నాంది పూర్తి | Allari Naresh Naandi poster release | Sakshi
Sakshi News home page

నాంది పూర్తి

Published Fri, Oct 30 2020 12:24 AM | Last Updated on Fri, Oct 30 2020 12:24 AM

Allari Naresh Naandi poster release - Sakshi

‘అల్లరి’ నరేష్‌ హీరోగా నటించిన తాజా చిత్రం ‘నాంది’. ఈ సినిమా ద్వారా విజయ్‌ కనకమేడల దర్శకుడిగా పరిచయమవుతున్నారు. సతీష్‌ వేగేశ్న నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. ‘‘నాంది’ సినిమాలో పూర్తి భిన్నమైన, ఉద్వేగభరితమైన పాత్ర పోషించారు నరేష్‌. ఇలాంటి పాత్రను ఆయన ఇప్పటివరకు చేయలేదు. సతీష్‌ వేగేశ్న ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌కు (ఫస్ట్‌ రివీల్‌ ఇంప్యాక్ట్‌) అద్భుతమైన స్పందన వచ్చింది’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ఈ సినిమాకి లైన్‌ ప్రొడ్యూసర్‌: రాజేష్‌ దండా, కెమెరా: సిద్, సంగీతం: శ్రీచరణ్‌ పాకాల.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement