ప్రతి వ్యక్తి ఇష్టాయిష్టాలు.. అలవాట్లు ఉంటాయి. అందులోనూ అందం విషయంలో ఇది కొంచెం ఎక్కువగానే ఉంటుంది. అందంగా కనిపించేందుకు ఎన్నో సాధనాలను వినియోగిస్తాం.. ఇంకా చిత్రంగా.. చూడగానే గుర్తించేలా ఉండేందుకు ఇప్పుడు టాటూలు వేయించుకోవడం సరదాగా మారింది. టాటూలు అందం పెంచేలా వేయించుకోవడం.. ప్రేమకు సింబల్‌గా పెట్టుకోవడం వరకూ బాగానే ఉందికానీ.. ఇదిగో ఇక్కడ చూడండి.. టాటూలను ఎలా వేయించుకున్నారో. వీళ్లను చూస్తూ భయం, అసహ్యం కలిగేలా.. ముఖం మీద.. చేతుల మీద వీపుమీద.. టాటూలను అత్యంత భీభత్సకరంగా వేయించుకున్నారు. ఈ టాటూలను చూడగానే అందం గుర్తుకు రావడం సంగతి దేవుడెరుగు.. భయం మాత్రం తప్పకుండా కలుగుతుందని జనాలు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment