
జిల్ ప్రిన్స్..గజినీకి రివర్స్
హైలీ సుపీరియర్ ఆటోబయోగ్రాఫికల్ మెమొరీ (హెచ్‌ఎస్‌ఏఎం). ఈ వ్యాధి వచ్చిన వారికి చిన్నతనం నుంచి ఇప్పటివరకు జరిగిన అన్ని విషయాలు గుర్తుండిపోతాయట.! అయితే ఇదో వ్యాధి లక్షణమట. ప్రపంచంలో అత్యంత అరుదుగా కొద్దిమందికే ఈ వ్యాధి వస్తుంది. ఇది వచ్చిన వారు 80 మంది మాత్రమే ఉన్నారని వైద్య నిపుణుల కథనం. ఆ కోవలోకే వస్తుంది ఈ ఫొటోలోని జిల్ ప్రిన్స్. 27 ఏళ్ల జిల్ ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌కు చెందింది. ఈ మతిమరుపు గజినీకి రివర్స్ అన్నమాట.
వాస్తవంగా హెచ్‌ఎస్‌ఏఎం ఉన్నవారికి సుమారుగా 10–12 ఏళ్ల వయసు నుంచి జరిగిన విషయాలు గుర్తుంటాయి. కానీ జిల్‌కు మాత్రం తాను పుట్టిన 12 రోజుల నుంచి జరుగుతున్న సంగతులూ గుర్తున్నాయని చెబుతోంది. తన మొదటి పుట్టినరోజుకు వేసుకున్న డ్రెస్ నుంచీ అన్నీ చెప్పేస్తోంది. తాను చదివిన అన్ని హ్యారీ పోర్టర్ నవలల్లోని ప్రతీ అక్షరాన్ని చెప్పగలుగుతోందట. ఇది తెలుసుకున్న శాస్త్రవేత్తలు ఇదెలా సాధ్యమని ముక్కున వేలేసేకుంటున్నారు.