టాలీవుడ్‌లో రొమాంటిక్ కపుల్‌గా గుర్తింపు పొందిన అక్కినేని నాగ చైతన్య – స్టార్ హీరోయిన్ సమంతల నాలుగేళ్ల వివాహ బంధానికి తెర పడింది. తామిద్దరం విడాకులు తీసుకోనున్నట్లు చైతన్య, సమంత సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఎంతో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ న్యూస్ టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. అసలు ఇలాంటి వార్త వినాల్సి వస్తుందని అక్కినేని అభిమానులు అస్సలు ఊహించలేదు.
ఏడేళ్ల పాటు ప్రేమించుకున్న ఈ జంట.. పెద్దలను ఒప్పించి 2017లో పెళ్లి చేసుకున్నారు. నాలుగేళ్ల పాటు ఒకరి మీద ఒకరి ప్రేమను ఎన్నో రకాలుగా చూపించారు. తమ ప్రేమను జీవితాంతం గుర్తుండిపోవాలని శరీరంపై టాటూలు కూడా వేయించుకున్నారు. చైతూ తో తన బంధాన్ని గుర్తు చేసేలా సమంత మూడు టాటూలు వేయించుకుంది. తమ ప్రేమకు పునాది వేసిన ‘ఏం మాయ చేశావే’ సినిమా పేరుకు షార్ట్ ఫామ్ YMC అనే అక్షరాలు తన మెడ వెనుక భాగంలో టాటూ వేయించుకుంది.
ఇక చైతన్య-సామ్‌లు కలిసి ఒకే రకమైన టాటూని కుడిచేతి మణికట్టుపై వేయించుకున్నారు. ఇవే కాదు చై మీద ప్రేమను ఓ సీక్రెట్ టాటూతో చూపించింది సమంత. ఏకంగా చైతన్య సంతకాన్ని తన తన నడుము మీద ఉన్న టాటూగా వేయించుకున్నారు. ఇలా తమ ప్రేమను టాటూ రూపంలో పదిలం చేసుకున్న సమంత… ఇప్పుడు విడాకులు తీసుకోవడం అక్కినేని అభిమానులకి విస్మయానికి గురిచేస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment