
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని అమెరికన్ కాన్సులెట్ జనరల్ క్యాథరిన్ హడ్డాకు తెలంగాణ ప్రభుత్వం తరఫున వీడ్కోలు సమావేశాన్ని ఘనంగా ఏర్పాటు చేశారు. నగరంలోని ఫలక్‌నామా ప‍్యాలెస్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. శుక్రవారం రాత్రి జరిగిన ఈ వీడ్కోలు సమావేశానికి టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో సహా వందమందికి పైగా ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అందమైన ప్యాలెస్‌లో వీడ్కోలు పలుకుతున్నందుకు సంతోషంగా ఉందంటూ క్యాథరిన్ హడ్డా తన సంతోషాన్ని ట్విటర్‌లో పంచుకున్నారు. సమావేశానికి తెలంగాణ ప్రభుత్వం తరఫున ముఖ్య అతిథిగా హాజరయిన కేటీఆర్.. ఆమెకు చేనేత చీరను బహుకరించారు. రాష్ట్రానికి ఆమె చేసిన సేవలను కొనియాడారు. తెలంగాణ ఐటీ, పెట్టుబడుల శాఖ కార్యదర్శి జయేష్ రంజన్ కూడా ఈ విందులో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment