mamatha benargy
-
సీఎం మమతా బెనర్జీతో మరోసారి వైద్యుల బృందం భేటీ
డాక్టర్ల సమస్యను కొలిక్కి తెచ్చేందుకు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రయత్నిస్తున్నారు. తాజాగా కొద్ది సేపటి క్రితమే డాక్టర్లతో భేటీ అయ్యారు.కోల్‌కతా ఆర్జీ కార్ ఆస్పత్రి అభయ ఘటనపై సీఎం మమతా బెనర్జీతో వైద్యుల బృందం మరోసారి భేటీ అయ్యింది. మమతా బెనర్జీ ఇంటికి బస్సులో చేరుకున్న డాక్టర్లు ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. చర్చలు పారదర్శకంగా జరగాలని డిమాండ్ చేస్తోంది వైద్యుల బృందం. అభయ ఘటనలో సీబీఐ అధికారుల విచారణ నిస్పక్షపాతంగా, వేగంగా జరగాలని కోరుతున్నారు. వ్యవస్థల వైఫల్యం ప్రభుత్వం దృష్టిపెట్టాలని, కేసును తప్పుదారి పట్టించిన హెచ్ఓడీలను తొలగించాలని కోరుకుంటున్నారు. డీసీపీతో పాటు పోలీసు అధికారులను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. మెడికల్ కౌన్సిల్‌ను రద్దు చేయాలని, వైద్యుల డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని, ఆందోళన చేస్తున్న వైద్యులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కోరుతున్నారు. ఇదీ చదవండి : గుంజీలు తీసిన విద్యార్థినులకు అస్వస్థత -
వైద్యులతో చర్చలు.. ఆహ్వానించిన సీఎం మమతా బెనర్జీ
కోల్‌కతా ఆర్జీ కర్ ఆస్పత్రిలో అభయ ఘటనపై ఆందోళన చేస్తున్న వైద్యుల డిమాండ్లపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం స్పందించింది. వైద్యులతో గురువారం సాయంత్రం ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు 15 సభ్యుల వైద్యుల ప్రతినిధుల బృందాన్ని ఆహ్వానించింది. ఈ మేరకు సీఎం మమతా బెనర్జీ చీఫ్ సెక్రటరీ మనోజ్ పంత్ లేఖ రాశారు.చీఫ్ సెక్రటరీ మనోజ్ పంత్ రాసిన లేఖలో వైద్యుల ప్రతినిధి బృందం సంఖ్య 15 మందికి మించకూడదు. పారదర్శకతను కొనసాగిస్తూ ప్రభుత్వానికి, వైద్య ప్రతినిధుల మధ్య జరిగే సమావేశాన్ని రికార్డ్ చేసుకోవచ్చు. లైవ్ టెలికాస్ట్ చేసేందుకు ఒప్పుకోలేదు. ఇదీ చదవండి : మాటలు చెప్పడం కాదు మోదీజీ -
మౌనమేల మోదీజీ!?
కోల్‌కతా : ‘ ఇప్పటికీ నేను రాసిన లేఖపై మీ నుంచి ఎలాంటి జవాబు రాలేదని’ ఆరోపిస్తూ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రధాని మోదీకి మరోసారి లేఖ రాశారు.కోల్‌కతా ఆర్జీకార్ ఘటన అనంతరం దేశంలో మహిళలపై జరిగే దారుణాల్ని అరికట్టేలా కఠిన చట్టాలు అమలు చేయాలని కోరుతూ మమతా బెనర్జీ ఆగస్ట్ 22న తొలిసారి లేఖ రాశారు. మొదటి లేఖపై స్పందన కరువైందంటూ తాజాగా శుక్రవారం రెండో సారి లేఖ రాశారు. ఆ లేఖను ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.I have written this letter to the Hon'ble Prime Minister of India in connection with an earlier letter of mine to him. This is a second letter in that reference. pic.twitter.com/5GXKaX6EOZ— Mamata Banerjee (@MamataOfficial) August 30, 2024 ఆర్జీ కార్ ఘటనఆగస్ట్ 9న కోల్‌కతా ఆర్జీకార్ ఆస్పత్రిలో జూనియర్ వైద్యురాలిపై దారుణం జరిగింది. ఈ ఘటనపై నిరసనలు వెల్లువెత్తాయి. బాధితురాలికి న్యాయం జరిగేలా నిందితుల్ని కఠినంగా శిక్షించాలని, ప్రాణ ప్రదాతలైన తమకు భద్రతేది? అని ప్రశ్నిస్తూ దేశ వ్యాప్తంగా వైద్యులు, వైద్య విద్యార్థులు ఆందోళన చేపట్టారు. వీరి ఆందోళనకు సామాన్యులకు సైతం మద్దతు పలికారు. ఆ సమయంలో ఆర్జీ కార్ దారుణం జరిగిన ప్రాంతంలో సాక్షాలు తారుమారు చేయడం, అప్పటి ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ ఇష్టారీతిన వ్యవహరించడంతో బాధితురాలి తల్లిదండ్రులు సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు చేయడం.. వెను వెంటనే విచారణ చేపట్టడం.. వైద్యుల భద్రత కోసం ప్రత్యేక టాస్క్ ఫోర్స్‌ను నియమించడం జరిగింది. ప్రస్తుతం ఈ కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్, మాజీ ప్రినిపల్ సందీప్ ఘోష్‌లను సీబీఐ అధికారులు విచారిస్తున్నారు.దేశంలో రోజుకు 90 దారుణాలుఈ క్రమంలో తొలిసారి ఆగస్ట్ 22న మమతా బెనర్జీ.. మోదీకి లేఖ రాశారు. వైద్యురాలి ఘటన కేసును పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుందని స్పష్టం చేశారు. అదే సమయంలో దేశంలో మహిళలపై అత్యాచార ఘటనలు ఎక్కువైపోతున్నాయని ఆరోపించారు. దేశంలో రోజుకు 90 దారుణాలు జరిగిన ఘటనల తాలుకూ కేసులు నమోదవుతున్నాయని, వీటిలో చాలా సందర్భాల్లో బాధితులు హత్యకు గురవతున్నారని తెలిపారు.ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని డిమాండ్మహిళలు సురక్షితంగా ఉండేలా వారికి రక్షణ కల్పించేలా చట్టాలు అమలు చేయాలని, అదే విధంగా సత్వర న్యాయం కోసం ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయాలని కోరారు. సత్వర న్యాయం జరగాలంటే 15 రోజుల్లోగా విచారణ పూర్తి చేయాలని ఆమె సూచించారు. అయితే ఆ లేఖపై కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి స్పందించారు.దీదీపై కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ ఆగ్రహందేశంలో మహిళలపై జరుగుతున్న దారుణాల్ని విచారించేందుకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఉన్నాయని, ముఖ్యంగా మీ రాష్ట్రంలో (పశ్చిమ బెంగాల్)123 ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను కేటాయించినప్పటికీ వాటి పనితీరు అంతంతం మాత్రంగా ఉన్నాయంటూ విమర్శించారు. మహిళల రక్షణ విషయంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం విఫలమైందని అన్నారు.నేను రాసిన లేఖపై మీరే స్పందించాలిఈ నేపథ్యంలో మమతా బెనర్జీ మరోసారి మోదీకి లేఖ రాశారు. తాను రాసిన మొదటి లేఖకు ప్రధాని మోదీ ఎలాంటి జవాబు ఇవ్వకపోవడంపై విచారం వ్యక్తం చేశారు. మహిళా శిశుసంక్షేమశాఖ నుంచి బదులు వచ్చిందని చెప్పిన ఆమె.. సమస్య తీవ్రత దృష్ట్యా ఆ సాధారణ సమాధానం సరిపోదన్నారు.నేరగాళ్లకు మోదీ హెచ్చరికఇదిలాఉంటే..దేశంలో మహిళలపై జరుగుతోన్న అఘాయిత్యాలపై మోదీ స్పందించారు. మహిళల భద్రత విషయంలో ఉపేక్షించరాదని హెచ్చరించారు. మహిళలపై నేరాలు క్షమించరానివని ప్రతీ రాష్ట్రానికి చెబుతున్నా. నేరస్థులు ఎవరైనా సరే.. వారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదు. మహిళలపై నేరాలకు పాల్పడేవారిని కఠినంగా శిక్షించేందుకు చట్టాలను మరింత పటిష్ఠ పరుస్తున్నాం’ అని వెల్లడించారు. -
అభయ కేసు... సీబీఐకి మమత సూటి ప్రశ్నలు!
కోల్‌కతా: ఆర్జీకార్ వైద్యురాలి ఘటన కేసులో సీబీఐ దర్యాప్తుపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రశ్నల వర్షం కురిపించారు. దారుణం జరిగి 16 రోజులు అవుతుంది. న్యాయం ఎక్కడా? అంటూ సీబీఐని ప్రశ్నించారు. రాష్ట్ర అధికార తృణముల్ కాంగ్రెస్ విద్యార్థి విభాగం వ్యవస్థాపక దినోత్సవం బహిరంగ సభ జరిగింది. ఈ సభలో ప్రసంగించిన దీదీ.. వైద్యురాలి కేసుపై పలు ప్రశ్నలు సంధించారు. "BJP is trying to defame Bengal," CM Mamata Banerjee condemns 12-hour 'Bengal Bandh'Read @ANI Story | https://t.co/bJMNXfPdD2 #MamataBanerjee #Bengalbandh #WestBengal #BJP pic.twitter.com/gCr6FFBGWa— ANI Digital (@ani_digital) August 28, 2024‘‘ఆర్జీ కార్ ఆస్పత్రి సెమినార్ హాల్లో వైద్యురాలిపై దారుణం జరిగిన రెండు రోజుల తర్వాత బాధితురాలి తల్లి దండ్రులను కలిశాను. కేసులో నిందితుల్ని పట్టుకునేందుకు ఐదు రోజులు సమయం కావాలని వారిని అడిగాను. కానీ కేసు సీబీఐ చేతుల్లోకి వెళ్లింది’’ అని అన్నారు. సీబీఐని ఉద్దేశిస్తూ..‘‘వాళ్లు మనకు న్యాయం చేయరు. కేసు దర్యాప్తు మరింత ఆలస్యం చేయడం వాళ్లకు కావాల్సింది’’ అని విమర్శించారు.నేరస్తులకు ఉరిశిక్ష.. త్వరలో అసెంబ్లీలో తీర్మానంబాధితురాలిపై దారుణం జరిగి 16 రోజులు అవుతుంది. న్యాయం ఎక్కడ? అని ప్రశ్నించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తుందని, నేరస్తులకు ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేస్తూ బిల్లును ప్రవేశపెడతామని సీఎం మమతా బెనర్జీ స్పష్టం చేశారు.విద్యార్థుల ముసుగులో బీజేపీ కుట్రఅభయ ఘటనకు వ్యతిరేకంగా ‘నబన్న మార్చ్’ పేరుతో విద్యార్థి సంఘాలు మంగళవారం సచివాలయ ముట్టడికి పిలుపునిచ్చాయి.నబన్నా అభియాన్ పేరుతో హావ్‌డా నుంచి ప్రారంభమైన ర్యాలీ గందరగోళానికి దారి తీసింది. సంతర్గాచి వద్ద పోలీసులు విద్యార్థుల్ని అడ్డుకోవడం వల్ల ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ర్యాలీ గురించి ప్రస్తావిస్తూ మమతా బెనర్జీ బీజేపీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘నబన్న మార్చ్‌కి విద్యార్థి సంఘాలు పిలుపునివ్వగా.. రాష్ట్రంలో అశాంతి సృష్టించడానికి బీజేపీ-ఏబీవీపీ కుట్ర అని’ఆరోపించారు. ప్రభుత్వ పరువు తీయడమే బీజేపీ ప్లాన్రాష్ట్రంలో బీజేపీ బంద్‌కు పిలుపునిచ్చింది. వాళ్లకు కావాల్సింది మృతదేహాలు. కానీ మనం అభయ కేసు నిందితుల్ని ఉరిశిక్ష పడేలా న్యాయం చేయాలని కోరుతున్నాం. బాధితురాలికి న్యాయం చేయాలనే లక్ష్యం నుంచి వాళ్లు (బీజేపీ) దూరమయ్యారు. ఇప్పుడు రాష్ట్ర పరువు తీస్తున్నారు. ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు మరిన్ని కుట్రలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు’అని ధ్వజమెత్తారు.రాష్ట్ర పోలీసులకు నా సెల్యూట్అనంతరం నగర పోలీసులపై మమత బెనర్జీ ప్రశంసల వర్షం కురిపించారు. దాడులకు గురైనప్పటికీ ఉచ్చులో పడకుండా.. ప్రాణ నష్టం లేకుండా విధులు నిర్వహించిన పోలీసులకు నా సెల్యూట్ మరణాలను నిరోధించిన పోలీసులకు నా అభినందనలు’ అని మమతా బెనర్జీ ప్రసంగించారు. -
మమతా బెనర్జీ ‘నాట్ మై కప్ ఆఫ్ టీ’.. గవర్నర్ ఆసక్తికర వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మమతా బెనర్జీని వ్యక్తి గతంగా గౌరవిస్తానని, ఆమెతో వృత్తి పరమైన సంబంధాలు ఉన్నాయని, అయితే రాజకీయవేత్త మమతా బెనర్జీ.. నాట్ మై కప్ ఆఫ్ టీ’ అని అన్నారు.మమతా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను ఆనంద బోస్ వ్యతిరేకిస్తున్నారు. ఈ తరుణంలో ఢిల్లీలో జరిగిన గవర్నర్ల సమావేశం అనంతరం పీటీఐతో జరిపిన ఇంటర్వ్యూలో గవర్నర్ ఆనంద్ బోస్ మాట్లాడారు. మమతా బెనర్జీతో ఉన్న సంబంధాల గురించి అడిగిన ప్రశ్నకు ఆనంద్ బోస్ మాట్లాడారు.మీరు ఏ మమతా బెనర్జీ గురించి అడుగుతున్నారు. నా ముందు ముగ్గురు మమతా బెనర్జీలు ఉన్నారు. ఒకరు వ్యక్తి మమతా బెనర్జీ..ఆమెతో నాకు మంచి అనుబంధం ఉంది. రెండవ వ్యక్తి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ..ఆమెతో నాకు వృత్తిపరమైన సంబంధాలు ఉన్నాయి. మూడవ వ్యక్తి రాజకీయ నాయకురాలు మమతా బెనర్జీ నాట్ మై కప్ ఆఫ్ టీ అని వ్యాఖ్యానించారు.వరుస వివాదాలుగత కొంతకాలంగా సీఎం మమతకు..గవర్నర్ ఆనందబోస్ మధ్య మనస్పర్ధలు తలెత్తాయి. ప్రభుత్వం పంపిన బిల్లుల్ని గవర్నర్ ఆమోదించడం లేదని మమతా సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీంతోపాటు రాజ్ భవన్లో ఆనందబోస్ ఓ మహిళాతో అసభ్యంగా ప్రవర్తించారంటూ ఆరోపణలు గుప్పించింది. ఈ వరుస పరిణామాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆనందబోస్ పశ్చిమబెంగాల్ ప్రభుత్వంపై కోల్‌కతా హైకోర్టులో దావా వేశారు. విచారణ చేపట్టిన కోర్టు హైకోర్టు ఆగష్టు 14 వరకు మధ్యంతర ఉత్తర్వులో గవర్నర్‌కు వ్యతిరేకంగా ఎటువంటి పరువు నష్టం కలిగించే లేదా తప్పుడు ప్రకటన చేయకూడదని ఆదేశాలు జారీ చేసింది. STORY | Concept of passive governor is gone: West Bengal Governor CV Anand BoseREAD: https://t.co/GNKBobRarN pic.twitter.com/niOE5dO3D4— Press Trust of India (@PTI_News) August 4, 2024 -
ఈ వీడియోని చూసి ‘ముఖ్యమంత్రి గారు సిగ్గుతో తలదించుకోండి’
తన పొలంలో రోడ్డు వేయొద్దన్నందుకు ఇద్దరు మహిళలల్ని బ్రతికుండగానే నడుం లోతు పూడ్చిపెట్టిన వీడియోలు సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రం (ఎంపీ) రీవా జిల్లాలో దారుణం జరిగింది. ఈ దుర్ఘటనపై పశ్చిమ బెంగాల్ అధికార తృణముల్ కాంగ్రెస్ బీజేపీ నేతృత్వంలోని మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది.Aayi NDA ki yeh sarkar Laayi mahilaon pe teen guna atyaacharAtrocities against women have become an epidemic under BJP-backed lawlessness.In MP's Rewa, two women were nearly buried alive for opposing road construction. CM @DrMohanYadav51 should hang his head in shame! pic.twitter.com/9vqsmgCwjr— All India Trinamool Congress (@AITCofficial) July 22, 2024 బీజేపీ పాలిత రాష్ట్రంలో మహిళలపై దారుణాలు పెరిగిపోతున్నాయి. వారికి రక్షణ లేకుండా పోయింది. తన పొలంలో రోడ్డు వేయొద్దన్నందుకు ఇద్దరు మహిళల్ని సజీవంగా పూడ్చి పెట్టారు. ఈ వీడియో చూసి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ సిగ్గుతో తలదించుకోండి అంటూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది.మరోవైపు మహిళలపై జరిగిన ఈ దారుణ ఘటనలో నిందితుల్ని అదుపులోకి తీసుకున్నట్లు రీవా జిల్లా ఎస్పీ వివేక్ సింగ్ తెలిపారు. మంగవా పోలీస్ స్టేషన్ పరిధిలోని హినోటా జోరోట్ గ్రామంలో ఈ దుర్ఘటన జరిగినట్లు వెల్లడించారు. బాధితులు మమతా పాండే,ఆశా పాండేలు అధికారులు రోడ్డు వేయడాన్ని వ్యతిరేకించారని, దీంతో ఆగ్రహానికి గురైన ట్రక్ డ్రైవర్ పాక్షికంగా ఎర్రటి మట్టితో పూడ్చాడని ఏఎస్పీ వివేక్ లాల్ తెలిపారు.ఈ ఘటనపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ మాట్లాడుతూ ‘రీవా జిల్లాలో మహిళలపై జరిగిన దాడి నా దృష్టికి వచ్చింది. నిందితులపై చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారుల్ని ఆదేశించాం. మహిళలపై దాడి కుటుంబకలహాలే కారణం. అందులో ఓ నిందితుడ్ని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు’అని సీఎం మోహన్ యాదవ్ తెలిపారు. -
ఐటీ సోదాలపై మమతా వివాదాస్పద వ్యాఖ్యలు
-
అమిత్‌షాపై ఐటీ దాడులు జరగవెందుకు?
కోల్‌కతా: తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహనరావు ఇళ్లు, ఆయన బంధువుల ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించడంపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రంగా మండిపడ్డారు. ఇది రాజకీయ కక్షసాధింపు చర్య అని, అధర్మమని విమర్శించారు. తమిళనాడు ప్రభుత్వానికి సమాచారం ఇవ్వకుండా ఇలా ఐటీ దాడులు చేయడం సాంకేతికంగా కూడా సరికాదని పేర్కొన్నారు. దేశంలోని సమాఖ్య విధానాన్ని దెబ్బతీసేందుకు కేంద్రం ఇలా చేస్తున్నదా? అని ఆమె ప్రశ్నించారు. డబ్బులు సేకరిస్తున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, ఇతరులపై ఐటీ దాడులు ఎందుకు జరగడం లేదని ఆమె ట్విట్టర్లో ప్రశ్నించారు. అవినీతిని అందరూ ఖండించాల్సిందేనని, కానీ తమిళనాడు సీఎస్ స్థాయి అధికారిపై కేంద్ర ప్రభుత్వ సంస్థ దాడులు చేయడం సివిల్ సర్వీసు వ్యవస్థను నైతికంగా దెబ్బతీయడమేనని అన్నారు.