
కోల్‌కతా ఆర్జీ కర్ ఆస్పత్రిలో అభయ ఘటనపై ఆందోళన చేస్తున్న వైద్యుల డిమాండ్లపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం స్పందించింది. వైద్యులతో గురువారం సాయంత్రం ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు 15 సభ్యుల వైద్యుల ప్రతినిధుల బృందాన్ని ఆహ్వానించింది. ఈ మేరకు సీఎం మమతా బెనర్జీ చీఫ్ సెక్రటరీ మనోజ్ పంత్ లేఖ రాశారు.
చీఫ్ సెక్రటరీ మనోజ్ పంత్ రాసిన లేఖలో వైద్యుల ప్రతినిధి బృందం సంఖ్య 15 మందికి మించకూడదు. పారదర్శకతను కొనసాగిస్తూ ప్రభుత్వానికి, వైద్య ప్రతినిధుల మధ్య జరిగే సమావేశాన్ని రికార్డ్ చేసుకోవచ్చు. లైవ్ టెలికాస్ట్ చేసేందుకు ఒప్పుకోలేదు.
ఇదీ చదవండి : మాటలు చెప్పడం కాదు మోదీజీ