బ్లాక్‌బస్టర్‌ హిట్‌ 'మురారి' రీ రిలీజ్‌.. అస్సలు పట్టించుకోని హీరోయిన్! | Murari Movie Heroine Sonali Bendre Not Responds On Her Block Buster Hit | Sakshi
Sakshi News home page

Sonali Bendre: ఎంట్రీతోనే హిట్‌ కొట్టిన మూవీ.. రీ రిలీజ్‌పై స్పందించని సోనాలి బింద్రే!

Published Fri, Aug 9 2024 4:17 PM | Last Updated on Fri, Aug 9 2024 5:23 PM

Murari Movie Heroine Sonali Bendre Not Responds On Her Block Buster Hit

టాలీవుడ్ సూపర్‌ స్టార్‌, ప్రిన్స్ మహేశ్‌ బాబు ఫ్యాన్స్ తెలుగు రాష్ట్రాల్లో హంగామా చేస్తున్నారు. తమ అభిమాన హీరో బర్త్‌ డే కావడం.. సూపర్ హిట్‌ మూవీ మురారి రీ రిలీజ్‌ చేయడం అభిమానుల్లో పండగ వాతావరణం నెలకొంది. 2001లో కృష్ణవంశీ డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇందులో బాలీవుడ్ భామ సోనాలి బింద్రే హీరోయిన్‌గా నటించింది. ముఖ్యంగా ఈ సినిమాలోని పెళ్లి సీన్‌ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇవాళ రీ రిలీజ్ కావడంతో కొందరైతే ఏకంగా థియేటర్లనే పెళ్లి చేసుకోవడం చూస్తే ప్రిన్స్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏంటో అర్థమవుతోంది.

రీ రిలీజ్‌పై స్పందించని హీరోయిన్..

అయితే మురారిలో హీరోయిన్‌గా మెప్పించిన ముంబయి ముద్దుగుమ్మ సోనాలి బింద్రే. ఆ తర్వాత ఇంద్ర, మన్మధుడు లాంటి హిట్‌ సినిమాల్లోనూ కనిపించింది. ఆమె మురారి సినిమాతోనే టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ తర్వాతే చిరంజీవి, నాగార్జున సరసన నటించే అవకాశం దక్కించుకుంది. ఇవాళ మురారి రీ రిలీజ్‌ అయినప్పటికీ ఎక్కడా కూడా ఈ సినిమా గురించి పోస్ట్ చేయలేదు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నప్పటికీ రెస్పాండ్ అవ్వలేదు. తనకు సూపర్ హిట్‌ అందించిన మురారి చిత్రంపై కనీసం ఇన్‌స్టా వేదికగా స్పందించకపోవడంపై ఫ్యాన్స్ నిరాశకు గురవుతున్నారు. ఏది ఏమైనా సోనాలి తొలి టాలీవుడ్ గురించి రియాక్ట్ అయి ఉంటే బాగుండేదని అభిమానులు భావిస్తున్నారు. 

అయితే 2002లో నిర్మాత,వ్యాపార వేత్త అయినా గోల్డీ బెల్‌ను పెళ్లాడిన ముద్దుగుమ్మ.. ఆ తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైంది. వీరిద్దరికీ ఓ కుమారుడు కూడా ఉన్నారు. గతంలో క్యాన్సర్ బారిన పడిన భామ.. ఆ తర్వాత కోలుకుంది. చివరిసారిగా 2022లో లవ్ యూ హమేశా చిత్రంలో కనిపించింది. 90ల్లో స్టార్‌ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన ముద్దుగుమ్మ ఇటీవలే ది బ్రోకెన్‌ న్యూస్‌ సీజన్‌-2తో ప్రేక్షకుల ముందుకొచ్చారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement