
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మమతా బెనర్జీని వ్యక్తి గతంగా గౌరవిస్తానని, ఆమెతో వృత్తి పరమైన సంబంధాలు ఉన్నాయని, అయితే రాజకీయవేత్త మమతా బెనర్జీ.. నాట్ మై కప్ ఆఫ్ టీ’ అని అన్నారు.
మమతా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను ఆనంద బోస్ వ్యతిరేకిస్తున్నారు. ఈ తరుణంలో ఢిల్లీలో జరిగిన గవర్నర్ల సమావేశం అనంతరం పీటీఐతో జరిపిన ఇంటర్వ్యూలో గవర్నర్ ఆనంద్ బోస్ మాట్లాడారు. మమతా బెనర్జీతో ఉన్న సంబంధాల గురించి అడిగిన ప్రశ్నకు ఆనంద్ బోస్ మాట్లాడారు.
మీరు ఏ మమతా బెనర్జీ గురించి అడుగుతున్నారు. నా ముందు ముగ్గురు మమతా బెనర్జీలు ఉన్నారు. ఒకరు వ్యక్తి మమతా బెనర్జీ..ఆమెతో నాకు మంచి అనుబంధం ఉంది. రెండవ వ్యక్తి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ..ఆమెతో నాకు వృత్తిపరమైన సంబంధాలు ఉన్నాయి. మూడవ వ్యక్తి రాజకీయ నాయకురాలు మమతా బెనర్జీ నాట్ మై కప్ ఆఫ్ టీ అని వ్యాఖ్యానించారు.
వరుస వివాదాలు
గత కొంతకాలంగా సీఎం మమతకు..గవర్నర్ ఆనందబోస్ మధ్య మనస్పర్ధలు తలెత్తాయి. ప్రభుత్వం పంపిన బిల్లుల్ని గవర్నర్ ఆమోదించడం లేదని మమతా సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీంతోపాటు రాజ్ భవన్‌లో ఆనందబోస్ ఓ మహిళాతో అసభ్యంగా ప్రవర్తించారంటూ ఆరోపణలు గుప్పించింది. ఈ వరుస పరిణామాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆనందబోస్ పశ్చిమబెంగాల్ ప్రభుత్వంపై కోల్‌కతా హైకోర్టులో దావా వేశారు. విచారణ చేపట్టిన కోర్టు హైకోర్టు ఆగష్టు 14 వరకు మధ్యంతర ఉత్తర్వులో గవర్నర్‌కు వ్యతిరేకంగా ఎటువంటి పరువు నష్టం కలిగించే లేదా తప్పుడు ప్రకటన చేయకూడదని ఆదేశాలు జారీ చేసింది.
STORY | Concept of passive governor is gone: West Bengal Governor CV Anand Bose
READ: https://t.co/GNKBobRarN pic.twitter.com/niOE5dO3D4— Press Trust of India (@PTI_News) August 4, 2024