
ఫలక్‌నుమా ప్యాలెస్‌లో కేసీఆర్ విందు
హైదరాబాద్: 14వ ఆర్థిక సంఘం సభ్యులు గురువారం హైదరాబాద్ రానున్నారు. సీఎం కేసీఆర్‌తో భేటీకానున్న ఆర్థిక సంఘం సభ్యులు సమావేశమవుతారు. ఈ నేపథ్యంలో తమ ప్రభుత్వం తరపున ఆర్థిక సంఘానికి ఇవ్వాల్సిన ప్రతిపాదనలపై సచివాలయంలో కేసీఆర్ నేడు సమీక్షా సమావేశం నిర్వహించారు. అన్ని శాఖల ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
గతంలో కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన ప్రకారం వ్యాట్ బకాయిలను చెల్లించాలని ఇంతకుముందు ఆర్థిక సంఘాన్న తెలంగాణ ప్రభుత్వం కోరింది. కాగా, రేపు రాజ్‌భవన్‌లో ఆర్థిక సంఘం సభ్యులకు గవర్నర్ నరసింహన్ విందు ఇవ్వనున్నారు. శుక్రవారం ఫలక్‌నుమా ప్యాలెస్‌లో కేసీఆర్ విందు ఏర్పాటు చేశారు.