చంద్రబాబు గజని: కొడాలి నాని | chandrababu naidu as a ghajini kodali nani | Sakshi
Sakshi News home page

Published Sat, Oct 26 2013 3:23 PM | Last Updated on Thu, Mar 21 2024 6:35 PM

విభజన ప్రక్రియను మొదలుపెట్టిన దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు అని వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుడు కొడాలి నాని విమర్శించారు. ఎల్బీ స్టేడియంతో జరుగుతున్న సమైక్య శంఖారావం సభలో ఆయన మాట్లాడుతూ... చంద్రబాబు గజని అని ఎద్దేవా చేశారు. ఒక ఓటు రెండు రాష్ట్రాలన్న బీజేపీతో 1999లో పొత్తుపెట్టుకున్న విషయాన్ని మర్చిపోయి ఆయన మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. చనిపోయిన వైఎస్సార్పై చంద్రబాబు పిచ్చిప్రేలాపనలు మానుకోవాలన్నారు. అనేక సంక్షేమ పార్టీలు పెట్టి ప్రజల గుండెల్లో వైఎస్సార్ గూడు కట్టుకున్నారని చెప్పారు. ఆయన తనయుడు వైఎస్ జగన్ స్థాపించిన పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు ప్రజలు ఎదురుచూస్తున్నారని అన్నారు. చంద్రబాబు ఒళ్లు దగ్గరపెట్టుకోవాల్సిన అవసరముందని హెచ్చరించారు. చంద్రబాబు తన పిచ్చి కుక్కలను మా నాయకుల మీదకు వదిలితే తగువిధంగా బుద్ధి చెబుతామని కొడాలి నాని అన్నారు. 150మంది ఎమ్మెల్యేలు వైఎస్‌ జగన్‌ సీఎం కావాలని సంతకాలు పెట్టినా పదవికి ఆశపడని నైజం ఆయనదన్నారు. కానీ చంద్రబాబు మాత్రం ఎమ్మెల్యేలతో వైశ్రాయ్‌ హోటల్‌లో క్యాంపు పెట్టి ఎన్టీఆర్‌కు వెన్నుపోటు ద్వారా సీఎం అయ్యారని గుర్తు చేశారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement