పెళ్లిపీటలెక్కబోతున్న హీరోయిన్ | Asin to tie the knot with Rahul Sharma on Novemver 26 | Sakshi
Sakshi News home page

పెళ్లిపీటలెక్కబోతున్న హీరోయిన్

Published Sun, Oct 25 2015 4:43 PM | Last Updated on Sun, Sep 3 2017 11:28 AM

పెళ్లిపీటలెక్కబోతున్న హీరోయిన్

పెళ్లిపీటలెక్కబోతున్న హీరోయిన్

'గజనీ' సినిమాతో ఇటు దక్షణాది వారిని, అటు బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరోయిన్ అసిన్ త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు. వచ్చేనెల 26న తన చెలికాడు రాహుల్‌ శర్మను మనువాడనున్నారు. ఈ మేరకు వారి పెళ్లి ముహూర్తం ఖరారైనట్లు తెలిసింది. న్యూఢిల్లీలోని ఓ ప్రముఖ హోటల్‌లో వీరి వివాహం జరుగనుంది.

నవంబర్ 27న ఢిల్లీలోని వెస్ట్ ఎండ్ గ్రీన్స్ ఫార్మ్‌హౌజ్‌లో ఈ జంట అతిథులకు రిసెప్షన్ ఇవ్వనుంది. ఈ వేడుకలో కుటుంబసభ్యులు, సన్నిహిత మిత్రులు మాత్రమే పాల్గొనున్నారు. ఇదే ఫామ్‌హౌజ్‌లో గతంలో షాహిద్, మీరాల రిసెప్షన్ జరిగింది. నవంబర్ 28న ముంబైలో ఈ దంపతులు మరో రిసెప్షన్ ఇవ్వనున్నారు.

 మైక్రోమాక్స్ సహ స్థాపకుడైన రాహుల్‌ శర్మ-అసిన్ కొంతకాలంగా స్నేహంగా ఉంటున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇద్దరి మనస్సులు కలువడంతో పెళ్లికి ఒప్పుకున్నట్టు తెలుస్తున్నది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement