నాగ చైతన్య షేర్‌ చేసిన ఫోటో.. మళ్లీ ఒకటిగా సమంత- చైతూ | Is Naga Chaitanya And Samantha Are Reuniting? What Is The Reason Behind Naga Chaitanya Recent Post - Sakshi
Sakshi News home page

Naga Chaitanya-Samantha Reunite Rumours: నాగ చైతన్య షేర్‌ చేసిన ఫోటో.. మళ్లీ ఒకటిగా సమంత- చైతూ?

Published Tue, Oct 10 2023 11:11 AM | Last Updated on Tue, Oct 10 2023 12:00 PM

Naga Chaitanya And Samantha Are Reuniting - Sakshi

టాలీవుడ్‌లో మోస్ట్ బ్యూటిఫుల్ పెయిర్‌గా గుర్తింపు తెచ్చుకున్న సమంత – నాగ చైతన్య విడిపోయి సుమారు రెండేళ్లు అవుతుంది. వీళ్లిద్దరు విడిపోయారు అనే వార్తని వారి అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే మళ్లీ కలుసుకోబోతున్న సమంత- చైతన్య అనే వార్తలు అప్పడప్పుడు ప్రచారంలోకి వస్తుంటాయి. తాజాగా నాగ చైతన్య వద్ద సమంత పెట్‌ డాగ్‌ హష్‌ కనిపించడంతో వారిద్దరూ మళ్లీ కలుసుకోబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి.

(ఇదీ చదవండి: గుండెపోటుతో బాడీ బిల్డర్ మృతి.. పెళ్లి తర్వాత ఈ పొరపాటు చేయడంతో)

మొదట్లో ఆ పెట్‌ను సమంత తెచ్చుకున్నారు. ఆ సమయంలో నాగ చైతన్యకు హష్‌ అంటే అంతగా ఇష్టం ఉండకపోయినా.. రాను రాను హష్ మీద ప్రేమ ఎక్కువైందట. ఇదే విషయాన్ని ఒక షోలో వారిద్దరూ చెప్పారు. కానీ విబేదాల వల్ల వారిద్దరూ విడిపోవడంతో  సమంత తన పెట్‌ను తాను తీసుకెళ్లారు.  ఇప్పుడు సమంత వద్ద ఉండాల్సిన హష్‌ తాజాగా నాగ చైతన్య వద్ద కనిపించడంతో వారి ఫ్యాన్స్‌ అంతా ఆశ్చర్యపోతున్నారు. దీంతో వారిద్దరూ మళ్లీ కలవడం ఖాయం అని వార్తలు వస్తున్న సమయంలో నాగ చైతన్య మరోసారి తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్‌ చేశారు.

అయితే, ఈ తాజా పోస్ట్‌లో సన్‌సెట్‌ సమయంలో 'హష్‌' కారులో కూర్చొని ఉంది. ఆ ఫోటోను నాగ చైతన్య షేర్‌ చేశారు. అతను ఫోటోకు 'వైబ్' అనే పదంతో క్యాప్షన్ ఇచ్చాడు. దీంతో సమంత-నాగ చైతన్య ఇద్దరూ కలవడం ఖాయమని వస్తున్న వార్తలను చైతూ ఇలా కన్ఫామ్‌ చేశాడా..? అంటూ ఫ్యాన్స్‌ చెప్పుకొస్తున్నారు. కొంతమంది అభిమానులు మాత్రం మీ ఇద్దరూ రాజీ పడ్డారా..? అని నేరుగా ప్రశ్నిస్తున్నారు. సమంత అంటే నాగ చైతన్యకు చాలా ఇష్టమని అందుకే తన ప్రేమను ఇలా తెలుపుతున్నాడని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనా వారిద్దరూ మళ్లీ కలుస్తే ఆనందించే వాళ్ల సంఖ్య భారీగానే ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదని చెప్పవచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement