
రెండు దశాబ్దాల క్రితం వచ్చిన క్లాసిక్ హిట్స్‌లో మురారి ఒకటి. మహేశ్‌బాబు, సోనాలి బింద్రె జంటగా నటించిన ఈ సినిమాను కృష్ణ వంశీ తెరకెక్కించాడు. మణిశర్మ సంగీతం సినిమా విజయానికి ఎంతగానో తోడ్పడింది. ఈ చిత్రాన్ని మహేశ్‌బాబు బర్త్‌డే సందర్భంగా ఆగస్టు 9న రీరిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా నటి సుధ ఆనాటి సంగతులను గుర్తు చేసుకుంది.
హీరోయిన్‌ను ఏడిపించే సాంగ్
ఆమె మాట్లాడుతూ.. అందరూ ఇష్టపడే హీరో ప్రిన్స్ మహేశ్‌బాబు. మీ నాన్న గారితో, మీతో పని చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. వంశీ, దూకుడు, అతడు.. ఇలా మంచి చిత్రాల్లో నటించాను. మురారి రీరిలీజ్ అవుతున్న సందర్భంగా ఓ సంఘటన మీతో చెప్పాలనుకుంటున్నాను. హీరోయిన్ సోనాలి బింద్రెను ఏడిపించే పాట(బంగారు కళ్ల బుచ్చమ్మో..)లో మహేశ్, నేను ఆమెను మామూలుగా ఏడిపించలేదు.
కావాలనే ఏడిపిస్తున్నారు కదా
ఆ షాట్ పూర్తయ్యాక తనొచ్చి.. మీరిద్దరూ కలిసి కావాలనే ఏడిపిస్తున్నారు కదా.. నాకు అర్థమవుతోంది. దర్శకుడు చెప్పకపోయినా కావాలని ఏడిపిస్తున్నారంది. ఆ పాటలో.. తనతో గేదెకు స్నానం చేయిస్తున్నప్పుడైతే ఎంత నవ్వుకున్నామో.. అయితే డేట్స్ సర్దుబాటు కాకపోవడం వల్ల కొన్ని సీన్స్‌లో నేను కనిపించను. అయినా ఉన్నంతవరకు షూటింగ్ ఆనందంగా చేశాం అని చెప్పుకొచ్చింది.
Veteran artist #Sudha garu’s special video byte for #Murari4K 💥❤️🔥@urstrulyMahesh #SSMB29 pic.twitter.com/vnkM7Po5Zx
— 𓆩MB_RAJ𓆪 (@Raj_6208) July 27, 2024