
హఫీజ్‌పేట్(హైదరాబాద్): ప్రముఖ పత్రికా సంపాదకుడు ఏబీకే ప్రసాద్‌కు గజ్జెల మల్లారెడ్డి స్మారక పురస్కారం లభించింది. కొండాపూర్‌లోని చండ్రరాజేశ్వరరావు (సీఆర్) ఫౌండేషన్ ఆధ్వర్యంలోని వృద్ధాశ్రమానికి శనివారం వచ్చిన యోగి వేమన విశ్వవిద్యాలయం ఉపకులపతి సూర్యకళావతి ఆమె చేతులమీదుగా ఈ పురస్కారాన్ని ఏబీకేకు అందజేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పాత్రికేయ వృత్తికే వన్నె తెచ్చి అనేక ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ సంస్థల నుంచి గౌరవ పురస్కారాలు అందుకున్న వ్యక్తి ఏబీకే అని తెలుగులోని అన్ని ప్రధాన పత్రికలకు సంపాదకులుగా పనిచేసిన ఘనత ఆయనదని ప్రశంసించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘానికి అధ్యక్షుడిగా 2004–2009 సంవత్సరాలకు సేవలందించి తెలుగుభాషకు ప్రాచీన హోదా తీసుకురావడంలో ఆయన చేసిన కృషి విస్మరించలేనిదన్నారు. ఈ సమావేశంలో సీఆర్ ఫౌండేషన్ కోశాధికారి వి.చెన్నకేశవరావు, వైద్యాధికారి డాక్టర్ కె.రజిని, డాక్టర్ సరస్వతి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment