సాక్షి, హైదరాబాద్/బంజారాహిల్స్: రాడిసన్ బ్లూప్లాజా హోటల్‌లోని పుడ్డింగ్ అండ్ మింక్ పబ్‌లో వెలుగులోకి వచ్చిన రేవ్ పార్టీ వ్యవహారంతో నిఘా వర్గాలు అప్రమత్తమయ్యాయి. స్థానిక పోలీసుల నుంచి ప్రాథమిక వివరాలు సేకరించిన ఇంటెలిజెన్స్ అధికారులు.. పబ్బుల్లో జరుగుతున్న కార్యకలాపాలపై రహస్య విచారణ చేపట్టారు. డ్రగ్స్ సరఫరాలో టాటూలు, కోడ్ వర్డ్స్ సహా పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి.
► విలాసాలకు నెలవుగా మారిన బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజగుట్ట, గచ్చిబౌలి, మాదాపూర్ తదితర ప్రాంతాల్లోని పబ్‌లలో డ్రగ్స్ దందా సాగుతున్నట్టు పోలీసు వర్గాలు చెప్తున్నాయి.
► కొన్ని పబ్‌లు సొంతంగా యాప్స్, వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపులు నిర్వహిస్తూ కస్టమర్లకు రహస్యంగా రేవ్ పార్టీలపై సమాచారం అందిస్తున్నాయని అధికారులు గుర్తించారు.
► యాప్‌లు, గ్రూపుల ద్వారా రిజిస్టర్ చేసుకుని పార్టీకి హాజరయ్యే వారికి నిర్వాహకులు టాటూలు వేస్తున్నారు. కస్టమర్ల మణికట్టుపై ఉండే ఈ టాటూ ఆధారంగానే ఏ డ్రగ్ ► కుడి చేయి మణికట్టుపై టాటూ ఉంటే.. వారికి గంజాయి, హష్ ఆయిల్ సరఫరా చేయాలని అర్థం. ఎడమ చేతి మణికట్టుపై ఉంటే కొకైన్, ఎండీఎంఏ వంటి డ్రగ్స్ సరఫరా చేస్తారు.
► కొన్ని రేవ్ పార్టీల్లో గంజాయి, హష్ ఆయిల్‌ను నేరుగా సరఫరా చేయట్లేదు. పార్టీ ప్రారంభంకావడానికి ముందే నిర్వాహకులు.. ఈ డ్రగ్స్‌ను నింపిన సిగరెట్లు సిద్ధం చేసి ఉంచుతున్నారు. వాటినే కస్టమర్లకు అందిస్తున్నారు.
► కొందరు పబ్ నిర్వాహకులు రేవ్ పార్టీలకు సంబంధించి ‘స్పెషల్’, ‘ఆఫర్’, ‘స్కీమ్’, ‘లిమిటెడ్’పేరుతో ప్రత్యేక కోడ్ భాషను వాడుతున్నారు. భారీగా డబ్బు వసూలు చేసే ఈ ► హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో తెల్లవారుజామున జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు, ఘర్షణలకు.. ఈ పార్టీలకు సంబంధం ఉన్నట్టు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఈ కోణంలో శాంతిభద్రతలు, ట్రాఫిక్ విభాగం అధికారులను అప్రమత్తం చేశాయి.
Comments
Please login to add a commentAdd a comment