పెళ్లయ్యాక సినిమాలు మానేశా: హీరోయిన్‌ | I have stopped taking up any assignments: Asin says post wedding | Sakshi
Sakshi News home page

పెళ్లయ్యాక సినిమాలు మానేశా: హీరోయిన్‌

Published Tue, Apr 5 2016 11:45 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

పెళ్లయ్యాక సినిమాలు మానేశా: హీరోయిన్‌ - Sakshi

పెళ్లయ్యాక సినిమాలు మానేశా: హీరోయిన్‌

గత జనవరిలో రాహుల్‌ శర్మను పెళ్లాడి వైవాహిక జీవితంలో అడుగుపెట్టింది బాలీవుడ్ ముద్దుగుమ్మ ఆసిన్ థొట్టుంకల్‌. పెళ్లయిన తర్వాత ఎలాంటి సినిమా ఆఫర్లు ఆమె ఒప్పుకోవడం లేదట. ఈ విషయాన్నే పెళ్లికి ముందు కూడా చెప్పింది. అయినా తనకు పలు సినిమాల ఆఫర్లు వస్తున్నాయంటూ కథనాలు వస్తుండటంతో మళ్లీ ఓసారి వివరణ ఇచ్చింది.

'నేను గతంలో చెప్పిన దానిని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయిన నా మీడియా మిత్రులందరికీ మరోసారి తెలియజేస్తున్నా. నేను ఎలాంటి అసైన్‌మెంట్లను ఒప్పుకోవడం లేదు. నా బ్రాండ్‌ ఎండార్స్‌మెంట్లు సహా నా కమిట్‌మెంట్లన్నింటినీ పెళ్లికి ముందే పూర్తి చేశాను. నా వర్క్‌ గురించి, అసైన్‌మెంట్ల గురించి ఊహాగానాలు చేయడం మానుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా. ప్రస్తుతం నేను వాటిని చేయడం లేదు. పెళ్లికి ముందే నేను ప్రకటన చేశాను' అని ఆసిన్ తన ఇన్‌స్టాగ్రామ్‌ పేజీలో వెల్లడించింది. మైక్రోమాక్స్ కో ఫౌండర్ అయిన రాహుల్‌-ఆసిన్ పెళ్లి జనవరి 19న జరిగిన సంగతి తెలిసిందే. క్రైస్తవ, హిందూ సంప్రదాయాల ప్రకారం వీరి వివాహం జరిగింది.


2008లో 'గజినీ' సినిమాతో బాలీవుడ్‌కు హాయ్‌ చెప్పిన ఆసిన్‌.. పెళ్లికి ముందు చివరగా అభిషేక్ బచ్చన్ నటించిన 'ఆల్ ఈజ్ వెల్‌' సినిమాలో హీరోయిన్‌గా కనిపించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement