
ప్రేక్షకులు ఓటీటీలకు అలావాటు పడడంతో.. వెబ్ సీరీస్‌ల హవా పెరిగింది.మరోవైపు మారుతున్న ట్రెండ్‌కు అనుగుణంగా మన స్టార్స్ కూడా డిజిటల్ మాధ్యమాల్లో వెబ్ సిరీస్‌లు, టాక్ షోలకు ప్రాధాన్యత ఇస్తున్నారు.ఇప్పటికే పలువురు స్టార్ డైరెక్టర్స్ వెబ్ సీరీస్ చేస్తూ ఓటీటీ ఆడియన్స్‌ను మెప్పిస్తున్నారు. తాజాగా ఈ జాబితాలో ఫ్యామిలీ చిత్రాల దర్శకుడు వేగేశ్న సతీష్ కూడా చేరారు.
ప్రస్తుతం 'కోతి కొమ్మచ్చి', 'శ్రీ శ్రీ రాజా వారు' సినిమాలు చేస్తున్న వేగేశ్న సతీష్ పల్లెటూరి కథలతో ఓ వెబ్ సిరీస్ కూడా చేస్తున్నారు. అయితే ఇది పూర్తిగా ఆయన మార్క్ పల్లెటూరి కథలతో తెరకెక్కనున్న ఆంతాలజీతో కూడిన వెబ్ సిరీస్. అందుకే దీనికి 'కథలు(మీవి మావి)' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇప్పటికే మూడు కథలకు సంబంధించి షూటింగ్ పూర్తయింది. త్వరలోనే మిగిలిన కథలు షూట్ చేసి ఒక ప్రముఖ ఓటీటీ సంస్థ ద్వారా విడుదల చేయనున్నారు. ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన సినిమాలు తీసి దర్శకుడిగా మెప్పించిన వేగేశ్న సతీష్ ఈ వెబ్ సిరీస్ కూడా ఫ్యామిలీ ఆడియన్స్ హాయిగా చూసేలా ఎటువంటి వల్గారిటీ లేకుండా క్లీన్ ఎంటర్టైనర్ గా రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.ఈ సిరీస్ కోసం కొందరు ప్రముఖ నటీ నటులు అలాగే సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. వారి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment