నిర్మాణ రంగంలోకి టాప్ మ్యూజిక్ కంపెనీ
ప్రముఖ ఆడియో కంపెనీ ఆదిత్య మ్యూజిక్ సినీ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టనుంది. ఎన్నో భారీ చిత్రాల ఆడియో రైట్స్ సొంతం చేసుకున్న ఈ సంస్థ తొలిసారిగా ఓ డబ్బింగ్ సినిమాతో టాలీవుడ్ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టనుంది. కార్తీ, రకుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన 'తీరన్ అధిగరమ్ ఒండ్రు' సినిమాను ఆదిత్య సంస్థ తెలుగులో విడుదల చేసేందుకు రెడీ అవుతోంది.
హెచ్.వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు జిబ్రన్ సంగీతం అందిస్తున్నాడు. యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అభిమన్యు సింగ్ మరో కీలక పాత్రలో కనిపించనున్నాడు. కార్తీ మరోసారి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్గా నటిస్తున్న ఈ సినిమా తెలుగు వర్షన్కు ఆదిత్య మ్యూజిక్ ఎండి ఉమేష్ గుప్తా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. జూన్ 30న సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఆగస్టు చివర్లో లేదా సెప్టెంబర్ తొలి వారంలో సినిమాను రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు.