ప్లేట్ ఫిరాయించిన అసిన్ | Asin fire on Media | Sakshi
Sakshi News home page

ప్లేట్ ఫిరాయించిన అసిన్

Published Sun, Apr 10 2016 2:33 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

ప్లేట్ ఫిరాయించిన అసిన్ - Sakshi

ప్లేట్ ఫిరాయించిన అసిన్

 క్షణ క్షణంబుల్ జవరాలి చిత్తంబుల్ అన్నారో కవివర్యులు. ఆ విషయాన్ని ఇంతకు ముందు చాలా మంది తారలు నిజం చేసినా, తానేమీ తక్కువ కాదన్నట్లు నటి అసిన్ రుజువు చేశారు. ఒకప్పటి క్రేజీ నటి అసిన్. దక్షిణాదిలో టాప్ హీరోయిన్‌గా ఉండగానే బాలీవుడ్‌కు ఎగుమతై అక్కడే మకామ్ పెట్టేసిన ఈ కేరళా భామ హిందీలోనూ అవకాశాలు తగ్గుముఖం పట్టడంతో బాలీవుడ్ స్టార్ నటుడు అక్షయ్‌కుమార్ ద్వారా పరిచయమైన మెక్రోమ్యాక్స్ కంపెనీ అధినేత రాహుల్ శర్మ ప్రేమలో మునిగి తేలి చివరికి ఆయన్నే మనువాడేశారు.
 
 ఇక్కడి వరకూ కథ బాగానే ఉంది. అసిన్ ప్రేమ వివాహానికి కొందరు అసూయ పడినా మరి కొందరు మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. ఇటీవల ఈ బ్యూటీ అనూహ్యంగా మీడియాపై విరుచుకు పడి వార్తల్లోకెక్కారు. ఆ కథేమిటంటే తాను వివాహానికి ముందే నటనకు పుల్ స్టాప్ పెట్టేశాన ని, వివాహానంతరం సంసార జీవితానికే పరిమితమైనట్టు పేర్కొన్నారు. అప్పటికి అంగీకరించిన చిత్రాలనూ, వాణిజ్య ప్రకటనలను పూర్తి చేశానని పేర్కొన్నారు. అయినా తనపై అసత్య ప్రచారం చేస్తున్నార ని, ఇకనైనా తన గురించి నిరాధార వార్తలను రాయడం మానుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
  ఇలా అన్న కొన్ని రోజులకే అసిన్ ప్లేట్ ఫిరాయించారు. ఇకపై నటించనున్న విషయంపై స్పందిస్తూ తాను అలా అన్నానా? ప్రస్తుతానికి వివాహ జీవితానికే పరిమితం అయ్యానని మాత్రమే తాను చెప్పినట్లు తను ట్విట్టర్‌లో పేర్కొంటూ మళ్లీ తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని మీడియాపై నెపం నెట్టేసే ప్రయత్నం అసిన్ చేశారు. ఏదేమైనా అసిన్ ఇలా ప్లేట్ ఫిరాయించడంతో త్వరలోనే మళ్లీ నటించడానికి వచ్చే అవకాశం ఉందనే విషయం అర్థం అవుతోందంటున్నారు సినీ వర్గాలు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement