని పొడిపించుకుంటున్నారు. త్రిష ఇప్పటికి మూడు సార్లు పచ్చ పొడిపించుకున్నారు. మొట్టమొదట ‘నెమో’ అనే కార్టూన్ చేపను పచ్చ పొడిపించుకున్నారు. నయనతార తన వీపుపై తేలును, చేతిపై ప్రభు అనే పేరును పొడిపించుకున్నారు. నమిత తన వీపుపై డిజైన్‌ను రూపొందించుకోగా, రీమాసేన్ ఉదర భాగంలో పక్షిని పచ్చ పొడిపించుకున్నారు. తమన్నా, కాజల్ అగర్వాల్, అసిన్, ప్రియమణి వంటి ప్రముఖ తారలు పలువురు తమకు నచ్చిన వాటిని ఒంటిపై పచ్చపొడిపించుకుంటున్నారు. శ్రుతిహాసన్ ఇదివరకే తన పేరును తమిళంలో వీపుపై చిత్రించుకున్నారు. ఆ తర్వాత తన చేతిపై రోజా పువ్వును పొడిపించుకున్నారు. కాలిపైనా టాట్టూ వేయించుకున్నారు. ప్రస్తుతం ఐదో సారిగా చేతిపై పచ్చ పొడిపించుకున్నారు. గతంలో కుష్బు, స్నేహ, సిమ్రాన్‌లు పచ్చ పొడిపించుకున్నవారే! తాజాగా తాప్సీ నటి తాప్సీ తన నడుముకు వెనుకవైపు టాట్టు పొడిపించుకోవడం కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. బాలీవుడ్ నుంచి కోలీవుడ్ వరకు తారల్లో టాట్టూ సంస్కృతి నానాటికి పెరిగిపోతోంది. ముఖ్యంగా కథానాయికల్లో ఈ పైత్యం పెరిగిపోతోంది. చేతులు, కాళ్లు, నడుము, వీపు భాగం, గుండెలపైనా రకరకాల టాట్టూలను వేయించుకుంటున్నారు. అభిమానులు, ఇతర చిత్ర ప్రముఖుల దృష్టిని తమ వైపు మళ్లించుకునేందుకు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా నటి తాప్సీ తన నడుము వెనుకవైపు టాట్టూ వేయించుకుని వార్తల్లో కెక్కారు. దీని గురించి ఈ బ్యూటీ మాట్లాడుతూ ఇంతకుముందు కళ్లపై, కాళ్లపై టాట్టు వేయించుకున్నానని, ఇప్పుడు నడుము కింద భాగంలో టాట్టూ వేయించుకున్నట్టు తెలిపారు. అక్కడ పొడిపించుకోవడానికి కారణం ఈ భాగంలో టాట్టును తరచూ చూడటం సాధ్యం కాదన్నారు. ఇంతకు ముందు వేయించుకున్న టాట్టూలను చూసి చూసి బోర్ కొట్టిందన్నారు. అందువలనే తాను నడుము కింది భాగంలో టాట్టు పొడిపించుకున్నట్లు వివరించారు. -
అచ్చం గజనీలాగే కనిపిస్తున్నా..
ఫోటోలో ఇతడ్ని చూస్తుంటే ‘గజనీ’ గుర్తుకొస్తున్నాడు కదూ? కెనడాలోని మోంట్రియల్కు చెందిన ఈ అభినవ గజనీ పేరు విన్ లాస్. వయసు 24 ఏళ్లు. అచ్చం గజనీలాగే కనిపిస్తున్నా.. ఇతడికి షార్ట్ టెర్మ్ మెమరీ లాస్ లేదండోయ్. మరి ఒళ్లంతా ఆ టాటూలు ఎందుకు వేయించుకున్నాడనేగా మీ డౌట్? సినిమాలో గజనీ ఏ విషయాన్నీ మరచిపోకుండా గుర్తుంచుకోవడం కోసం పచ్చబొట్లు పొడిపించుకుంటే.. విన్ లాస్ మాత్రం జనమంతా తనను గుర్తించాలని ఇలా టాటూలమీద టాటూలు వేయించేసుకుంటున్నాడు. పైగా రకరకాల సైజుల్లో రకరకాల పదాలు.. ఒకదాని కొకటి సంబంధం ఉండదు.. అసలు ఆ పదం ఎందుకు వేయిం చుకున్నాడో అర్థం కాదు. ఒక్క ముఖంపైనే ఏకంగా 24 పదాలున్నాయి. అర్థంపర్థం లేకుండా ఏమిటా పదాలు అని అడిగితే.. ‘‘అద్భుతమైన పెయింటింగ్స్‌లో మనకు ఏమైనా అర్థమవుతుందా? ఇది కూడా అంతే’’ అని తెలివిగా సమాధానం చెబుతాడు. 16వ ఏట తొలి టాటూ పొడిపించుకున్న విన్ అసలు లక్ష్యం.. ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ కావడమేనట. మరి ఫేమస్ కావాలంటే ఏదో ప్రత్యేకత ఉండాలి కదా? అందుకే ఈ మార్గాన్ని ఎంచుకున్నానని చెబుతున్నాడు. వాటేన్ ఐడియా..! -
పచ్చందాలు..
‘పచ్చబొట్టూ చెరిగి పోదులే నా రాజా... పడుచు జంట చెదిరి పోదులే’ పవిత్రబంధం సినిమాలో నాగేశ్వరరావు, వాణిశ్రీ సూపర్ హిట్ సాంగ్. పడుచు జంట చెదిరిపోకుండా ఉంటుందో లేదో తెలియదు కానీ.. పచ్చ బొట్టు మాత్రం పర్మినెంట్‌గా ఉండిపోతుంది. ఒకప్పుడు పిల్లలెక్కడ తప్పిపోతారేమోనని ముందు జాగ్రత్త కోసం తల్లిదండ్రులు పచ్చబొట్టు వేయించేవారు. తర్వాతి కాలంలో మధుర ప్రేమకు చిలిపి గుర్తుగా.. ఒకరి పేరు పచ్చబొట్టుగా మారి మరొకరి తనువుపై కొలువయ్యేది. కాలాలు మారే సరికి ‘పచ్చ’బొట్టు కాస్తా మల్టీకలర్స్ను కలిపేసుకుని టాటూగా మారిపోయింది. మొదట్లో సెలబ్రిటీల దేహంపై సాక్షాత్కరించిన టాటూలు కొద్ది రోజుల్లోనే ఈతరం యూత్‌కు అతుక్కుపోయాయి. ఒకప్పుడు ఏ సంతకో, తిరునాళ్లకో వెళ్తే గానీ పచ్చబొట్టు వేయించుకునే అవకాశం దొరికేది కాదు. ఇప్పుడు టాటూస్ కోసం స్టూడియోలే వెలిశాయి. దేవుళ్లు, దెయ్యాలు, జంతువులు, పక్షులు, డ్రాగన్స్.. చివరకు కీటకాలు ఇలా కావేవీ టాటూకు అనర్హం అన్నంతగా మారిపోయింది. కొందరు చేతులపై, మెడపై.. ఇంకొందరు నడుముపై, మరికొందరు ఒళ్లంతా టాటూలకు అర్పించేస్తున్నారు. టాటూ వేయించుకోవాలనుకున్న ముందు రోజు నుంచే ఆల్కహాల్, డ్రగ్స్‌లాంటివి తీసుకోకూడదు. అనారోగ్యంతో ఉన్నప్పుడు టాటూ వేయించుకోకూడదు. టాటూ వేయడం కోసం వాడేందుకు కొత్త సూదులనే వాడాలి. టాటూగన్, ఇతర సామగ్రిని పూర్తిగా శుభ్రపరిచే యంత్రాలు స్టూడియోలో ఉన్నాయో లేదో చూసుకోవాలి. కలర్‌తో పాటు టాటూ వేయడానికి ఉపయోగించే ప్రతి అంశాన్నీ పరిశీలించాలి. టాటూ వేసిన తరువాత సూచించే సలహాలను తప్పనిసరిగా పాటించాలి. అన్నింటినీ మించి మీ శరీరం టాటూస్‌కు సరైందా లేదా పరీక్షించుకోవాలి. సమ్‌థింగ్ స్పెషల్ చర్మపు పొరల్లోకి సిరాను ఇంజెక్ట్ చేసి స్కిన్ కలర్ మార్చి అందమైన డిజైన్లుగా వేయించుకోవడమే టాటూ. తామేంటో చెప్పుకోవడానికి కొందరు టాటూను ఆశ్రయిస్తే.. తమ ప్రత్యేకత చాటుకోవడానికి ఒంటిపై టాటూకు చోటిస్తున్నారు ఇంకొందరు. కొందరు పెంపుడు జంతువులను అలంకరించడానికి కూడా టాటూలను వాడుకుంటున్నారు. షోలకు తీసుకెళ్లే జంతువులు, గుర్రాలకు గుర్తుల కోసం టాటూ వేయిస్తున్నారు. కాస్మొటిక్ టాటూ.. ఈ రకం టాటూ పర్మనెంట్ మేకప్‌గా ఉండిపోతుంది. కళ్లు కలువ రేకుల్లా కనిపించడం కోసం ఐ లైనింగ్.., మంచి ఛాయ కోసం ముఖానికి, అధరాలు అదరహో అనిపించడానికి పెదవులకు కూడా టాటూస్ వేయించుకుంటున్నారు. ముఖంపై మచ్చలు పోగొట్టడానికి టాటూస్‌తో రంగులద్దించుకుంటున్నారు. మెడికల్ టాటూస్ శ రీరంలో ఉన్న వ్యాధిని తెలియజేసేలా వేసేదే మెడికల్ టాటూ. దీర్ఘకాలిక వ్యాధి, అలర్జీతో బాధపడే వ్యక్తి ఏ క్షణంలోనైనా ఆపదలో చిక్కుకోవచ్చు. డయాబెటిస్ ఉన్న వ్యక్తి రక్తంలో చక్కెర శాతం తగ్గినా పెరిగినా స్పృహ కోల్పోయే ప్రమాదం ఉంది. అలాంటి వాళ్లను గుర్తించి వెంటనే చికిత్స అందించేందుకు ఇలాంటి టాటూస్ ఉపయోగిస్తున్నారు. ప్రొఫెషనల్ అయితే బెస్ట్ టాటూ డిజైన్ ఎంత అందంగా వేయించుకుంటున్నామనే దానికంటే ఎలాంటి స్టూడియో ఎంపిక చేసుకున్నామన్నది చాలా ముఖ్యం. టాటూ వల్ల ఒక్కోసారి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది. పరిశుభ్రమైన సూదులు ఉపయోగించకపోవడం వల్ల ప్రమాదం తలెత్తవచ్చు. కలుషితమైన సిరాలో రోగకారక శిలీంధ్రాలు, బ్యాక్టీరియాలు ఉంటే, కళ్లు, ఊపిరితిత్తులు, ఇతర అవయవాలకు సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అయితే నాణ్యత, సేఫ్టీ స్టాండర్డ్స్ పాటిస్తే వీటిని తగ్గించొచ్చు. పచ్చబొట్టు వేసే సమయంలో గన్ను పరిశుభ్రమైన ప్లేస్లోనే ఉంచుతున్నారో, లేదో కచ్చితంగా అబ్జర్వ్ చేయాలి. ప్రొఫెషనల్ టాటూ ఆర్టిస్టు లెసైన్స్ విషయాన్ని కూడా ఆరా తీయాల్సిందే. రెలిజియస్ టాటూ నచ్చిన దైవాన్ని తనలో భాగం చేసుకోవాలని భావిస్తున్న యువతరం రెలిజియస్ సింబల్స్‌ను పచ్చ పొడిపించుకుంటున్నారు. వినాయకుడు, సాయిబాబా, శివుడు వంటి దేవుళ్ల బొమ్మలను టాటూగా వేయించుకుంటున్నారు. మ్యూజికల్ నోట్స్, చైనా అక్షరాలు వంటి వెరైటీ టాటూస్‌ను కూడా ప్రిఫర్ చేస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త పేర్లు టాటూగా వేయించుకునే వాళ్లు కాస్త జాగ్రత్త. రణబీర్‌కపూర్‌తో పీకల్లోతు ప్రేమలో మునిగినప్పుడు దీపికా పదుకొనె ‘ఆర్కే’ అనే పచ్చబొట్టు వేయించుకుంది. ఆ ప్రేమ వ్యవహారం బెడిసి కొట్టింది. అయినా ఏం లాభం ఒంటిపై ఉన్న రణబీర్‌ను తీసేయలేక నానా తంటాలు పడుతోంది. ఇక నయనతార గురించి వేరే చెప్పక్కర్లేదు. ప్రభుదేవాతో కలసి స్టెప్పులు వేసినపుడు ‘ప్రభు’ అని పొడిపించుకుంది. ప్రేమను బ్రేకప్ చేసుకున్నా.. ఒంటిపై ఉన్న ‘ప్రభు’ను మాత్రం దూరం చేసుకోలేకపోతోంది. షూటింగ్ టైంలో దాన్ని కవర్ చేసుకోలేక తెగ ఇబ్బంది పడుతోంది. - శిరీష చల్లపల్లి