GK reddy
-
హీరో విశాల్ తండ్రి ఫిట్నెస్ చూస్తే షాకే!
చెన్నై: ఇటీవల కరోనా బారినపడి కోలుకున్న హీరో విశాల్ తండ్రి జీకే రెడ్డి తన ఆరోగ్య సహస్యం వెల్లడించారు. 82 ఏళ్ల వయసులో తాను ఆరోగ్యంగా ఉన్నానని, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడమే తన ఆరోగ్యానికి కారణమని తెలిపారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొందని, ఇంట్లోనే ఉండి చిన్న చిన్న ఎక్సర్సైజుల వల్ల శారీరకంగా ధృడంగా తయారవ్వొచ్చని అన్నారు. వ్యాయామానికి సంబంధించి ఆయన వీడియోను యూట్యూబ్‌లో అప్లోడ్ చేశారు. అభిమానులు, నెటిజన్లు జీకే రెడ్డిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. 82 ఏళ్ల వయసులో ఇంత ఫిట్‌గా ఉన్నారు. మీ కృషి అభినందనీయం అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా, జీకే రెడ్డికి కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో విశాల్ దగ్గరుండి సపర్యలు చేశాడు. ఆ క్రమంలోనే తనూ వైరస్ బారినపడ్డాడు. డాక్టర్ల సలహాలు, మనోధైర్యంతో ఇద్దరూ వైరస్‌పై విజయం సాధించారు. ఇదిలాఉండగా.. జీకే గ్రానైట్స్ కంపెనీ అధినేత అయిన జీకే రెడ్డి.. జీకే ఫిట్ అనే సంస్థను స్థాపించారు. దానిద్వారా వ్యాయామంలో మెళకువలు నేర్పిస్తుంటారు. (చదవండి: బీజేపీలోకి హీరో విశాల్?) -
మేం ఆరోగ్యంగా ఉన్నాం
కరోనా మహమ్మారి రోజురోజుకూ తన ప్రతాపం చూపుతోంది. భారతదేశంలో కోవిడ్ 19 బాధితుల సంఖ్య పెరుగుతూ ఉంది. ఇప్పటికే హిందీ, కన్నడ చిత్ర పరిశ్రమలకు చెందిన పలువురు నటీనటులు కరోనా బారిన పడ్డారు. హీరో విశాల్ కూడా కరోనా బారిన పడ్డారు. విశాల్ తండ్రి, నిర్మాత జి.కె. రెడ్డి పదిహేను ఇరవై రోజుల కిందట కరోనా బారిన పడ్డారట. తండ్రికి సేవలందించిన క్రమంలో విశాల్‌కి కూడా కరోనా సోకింది. కరోనా నివారణకు తండ్రీ కొడుకులిద్దరూ హోమియోపతి మందులు వాడటంతో దాన్నుంచి బయటపడ్డారని వార్త వచ్చింది. ‘ప్రమాదం నుంచి బయటపడ్డాం, మేము ఆరోగ్యంగా ఉన్నాం’ అని విశాల్ ట్వీట్ చేశారు. -
వినోద్ మెహతాకి జీకే రెడ్డి మెమోరియల్ అవార్డు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ జర్నలిస్టు, ది ఔట్లుక్ గ్రూప్ ఎడిటోరియల్ చైర్మన్ వినోద్ మెహతా ప్రతిష్టాత్మక ‘జీకే రెడ్డి మెమోరియల్ అవార్డు’కు ఎంపికయ్యారు. జర్నలిజంలో మెహతా చేసిన కృషికి గుర్తింపుగా ఆయన్ని ఎంపిక చేసినట్టు ఈ అవార్డు వ్యవస్థాపకులు, టీఎస్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ టి.సుబ్బిరామిరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ఏడాది డిసెంబర్లో జరిగే ఓ కార్యక్రమంలో అవార్డుతోపాటు రూ.5 లక్షల నగదు బహుమతి, బంగారు పతకం, ప్రశంసా పత్రాన్ని మెహతాకు అందజేయనున్నట్టు తెలిపారు. సుప్రసిద్ధ పాత్రికేయుడు జీకే రెడ్డి స్మారకార్థం ఏటా పాత్రికేయ రంగానికి చెందిన ఒకరిని ఈ అవార్డుతో టీఎస్ఆర్ ఫౌండేషన్ సత్కరిస్తోంది.