ఆసిన్, రాహుల్ శుభలేఖ ఇలా ఉంటుంది!
బాలీవుడ్ హీరోయిన్ ఆసిన్, రాహుల్‌శర్మ పెళ్లి శుభలేఖ అందుకున్న విషయాన్ని హీరో అక్షయ్‌కుమార్ ఆదివారం ట్విట్టర్‌లో వెల్లడించారు. మైక్రోమాక్స్ సీఈవో రాహుల్‌శర్మ, ఆసిన్ వివాహం ఈ నెల 23న జరుగనుంది. గతకొంతకాలంగా చెట్టాపట్టాలేసుకొని తిరిగిన ఈ జంట త్వరలోనే పెళ్లి చేసుకుంటారని చాలాకాలంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. సంప్రదాయకత, నవ్యత కలబోసి.. ముదురు ఎరుపు, బంగారు రంగుల్లో వీరి శుభలేఖ కవర్‌ను తీర్చిదిద్దారు. ఆసిన్-రాహుల్ శర్మ వివాహం ఢిల్లీలో జరుగనుండగా.. ముంబైలో తన బాలీవుడ్ స్నేహితులకు ఆసిన్ విందు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.
'గజనీ' సినిమాతో బాలీవుడ్‌కు పరిచయమైన ఆసిన్ అడపదడపా విజయాలతో మొన్నటివరకు ప్రేక్షకులను పలుకరించింది. ఇటీవల ఆమె నటించిన 'ఆల్ ఈజ్ వెల్' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత తన సినిమా షూటింగ్‌లన్నింటికీ ఆసిన్ స్వస్తి చెప్పింది. తన ఆప్తమిత్రులైన ఆసిన్-రాహుల్ శర్మ తొలి శుభలేఖను అందుకున్నట్టు అక్షయ్ ట్విట్టర్‌లో ఆనందం వ్యక్తం చేశారు.
Happy to receive the 1st wedding card of 2 of my close friends,Rahul & Asin. Wishing you both happiness always pic.twitter.com/1ILe2TfK0F
— Akshay Kumar (@akshaykumar) January 10, 2016