రెండు సాంప్రదాయాల్లో అసిన్ పెళ్లి | asin rahul sharma wedding | Sakshi
Sakshi News home page

రెండు సాంప్రదాయాల్లో అసిన్ పెళ్లి

Jan 20 2016 1:52 PM | Updated on Sep 3 2017 3:59 PM

రెండు సాంప్రదాయాల్లో అసిన్ పెళ్లి

రెండు సాంప్రదాయాల్లో అసిన్ పెళ్లి

సౌత్తో పాటు నార్త్ ఇండస్ట్రీలోనూ హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న అందాల భామ అసిన్ పెళ్లి, బందువులు, అత్యంత సన్నిహితుల మధ్య ఘనంగా జరిగింది. మైక్రోమ్యాక్స్ సంస్థ కో ఫౌండర్...

సౌత్తో పాటు నార్త్ ఇండస్ట్రీలోనూ హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న అందాల భామ అసిన్ పెళ్లి, బందువులు, అత్యంత సన్నిహితుల మధ్య ఘనంగా జరిగింది. మైక్రోమ్యాక్స్ సంస్థ కో ఫౌండర్ రాహుల్ శర్మను జనవరి 19న అసిన్ వివాహం చేసుకుంది. ముందుగా క్యాథలిక్ సాంప్రదాయం ప్రకారం క్రిస్టియన్ వివాహం చేసుకున్న ఈ జంట, తరువాత హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకుంది.

ఢిల్లీలోని ఓ రిసార్ట్ హోటల్లో ఈ కార్యక్రమం జరిగింది. రాహుల్ శర్మకు చెందిన ఓ ఫార్మ్ హౌస్లో గురువారం బందువులకు పార్టీ ఇవ్వనున్నారు. త్వరలో ముంబైలోని సన్నిహితులు సినీ ప్రముఖుల కోసం రిసెప్షన్ నిర్వహించే ఆలోచనలో ఉన్నారు. అమీర్ ఖాన్ సరసన గజినీ సినిమాతో బాలీవుడుకి పరిచయం అయిన అసిన్ చివరి చిత్రం ఆల్ ఈజ్ వెల్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement