
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ మహమ్మారి నియంత్రణ చర్యలో భాగంగా కళాకారులు సైతం నడుం బిగించారు. తమ వంతుగా అవగాహన గీతాలను రూపొందించారు. ఈమేరకు ఆదివారం మంత్రుల నివాస ప్రాంగణంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ గీతాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. ఈ అవగాహన గీతాలను రచించిన రచయితలను, గాయకులను అభినందించారు. కరోనా వైరస్ నియంత్రణ కోసం సీఎం కేసీఆర్ అనుక్షణం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, దర్శకుడు నరేందర్‌గౌడ్ నంగునూరి, ప్రముఖ గీత రచయిత, సాంస్కృతిక సారథి కళాకారుడు అభినయ శ్రీనివాస్‌లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment