
తండ్రితో విశాల్
కరోనా మహమ్మారి రోజురోజుకూ తన ప్రతాపం చూపుతోంది. భారతదేశంలో కోవిడ్ 19 బాధితుల సంఖ్య పెరుగుతూ ఉంది. ఇప్పటికే హిందీ, కన్నడ చిత్ర పరిశ్రమలకు చెందిన పలువురు నటీనటులు కరోనా బారిన పడ్డారు. హీరో విశాల్ కూడా కరోనా బారిన పడ్డారు. విశాల్ తండ్రి, నిర్మాత జి.కె. రెడ్డి పదిహేను ఇరవై రోజుల కిందట కరోనా బారిన పడ్డారట. తండ్రికి సేవలందించిన క్రమంలో విశాల్‌కి కూడా కరోనా సోకింది. కరోనా నివారణకు తండ్రీ కొడుకులిద్దరూ హోమియోపతి మందులు వాడటంతో దాన్నుంచి బయటపడ్డారని వార్త వచ్చింది. ‘ప్రమాదం నుంచి బయటపడ్డాం, మేము ఆరోగ్యంగా ఉన్నాం’ అని విశాల్ ట్వీట్ చేశారు.