చై-సామ్‌ కలుస్తున్నారంటూ వార్తలు.. షాకిచ్చిన సమంత! | Samantha Removes Naga Chaitanya Tattoo On Her Body, Photos Goes Viral | Sakshi
Sakshi News home page

Samantha- Chaitanya: చై - సామ్‌ కలుస్తున్నారా?.. మరి తను ఇలా చేసిందేంటి?

Oct 11 2023 2:00 PM | Updated on Oct 11 2023 2:38 PM

Samantha Removes Naga Chaitanya tattoo On Her Body Photos Goes Viral - Sakshi

టాలీవుడ్‌లో మోస్ట్ బ్యూటిఫుల్ పెయిర్‌గా గుర్తింపు తెచ్చుకున్న సమంత – నాగ చైతన్య విడిపోయి దాదాపుగా రెండేళ్లు అవుతోంది. అయితే పెళ్లైన కొన్నేళ్లకే ఈ జంట విడాకులు తీసుకున్నారు. వీరిద్దరు విడిపోవడాన్ని వారి అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే ఇటీవల నాగచైతన్య- సామ్ మళ్లీ కలుసుకోబోతున్నారంటూ వార్తలొస్తున్నాయి. ఎందుకంటే తాజాగా నాగ చైతన్య వద్ద సమంత పెట్‌ డాగ్‌ హష్‌ కనిపించడంతో వారిద్దరూ మళ్లీ కలుస్తారన్నారంటూ నెటిజన్స్ చర్చించుకుంటున్నారు. మరోవైపు ఇద్దరు కలిస్తే బాగుంటుందని అటు నాగచైతన్య ఫ్యాన్స్, ఇట్టు సమంత ఫ్యాన్స్ సైతం భావిస్తున్నారు.

(ఇది చదవండి: 'హ్యాపీ బర్త్‌ డే గురూజీ'.. మెగాస్టార్ స్పెషల్ విషెస్!)

అయితే ఇటీవల తాజాగా సమంత సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు తెగ వైరల్‌గా మారాయి. పింక్‌ డ్రెస్‌లో సమంత తన ఫోటోలను ఇన్‌స్టా వేదికగా పంచుకుంది. ‍అయితే గతంలో షేర్ చేసిన ఫోటోల్లో సమంత బాడీపై అక్కినేని నాగచైతన్య టాటూ ఉండేది. ఈ సారి షేర్ చేసిన ఫోటోల్లో చైతూ టాటూ కనిపించకపోవడంపై అభిమానుల్లో చర్చ మొదలైంది.

ఇప్పుడిప్పుడే మళ్లీ కలుస్తారనుకుంటున్న తరుణంలో ఈ ట్విస్ట్ ఏంటని నెటిజన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే సామ్ నిజంగానే టాటూ తొలగించుకుందా? లేక ఉద్దేశపూర్వకంగానే కనిపించకుండా జాగ్రత్త పడిందా? అనే విషయం తెలియాల్సి ఉంది. ఏదేమైనా ఈ జంట కలవాలని ఫ్యాన్స్‌తో పాటు టాలీవుడ్‌లో చాలామంది  కోరుకుంటున్నారు. అయితే సమంత ఫోటోలు చూసిన నెటిజన్స్ దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.   

(ఇది చదవండి: నాగ చైతన్య షేర్‌ చేసిన ఫోటో.. మళ్లీ ఒకటిగా సమంత- చైతూ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement