ఆందోళనలతో అట్టుడుకుతున్న పశ్చిమ బెంగాల్‌ | Doctor Protest In Bengal Against | Sakshi
Sakshi News home page

ఆందోళనలతో అట్టుడుకుతున్న పశ్చిమ బెంగాల్‌

Published Thu, Sep 5 2024 7:48 AM | Last Updated on Thu, Sep 5 2024 9:40 AM

Doctor Protest In Bengal Against

పశ్చిమ బెంగాల్‌ ఆందోళనతో అట్టుడికిపోతుంది. అభయ ఘటనపై త్వరగా న్యాయం జరగాలని డిమాండ్‌ చేస్తూ రాజధాని కోల్‌కతాలో ‘ది బెంగాల్‌ జూనియర్‌ డాక్టర్‌ ఫ్రంట్‌’ ఆందోళనకు పిలుపునిచ్చింది. సంఘం పిలుపు మేరకు బుధవారం రాత్రి వైద్యులు రోడ్డెక్కారు. ఆమెకు సంఘీభావం తెలిపేందుకు లైట్లన్ని ఆర్పేసి కొవ్వొత్తులు, కాగడాలు, సెల్‌ఫోన్‌ లైట్లు వెలిగించారు. దీంతో కోల్‌కతా మొత్తం చీకటిమయమైంది.

రాత్రి 9 గంటలకు నగరంలోని ప్రముఖ ప్రాంతాలైన విక్టోరియా మెమోరియల్, రాజ్ భవన్‌తో పాటు ఇతర ప్రాంతాల్లోని ప్రజలు వైద్యురాలికి అండగా నిలిచారు. లైట్లు ఆఫ్‌ చేసి సంఘీభావం తెలిపారు. వీరితో పాటు గవర్నర్ సీవీ ఆనంద బోస్ సంఘీభావం తెలిపేందుకు రాజ్‌భవన్‌లో లైట్లు ఆఫ్ చేశారు. కొవ్వొత్తులతో వీధుల్లోకి వచ్చారు.

కోల్‌కతాలో శ్యాంబాజార్, మౌలాలి, న్యూ టౌన్ బిస్వా బంగ్లా గేట్, రాష్‌బెహారీ క్రాసింగ్, బెహలా, గరియా, బల్లిగంజ్, హజ్రా క్రాసింగ్, జాదవ్‌పూర్ 8బీ బస్‌ స్టాండ్‌తో పాటు బస్టాండ్‌తో సహా ప్రముఖ కూడళ్ల వద్ద నిరసనలు జరిగాయి. వాతావారణ కేంద్రం వద్ద జరిగిన ఆందోళనలో అభయ తల్లిదండ్రులు పాల్గొన్నారు.

మరోవైపు బెంగాల్ జూనియర్ డాక్టర్స్ ఫ్రంట్ లైట్ దేర్ బి జస్టిస్..లెట్ దేర్ బీ జస్టిస్ పేరుతో పిలుపునిచ్చిన ఆందోళనతో ఢిల్లీలోనూ నిరసనలు జరిగాయి. రామ్‌ మనోహర్‌ లోహియా ఆస్పత్రి, ఎయిమ్స్‌ వైద్యులు క్యాండిల్‌ లైట్‌ మార్చ్‌ నిర్వహించారు. న్యాయం ఆలస్యం కాకుండా కేసును త్వరగా పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.

సందీప్‌ ఘోష్‌ అరెస్ట్‌
అభయ కేసులో విమర్శలు ఎదుర్కొంటున్న సందీప్‌ ఘోష్‌ను సీబీఐ అరెస్ట్‌ చేసింది. దాదాపు 15 రోజులుగా ఘోష్‌ను విచారించిన సీబీఐ అధికారులు సోమవారం(సెప్టెంబర్ 02) అరెస్ట్ చేశారు. సందీప్‌ ఘోష్‌ ఫిబ్రవరి 2021 -సెప్టెంబర్ 2023 మధ్య ఆర్‌జీ కార్‌ ప్రిన్సిపల్‌గా పనిచేసే సమయంలో  మృతదేహాలను అక్రమంగా విక్రయించడం, బయోమెడికల్ వ్యర్థాల అక్రమ రవాణా, పరీక్షల్లో ఉత్తీర్ణత కోసం విద్యార్థులను లంచాల కోసం ఒత్తిడి చేయడం వంటి ఆరోపణలు అతనిపై ఉన్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement