Jewelery companies
-
గిన్నిస్‌లోకి భాగ్య‘నగ’లు!
సాక్షి, హైదరాబాద్: నగరానికి చెందిన ఓ ఆభరణాల సంస్థ రూపొందించిన ఆభరణాలకు ఏకంగా 8 గిన్నిస్ రికార్డులు లభించాయి. 11,472 వజ్రాలతో పొదిగిన, అత్యంత బరువైన (1,011.150 గ్రాములు) బంగారు గణేశ్ పెండెంట్, అత్యధికంగా 54,666 వజ్రాలతో పొదిగిన, అత్యంత బరువుగల (1,681.820 గ్రాములు) బంగారు రామ్‌దర్బార్ పెండెంట్, 315 పచ్చలు, 1,971 వజ్రాలతో పొదిగిన ద సెవన్ లేయర్ నెక్లస్, 63.65 క్యారట్ల పచ్చలు, 29.70 క్యారట్ల వజ్రాలు ఉపయోగించి తయారు చేసిన అత్యంత ఖరీదైన (సుమారు రూ. 90 లక్షల) భూతద్దం గిన్నిస్‌లో చోటుదక్కించుకున్నాయి. ఆదివారం ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శివ్‌నారాయణ్ జ్యుయలర్స్ ఎండీ తుషార్ అగర్వాల్ ఈ విషయాన్ని వెల్లడించారు. దేశంలో మరే ఆభరణాల సంస్థకు ఈ ఘనత లభించలేదన్నారు. హైదరాబాద్ నిజాం ఆభరణాల వైభవంలో కీలకపాత్ర పోషించిన తమ పూర్వీకుల వారసత్వాన్ని కొనసాగిస్తూ నగర ప్రతిష్టను ఇనుమడింపజేసినందుకు సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ బాలీవుడ్ నటి దిశాపటాని ఆయా ఆభరణాలను ధరించి ప్రదర్శించింది. -
తనిష్క్ అక్షయ తృతీయ ఆఫర్లు
హైదరాబాద్: ప్రముఖ జువెలరీ సంస్థ తనిష్క్ అక్షయ తృతీయ సందర్భంగా ఆకర్షణీయమైన ఆఫర్లు ప్రకటించింది. బంగారు ఆభరణాలపై ప్రతి గ్రాముకు రూ.200, వజ్రాభరణాలపై 20% వరకు తగ్గింపు అందిస్తోంది. గోల్డ్ కాయిన్ల సులభతర కొనుగోళ్లకు ‘24కే ఎక్స్‌ప్రెస్’ పేరిట గోల్డ్ కాయిన్ ఏటీఎంలను లాంచ్ సంస్థ చేసింది. తనిష్క్ ఫ్లాగ్షిప్ స్టోర్లలో ఈ ఏటీఎం సదుపాయం అందుబాటులో ఉంటుంది. ఈ ఆఫర్లు పరిమితకాలం మాత్రమే అందుబాటులో ఉంటాయని ఈ మేరకు వెలువడిన ఒక ప్రకటన తెలిపింది. -
రూ. 100కే గోల్డ్..! సరికొత్త వ్యూహంతో గోల్డ్ జ్యువెలర్స్ కంపెనీలు..!
దేశవ్యాప్తంగా కరోనా, లాక్డౌన్ పరిస్థితుల ప్రభావంతో బంగారం అమ్మకాలు ఒక్కసారిగా పడిపోయాయి. ఇప్పుడిప్పుడే బంగారం అమ్మకాలు తిరిగి పుంజుకుంటున్నాయి. కొనుగోలుదారులు ఆన్లైన్ ఫ్లాట్‌ఫామ్స్‌లో బంగారం కొనుగోలుపై గణనీయంగా దృష్టిసారించారు. దీంతో పలు జ్వువెలరీ కంపెనీలు కూడా ఆన్లైన్ అమ్మకాలపై దృష్టిపెట్టాయి. చదవండి: కంపెనీ బోర్డుల్లో 'మహిళలు తక్కువే'..పశ్చిమ, ఆసియా దేశాలతో పోలిస్తే రూ.100 కే గోల్డ్..! తాజాగా టాటా గ్రూప్‌కు చెందిన తనిష్క్, కళ్యాణ్ జ్యువెలర్స్ ఇండియా లిమిటెడ్, పీసీ జ్యువెలర్ లిమిటెడ్, సెన్కో గోల్డ్ అండ్ డైమండ్స్ వంటి గోల్డ్ జ్వువెలరీ కంపెనీలు కనిష్టంగా రూ. 100 కూడా బంగారం అందించే ప్లాన్స్‌తో ముందుకువస్తున్నాయి. కంపెనీ వెబ్సైట్లలో లేదా ఇతర థర్డ్‌యాప్స్ ద్వారా విక్రయించే ఆఫర్లను ప్రారంభించాయి. కాగా ఒక గ్రామ్ బంగారం కొనుగోలు చేసిన వారికే మాత్రమే గోల్డ్ జ్యవెలరీ కంపెనీలు డెలివరీ చేయనున్నాయి. డిజిటల్ బంగారం అమ్మకాలు భారత్‌కు కొత్తేమీ కాదు...పేటిఏమ్, గూగుల్ పే, ఫోన్ పే వంటి మొబైల్ వ్యాలెట్స్ డిజిటల్ బంగారాన్ని అందిస్తున్నాయి. ఆగ్మాంట్ గోల్డ్ ఫర్ ఆల్ వంటి ప్లాట్‌ఫారమ్‌లు , వరల్డ్ గోల్డ్ కౌన్సిల్-ఆధారిత సేఫ్గోల్డ్ ఆయా మొబైల్ వ్యాలెట్లకు ఉత్పత్తి చేస్తున్నాయి. ఆన్లైన్లో నగలను విక్రయించే సంఖ్య గణనీయంగా పెరిగిందని ఆగ్మాంట్ గోల్ట్ డైరక్టర్ కేతన్ కొఠారి పేర్కొన్నారు. అమ్మకాలను పెంచేందుకు..! దసరా, ధంతేరాస్, దీపావళి పండుగలను దృష్టిలో పెట్టుకుని కంపెనీలు ఈ సరికొత్త వ్యూహంతో ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఆన్లైన్ ప్లాట్‌ఫామ్స్‌తో బంగారం అమ్మకాలను మరింత పెంచుకోవడానికి జ్యువెలరీ కంపెనీలు సిద్దమయ్యాయి. గత ఏడాది ఫిబ్రవరి తర్వాత ఆన్లైన్లో విక్రయాలు 200 శాతం పెరిగినట్లు గోల్డ్ జ్యువెలరీ వర్గాలు పేర్కొన్నాయి. ఎక్కువగా 3 వేల నుంచి 4 వేల మధ్య ఉండే నాణేలు, బిస్కట్లపై ఎక్కువ బంగారం కొనుగోలు దారులు ఆసక్తిని చూపుతున్నారు. చదవండి: భారతీయుల హైట్ తగ్గిపోతోంది!!.. కాలుష్యంతో పాటు ఇవే కారణాలు -
అక్షయ తృతీయ @ ఆన్లైన్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అక్షయ తృతీయ అనగానే బంగారం షాపుల ముందు క్యూ కట్టిన కస్టమర్ల దృశ్యాలు కళ్ల ముందు మెదులుతాయి. హిందువులు పవిత్ర దినంగా భావించే అక్షయ నాడు జువెల్లరీ దుకాణాల్లో హడావుడి అంతా ఇంతా కాదు. సెంటిమెంటుగా భావించి చిన్న మొత్తంలో అయినా సరే బంగారం కొనేందుకు షాపులకు వచ్చే కస్టమర్లుంటారు. అయితే కోవిడ్–19 పుణ్యమాని ఈసారి మాత్రం అక్షయ లాక్డౌన్లో చిక్కుకుంది. దేశవ్యాప్తంగా నిత్యావసర వస్తువుల దుకాణాలు మాత్రమే తెరిచిన సంగతి తెలిసిందే. బంగారం కొనాలంటే ఆన్లైన్ మినహా ప్రస్తుతం మరో మార్గం లేదు. పలు జువెల్లరీ సంస్థలు, పేమెంట్ యాప్స్ ద్వారా ఆభరణాలు, ముడి బంగారాన్ని కొనుక్కోవచ్చు. లాక్డౌన్ ముగిశాక ఈ పుత్తడిని కస్టమర్లు అందుకోవచ్చు. ఏప్రిల్ 26న అక్షయ తృతీయ. ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.47 వేలు దాటింది. సిద్ధమైన కంపెనీలు.. ఆభరణాలను, ముడి బంగారాన్ని అమ్మేందుకు జువెల్లరీ సంస్థలు, పేమెంట్ యాప్స్ సిద్ధమయ్యాయి. వ స్త్రాలతోపాటు బంగారాన్ని అమ్మే సంప్రదాయ రిటైల్ కంపెనీలు ఈసారి పుత్తడి అమ్మకాల నుంచి దూరమైనట్టే. ఇప్పటికే ఆన్లైన్లో విక్రయాలు సాగిస్తున్న కంపెనీలకే అక్షయ కలిసిరానుంది. కల్యాణ్ జువెల్లర్స్, లలితా జువెల్లర్స్, జోయాలుక్కాస్, జోస్ ఆలుక్కాస్, మలబార్, ఖజానా, తనిష్క్, బ్లూస్టోన్ వంటి కంపెనీలు అక్షయకు పోటీపడుతున్నాయి. డిస్కౌంట్లను సైతం ఇవి ఆఫర్ చేస్తున్నాయి. కస్టమర్లు ఈ కంపెనీల వెబ్సైట్లో తమకు కావాల్సిన నగలు, కాయిన్స్‌ను ఆన్లైన్లో డబ్బులు చెల్లించి బుక్ చేసుకోవచ్చు. లాక్డౌన్ ముగిశాక నిర్దేశిత రోజుల్లో సమీపంలోని దుకాణానికి వెళ్లి కొనుగోలు చేసిన వస్తువును తెచ్చుకోవచ్చు. కస్టమర్ కోరితే ఇంటికే డెలివరీ చేస్తారు. ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం వంటి పేమెంట్ యాప్స్ ద్వారా కూడా బంగారాన్ని బుక్ చేసుకోవచ్చు. అక్షయ వాటా 30–40 శాతం వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా 2019లో భారత్‌లో 690.4 టన్నుల పుత్తడి అమ్ముడైంది. ప్రస్తుత సంవత్సరం డిమాండ్ 700–800 టన్నులు ఉండొచ్చని కౌన్సిల్ గతంలో అంచనా వేసింది. అయితే కోవిడ్–19 నేపథ్యంలో అంచనాలకు తగ్గట్టుగా అమ్మకాలు ఉండకపోవచ్చన్నది నిపుణుల మాట. 350–400 టన్నులకే పరిమితం అవొచ్చని ఆల్ ఇండియా జెమ్ అండ్ జువెల్లరీ డొమెస్టిక్ కౌన్సిల్ చైర్మన్ ఎన్.అనంత పద్మనాభన్ తెలిపారు. సాధారణంగా మొత్తం విక్రయాల్లో అక్షయ వాటా 30–40% ఉంటుందని శారీనికేతన్ జువెల్లరీ విభాగం మేనేజర్ గుల్లపూడి నాగకిరణ్ కుమార్ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. కస్టమర్లలో కోవిడ్–19 తద నంతర పరిస్థితులు ఎలా ఉంటాయో అన్న ఆందోళన ఉంది కాబట్టి కొనుగోళ్లకు మొగ్గు చూపరని అన్నారు. వినియోగదార్లలో 20–30% మంది ఆన్లైన్లో కొనుగోలు చేసే అవకాశం ఉందని చెప్పారు. ఇక బంగారం కొనేద్దాం.. కొత్త రిటైల్ ఇన్వెస్టర్ల అభిప్రాయం: డబ్ల్యూజీసీ న్యూఢిల్లీ: అందరినీ ఆర్థిక సేవల పరిధిలోకి తెచ్చేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషి, ఫిన్‌టెక్ ఊతం, ఆర్థి కాంశాలపై పెరుగుతున్న అవగాహన తదితర అంశాల కారణంగా గతంలో ఎన్నడూ బంగారాన్ని కొనని వారు కూడా ప్రస్తుతం పసిడి కొనుగోళ్లపై ఆసక్తి చూపుతున్నారు. పుత్తడి పెట్టుబడుల్లో ఆభరణాలు, నాణేలదే అగ్రస్థానంగా ఉంటోంది. దేశీయంగా రిటైల్ ఇన్వెస్టర్ల అభిప్రాయాలపై వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) నిర్వహించిన సర్వేలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం సుమారు 29 శాతం మంది రిటైల్ ఇన్వెస్టర్లు భవిష్యత్‌లో పసిడిని కొనుగోలు చేయాలని భావిస్తున్నారు. 52 శాతం ఇన్వెస్టర్ల దగ్గర ఏదో ఒక రూపంలో బంగారం ఉండగా, 48 శాతం మంది గడిచిన 12 నెలల్లో పసిడిలో పెట్టుబడులు పెట్టారు. ‘భారత్‌లో రిటైల్ పెట్టుబడుల ధోరణులు మారుతున్నాయి. అందరినీ ఆర్థిక సేవల పరిధిలోకి తెచ్చేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, ఫైనాన్షియల్ టెక్నాలజీ విస్తృతి చెందుతుండటం, ఆర్థిక సాధనాలపై ఇన్వెస్టర్లలో అవగాహన పెరుగుతుండటం ఇందుకు కారణం‘ అని డబ్ల్యూజీసీ భారత విభాగం ఎండీ సోమసుందరం పీఆర్ తెలిపారు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ధోరణులు.. సర్వే ప్రకారం.. పట్టణ ప్రాంత ఇన్వెస్టర్లలో సుమారు 76 శాతం మంది ఇప్పటికే బంగారంపై ఇన్వెస్ట్ చేయగా, 21 శాతం మంది గతంలో ఎన్నడూ కొనుగోలు చేయనప్పటికీ భవిష్యత్‌లో కొనాలని భావిస్తున్నారు. అటు గ్రామీణ ఇన్వెస్టర్లలో కొత్తగా కొనుగోలు చేయాలనుకుంటున్న వారి సంఖ్య 37 శాతంగా ఉంది. కొనుగోలు చేయడంలో సౌలభ్యం, పెట్టుబడికి భరోసా వంటి అంశాల కారణంగానే పసిడివైపు ఇన్వెస్టర్లు మొగ్గు చూపుతున్నారు. -
పసిడి పెట్టుబడికి... పంచ సూత్రాలు
- రాబడి ప్రకారం చూస్తే ఈ-గోల్డ్ ఉత్తమం - అందుబాటులో గోల్డ్ ఈటీఎఫ్‌లు, ఫండ్లు - పథకాలతో ఆకట్టుకుంటున్న జ్యుయలరీ సంస్థలు ప్రపంచంలో ఉత్పత్తయ్యే మొత్తం బంగారంలో దాదాపు 27 శాతాన్ని మనదేశం దిగుమతి చేసుకుంటోందంటేనే... ఇక్కడ బంగారానికున్న డిమాండు అర్థమవుతుంది. భారతీయులకు ముఖ్యంగా మహిళలకు బంగారంపై మక్కువ ఎక్కువ. అయితే ఇన్వెస్ట్మెంట్ సాధనంగా కూడా బంగారానిది రికార్డే. ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా ఇతర ఇన్వెస్ట్మెంట్ సాధనాలతో పోలిస్తే బంగారం మంచి రాబడినే ఇచ్చింది. అందుకే ప్రతి ఇన్వెస్టరు పోర్ట్‌ఫోలియోలో బంగారం కచ్చితంగా ఉంటుంది. ఉండాలి కూడా. బంగారంలో భౌతికంగా నాణేలు, కడ్డీలు, ఆభరణాల రూపంలోనూ, గోల్డ్ ఈటీఎఫ్ వంటి ఎలక్ట్రానిక్ రూపంలోనూ ఇన్వెస్ట్ చేయొచ్చు. అవేంటో ఒకసారి చూద్దాం... గోల్డ్ సేవింగ్ పథకాలు పలు జ్యుయలరీ సంస్థలు రెండు రకాల గోల్డ్ సేవింగ్ పథకాలను అందిస్తున్నాయి. తొలి రకం పథకంలో ప్రతి నెలా నిర్ణీత మొత్తం, నిర్ణీత కాలం వరకు చెల్లించాలి. జ్యుయలరీ సంస్థలు పథకం కాల పరిమితి ముగిసిన తర్వాత ఒక నెల మొత్తాన్ని బోనస్‌గా ఇస్తాయి. వాయిదాలు సక్రమంగా చెల్లించినవారికే కొన్ని సంస్థలు ఈ బోనస్‌ను ఇస్తున్నాయి. ఉదాహరణకు ఒక సంస్థ 11 నెలల కాలపరిమితితో ఈ పథకాన్ని అందిస్తోందని అనుకుంటే... మీరు చెల్లించే వాయిదా రూ.2,000 అయితే మీరు మీ పథకం కాలపరిమితిలోపు సంస్థకు రూ.22,000 చెల్లిస్తారు. దీనికి సదరు సంస్థ మరో రూ.2,000 అదనంగా అందిస్తుంది. అప్పుడు మొత్తం రూ.24,000 విలువైన ఆభరణాలను కొనుగోలు చేయొచ్చు. రెండవ రకం పథకం లోనూ నిర్ణీత మొత్తం, నిర్ణీత కాలం వరకు ప్రతినెలా వాయిదా పద్ధతిలో చెల్లించాలి. ఇక్కడ మనం చెల్లించే నెలవారి మొత్తంతో ఆ నెల్లోనే బంగారాన్ని కొని మన ఖాతాలో జమచేస్తారు. పథకం కాలపరిమితి ముగిశాక మన ఖాతాలో ఎంత బంగారం ఉంటుందో దానిని మనకిస్తారు. ఈ విధానంలో బోనస్ అంటూ ఏమీ ఉండదు. కస్టమర్లు ఈ పథకాల్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు జాగ్రత్త పాటించాలి. ఎందుకంటే ఈ జ్యుయలరీ సంస్థలపై బ్యాంకులు, మ్యూచువల్ ఫండ్స్ తదితర వాటిపై ఉన్నట్లుగా ప్రభుత్వ సంస్థల అజమాయిషీ ఉండదు. వారు బోర్డు తిప్పేస్తే ఎవరు ఏమీ చేయలేరు. 2003లో ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకువచ్చింది. గతేడాది ఏప్రిల్ నుంచి అమల్లోకి వచ్చిన ఈ చట్టం ప్రకారం జ్యుయలరీ సంస్థలు వినియోగదారులకు ఎట్టి పరిస్థితుల్లోను 12 శాతానికి మించి రాబడినివ్వకూడదు. గోల్డ్ ఈటీఎఫ్... గోల్డ్ ఈటీఎఫ్ మార్గంలో కూడా బంగారంలో ఇన్వెస్ట్ చేయొచ్చు. గోల్డ్ సేవింగ్ పథకాలతో పోలిస్తే గోల్డ్ ఈటీఎఫ్‌లలో ఇన్వెస్ట్మెంట్ మంచిది. ఎందుకంటే మనం ఇన్వెస్ట్‌చేసే డబ్బుకు రాబడి, రక్షణ రెండూ ఉంటాయి. గోల్డ్ సేవింగ్ పథకాల మాదిరే దీన్లోనూ రాబడి ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ గోల్డ్ ఈటీఎఫ్ మ్యూచువల్ ఫండ్స్ స్టాక్ ఎక్స్ఛేంజ్లలో లిస్టవుతాయి కూడా. మనం మన షేర్లను ఏ విధంగా విక్రయిస్తామో... అలాగే వీటిని కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు విక్రయించవచ్చు. అంటే లిక్విడిటీ ఉంటుందన్న మాట. సాధారణంగా ఒక యూనిట్ గోల్డ్ ఈటీఎఫ్ ఒక గ్రాము బంగారానికి సమానం. కొన్ని సంస్థలు అరగ్రామును కూడా యూనిట్‌గా పరిగణిస్తున్నాయి. గోల్డ్ ఈటీఎఫ్‌లు దీర్ఘకాలంలో సగటున 13 శాతం వరకు రాబడినిస్తున్నాయి. బంగారాన్ని భౌతిక రూపంలో కొంటే తయారీ చార్జీలుంటాయి. గోల్డ్ ఈటీఎఫ్‌లలో అయితే అవేవీ ఉండవు. బంగారం ధర ప్రాంతాన్ని బట్టి మారుతుంది కానీ... ఈటీఎఫ్‌లలో దేశవ్యాప్తంగా ఒకే ధర ఉంటుంది. బంగారాన్ని విక్రయించేటప్పుడు తరుగుదల తీసేస్తారు. గోల్డ్ ఈటీఎఫ్‌లలో అయితే ఇలాంటివి ఉండవు. అలాగే గోల్డ్ ఈటీఎఫ్‌లపై వ్యాట్, సంపద పన్ను, ఎస్టీటీ వంటి పన్నులుండవు. బ్రోకరేజ్ చార్జీలు మాత్రం ఉంటాయి. - గోల్డ్ ఈటీఎఫ్ పథకాలనందిస్తున్న సంస్థలు - ఎస్బీఐ గోల్డ్ ఈటీఎఫ్ - యూటీఐ గోల్డ్ ఈటీఎఫ్ - రిలయన్స్ గోల్డ్ ఈటీఎఫ్ - కొటక్ గోల్డ్ ఈటీఎఫ్ - హెచ్డీఎఫ్సీ గోల్డ్ ఈటీ ఎఫ్ - యాక్సిస్ గోల్డ్ ఈటీఎఫ్ - ఐడీబీఐ గోల్డ్ ఎక్స్చేంజ్ - జీఎస్ గోల్డ్ పథకం - బిర్లా సన్‌లైఫ్ గోల్డ్ ఈటీఎఫ్ - రెలిగేర్ గోల్డ్ ఈటీఎఫ్ ఈ-గోల్డ్ ఈ-గోల్డ్ పథకాన్ని నేషనల్ స్పాట్ ఎక్స్చేంజ్ లిమిటెడ్ (ఎన్‌ఎస్‌ఈటీ) అందిస్తోంది. గోల్డ్ ఈటీఎఫ్‌లతో పోలిస్తే ఈ-గోల్డ్ రాబడి ఇంకాస్త ఎక్కువ. 2012లో గోల్డ్ ఈటీఎఫ్‌లు సగటున 11 శాతం రాబడినిస్తే.. ఈ-గోల్డ్ 16 శాతం రాబడిని అందించింది. గోల్డ్ ఈటీఎఫ్‌లతో పోలిస్తే ఈ-గోల్డ్‌లో బ్రోకరేజ్ చార్జీలు తక్కువ. సంపద పన్ను వర్తిస్తుంది. గోల్డ్ ఈటీఎఫ్‌లలో ఏడాది కాలాన్ని దీర్ఘకాలంగా పరిగణిస్తే.. ఈ-గోల్డ్‌లో మూడేళ్లను దీర్ఘకాలంగా పరిగణి స్తారు. అంటే మూడేళ్లు సేవింగ్ చేస్తేనే పన్ను మినహాయింపులు వర్తిస్తాయి. గోల్డ్ ఫండ్స్, ఫండ్ ఆఫ్ ఫండ్స్ మ్యూచువల్ ఫండ్స్‌లానే వివిధ ఫండ్ హౌస్‌లు గోల్డ్ ఫండ్స్‌నూ వినియోగదారులకు ఆఫర్ చేస్తున్నాయి. గోల్డ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడానికి డీమ్యాట్ ఖాతా తప్పనిసరి కాదు. ఈ-గోల్డ్, గోల్డ్ ఈటీఎఫ్ లావాదేవీలు మాత్రం డిమ్యాట్ ఖాతా ద్వారానే జరుగుతాయి. గోల్డ్ ఫండ్ ఆఫ్ ఫండ్స్ ద్వారా కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. గోల్డ్ బాండ్లు కేంద్రం గోల్డ్ బాండ్లను ప్రవేశపెట్టడానికి సన్నాహాలు చేస్తోంది. ఇంకా దీని విధివిధానాలు ఖరారు కాలేదు. త్వరలో అందుబాటులోకి రానున్న ఈ బాండ్లను... 2,5 నుంచి 10 గ్రాము ల వరకూ వివిధ పరిమాణాల్లో కేంద్రం జారీ చేస్తుంది. వీటి కాలపరిమితి 5-7 సంవత్సరాల దాకా ఉంటుంది. 50 టన్నుల పసిడికి సమానమైన గోల్డ్ బాండ్లను జారీచేసి రూ.13,500 కోట్లను సమీకరించాలని కేంద్రం భావిస్తోంది.