మహేశ్ బాబు బర్త్‌ డే.. అభిమానులకు థ్యాంక్స్‌ చెప్పిన ప్రిన్స్! | Tollywood Hero Mahesh Babu Emotional Post About His Birthday Celebrations | Sakshi
Sakshi News home page

Mahesh Babu: మహేశ్ బాబు బర్త్‌ డే విషెస్.. ప్రిన్స్ ఎమోషనల్ పోస్ట్!

Published Sat, Aug 10 2024 5:56 PM | Last Updated on Sat, Aug 10 2024 6:09 PM

Tollywood Hero Mahesh Babu Emotional Post About His Birthday Celebrations

టాలీవుడ్ సూపర్ స్టార్‌ మహేశ్ బాబు ఈనెల 9న 50 వసంతంలోకి అడుగుపెట్టారు. ప్రిన్స్ పుట్టినరోజు కావడంతో సినీతారలు, అభిమానులు ఆయనకు బర్త్‌ డే విషెస్ తెలిపారు. అంతేకాకుండా అదే రోజు మురారి రీ రిలీజ్ కావడంతో థియేటర్ల వద్దఫ్యాన్స్ హడావుడి చేశారు. ఈ సందర్భంగా అభిమానులను ఉద్దేశించి మహేశ్ బాబు ఎమోషనల్ ట్వీట్ చేశారు. తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.

మహేశ్ బాబు తన ట్వట్‌లో రాస్తూ.. 'నా పుట్టినరోజున  లభించిన ప్రేమ, సందేశాలు, ఆశీర్వాదాలతో ఉప్పొంగిపోయాను. మీలో ప్రతి ఒక్కరూ నా రోజును మరింత ప్రత్యేకంగా, ఎప్పటికీ గుర్తుండేలా మార్చారు. ఎల్లప్పుడూ మీరు  నా పట్ల చూపిస్తున్న ప్రేమ, మద్దతుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. లవ్ యూ ఆల్' అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట తెగ వైరలవుతోంది. ఇది చూసిన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

కాగా.. ఈ ఏడాది గుంటూరు కారం మూవీతో అలరించిన మహేశ్ బాబు.. మరో సినిమాకు రెడీ అవుతున్నారు. దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో ఆయన నటించనున్నారు. ఇప్పటికే కథ సిద్ధం కాగా.. త్వరలోనే ఈ మూవీ పట్టాలెక్కనున్నట్లు తెలుస్తోంది.  అమెజాన్‌ అడవుల నేపథ్యంలో సాగే కథతో ఈ మూవీ తెరకెక్కించనున్నారు. ఈ  చిత్రానికి మహారాజ్‌ అనే టైటిల్‌ పెట్టనున్నట్లు టాలీవుడ్‌లో టాక్‌ వినిపిస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement