సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ నియంత్రణ కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) అన్ని ప్రయత్నాలు చేస్తోంది. వాట్సాప్, ఫేస్‌బుక్‌ల ద్వారా ప్రపంచంలోని పలు దేశాలకు చెందిన 2 కోట్ల మందిని నిరంతరం అప్రమత్తం చేసేందుకు గాను ఆయా సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది. తన అధికారిక వెబ్‌సైట్‌లో ఉన్న ఓ ప్రత్యేక లింకును క్లిక్ చేయడం ద్వారా ఫోన్ నంబర్‌ను పంపిస్తే.. ఆ మొబైల్‌కు ఎప్పటికప్పుడు సమాచారం చేరవేయనుంది. అదేవిధంగా ఫేస్‌బుక్ అకౌంట్‌ను రిజిస్టర్ చేసుకోవడం ద్వారా కూడా ఆ సమాచారాన్ని తెలుసుకునే విధంగా ఏర్పాట్లు చేసింది.
ఈ సమాచారమే అధికారికం..
వాస్తవానికి కరోనా వైరస్ గురించి పలు ఊహాగానాలు, కల్పితాలు, అవాస్తవాలు, అర్ధ సత్యాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. ఇవి ప్రజల్లోకి వెళ్లకుండా ఉండాలంటే డబ్ల్యూహెచ్‌వో ద్వారా వచ్చే సమాచారాన్ని అధికారికంగా ప్రజల్లోకి తీసుకెళ్లడమే మంచిది. ఎప్పటికప్పుడు వివిధ దేశాల్లో కరోనా కేసుల సంఖ్య, మరణాల సంఖ్య, ఆయా దేశాలు తీసుకుంటున్న చర్యలు, సలహాలను కూడా అందించనుంది. అదేవిధంగా కరోనా వైరస్ గురించి ఉండే సందేహాలను కూడా ప్రశ్నల రూపంలో సదరు వాట్సాప్ నంబర్‌కు పంపిస్తే మళ్లీ సమాధానాలు కూడా పంపే విధంగా ఏర్పాటు చేసింది అయితే ఇంకెందుకు ఆలస్యం.. డబ్ల్యూహెచ్‌వో అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఆ ప్రత్యేక లింక్‌ను క్లిక్ చేద్దామా.
Comments
Please login to add a commentAdd a comment