ఇలా చేయడంతో వారంలో కోలుకున్నా: విశాల్‌ | Video: Vishal explains How He Was Cured From Corona | Sakshi
Sakshi News home page

ఇలా చేయడం వల్ల వారంలో కోలుకున్నా: విశాల్‌

Published Wed, Jul 29 2020 11:34 AM | Last Updated on Wed, Jul 29 2020 1:51 PM

Video: Vishal explains How He Was Cured From Corona - Sakshi

ఇటీవల తను కరోనా బారినపడి కోలుకున్నట్లు హీరో విశాల్‌ వెల్లడించినవ విషయం తెలిసిందే. ముందుగా తన తండ్రి జీకే రెడ్డికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు తెలిపిన విశాల్‌.. తండ్రికి సాయం చేస్తున్న క్రమంలో ఆ వైరస్‌ తనకు కూడా సోకినట్లు పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగా ఉందని, పూర్తిగా కోలుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ క్రమంలో కరోనాతో తన అనుభవాన్ని పంచుకునేందుకు విశాల్‌ ట్విటర్‌లోకి వెళ్లారు. పాజిటివ్ వచ్చిన వ్యక్తులను మనోధైర్యాన్ని కలిగించేలా ‌ ఓ వీడియో షేర్ చేశాడు. సినిమాకు సంబంధించిన చాలా ట్వీట్లు చేశానని, తన జీవితంలో ఇప్పుడు చాలా ముఖ్యమైన వీడియోను షేర్‌ చేస్తున్నానని ఈ సందర్భంగా విశాల్‌ వెల్లడించారు. (మేం ఆరోగ్యంగా ఉన్నాం)

ఈ వీడియోలో కరోనా పాజిటివ్ వచ్చినా కూడా ఎలాంటి భయం అవసరం లేదన్నాడు. ఒకవేళ టెస్టులు చేసిన తర్వాత కూడా ఫలితాల కోసం టెన్షన్ పడొద్దని చెప్పాడు. నాన్న గురించి జాగ్రత్తలు తీసుకుంటుంటే తనకు కూడా అవే లక్షణాలు కనిపించాయని.. శరీర ఉష్ణోగ్రత 100-103కి పైగా ఉందని తెలిపాడు. ఆ తర్వాత రోజు దగ్గు, జలుబు వచ్చిందని.. తన మేనేజర్ హరికి కూడా అవే లక్షణాలున్నాయని తెలిపాడు. తాము ఆయుర్వేద మెడిసిన‌ వాడటం వల్ల కేవలం వారం రోజుల్లో డేంజ‌ర్ నుంచి బయటపడినట్లు పేర్కొన్నాడు. (సుశాంత్ ఆత్మహత్య కేసులో కీలక మలుపు)

క్రమ పద్దతిలో మెడిసిన్స్ వాడుతూ ప్రత్యేక శ్రద్ద తీసుకోవడంతో శరీర ఉష్ణోగ్రత, లక్షణాలు తగ్గుముఖం పట్టాయని చెప్పాడు. సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉండటంతో పాటు మందులు కూడా వాడటం వల్ల  వారం రోజుల్లోనే ఆరోగ్యంగా మారిపోయామని పేర్కొన్నాడు.  ఆరోగ్యం కుదుటపడేందుకు ఉపయోగిస్తున్న మెడిసిన్‌ను సైతం ట్విటర్‌లో పంచుకున్నాడు. అయితే ప్రతి ఒకరూ తమ ఫ్యామిలీ డాక్టర్‌ను కలిసి ఈ మెడిసన్‌ను వాడాలని విశాల్‌ సూచించాడు. తాజాగా ఇది చూసిన అభిమానులు నువ్వు రియల్ హీరో అంటూ విశాల్‌ను పొగిడేస్తున్నారు. (కోలీవుడ్‌లో ‘బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఛాలెంజ్’)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement