
పుట్టిన రోజున ఫ్యామిలీతో మహేష్..!
ప్రిన్స్ మహేష్ బాబు తన ఖాలీ సమయాన్ని కుటుంబంతోనే గడుపుతుంటాడు. ప్రతీ సినిమా తరువాత ప్రత్యేకించి గ్యాప్ తీసుకొని మరీ కుటుంబంతో ఇతర దేశాలకు వెళ్లి రావటం సూపర్ స్టార్కు అలవాటు. అంతేకాదు ప్రతీ సెలబ్రేషన్ను ఫ్యామిలీతో కలిసి సెలబ్రేట్ చేసుకునే అలవాటున్న ప్రిన్స్.. తనపుట్టిన రోజును కూడా ఫ్యామిలీతో కలిసి ఆనందంగా సెలబ్రేట్ చేసుకున్నాడు.
ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న బైలింగ్యువల్ సినిమాలో నటిస్తున్న సూపర్ స్టార్, బర్త్ డే రోజున బ్రేక్ తీసుకొని మరి.. ఫ్యామిలీతో ఎంజాయ్ చేశాడు. భార్య నమ్రత, పిల్లలు గౌతమ్, సితారలతో కలిసి తాజ్ ఫలక్ నామా ప్యాలస్కు వెళ్లిన మహేష్, అక్కడి అందాలను, టేస్టీ ఫుడ్ను ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేశాడు. ఆ రోజును సినీ ప్రపంచానికి దూరంగా ప్రత్యేకంగా తన కుటుంబం కోసం కేటాయించాడు మహేష్.