AP MAA Institutes Memorial Award Named After Superstar Krishna - Sakshi
Sakshi News home page

Superstar Krishna : సూపర్‌ స్టార్‌ కృష్ణ పేరుతో అవార్డు

Published Thu, Nov 24 2022 8:32 AM | Last Updated on Thu, Nov 24 2022 1:46 PM

AP MAA Institutes Memorial Award Named After Superstar Krishna - Sakshi

‘‘సినీ రంగంలో విశిష్ట సేవలందించిన వ్యక్తికి ప్రతి ఏడాది ‘సూపర్‌ స్టార్‌ కృష్ణ స్మారక అవార్డు’ ప్రదానం చేస్తాం’’ అని ‘మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ఆంధ్రప్రదేశ్‌ (మా ఏపీ)’ అధ్యక్షుడు, డైరెక్టర్‌ దిలీప్‌ రాజా అన్నారు. తెనాలిలోని ‘మా ఏపీ’ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ– ‘‘ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రజలు తమకు ఇష్టమైన ముగ్గురు నటుల పేర్లను ‘మా – ఏపీ’ కార్యాలయానికి పంపాలి.

పంపిన వారి వివరాలు, ఫోన్‌ నంబర్‌ తప్పనిసరిగా ఉండాలి. ప్రజా బ్యాలెట్‌లో ఎక్కువ ఓట్లు వచ్చిన ఒకరిని ‘సూపర్‌ స్టార్‌ కృష్ణ స్మారక అవార్డు’కు జ్యూరీ ఎంపిక చేస్తుంది. తెనాలిలో జరిగే ఈ అవార్డు వేడుక తేదీని మహేశ్‌బాబుతో చర్చించిన అనంతరం తెలియజేస్తాం’’ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement