
అక్రమంగా తనను అరెస్ట్ చేయడంతో పాటు ఇబ్బందులకు గురి చేశారంటూ..
సాక్షి, హైదరాబాద్: వైఎస్‌ఆర్‌టీపీ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల.. రేపు(గురువారం) రాజ్‌భవన్‌కు వెళ్లనున్నారు. గవర్నర్ తమిళిసై తమిళిసై సౌందరరాజన్‌ను ఆమె భేటీ కానున్నారు. ఈ మేరకు అపాయింట్‌మెంట్ ఖరారు అయినట్లు సమాచారం.
ఈ సందర్భంగా పోలీసుల తీరుపై వైఎస్ షర్మిల.. గవర్నర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది. అక్రమంగా తనను అదుపులోకి తీసుకున్నారని, ఆ టైంలో వ్యవహరించిన తీరును ఆమె గవర్నర్‌కు వివరించే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే.. వైఎస్‌ఆర్‌టీపీ చీఫ్ వైఎస్ షర్మిల అరెస్టుపై సౌందరరాజన్ ఆందోళన వ్యక్తం చేస్తూ ఓ ట్వీట్ చేశారు. ఆమె కారులో ఉండగానే.. లాక్కుంటూ వెళ్లిన దృశ్యాలు కలవరపెట్టాయని ఆమె ట్వీట్‌లో పేర్కొన్నారు.
వైఎస్‌ఆర్‌టీపీ చీఫ్, మాజీ సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె శ్రీమతి వైఎస్ షర్మిల అరెస్టుపై గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ ఆందోళన వ్యక్తం చేశారు.
— Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) November 30, 2022
ఆమె కారు లోపల ఉన్నప్పుడు
ఆ కారును దూరంగా లాగుతున్న దృశ్యాలు కలవరపెట్టాయి.@realyssharmila @PMOIndia @TelanganaDGP