
సాక్షి, చెన్నై: కరోనాతో నిర్మాత సేలం చంద్రశేఖర్ సోమ వారం కన్నుమూశారు. ఈయన సూర్య కథానాయకుడిగా నటించిన గజిని, విజయకాంత్ నటించిన శబరి, భరత్ నటించిన ఫిబ్రవరి 14, కిల్లాడి వంటి చిత్రాలను నిర్మించారు. కొంతకాలంగా చిత్రనిర్మాణానికి దూరంగా ఉన్న సేలం చంద్రశేఖర్ వయసు 59 ఏళ్లు. సేలంలో నివసిస్తున్న ఈయన కొన్ని రోజుల క్రితం అనారోగ్యానికి గురయ్యారు. దీంతో స్థానిక ప్రైవేటు ఆసుపత్రిలో చేరి చికిత్స పొందారు. ఇటీవల ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచా రు. ఆయన మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
చదవండి: నా జీవితంలో ఇది అత్యంత క్లిష్ట సమయం: నటుడు
Comments
Please login to add a commentAdd a comment