సాక్షి, హైదరాబాద్: నగరానికి చెందిన ఓ ఆభరణాల సంస్థ రూపొందించిన ఆభరణాలకు ఏకంగా 8 గిన్నిస్ రికార్డులు లభించాయి. 11,472 వజ్రాలతో పొదిగిన, అత్యంత బరువైన (1,011.150 గ్రాములు) బంగారు గణేశ్ పెండెంట్, అత్యధికంగా 54,666 వజ్రాలతో పొదిగిన, అత్యంత బరువుగల (1,681.820 గ్రాములు) బంగారు రామ్‌దర్బార్ పెండెంట్, 315 పచ్చలు, 1,971 వజ్రాలతో పొదిగిన ద సెవన్ లేయర్ నెక్లస్, 63.65 క్యారట్ల పచ్చలు, 29.70 క్యారట్ల వజ్రాలు ఉపయోగించి తయారు చేసిన అత్యంత ఖరీదైన (సుమారు రూ. 90 లక్షల) భూతద్దం గిన్నిస్‌లో చోటుదక్కించుకున్నాయి.
ఆదివారం ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శివ్‌నారాయణ్ జ్యుయలర్స్ ఎండీ తుషార్ అగర్వాల్ ఈ విషయాన్ని వెల్లడించారు. దేశంలో మరే ఆభరణాల సంస్థకు ఈ ఘనత లభించలేదన్నారు. హైదరాబాద్ నిజాం ఆభరణాల వైభవంలో కీలకపాత్ర పోషించిన తమ పూర్వీకుల వారసత్వాన్ని కొనసాగిస్తూ నగర ప్రతిష్టను ఇనుమడింపజేసినందుకు సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ బాలీవుడ్ నటి దిశాపటాని ఆయా ఆభరణాలను ధరించి ప్రదర్శించింది.
Comments
Please login to add a commentAdd a comment