తన పొలంలో రోడ్డు వేయొద్దన్నందుకు ఇద్దరు మహిళలల్ని బ్రతికుండగానే నడుం లోతు పూడ్చిపెట్టిన వీడియోలు సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చాయి.
మధ్యప్రదేశ్ రాష్ట్రం (ఎంపీ) రీవా జిల్లాలో దారుణం జరిగింది. ఈ దుర్ఘటనపై పశ్చిమ బెంగాల్ అధికార తృణముల్ కాంగ్రెస్ బీజేపీ నేతృత్వంలోని మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది.
Aayi NDA ki yeh sarkar
Laayi mahilaon pe teen guna atyaachar
Atrocities against women have become an epidemic under BJP-backed lawlessness.
In MP's Rewa, two women were nearly buried alive for opposing road construction. CM @DrMohanYadav51 should hang his head in shame! pic.twitter.com/9vqsmgCwjr— All India Trinamool Congress (@AITCofficial) July 22, 2024
బీజేపీ పాలిత రాష్ట్రంలో మహిళలపై దారుణాలు పెరిగిపోతున్నాయి. వారికి రక్షణ లేకుండా పోయింది. తన పొలంలో రోడ్డు వేయొద్దన్నందుకు ఇద్దరు మహిళల్ని సజీవంగా పూడ్చి పెట్టారు. ఈ వీడియో చూసి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ సిగ్గుతో తలదించుకోండి అంటూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది.
మరోవైపు మహిళలపై జరిగిన ఈ దారుణ ఘటనలో నిందితుల్ని అదుపులోకి తీసుకున్నట్లు రీవా జిల్లా ఎస్పీ వివేక్ సింగ్ తెలిపారు. మంగవా పోలీస్ స్టేషన్ పరిధిలోని హినోటా జోరోట్ గ్రామంలో ఈ దుర్ఘటన జరిగినట్లు వెల్లడించారు. బాధితులు మమతా పాండే,ఆశా పాండేలు అధికారులు రోడ్డు వేయడాన్ని వ్యతిరేకించారని, దీంతో ఆగ్రహానికి గురైన ట్రక్ డ్రైవర్ పాక్షికంగా ఎర్రటి మట్టితో పూడ్చాడని ఏఎస్పీ వివేక్ లాల్ తెలిపారు.
ఈ ఘటనపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ మాట్లాడుతూ ‘రీవా జిల్లాలో మహిళలపై జరిగిన దాడి నా దృష్టికి వచ్చింది. నిందితులపై చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారుల్ని ఆదేశించాం. మహిళలపై దాడి కుటుంబకలహాలే కారణం. అందులో ఓ నిందితుడ్ని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు’అని సీఎం మోహన్ యాదవ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment