చంద్రునిపై మచ్చలు ఎలా వచ్చాయో తెలుసా!
వాషింగ్టన్: రాత్రిళ్లు ఆకాశంలోకి చూసినపుడు మనకు ఎప్పుడో ఒక్కసారైన చిన్న అనుమానం వచ్చి ఉంటుంది.. అదే చంద్రుని మీద ఉన్న ఆ మచ్చలు ఎలా వచ్చాయి? అని.. ఆ మచ్చల వెనుక కథను నాసా ఇప్పుడు బయటపెట్టింది. మరీ ఆ మిస్టరీ వెనుక దాగున్న నిజాలను చూద్దాం..
చంద్రుడి గురించి మనకు ఇప్పటివరకు ఏం తెలుసు..? రాత్రి పూట కాకుండా పగలు కూడా చంద్రుడు కనిపిస్తాడనీ, ఇంకా మరికొన్ని చిన్న చిన్న విషయాలు తెలుసు. చంద్రుడి మీద మనకు కనిపించే తెలుపు, నలుపు మచ్చలు దాదాపు వందకు పైగా ఉన్నాయి. నాసా చేపట్టిన లూనార్ రీకొన్నైసెన్స్ ఆర్బిటర్ (ఎల్ఆర్ఓ) మిషన్ కు నేతృత్వం వహించిన కెల్లర్ అనే శాస్త్రజ్ఞడు తెలిపిన వివరాల ప్రకారం చంద్రుడి మీద మచ్చలు చాలా పెద్దవిగా గుంపుగా ఉంటాయి.
ఎలా ఏర్పడ్డాయి..
చంద్రునిపై మచ్చలు ఏర్పడానికి రెండు కారణాలు ఉన్నాయి.
- చంద్రుడు ఏర్పడే పరిణామక్రమంలో అయస్కాంత క్షేత్రంతో మిళితమైపోయాడు. దీని కారణంగా చంద్రుని మీద ఉండే శిలాజాలు నల్లని మచ్చలుగా కనిపిస్తాయి. అలాగని చంద్రుని మీద ఉన్న ప్రతి ఒక్క శిలాజం మచ్చగా కనిపించదు. అయస్కాంత క్షేత్రం బలం ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో మాత్రమే మచ్చలు తయారవుతాయి.
- చంద్రుడు సూర్యుని నుంచి శక్తిని గ్రహించుకుని రాత్రిపూట వెలుగునిస్తాడని మనకు తెలుసు. అలా సూర్యుని నుంచి వచ్చే వేడి గాలుల వల్ల అయస్కాంత క్షేత్రాలు ప్రభావితం చెంది బలమైన విద్యుత్ క్షేత్రాలను తయారుచేశాయి. ఈ విద్యుత్ క్షేత్రాలు వేడిగాలలతో ప్రభావం చెంది ఎక్కువ కాంతిని బయటకు ప్రసరించేలా చేస్తాయి. అందుకే చంద్రుని మీద మనకు కనిపించే కొన్ని మచ్చలు తెల్లగా ఉంటాయి.