వినోద్ మెహతాకి జీకే రెడ్డి మెమోరియల్ అవార్డు | Vinod Mehta wins GK Reddy Memorial Award 2014 | Sakshi
Sakshi News home page

వినోద్ మెహతాకి జీకే రెడ్డి మెమోరియల్ అవార్డు

Published Wed, Sep 3 2014 12:33 AM | Last Updated on Sat, Sep 2 2017 12:46 PM

Vinod Mehta wins GK Reddy Memorial Award 2014

సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ జర్నలిస్టు, ది ఔట్‌లుక్ గ్రూప్ ఎడిటోరియల్ చైర్మన్ వినోద్ మెహతా ప్రతిష్టాత్మక ‘జీకే రెడ్డి మెమోరియల్ అవార్డు’కు ఎంపికయ్యారు. జర్నలిజంలో మెహతా చేసిన కృషికి గుర్తింపుగా ఆయన్ని ఎంపిక చేసినట్టు ఈ అవార్డు వ్యవస్థాపకులు, టీఎస్‌ఆర్ ఫౌండేషన్ చైర్మన్ టి.సుబ్బిరామిరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ఏడాది డిసెంబర్‌లో జరిగే ఓ కార్యక్రమంలో అవార్డుతోపాటు రూ.5 లక్షల నగదు బహుమతి, బంగారు పతకం, ప్రశంసా పత్రాన్ని మెహతాకు అందజేయనున్నట్టు తెలిపారు.

 

సుప్రసిద్ధ పాత్రికేయుడు జీకే రెడ్డి స్మారకార్థం ఏటా పాత్రికేయ రంగానికి చెందిన ఒకరిని ఈ అవార్డుతో టీఎస్‌ఆర్ ఫౌండేషన్ సత్కరిస్తోంది.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement