Sudha
-
పుస్తకాలు మా ఇంటి సభ్యులు
తల్లీ కుమార్తె కూచుంటే ఏం మాట్లాడుకుంటారు? మెట్టినింటి విషయాలో.. నగలో, చీరలో... అనుకోవచ్చు కొందరు. కానీ వారు పుస్తకాల గురించి మాట్లాడుకుంటారని తెలుసా? సుధామూర్తి, ఆమె కుమార్తె అక్షతా మూర్తి ‘జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్’లో తల్లి కుమార్తె చేత ఎందుకు పుస్తకాలు చదివించాలో, తామెలాంటి పుస్తకాలు చదివారో మాట్లాడుకున్నారు. ప్రేక్షకుల్లో నారాయణమూర్తి, బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునక్ కూచుని విన్నారు. ‘పవర్ ఆఫ్ బుక్’... తమిద్దరి దగ్గరా న్నదని సుధా, అక్షత అన్నారు. వివరాలు..‘అమ్మా... నువ్వు పుస్తకాలు మా చేత ఎందుకు చదివించాలని పట్టుబట్టావ్? పుస్తకాలు నీ జీవితంలోకి ఎలా ప్రవేశించాయి?’ అని ప్రశ్నించారు అక్షతా మూర్తి.‘జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్ 2025’ లో రెండు రోజుల క్రితం జరిగిన ‘మై మదర్ మైసెల్ఫ్’ అనే సెషన్లో అక్షతా మూర్తి తన తల్లి సుధామూర్తిని పుస్తకాలు, పెంపకం, వ్యక్తిత్వం వంటి అంశాలపై ప్రశ్నలు అడుగుతూ తల్లీకూతుళ్లుగా తాము నడిచి వచ్చిన జీవితాన్ని మననం చేసుకున్నారు. కిక్కిరిసిన వేలాది ప్రేక్షకులతో పాటు అక్షత తండ్రి ఇన్ఫోసిస్ నారాయణమూర్తి, భర్త బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునాక్‌లు ముందు వరుసలో కూచుని ఈ సెషన్ విన్నారు. సెషన్‌కు ముందు రిషి సునాక్ లేచి నిలబడి ప్రేక్షకుల వైపు చూస్తూ ‘నమస్తే’ అని అభివాదం చేయడం అందరినీ ఆకట్టుకుంది. ఇక కూతురి ప్రశ్నకు సుధామూర్తి సమాధానం చెప్తూ–సుధామూర్తి: మాది టీచర్ల ఫ్యామిలీ. మా తాత టీచర్. మా నాన్న మెడికల్ కాలేజీలోప్రోఫెసర్. అమ్మ టీచర్. నేనూ ఆ తర్వాత టీచర్నయ్యాను. మామగారు కూడా టీచరే. మా ఇంట్లో టీచరు కానిది నా భర్తగా వచ్చిన నారాయణమూర్తి ఒక్కడే. కాబట్టి అనివార్యంగా నేను చిన్నప్పటి నుంచి డబ్బుతో కాకుండా పుస్తకాలతో పెరిగాను. మా ఇంట్లో ఎవరి బర్త్‌డేకైనా ఇచ్చే గిఫ్ట్ పుస్తకమే. అలా పుస్తకాలు అలవాటు చేశారు. పుస్తకాలంటే అజ్ఞానంతో పడిన తలుపులను తెరిచే తాళం చెవులు. అవి మనకు ఎన్నో నేర్పిస్తాయి. పుస్తకాలు చదవడం లేదా నేర్చుకోవడం ఎప్పుడైతే మానేస్తామో ఆ రోజు నుంచి జీవించడం మానేసినట్టు. అందుకే నా పిల్లలు కూడా పుస్తకాలు చదవాలని నేను పట్టుబట్టాను....సుధామూర్తిని అక్షత ఇంటర్వ్యూ చేస్తుండగా బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునక్, నారాయణమూర్తి ప్రేక్షకుల్లో కూర్చుని వింటున్న దృశ్యం అక్షత: నువ్వు పట్టుబట్టడం వల్ల నేను, రోహన్ (సోదరుడు) నేటికీ లాభపడుతున్నాం. నీకు గుర్తుందా అమ్మా... మనింట్లో నీదో లైబ్రరీ ఉండేది. అందులో సాహిత్యం, చరిత్ర పుస్తకాలుండేవి. నాన్నదో లైబ్రరీ ఉండేది. అందులో సైన్స్ అండ్ టెక్నాలజీ పుస్తకాలుండేవి. మీ ఇద్దరి లైబ్రరీలు– ఆ రోజుల్లో ఇంటర్నెట్ లేదు కనుక నా చదువులో పెద్ద రిఫరెన్సుగా ఉండేవి. స్కూల్లో ఏ ్రపాజెక్టు చేయాల్సి వచ్చినా ఉద్వేగంగా ఇంటికి వచ్చి పుస్తకాలు తిరగేస్తూ కూరుకుపోయేదాన్ని. అన్నట్టు నీకు సేవాభావం పుస్తకాల నుంచే వచ్చిందా?సుధామూర్తి: మా నానమ్మ ఊళ్లో మంత్రసానిగా ఉండేది. డబ్బుకు కాదు. సేవకోసం. కులం, మతం, జాతి.. పట్టింపు ఉండేది కాదు. వెళ్లి పురుడుబోసి వచ్చి తలస్నానం చేసి ఇంట్లోకి వచ్చేది. తగిన వైద్యం లేక స్త్రీలు పడే వేదన ఆమె చెప్తుంటే విని విని నాన్న గైనకాలజిస్ట్ అయ్యారు. మా చెల్లెలు (నంద) కూడా గైనకాలజిస్ట్ అయ్యింది. సేవ చేస్తే ఎంత తృప్తి ఉంటుందో నాకు తెలిసింది. మా నానమ్మకు 62 ఏళ్లు ఉన్నప్పుడు నాకు 12 ఏళ్లు. కన్నడ నేర్చుకోవాలని అంటే మూడు నెలలు స్ట్రిక్ట్ టీచర్‌గా పాఠాలు చెప్పాను. ఏ రోజైతే ఆమె తనకు తానుగా కన్నడం చదవడం నేర్చుకుందో వచ్చి నా కాళ్లకు ప్రణామం చేసింది గురువుగా. నేను షాక్ అయ్యాను. జ్ఞానం పంచినవారు గురువే చిన్నైనా పెద్దయినా. చాలా సంతోషం అనిపించింది. జ్ఞానం పంచడం కూడా సేవే అని తెలుసుకున్నాను.అక్షత: మీ నానమ్మ పేరు ఏమిటి?సుధామూర్తి: కృష్ణఅక్షత: నా చిన్న కూతురి పేరు అదేగా. కృష్ణ. (పెద్ద కూతురు అనుష్క). అమ్మా... నువ్వు మమ్మల్ని ఆదర్శంగా ఉండమని కూడా చెప్పేదానివి.సుధామూర్తి: ఒక మాటుంది.. ఇరవై ఏళ్ల వయసులో ఆదర్శంగా లేకపోతే హృదయం లేనట్టు. నలభై ఏళ్ల వయసులో ఆదర్శంగా ఉంటే బుర్ర లేనట్టు. కాని నేను ఈ వయసులో కూడా ఆదర్శంగానే ఉన్నాను. జీవితంలో ఆదర్శాలు ముఖ్యం. మీకు చిన్నప్పటి నుంచి ఒకటే చెప్పేదాన్ని– జీవితంలో ఏదైనా కాకపోయినా ఆదర్శవంతంగా మాత్రం ఉండండి అని. ఆదర్శంగా ఉండటం అంటే. పార్శీ వారు చెబుతారు... ఏది ఆలోచిస్తామో అదే మాట్లాడటం... ఏది మాట్లాడతామో అదే చేయడం. బుద్ధికీ, వాక్కుకీ, చేతకీ సారూప్యతే ఆదర్శం. ఒకటి చెప్పి ఒకటి చేయడం కపటం.అక్షత: నీకు ఇష్టమైన పుస్తకం ఏది?సుధామూర్తి: ముందు నువ్వు చెప్పు. అక్షత: నాకు సుఖాంతాలున్న పుస్తకాలు ఇష్టమే కాని పాత్రలు ఎన్ని విషమ పరీక్షలు ఎదురైనా తట్టుకుని నిలబడేట్టుగా ఉంటే ఇంకా ఇష్టం. చారిత్రక ఘట్టాలు, వ్యక్తులను తీసుకుని రాసే పుస్తకాలు ఇష్టం. నీకు?సుధామూర్తి: నా పుస్తకమే చెబుతాను– ‘మహాశ్వేత’. అది రాసినప్పుడు నేనుప్రోఫెసర్గా చేస్తున్నాను. ఒకరోజు ఎవరిదో పెళ్లికి నన్ను తప్పనిసరిగా ఆహ్వానించారు. ఆశ్చర్యంతో వెళ్లాను. భోజనం చేయాలని పట్టుబట్టారు. కారణం అడిగితే పెళ్లికొడుకు నా మహాశ్వేత నవలను చదివాడట. పెళ్లికూతురుగా తెల్లమచ్చలు ఉన్న అమ్మాయిని ఎంపిక చేసుకున్నాడట. మీ నవల వల్లే తెల్లమచ్చలు ఉన్న అమ్మాయిల వ్యధ అర్థం చేసుకుని ఈ పెళ్లి చేసుకున్నానని చెప్పాడు. ఒక సింపుల్ పెన్ ఎంత మార్పు తేగలదో చూడటం. పవర్ ఆఫ్ బుక్ అంటే అది.అక్షత: పవర్ ఆఫ్ బుక్ ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలి. జీవితంలో ఉపయోగించడానికి పనికి వచ్చే ఆయుధం పుస్తకమే. సుధామూర్తి: కచ్చితంగా.అక్షత: థ్యాంక్యూ అమ్మా... ఇలా కూచుని మనం మాట్లాడుకున్నందుకు. సుధామూర్తి: అందరికీ థ్యాంక్స్. – జైపూర్ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి -
రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువు
బద్వేలు అర్బన్: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచి మహిళలు, విద్యార్థినులకు రక్షణ కరువైందని వైఎస్సార్ జిల్లా ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, బద్వేలు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే డాక్టర్ సుధ విమర్శించారు. బద్వేలు సమీపంలో బాలిక దస్తగిరమ్మ ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురికావడం అత్యంత బాధాకరమైన విషయమన్నారు. రాష్ట్రంలో మహిళలు, విద్యార్థినులపై జరుగుతున్న వరుస ఘటనలు చూస్తుంటే కూటమి ప్రభుత్వ పాలన ఏ విధంగా ఉందో అర్థమవుతుందన్నారు. ఆదివారం స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. లిక్కర్, ఇసుక దందాలతో శాంతిభద్రతలు గాలికి..హిందూపురం నియోజకవర్గంలో అత్తాకోడళ్లపై జరిగిన గ్యాంగ్‌రేప్ ఘటన.. కర్నూలు జిల్లా అస్పరి మండలంలో అశ్విని అనే ఇంటర్ విద్యార్థిని హత్య ఘటన మరువక ముందే తాజాగా బద్వేలులో దస్తగిరమ్మ హత్య.. ఇలా వరుసగా దుర్ఘటనలు జరుగుతున్నా కూటమి ప్రభుత్వం తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం చేయకపోవడం బాధాకరమన్నారు. లిక్కర్, ఇసుక స్కాంలలో పాలకులు నిండా మునిగిపోయి మహిళల రక్షణ బాధ్యతలను పూర్తిగా విస్మరిస్తున్నారన్నారు. పోలీసు వ్యవస్థ కూడా అధికారంలో ఉన్న వారి అడుగులకు మడుగులొత్తుతూ ప్రతిపక్ష నేతలను తప్పుడు కేసులతో వేధించడమే పనిగా పెట్టుకున్నారని, శాంతిభద్రతలను పట్టించుకోవడం మానేశారని మండిపడ్డారు. ఇంతటి దారుణ పరిస్థితులు రాష్ట్రంలో మునుపెన్నడూ లేవన్నారు. వైఎస్సార్సీపీ హయాంలో మహిళల రక్షణకు పెద్దపీటఇక గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో బాలికలు, మహిళల భద్రతకు పెద్దపీట వేశారని, ఇందులో భాగంగానే విప్లవాత్మకంగా దిశ యాప్‌ను తీసుకొచ్చారన్నారు. మహిళల రక్షణ కోసం రాష్ట్రవ్యాప్తంగా 18 దిశ పోలీసుస్టేషన్లు ఏర్పాటుచేయడంతో పాటు ప్రత్యేకంగా 13 పోక్సో కోర్టులు, 12 మహిళా కోర్టులు ఏర్పాటుచేసి ప్రత్యేకంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్లను ఏర్పాటుచేశారని వారు గుర్తుచేశారు. అంతేకాక.. పెట్రోలింగ్ వ్యవస్థను పటిష్టపరిచామన్నారు. అయితే, రాజకీయ కక్షతో చంద్రబాబు దిశ వ్యవస్థను నిర్వీర్యం చేశారని ఆరోపించారు. -
నేను, మహేశ్‌బాబు హీరోయిన్ను ఏడిపించాం: సుధ
రెండు దశాబ్దాల క్రితం వచ్చిన క్లాసిక్ హిట్స్‌లో మురారి ఒకటి. మహేశ్‌బాబు, సోనాలి బింద్రె జంటగా నటించిన ఈ సినిమాను కృష్ణ వంశీ తెరకెక్కించాడు. మణిశర్మ సంగీతం సినిమా విజయానికి ఎంతగానో తోడ్పడింది. ఈ చిత్రాన్ని మహేశ్‌బాబు బర్త్‌డే సందర్భంగా ఆగస్టు 9న రీరిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా నటి సుధ ఆనాటి సంగతులను గుర్తు చేసుకుంది. హీరోయిన్ను ఏడిపించే సాంగ్ఆమె మాట్లాడుతూ.. అందరూ ఇష్టపడే హీరో ప్రిన్స్ మహేశ్‌బాబు. మీ నాన్న గారితో, మీతో పని చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. వంశీ, దూకుడు, అతడు.. ఇలా మంచి చిత్రాల్లో నటించాను. మురారి రీరిలీజ్ అవుతున్న సందర్భంగా ఓ సంఘటన మీతో చెప్పాలనుకుంటున్నాను. హీరోయిన్ సోనాలి బింద్రెను ఏడిపించే పాట(బంగారు కళ్ల బుచ్చమ్మో..)లో మహేశ్, నేను ఆమెను మామూలుగా ఏడిపించలేదు. కావాలనే ఏడిపిస్తున్నారు కదాఆ షాట్ పూర్తయ్యాక తనొచ్చి.. మీరిద్దరూ కలిసి కావాలనే ఏడిపిస్తున్నారు కదా.. నాకు అర్థమవుతోంది. దర్శకుడు చెప్పకపోయినా కావాలని ఏడిపిస్తున్నారంది. ఆ పాటలో.. తనతో గేదెకు స్నానం చేయిస్తున్నప్పుడైతే ఎంత నవ్వుకున్నామో.. అయితే డేట్స్ సర్దుబాటు కాకపోవడం వల్ల కొన్ని సీన్స్‌లో నేను కనిపించను. అయినా ఉన్నంతవరకు షూటింగ్ ఆనందంగా చేశాం అని చెప్పుకొచ్చింది. Veteran artist #Sudha garu’s special video byte for #Murari4K 💥❤️🔥@urstrulyMahesh #SSMB29 pic.twitter.com/vnkM7Po5Zx— 𓆩MB_RAJ𓆪 (@Raj_6208) July 27, 2024 చదవండి: రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ 'ప్రేమలు' నటుడు -
అక్కాచెల్లెళ్ల హెల్త్ఫుల్ సప్లిమెంట్స్!
‘‘మన నేల సుసంపన్నం... పోషకాలన్నీ ఉన్నాయి. కానీ... పోషకాహారలోపంతో బాధపడుతోంది మనదేశం. ఆరోగ్యాభిలాషులుగా మేము హెల్దీ లివింగ్ కోసం ఉద్యమించాం. మొక్కలతో పోషకాలందించాలనే సంకల్పాన్ని చేబూనాం. భూమి... మొక్క మనకు సంపూర్ణ ఆరోగ్యాన్నిస్తాయి. అందుకే మా ప్రయోగాలకు ఎర్త్ ఫుల్ అని పేరు పెట్టాం’’ తమను తాము బ్లాగ్‌లో ఇలా పరిచయం చేసుకున్నారీ అక్కాచెల్లెళ్లు. వాళ్ల పేర్లు సుధ, వేద. ఇద్దరూ ఐఐటీ ఖరగ్‌పూర్ ఇంజనీర్లు. కెరీర్లో కొత్త మలుపు గురించి సాక్షితో పంచుకున్నారిద్దరూ". ‘‘మా నాన్న సొంతూరు విజయవాడ దగ్గర మానికొండ. నాన్న వ్యాపార రీత్యా ఒడిశా, వైజాగ్, హైదరాబాద్‌లో పెరిగాం. అమ్మ ఏజీ ఎమ్మెస్సీ చదివింది. మమ్మల్ని ఐఐటీలో ఇంజనీరింగ్ చేయించాలనే సంకల్పం అమ్మదే. కోచింగ్‌కి చుక్కారామయ్య గారి ఇన్స్టిట్యూట్లో చేర్చడం కోసమే హైదరాబాద్‌లో నల్లకుంటలో ఉండేవాళ్లం. నేను కెమికల్, చెల్లి బయోటెక్నాలజీలో ఇంజనీరింగ్ చేశాం. నాకు ఐటీసీ లిమిటెడ్‌లో ఉద్యోగం. హరిద్వార్‌లో పోస్టింగ్. దాదాపు ఆరువందల మంది ఉద్యోగుల్లో ఒక్క అమ్మాయిని. అర్బన్ టచ్‌లో ఉద్యోగం చేసేటప్పుడు సొంత స్టార్టప్ ఆలోచన వచ్చింది. హైదరాబాద్‌కి వచ్చి ఎంబీఏ చేసి ఊబెర్లో లాంచింగ్ సమయంలో ఉద్యోగం చేశాను. ఇక వేద విషయానికి వస్తే... బ్యాంకింగ్‌రంగంలో ముంబయి, లండన్లలో చేసింది. సివిల్స్ కోసం ఢిల్లీలో కోచింగ్ తీసుకుంటూ మూడేళ్లు ప్రయత్నించింది. తనకు బిజినెస్ నాలెడ్జ్ ఎక్కువ. మీషో స్టార్టప్ కోసం బెంగళూరులో ఉద్యోగం చేసింది. ఈ సమయంలో కోవిడ్ ప్రపంచాన్ని కుదిపేసింది. వేద ఇంటి నుంచి పని చేయడానికి హైదరాబాద్‌కి వచ్చింది. ఇద్దరమూ ఎప్పుడూ ఏదో ఒక టాపిక్ మీద మాట్లాడుకుంటూ ఉండేవాళ్లం. ఆ సమయంలో బర్నింగ్ టాపిక్ ఆరోగ్యమే. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండి వ్యాధినిరోధక శక్తి సమృద్ధిగా ఉండాల్సిన అవసరం గురించి ప్రపంచం అంతా మాట్లాడుతోంది. ఆహారం ద్వారా సమగ్ర ఆరోగ్యాన్ని పొందడం గురించి డాక్టర్లు చెబుతున్నారు. కానీ పరిపూర్ణమైన పరిష్కారం అందుబాటులో లేదప్పటకి. మనకు తెలిసింది... మంచి ఆహారం తీసుకోవడం, అనారోగ్యం వస్తే ఔషధాలు తీసుకోవడం మాత్రమే. ఈ రెండింటికీ మధ్య ఫుడ్ సప్లిమెంట్ అనే మరొక ప్రత్యామ్నాయం ఉందని మనదేశంలో అవగాహన చాలా తక్కువ. మేము ఆ చైతన్యం కోసమే పని చేస్తున్నాం’’ అన్నారు సుధ. సీట్లో కూర్చోవడం నుంచి మొదలు... ‘‘మేమిద్దరం కార్పొరేట్ రంగంలో ఉద్యోగం చేశాం. పనిలో నిర్దేశించిన లక్ష్యాలను చేరడానికి విపరీతంగా శ్రమించేవాళ్లం. ఆఫీస్ వర్క్‌లో దేహకదలికలు తగినంత ఉండవు. యాసిడ్ రిఫ్లక్స్‌తో సమస్యలు జీర్ణవ్యవస్థ నుంచి మొదలవుతాయి. బ్యాక్ పెయిన్ వరకు వెళ్తుంది. ఆరోగ్యం క్షీణిస్తోందని తెలిసేటప్పటికే దేహం శక్తిని కోల్పోయి ఉంటుంది. మంచి ఆహారం తీసుకుంటున్నప్పటికీ దేహానికి కావల్సినంత శక్తి అందడం లేదని అర్థమవుతుంది. అనారోగ్యం ఏమిట’ని ప్రశ్నిస్తే ఫలానా అని ఏమి చెప్పాలో అర్థం కాదు. డాక్టర్ సూచన మేరకు ఐరన్, క్యాల్షియమ్, ప్రొటీన్, విటమిన్లతోపాటు మైక్రో న్యూట్రియెంట్స్‌తో కూడిన మందులు వాడుతాం. మందులు ఆపేసిన రెండు వారాలకు మనతో స్నేహం చేయడానికి తిరిగి నీరసం, నిస్సత్తువలు దరి చేరతాయి. మా జనరేషన్ మాత్రమే కాదు, కొంచెం అటూ ఇటూగా సమాజంలో ఎక్కువమంది ఎదుర్కొంటున్న సమస్య ఇది. ఇంట్లో దీర్ఘకాలంగా డయాబెటిస్తో బాధపడుతున్న మా నాన్నను చూస్తున్నాం. బలహీనమవుతున్న దేహం మనం అనుసరిస్తున్న డైలీ రొటీన్ ఆరోగ్యానికీ– అనారోగ్యానికీ మధ్య ఉండాల్సిన రక్షణరేఖ చెరిపేసిందనిపించింది. ముఖ్యంగా ఇండియన్ ఉమెన్ ఎదుర్కొంటున్న సమస్యలైతే మరీ విడ్డూరం. అనారోగ్యమేమీ ఉండదు. నడవాలంటే మోకాళ్లు నొప్పులు, కూర్చోవాలంటే వెన్నునొప్పి, బరువు ఎత్తితే భుజం నొప్పి, త్వరగా అలసిపోవడం, నీరసం. నిజానికి ఇవేవీ అనారోగ్యాలు కావు. మనం దేహానికి అవసరమైన పోషకాలందకపోవడం వల్లనే అని మా అధ్యయనంలో తెలుసుకున్నాం. పాశ్చాత్య దేశాల్లో అయితే రోజూ ఆహారంతోపాటు ఫుడ్ సప్లిమెంట్లు కూడా తీసుకుంటారు. నిజానికి మన దేహానికి అవసరమైన పోషకాలన్నింటినీ ఆహారం ద్వారా అందించడం అంత సులువైన పనేమీ కాదు, పోషకాహార పట్టిక, న్యూట్రిషనిస్టుల సూచన ప్రకారం ఒక మనిషికి ఒక రోజుకు అవసరమైనంత ఐరన్ ఆహారం ద్వారా అందాలంటే తొమ్మిది కప్పుల పాలకూర తినాలి. మా రీసెర్చ్‌లో తెలుసుకున్న విషయాలతోనే సమాజం ఎదుర్కొంటున్న సమస్యకు పరిష్కారం దొరికింది. అదే మా స్టార్టప్ అయింది. మా ఎర్త్ఫుల్ బోర్డ్ సభ్యులుగా డాక్టర్, న్యూట్రిషనిస్ట్, ఫుడ్ ఎక్స్‌పర్ట్‌లున్నారు. ఆకు నుంచి గింజ వరకు... ప్రకృతి మనకు అవసరమైన అన్నింటినీ సమగ్రంగా, సమతూకంగా ఇచ్చింది. కానీ మనమే లైఫ్‌స్టయిల్‌ని పక్కదారి పట్టించుకున్నాం. జామపండుని కొరికి తినాలంటే దంతాలు సహకరించవు. దాంతో గింజలను వదిలేయడమో లేదా రెడీమేడ్ జ్యూస్‌లు తాగడమో చేస్తున్నాం. దాంతో గింజల ద్వారా అందాల్సిన పోషకాలను కోల్పోతున్నాం. జామ ఆకులో జింక్ ఉంటుందని తెలిసినప్పుడు మేము కూడా ఆశ్చర్యపోయాం. ఇలాంటి వాటిని సులువైన రూపంలో అందించడమే మా ప్రయత్నం. అలాగే ఆరోగ్యం పట్ల చైతన్యవంతం చేయడం కూడా. వ్యాపారం అంటే డబ్బు సంపాదన కోసం మాత్రమే కాకూడదు. సామాజిక బాధ్యత ఉండాలి. అలాగే నైతిక విలువలతో కూడినదై ఉండాలి. సమాజాన్ని ఆరోగ్యవంతం చేయడంలో మా కృషి ఉంటోందంటే కలిగే సంతృప్తిని మాటల్లో వివరించలేం. బాక్స్ మార్కెట్ మా వెంట వస్తోంది! భూమ్మీద జీవించాల్సిన మనిషి కోసం భూమి అన్నింటినీ మొక్కల రూపంలో ఇచ్చింది. వాటిని తెలుసుకోవడంలో మనం విఫలమవుతున్నాం. ‘భూమి నుంచి ఉద్భవించిన మొక్కల ఆధారంగా ఫుడ్ సప్లిమెంట్స్ తయారు చేస్తున్నాం, మొక్కల్లో మనకు అవసరమైనవన్నీ ఉన్నాయ’ని చెప్పాలనే ఉద్దేశంతో మా స్టార్టప్‌కి ఎర్త్ఫుల్ అని పెట్టాం. ఈ స్టార్టప్ కోసం చేసిన హోమ్ వర్క్ చిన్నది కాదు. ఈ జర్నీలో మేము ప్రతిరోజూ కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉత్తేజితులమవుతున్నాం. తెలుసుకున్న విషయాలను ఎప్పటికప్పుడు బ్లాగ్‌లో, ఎఫ్బీలో షేర్ చేసుకుంటూ ఉండడంతో స్టార్టప్ ప్రారంభించేటప్పటికే మాకు ఫాలోయింగ్ బాగా వచ్చేసింది. దాంతో మార్కెటింగ్ కోసం ప్రయాస పడాల్సిన అవసరం లేకపోయింది. అవుట్లెట్లే స్వయంగా మా ఉత్పత్తులను అడుగుతున్నాయి. కానీ మా ఉత్పత్తులు కమర్షియల్ కావడం మాకిష్టం లేదు’’ – సుధ, వేద, ఫౌండర్స్, ఎర్త్ఫుల్ , హైదరాబాద్ – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి (చదవండి: ఆమెను చూస్తే..'ధైర్యే సాహసే ఆరోగ్య లక్ష్మీః' అనకతప్పదు!) -
తినడానికి తిండి లేక మంగళసూత్రం అమ్మాల్సి వచ్చింది: నటి
దాదాపు వెయ్యి సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల మనసులో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది సీనియర్ నటి సుధ. బాలనటిగా, హీరోయిన్గా, అత్తగా, అమ్మగా, వదినగా.. ఇలా ఎన్నో పాత్రల్లో ఇట్టే ఒదిగిపోయిన ఆమె జీవితంలో మాత్రం ఎన్నో కష్టనష్టాలను చవిచూసింది. దీని గురించి తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'నేను డైమండ్ స్పూన్‌తో పుట్టాను. పెద్ద ఇల్లు, ఇంటినిండా పనివాళ్లు, ముగ్గురు డ్రైవర్లు.. ఇలా చాలా రాజసంగా బతికాం. మా నాన్నకు నలుగురు కొడుకుల తర్వాత నేను పుట్టాను. అందుకే నాకు అమృతం అన్న అర్థం వచ్చేలా సుధ అని పేరు పెట్టారు. ఇంట్లో 20 తులాల బంగారు నగలు వేసుకుని తిరిగేదాన్ని. ఆస్తి, ఐశ్వర్యం అన్నీ చూశాను. కానీ తమ్ముడు పుట్టిన కొంతకాలానికే నాన్నకు క్యాన్సర్ అని తెలిసింది. అప్పటినుంచి ఆస్తి అంతా కరిగిపోవడం మొదలైంది. నేను ఆరో తరగతి చదివే సమయంలో అమ్మ తన మంగళసూత్రం అమ్మి మాకు భోజనం పెట్టింది. అలా అన్నీ ఉన్న స్టేజ్ నుంచి ఏమీ లేని స్థాయికి వచ్చాం. అమ్మ థియేటర్ ఆర్టిస్ట్ కావడంతో నన్ను కూడా యాక్టింగ్ ఫీల్డ్‌కు తీసుకొచ్చింది. డబ్బు, పేరు రావడంతో చుట్టాలు తిరిగి మావంక చూడటం మొదలుపెట్టారు. చిన్నతనంలో సుఖసంతోషాలతో పాటు ఎన్నో కష్టాలు పడ్డాము. ఆ మధ్య ఢిల్లీలో హోటల్ ప్రారంభించడంతో ఉన్న డబ్బంతా పోయింది. ఒక్క సంతకంతో వందల కోట్లు నష్టపోయాను. ఇంకా కొన్ని అప్పులైతే ఇప్పుడిప్పుడే వాటినుంచి బయటపడ్డాను. నా కొడుకు విదేశీ అమ్మాయిని పెళ్లి చేసుకుని అక్కడే సెటిలైపోయాడు. నాతో గొడవపడి వెళ్లిపోయాడు. ఇప్పటికీ మాట్లాడట్లేదు' అని చెప్తూ ఎమోషనలైంది సుధ. చదవండి: రాకీ భాయ్ స్థానంలో వేరే హీరో.. షాకిచ్చిన నిర్మాత తమ్ముడి బర్త్‌డే పార్టీలో శ్రీముఖి రచ్చ -
స్టేషన్లో గొడవతో హత్యకు సుపారీ
తుమకూరు: హుళియారు పోలీస్ స్టేషన్ మహిళా కానిస్టేబుల్ సుధా హత్య కేసు కొత్త మలుపు తిరిగింది. ఆమెను హత్య చేయడానికి సహచర కానిస్టేబుల్ రాణినే సుపారీ ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఇప్పటికే మంజునాథ్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకోగా అతనికి సహకరించిన వ్యక్తి పట్టుబడ్డాడు. కానిస్టేబుల్ రాణితో పాటు నిఖేశ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. ప్రాణం తీసిన గొడవ హుళియారు పీఎస్‌లో సుధాతో పాటు రాణి అనే మహిళా కానిస్టేబుల్ కూడా పనిచేస్తోంది. అయితే డ్యూటీ విషయాలతో పాటు సుధా, రాణి ఇద్దరు తరచూ డబ్బుల గురించి గొడవ పడేవారు. ఇద్దరు మూడు నాలుగు సార్లు స్టేషన్లోనే తీవ్రంగా రగడ పడినట్లు సమాచారం. దీంతో ఎలాగైనా సుధను అడ్డుతొలగించుకోవాలని రాణి పథకం వేసింది. ఏకంగా సుధకు వరుసకు సోదరుడైన మంజునాథ్‌కు సుపారీ ఇచ్చింది. దీంతో రాణి వద్ద సుపారీ తీసుకున్న మంజునాథ్ (23), తన స్నేహితుడు నిఖేశ్ (30) సాయంతో సుధను కారులో తీసుకుని పోయి హాసన్ వద్ద హత్య చేసి పొదల్లో పడేసి వెళ్లిపోయాడు. తరువాత భయాందోళనకు గురైన మంజునాథ్ శివమొగ్గకు చేరుకుని అక్కడ ఓ లాడ్జిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ కేసులో ముగ్గురిపై కేసు నమోదు చేశామని ఎస్ఐ కేవీ మూర్తి తెలిపారు. (చదవండి: ఫోటోలు లీక్, ప్రియుడు ఖతం) -
సైకిల్ దీదీ... :సుధా వర్గీస్ సేవకు షష్టిపూర్తి
చదువు బతకడానికి అవకాశం ఇస్తుంది. అదే చదువు ఎంతోమందిని బతికించడానికి ఓ కొత్త మార్గాన్ని చూపుతుంది. బీహార్‌లో సామాజికంగా అత్యంత వెనకబడిన ముసహర్ కమ్యూనిటీకి చెందిన బాలికల సాధికారతకు ఆరు దశాబ్దాలుగా కృషి చేస్తున్న సుధా వర్గీస్ చదువుతో పాటు ప్రేమ, ధైర్యం, కరుణ అనే పదాలకు సరైన అర్థంలా కనిపిస్తారు. సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన అమ్మాయి సామాజిక నాయికగా ఎలా ఎదిగిందో తెలుసుకుందాం... ముసహర్ సమాజంలో సైకిల్ దీదీగా పేరొందిన సుధా వర్గీస్ పుట్టి పెరిగింది కేరళలోని కొట్టాయంలో. స్కూల్లో చదువుకుంటున్నప్పుడు ఒక పేపర్లోని వార్త ఆమెను ఆకర్షించింది. అందులో.. బీహార్‌లోని ముసహర్ల సమాజం ఎదుర్కొంటున్న భయానకమైన జీవనపరిస్థితులను వివరిస్తూ ఫొటోలతో సహా ప్రచురించారు. ‘ముసహర్’ అంటే ‘ఎలుకలు తినేవాళ్లు’ అనేది తెలుసుకుంది. తాను పుట్టి పెరిగిన కేరళలో ఇలాంటివి ఎన్నడూ చూడని ఆ సామాజిక వెనుకబాటుతనం సుధను ఆశ్చర్యపరిచింది. ‘వీరి పరిస్థితిని మెరుగుపరచడానికి ఏమీ చేయలేమా..?!’ అని ఆలోచించింది. తనవంతుగా కృషి చేయాలని అప్పుడే నిర్ణయించుకుంది. కాలేజీ రోజుల్లోనే... ముసహర్ ప్రజలకోసం పనిచేయాలని నిర్ణయించుకొని బీహార్‌లోని పాట్నా నోట్రే డామ్ అకాడమీలో చేరింది. అక్కడ శిక్షణ పొందుతున్న సమయంలోనే ఇంగ్లిష్, హిందీ నేర్చుకుంది. 1986లో తన సౌకర్యవంతమైన జీవితాన్ని విడిచిపెట్టి ముసహర్లతో కలిసి జీవించాలని, వారికి విద్యను అందించాలని, వారి జీవితాలను మెరుగుపరచడానికి తన సమయాన్ని, వనరులను వెచ్చించాలని నిర్ణయించుకుంది. గుడిసెలో జీవనం... ముసహర్లు గ్రామాల సరిహద్దుల్లో ఉండేవారు. ఆ సరిహద్దు గ్రామాల్లోని వారిని కలుసుకోవడానికి సైకిల్ మీద బయల్దేరింది. అక్కడే ఓ పూరి గుడిసెలో తన జీవనం మొదలుపెట్టింది. ‘ఇది నా మొదటి సవాల్. ఆ రోజు రాత్రే భారీ వర్షం. గుడిసెల్లోకి వరదలా వర్షం నీళ్లు. వంటపాత్రలతో ఆ నీళ్లు తోడి బయట పోయడం రాత్రంతా చేయాల్సి వచ్చింది. కానీ, విసుగనిపించలేదు. ఎందుకంటే నేను ఇక్కడే ఉండాలని నిర్ణయించుకుని వచ్చాను. ఎలాంటి ఘటనలు ఎదురైనా వెనక్కి వెళ్లేదే లేదు’ అనుకున్నాను అంటూ తన ప్రారంభ రోజులను గుర్తుచేసుకుంటారు సుధ. పేదరికంతోనేకాదు శతాబ్దాలనాటి కులతత్వంపై కూడా పోరాటానికి సిద్ధమవడానికి ప్రకృతే ఓ పాఠమైందని ఆమెకు అర్ధమైంది. ముసహర్లు తమజీవితంలోని ప్రతి దశలోనూ, ప్రాంతీయ వివక్షను ఎదుర్కొంటున్నారు. వారికి చదువుకోవడానికి అవకాశాల్లేవు. స్కూల్లోకి ప్రవేశం లేదు. సేద్యం చేసుకోవడానికి భూమి లేనివారు. పొట్టకూటికోసం స్థానికంగా ఉన్న పొలాల్లో కూలీ పనులు చేస్తుంటారు. ఈ సమాజంలోని బాలికలు, మహిళలు తరచు అత్యాచారం, లైంగిక వేధింపులకు గురవుతున్నారు. మొదటి పాఠశాల... ముసహర్ గ్రామంలో వారిని ప్రాధేయపడితే చదువు చెప్పడానికి అంగీకరించారు. బాలికలకు చదువు, కుట్లు, అల్లికలు నేర్పించడానికి ఆమె ప్రతిరోజూ పోరాటమే చేయాల్సి వచ్చేది. దశాబ్దాల పోరాటంలో 2005లో సామాజికంగా వెనుకబడిన సమూహాలకు చెందిన బాలికల కోసం ఓ రెసిడెన్షియల్ పాఠశాలను ఏర్పాటు చేసింది. ఆ తర్వాత నుంచి వెనకబడిన సమాజానికి చెందిన బాలికల కోసం అనేక రెసిడెన్షియల్ స్కూళ్లను నడుపుతోంది. ఆమె కృషిని అభినందిస్తూ 2006లో భారతప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. కుటుంబం నుంచి ఆరుగురు తోబుట్టువులలో పెద్ద కూతురుగా పుట్టిన సుధ కళల పట్ల ప్రేమతో స్కూల్లో నాటకాలు, నృత్యం, పాటల పోటీలలో పాల్గొనేది. పెద్ద కూతురిగా తల్లీ, తండ్రి, తాత, బామ్మలు ఆమెను గారాబంగా పెంచారు. ‘స్కూల్లో నేను చూసిన పేపర్లోని ఫొటోల దృశ్యాలు ఎన్ని రోజులైనా నా తలలో నుంచి బయటకు వెళ్లిపోలేదు. అందుకే నేను బీహార్ ముసహర్ సమాజం వైపుగా కదిలాను’ అని చెబుతారు ఈ 77 ఏళ్ల సామాజిక కార్యకర్త. ‘మొదటగా నేను తీసుకున్న నిర్ణయానికి మా అమ్మ నాన్నలు అస్సలు ఒప్పుకోలేదు. నేనేం చెప్పినా వినిపించుకోలేదు. కానీ, నా గట్టి నిర్ణయం వారి ఆలోచనలనూ మార్చేసింది’ అని తొలినాళ్లను గుర్తుచేసుకుంటారు ఆమె. బెదిరింపుల నుంచి... అమ్మాయిలకు చదువు చెప్పడానికి ముసహర్ గ్రామస్తులను ఒక స్థలం చూపించమని అడిగితే తాము తెచ్చుకున్న ధాన్యం ఉంచుకునే ఒక స్థలాన్ని చూపించారు. అక్కడే ఆమె బాలికల కోసం తరగతులను ప్రారంభించింది. ‘ఈ సమాజానికి ప్రధాన ఆదాయవనరు మద్యం తయారు చేయడం. మద్యం కొనుగోలు చేసేందుకు వినియోగదారులు వస్తుండటంతో యువతుల చదువుకు ఆటంకం ఏర్పడేది. దీంతో నేనుండే గుడిసెలోకి తీసుకెళ్లి, అక్కడే వారికి అక్షరాలు నేర్పించేదాన్ని. కుట్లు, అల్లికలు, ఎంబ్రాయిడరీ క్లాసులు కూడా తీసుకునేదాన్ని. రోజు రోజుకూ అమ్మాయిల సంఖ్య పెరుగుతోంది. వారిలో స్వయం ఉపాధి కాంక్ష పెరుగుతోంది. కానీ, అంతటితో సరిపోదు. వారి హక్కుల కోసం గొంతు పెంచడం అవసరం. తిరుగుబాటు చేస్తారనే ఆలోచనను గమనించిన కొందరు వ్యక్తులు బెదిరింపులకు దిగారు. చంపేస్తారేమో అనుకున్నాను. దీంతో అక్కణ్ణుంచి మరో చోటికి అద్దె ఇంటికి మారాను. కానీ, ఇలా భయపడితే నేననుకున్న సహాయం చేయలేనని గ్రహించాను. ఇక్కడి సమాజానికి అండగా ఉండాలని వచ్చాను, ఏదైతే అది అయ్యిందని తిరిగి మొదట నా జీవనం ఎక్కడ ప్రారంభించానో అక్కడికే వెళ్లాను’ అని చెబుతూ నవ్వేస్తారు ఆమె. ముసహర్ల కోసం సేవా బాట పట్టి ఆరు దశాబ్దాలు గడిచిన సుధి ఇప్పుడు వెనకబడిన సమాజపు బాలికల కోసం అనేక రెసిడెన్షియల్ స్కూళ్లను నడుపుతోంది. యువతులకు, మహిళలకు జీవనోపాధి కార్యక్రమాలను చేపడుతోంది. ఈ దళిత సంఘాలను అగ్ర కులాల సంకెళ్ల నుండి శక్తిమంతం చేస్తోంది. ఈమె శతమానం పూర్తి చేసుకోవాలని కోరుకుందాం. నైపుణ్యాల దిశగా.. సుధ వర్గీస్ ఏర్పాటు చేసిన ముసహర్ రెసిడెన్షియల్ పాఠశాలలోని బాలికలు చదువులోనే కాదు క్రీడల్లోనూ రాణిస్తున్నారు. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ మార్షల్ ఆర్ట్స్ పోటీలలో పతకాలను సాధించుకు వస్తున్నారు. ఇక్కడ నుంచి డాక్టర్లు, ఇంజినీర్లు, లాయర్లు, నాయకులు కావడానికి సన్నద్ధం అవుతున్నారు. ఈ సమాజంలోని మహిళలు బృందాలుగా కూరగాయలు పండిస్తూ జీవనోపాధిని మెరుగుపరుచుకుంటున్నారు. వీరు చేస్తున్న హస్తకళలను ప్రభుత్వ, ఉన్నతస్థాయి ఈవెంట్లలో ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ నుంచి చవకగా లభించే శానిటరీ న్యాప్కిన్లను తయారుచేస్తున్నారు. -
జీవితంలో ఒకటికాలేక.. మరణంతో ఒక్కటయ్యారు!
సాక్షి, చెన్నై: మేనమామ ఇంటికి కోడలిగా వెళ్లాలన్న ఓ యువతి ఆశలు అడియాశలయ్యాయి. తాను ఎంతగానో ప్రేమించిన మేనమామ కొడుకు ఆత్మహత్య చేసుకోవడంతో ఆ యువతి కూడా బలవన్మరణానికి పాల్పడింది. వీరి ప్రేమను ఇరు కుటుంబాలు అంగీకరించక పోవడంతో ఈ అఘాయిత్యాలకు పాల్పడినట్లు విచారణలో తేలింది. వివరాలు.. తిరునల్వేలి జిల్లా నాంగునేరికి చెందిన ఆర్ముగం , సరస్వతి దంపతులకు సుధా(22), ఉదయ శంకర్(20) అనే పిల్లలు ఉన్నారు. సుధా ఓ కళాశాలలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతోంది. తన మేనమామ పెరియస్వామి కుమారుడు సుబయ్య(24)ను ప్రేమించింది. సుబయ్య కూడా సుధను ఇష్టపడ్డాడు. ఇద్దరు చెట్టా పట్టాలు వేసుకుని తిరిగారు. అయితే వీరి ప్రేమకు కుటుంబ సభ్యులే అడ్డంకిగా మారారు. చదువుకునే వయస్సులో ప్రేమ వద్దంటూ వారించారు. దీంతో మనస్థాపం చెందిన సుబ్బయ్య బుధవారం రాత్రి పురుగుల మందు తాగేశాడు. ఆస్పత్రికి తరలించగా అర్ధరాత్రి సమయంలో మరణించాడు. ఈ సమాచారంతో సుధా తల్లడిల్లి పోయింది. జీవితంలో ఒకటి కాకున్నా, మరణంలోనైనా ఒక్కటి కావాలన్న నిర్ణయానికి వచ్చేసింది. గురువారం ఓ వైపు సుబయ్య మృతదేహానికి అంత్యక్రియలు జరగగా, మరో వైపు ఇంట్లో ఉరివేసుకుని సుధా ఆత్మహత్య చేసుకుంది. ఇంటికి వచ్చిన సుధా తల్లిదండ్రులు కుమార్తె మృత దేహాన్ని చూసి రోదించారు. ప్రేమను పక్కన పెట్టి చదువుకోవాలని సూచించినందుకు బలవన్మరణానికి పాల్పడి తమకు కడుపు కోత మిగిల్చారని వాపోయారు. చదవండి: (ప్రేమ జంట ఆత్మహత్య) ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
విడుదలకు సిద్ధమైన 'మాతృదేవోభవ'.. ఎప్పుడంటే ?
Matru Devo Bhava 2022 Movie Ready To Release In July: 1993లో వచ్చిన 'మాతృదేవోభవ' సినిమా ఏ రేంజ్లో హిట్టయిందో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. చిన్న పెద్దా అనే తేడా లేకుండా అంతా ఈ సినిమాకు కనెక్ట్ అయ్యారు. అన్ని వర్గాల ఆడియన్స్ నీరాజనం పలికారు. ఈ సినిమాలోని ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకుల చేత థియేటర్స్‌లోనే కన్నీళ్లు పెట్టించాయి. సంవత్సరాల తరబడి ఈ సినిమా థియేటర్స్‌లో ఆడటమే గాక ప్రతి ఒక్క ఫ్యామిలీని సినిమా హాలుకు తీసుకొచ్చింది. అయితే ఇన్నేళ్లకు మళ్లీ అదే రకమైన సెంటిమెంట్ కంటెంట్‌తో 'మాతృదేవోభవ' టైటిల్‌తో మరో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. శ్రీ వాసవి మూవీస్ బ్యానర్‌పై వస్తున్న చిత్రం 'మాతృదేవోభవ'. దీనికి ఓ అమ్మ కథ అనేది ట్యాగ్ లైన్. బలమైన ఫ్యామిలీ సబ్జెక్టుతో జూలై 1న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సినిమాలో సీనియర్ నటి సుధ టైటిల్ రోల్ పోషిస్తుండగా.. ఆమె భర్తగా సీనియర్ హీరో సుమన్ నటిస్తున్నారు. భర్త ప్రమాదంలో చనిపోవడంతో తన పిల్లలను సుధ ఏ విధంగా పెంచిందనే కథాంశంతో ఎమోషనల్ ఎలిమెంట్స్ జొప్పిస్తూ ఈ సినిమా రూపొందిస్తున్నారు. ఎంఎస్ రెడ్డి సమర్పిస్తున్న ఈ చిత్రానికి కె. హరనాథ్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాతో పతాంజలి శ్రీను, అమృత చౌదరి హీరో హీరోయిన్లుగా పరిచయం అవుతున్నారు. చదవండి: ఆ పాత్ర కోసం 15 రోజులు ఇంట్లో వాళ్లతో మాట్లాడలేదు: నటుడు వచ్చేస్తోంది 'చంద్రముఖి 2'.. సీక్వెల్‌పై అధికారిక ప్రకటన సెంటిమెంట్ ప్రధానంగా రాబోతున్న ఈ చిత్రానికి కెజెఎస్ రామా రెడ్డి కథ అందించగా చోడవరపు వెంకటేశ్వర రావు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మారుధూరి రాజా డైలాగ్స్ రాశారు. డైమండ్ వెంకట్ ఫైట్స్ కంపోజ్ చేశారు. అనంత శ్రీరాం, పాండురంగ రావు, దేవేందర్ రెడ్డి లిరిక్స్ రాశారు. ఈ చిత్రంలో సుధ, సుమన్, రఘు బాబు, పోసాని కృష్ణ మురళి లాంటి ప్రఖ్యాత తారాగణం నటించడం విశేషం. -
Sudha Menon: మిథాలి రాజ్ పీతల కూర.. ఇర్ఫాన్ పఠాన్ తల్లి చేసిన కిచిడి!
Sudha Menon- Recipes For Life Book: ‘ఆస్తి దస్తావేజులు ఒక తరం నుంచి ఇంకో తరానికి అందుతాయి... రుచుల దస్తావేజులు ఎందుకు అందవు’ అంటుంది సుధా మీనన్. ‘మా నానమ్మ ఫలానా కూర చేసేది’... ‘మా అమ్మమ్మ చేసే వేపుడు రుచే వేరు’ ‘మా అమ్మతో పాటుగా ఆ టేస్టే పోయింది’... లాంటి మాటలు ప్రతి ఇంట్లో వినిపిస్తాయి. ఎందుకు వీరంతా తమ విలువైన రెసిపీలను రాసి ఇంకో తరానికి అందించరు? అంటుందామె. తన తల్లి చిన్నప్పుడు తిన్న వంటలతో మొదలెట్టి దేశంలోని ఎందరో సెలబ్రిటీలు తమ బాల్యంలో ఇంట్లో ఇష్టపడి తినే వంటలను తెలుసుకుని పుస్తకంగా రాసింది. విలువైన దస్తావేజుగా మలిచింది. ఆమె చేసిన పని మెచ్చుకోలు పొందుతోంది. దేశంలోని ముప్పై మంది సెలబ్రిటీలు తమ బాల్యంలోకి వెళ్లి, తమ తల్లుల చేతి వంటను తలుచుకుని, వారికి ఇష్టమైన పదార్థపు రెసిపీని పాఠకులతో పంచుకుంటే ఎలా ఉంటుంది? రచయిత్రి సుధా మీనన్ రాసిన ‘రెసిపీస్ ఫర్ లైఫ్’ చదివితే తెలుస్తుంది. నాలుగేళ్ల పాటు ప్రయత్నించి సుధా మీనన్ రాసిన ఈ పుస్తకాన్ని పెంగ్విన్ వెలువరిస్తే ప్రఖ్యాత వంటగాడు వికాస్ ఖన్నా ముందు మాట రాశాడు. ఈ పుస్తకంలో తమకు నచ్చిన ఇంటి వంటలను పంచుకున్న సెలబ్రిటీలలో మేరీ కోమ్, సుహాసిని, ఆమిర్ ఖాన్, విద్యా బాలన్, ఇర్ఫాన్ పఠాన్ తదితరులు ఉన్నారు. దేశంలోని అన్ని నైసర్గిక ప్రాంతాలు కవర్ అయ్యేలా వేరు వేరు చోట్లకు చెందిన సెలబ్రిటీలను సుధా మీనన్ ఎంచుకోవడం వల్ల భిన్న రుచుల భారతదేశాన్ని ఈ పుస్తకంలో దర్శించవచ్చు. ఈ పుస్తకం ఐడియా ఎలా వచ్చింది? గతంలో నాలుగు పుస్తకాలు రాసి స్త్రీలను రచనలో ప్రోత్సహించే సంస్థను నడుపుతున్న సుధా మీనన్ నాలుగేళ్ల క్రితం లండన్‌లో ఉండగా ఈ ఐడియా వచ్చింది. ‘అప్పుడు మా అమ్మ నాతోనే ఉంది. మా నాన్న పోయిన విషాదంలో ఆమె నోరు విప్పేది కాదు. ఒకరోజు అమ్మా.. చిన్నప్పుడు అమ్మమ్మ ఏం వండేది... ఇంట్లో ఏమేమి తినేవారు అని అడగ్గానే ఆమె కళ్లల్లో మెరుపు వచ్చింది. వంటల కబుర్లు చెప్పడం మొదలెట్టింది. ఆ సమయంలోనే మా అత్తగారు పోయారు. ఆమె చాలా బాగా వంట చేసేది. ఆమె పోవడంతో ఆమె రెసిపీలన్నీ అంతర్థానం అయ్యాయి. ఇలా ఎంతోమంది అమ్మల, అమ్మమ్మల వంటలు రికార్డు అయ్యి తర్వాతి తరాలకు అందాలనుకుని... సామాన్యుల కంటే కూడా సెలబ్రిటీలను ఎంచుకుంటే పాఠకాసక్తి ఉంటుందని పని మొదలెట్టాను’ అంటుంది సుధా మీనన్. ఆమె కొన్ని రోజులు నేరుగా ఇంటర్వ్యూలు చేసి లాక్డౌన్ కాలంలో ఫోన్ ద్వారా మిగిలిన పని పూర్తి చేసింది. కోపి బూట్... చుకన్దార్ గోష్ ఇంటర్వ్యూలో సుధా మీనన్ తల్లి ప్రస్తావన తేగానే అందరూ ఎన్నో కబుర్లు చెప్పేవారు. ఆమిర్ ఖాన్ తన తల్లి చేసే ‘చుకన్దార్ గోష్’ గురించి మాట్లాడితే మేరి కోమ్ తన చిన్నప్పుడు ఇంట్లో అమ్మ చేసిన ‘కోపి బూట్’ గురించి చెప్పింది. విద్యా బాలన్ వాళ్లమ్మ చేసే ‘అడయి’, ‘పోడి’ గురించి చెప్పింది. నటి సుహాసిని తన తల్లి చేసే సాంబార్ గురించి మాట్లాడితే మన మిథాలి రాజ్ పీతల కూర రుచిని చెప్పి తెలుగు ఘుమఘుమలను యాడ్ చేసింది. కదిలించిన ఇర్ఫాన్ పఠాన్ ఈ పుస్తకం కోసం ఇంటర్వ్యూల్లో భాగంగా ఇర్ఫాన్ పఠాన్‌కు ఫోన్ చేసింది. చిన్నప్పుడు మీ అమ్మ చేసిన వంటల్లో మీకేది ఇష్టం అని అడిగింది. దానికి ఒక నిమిషం సమయం తీసుకున్నాడు ఇర్ఫాన్. ఆ తర్వాత అన్నాడు– ‘అన్ని వంటలు చేసుకునే డబ్బులు మాకు లేవండి. రోజూ మా అమ్మ కిచిడి, ఆలుగడ్డ కూర చేసేది. అవే చీప్‌గా వచ్చేవి అంతో ఇంతో కడుపు నింపేవి. మాకు డబ్బులున్న రోజు ధనియాలు కొనేది అమ్మ. అప్పుడు ధనియాల పచ్చడి చేసేది. అదే మాకు పెద్ద లగ్జరీ’ అని చెప్పాడు. ఆ జవాబు సుధా మీనన్‌ను బాగా కదిలించింది. అందరూ సొంతగా రికార్డు చేయాలి భారతదేశంలో ప్రతి స్త్రీ, వంట అభిరుచి ఉన్న పురుషుడు తరాలుగా ఎన్నో వంటలను తీర్చిదిద్దారు. ఎలా చేస్తే పాకంలో రుచి వస్తుందో తెలుసుకున్నారు. ఆ జ్ఞానం వారితోనే పోకూడదు. సుధా మీనన్‌లా ప్రతి ఇల్లు ఒక చిన్న నోట్‌బుక్‌తో కొన్ని వంటలనైనా రికార్డు చేసుకుంటే ఆ రుచులు కొనసాగుతాయి. తమ రుచులను కాపాడుకున్నామన్న సంతృప్తిని ఇస్తాయి. ఆ పని చేద్దాం. చదవండి👉🏾Vitamin B12: విటమిన్ బి 12 లోపం లక్షణాలివే! వీటిని తిన్నారంటే.. -
నటి శ్రీసుధ కేసు: సుప్రీం కోర్టులో శ్యామ్ కె. నాయుడికి ఊరట
సాక్షి, న్యూఢిల్లీ: సినీ నటి శ్రీసుధపై వేధింపుల కేసులో టాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కె. నాయుడికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. తెలంగాణ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ నాయుడు బెయిల్ రద్దు చేయాలంటూ శ్రీసుధ వేసిన పిటిషన్‌ను శుక్రవారం సుప్రీం ధర్మాసనం కొట్టివేసింది. కాగా తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఐదేళ్లు సహజీవనం చేసి శ్యామ్ కె.నాయుడు మోసం చేశాడంటూ శ్రీసుధ గతంలో హైదరాబాద్‌లోని ఎస్ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. శ్యామ్ కె.నాయుడుతో తనకు ప్రాణహాని ఉందని.. ఆయన బెయిల్ రద్దు చేయాలని శ్రీసుధ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తాజాగా ఈ కేసులో శ్యామ్ కె. నాయుడికి ఊరటనిస్తూ ధర్మాసనం తీర్పునిచ్చింది. చదవండి: (సుందరం మాస్టర్‌పై నటి సుధ సంచలన వ్యాఖ్యలు, సెట్లో అందరి ముందే..) -
సుందరం మాస్టర్‌పై నటి సుధ సంచలన వ్యాఖ్యలు, సెట్లో అందరి ముందే..
Actress Sudha Sensational Comments On Sundaram Master: సీనియర్ నటి సుధ ప్రముఖ కొరియోగ్రాఫర్, ప్రభుదేవ తండ్రి సుందరం మాస్టర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ ఓ మూవీ సెట్లో ఆయన తనని ఘోరంగా అవమానించారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘తమిళంలో ఓ సినిమా పాటను షూట్ చేస్తున్న సమయంలో సుందరం మాస్టర్ నాతో డ్యాన్స్ మూమెంట్స్ చేయిస్తున్నారు. అయితే అవి నాకు అర్థం కాకపోవడంతో ఐదుకు పైగా టేకులు తీసుకున్నాను. దీంతో ఆయన కోపంతో నాపై అందరి ముందే అరిచారు. చదవండి: దర్శకుడు మోసం చేశాడు, ఆ ఫొటోలు నా జీవితానికి మచ్చ తెచ్చాయి: నటి అంతేకాదు నాపై అనుచిత వ్యాఖ్యలు కూడా చేశారు. ‘నువ్వు వ్యభిచారానికి కూడా పనికి రావు’ అంటూ అనకుడని మాట అన్నారు’ అని చెప్పుకొచ్చారు. ఇక ఆయన మాటలు భరించలేకపోయానని, ఆ సమయంలో ప్రభు, పి.వాసు సహా పలువురు పెద్దలు సెట్లో ఉన్నారని ఆమె పేర్కొన్నారు. దీంతో ఏడుస్తూ ఇంటికి వెళ్లానని, ఈ విషయం తన తల్లికి చెప్పుకుని బాధపడ్డానంటూ ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న ఆర్టిస్టు అయినా, పెద్ద ఆర్టిస్టు అయినా నటీనటులను అలా అనడం తప్పని, ఆయన నాపై వాడకూడని పదాలు వాడారంటూ సుధ వాపోయారు. చదవండి: బాబోయ్ ఇలియాన సాహసం, అలాంటి ఫొటో షేర్ చేసిందేంటి! ఇక ఎప్పటికీ ఆయన సినిమాల్లో నటించకూడదని నిర్ణయించుకున్నన్నారు. అయితే ఓ రోజు ఆయన దర్శకత్వం వహిస్తున్న ఓ సినిమాలో తల్లి పాత్ర కోసం సుందరం మాస్టర్ తనని కలిశారని, ఆయనని చూడగానే సినిమా చేయనని చెప్పానన్నారు. కానీ ఆయన తనను అన్న వ్యాఖ్యలకు పశ్చాత్తాపపడ్డారని, అందుకు క్షమాపణలు చెప్పేందుకు వచ్చినట్లు సుందరం మాస్టర్ తనతో అన్నట్లు చెప్పారు. ఆయన క్షమాపణలు చెప్పాగానే ఆయన సినిమా చేసేందుకు ఓకే చెప్పానని తెలిపింది. ఆ సినిమా షూటింగ్ సమయంలో రెండు పేజీల డైలాగ్ ఫస్ట్ షాట్‌కే చెప్పడంతో ఆయనే స్యయంగా వచ్చి ప్రశంసించడమే కాకుండా, అందరి ముందు అవమానించినందుకు క్షమాపణలు కూడా కోరారని నటి సుధ వెల్లడించారు. -
ఇది నా సినిమా అని గర్వంగా చెప్పుకుంటా: సుధ
సీనియర్ నటి సుధ టైటిల్ రోల్ చేసిన చిత్రం ‘మాతృ దేవోభవ’. ‘ఓ అమ్మ కథ’ ఉపశీర్షిక. పతంజలి శ్రీనివాస్, అమృతా చౌదరి ïహీరో హీరోయిన్లు. కె. హరనాథ్ రెడ్డి దర్శకత్వంలో చోడవరపు వెంకటేశ్వర రావు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 18న విడుదలవుతోంది. ఈ సందర్భంగా సుధ మాట్లాడుతూ.. ‘‘ఇది నా సినిమా అని నేను గర్వంగా చెప్పుకునేలా ‘మాతృ దేవోభవ’ ఉంటుంది.ఫస్ట్ టైమ్ డైరెక్టర్ హరనాధ్ రెడ్డి, ఫస్ట్ టైమ్ ప్రొడ్యూసర్స్ చోడవరపు వెంకటేశ్వరావు-ఎమ్.ఎస్.రెడ్డిలకు చాలా మంచి పేరు తెస్తుంది. ఇందులో నటించిన, ఈ చిత్రానికి పనిచేసిన ప్రతి ఒక్కరూ మనసు పెట్టి పనిచేశారు. సకుటుంబ సమేతంగా చూడదగ్గ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిన "మాతృదేవోభవ" మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’అన్నారు. నిర్మాతలు చోడవరపు వెంకటేశ్వరావు-ఎమ్.ఎస్.రెడ్డి మాట్లాడుతూ... "మాతృదేవోభవ" వంటి మంచి సినిమాతో నిర్మాతలుగా పరిచయమవుతుండడం అదృష్టంగా భావిస్తున్నామని, సుధ గారి కెరీర్ లో ఈ చిత్రం ఓ కలికితురాయిగా నిలుస్తుందని, ఈనెల 18న ప్రపంచవ్యాప్తంగా "మాతృదేవోభవ" చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని పేర్కొన్నారు. హీరో పతంజలి శ్రీనివాస్, ముఖ్యపాత్రధారులు జెమిని సురేష్, చమ్మక్ చంద్ర, శ్రీహర్ష, కీర్తి, సత్యశ్రీ... "మాతృదేవోభవ" సినిమాలో నటించే అవకాశం లభించడం పట్ల సంతోషం వ్యక్తం చేసి, ఈ చిత్రం కచ్చితంగా పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందన్నారు. -
ఒంటరి జీవితం, వాళ్లకు నాలాంటి పరిస్థితే వస్తుంది: నటి సుధ కంటతడి
ఎన్నో వందలాది చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది నటి సుధ. బాలనటిగా అలరించిన ఆమె పద్నాలుగేళ్ల వయసులోనే హీరోయిన్‌గానూ మారింది. ఆ తర్వాత అత్తగా, అమ్మగా, వదినగా ఇలా ఎన్నో పాత్రల్లో ఒదిగిపోయి ప్రేక్షకులకు మరింత దగ్గరైంది సుధ. తాజాగా ఆమె తన జీవితంలోని ఒడిదుడుకులను కళ్లకు కట్టినట్లు వివరించింది. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. 'ఇన్నేళ్ల కెరీర్లో చాలా సంపాదించుకున్నాను, కానీ బిజినెస్‌లు పెట్టి ఉన్నదంతా పోగొట్టుకున్నాను. ఢిల్లీలో ఒక హోటల్ పెట్టినప్పుడు లాభం వస్తే దాంతో మరో హోటల్ పెట్టాను. అప్పుడు నష్టాలొచ్చి నిండా మునిగాను. కొన్నాళ్లపాటు నేను హైదరాబాద్‌లోనే ఉన్నాను. కానీ కుటుంబ సమస్యలు, అమ్మాయి పెళ్లి ఉండటంతో చెన్నైకి మారాల్సి వచ్చింది. అబ్బాయి యూఎస్‌లో ఉన్నాడు.' 'చిన్నప్పుడే అమ్మ హార్ట్ ఎటాక్‌తో చనిపోయింది. ఆమె పోయిన తర్వాత కొడుకులున్నా నాన్నకు సపోర్ట్ లేకుండా పోవడంతో ఆయనని నేనే చూసుకున్నాను. నాన్నకు బాగానే ఆస్తుపాస్తులు ఉండేవి. కానీ క్యాన్సర్ వల్ల అది కరిగిపోయింది. అమ్మ పోయినప్పుడు కూడా అంత బాధపడలేదు, కానీ నాన్న పోయాక లైఫ్ అంటే ఏంటో తెలిసొచ్చింది. ఒంటరి జీవితాన్ని గడుపుతున్నాను. మనుషుల్ని నమ్మకూడదని అర్థమైంది. నాన్నకు క్యాన్సర్ అనగానే బంధువులంతా దూరం పెట్టారు.. వీటినుంచి నేను చాలా గుణపాఠాలు నేర్చుకున్నాను. నా భర్త, కొడుకులు కూడా నాకు దూరంగా ఎక్కడో యూఎస్‌లో ఉన్నారు. కానీ వాళ్లకూ నాలాంటి పరిస్థితే వస్తుంది. మాతృదేవోభవ సినిమాలోని చాలా సంఘటనలు నా నిజ జీవితంలో జరిగినవే..' అంటూ కన్నీళ్లు పెట్టుకుంది సుధ. -
మ్యాగజైన్ స్టోరీ 02 november 2021
-
బద్వేలు ఉపఎన్నికలో వైఎస్ఆర్ సీపీ చారిత్రాత్మక విజయం
-
Badvel By Election: ఓటింగ్ శాతం పెరగాలి: సీఎం జగన్
సాక్షి, అమరావతి: బద్వేలు ఉప ఎన్నికలో ఓటింగ్ శాతం పెరగాలని, ఓటు వేసేలా ఓటర్లను ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఎక్కడా అతి విశ్వాసం ఉండకూడదని, కష్టపడి ప్రజల ఆమోదం పొందాలని స్పష్టం చేశారు. 2019లో 77 శాతం ఓటింగ్ జరిగిందని, ఇప్పుడు అంత కంటే ఎక్కువగా ఓటింగ్ శాతం పెరగాలన్నారు. బద్వేలు ఉప ఎన్నిక నేపథ్యంలో పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలతో గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దివంగత ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య భార్య సుధ కూడా డాక్టర్ అని, మన పార్టీ తరఫున ఆమెను అభ్యర్థిగా నిలబెడుతున్నామని ప్రకటించారు. బద్వేలు నియోజకవర్గ బాధ్యతలన్నీ ఇక్కడున్న (సమావేశంలో పాల్గొన్న) వారందరిమీదా ఉన్నాయని స్పష్టం చేశారు. నామినేషన్ కార్యక్రమానికి అందరూ హాజరు కావాలని ఆదేశించారు. 2019లో వెంకసుబ్బయ్యకు వచ్చిన 44 వేలకుపైగా ఓట్ల మెజార్టీ కన్నా.. డాక్టర్ సుధకు ఇప్పుడు ఎక్కువ మెజార్టీ రావాలని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో సీఎం ఏమన్నారంటే.. ప్రతి సామాజిక వర్గాన్ని కలుపుకుపోవాలి ► ఉప ఎన్నికలో ప్రతి సామాజిక వర్గాన్ని కలుపుకుపోవాలి. ప్రతి మండలాన్ని బాధ్యులకు అప్పగించాలి. గ్రామ స్థాయి నాయకులతో కలిసి ప్రచారం నిర్వహించాలి. ► ఒక్కో ఇంటికి కనీసం మూడు నాలుగు సార్లు వెళ్లి వారిని అభ్యర్థించాలి. వారు పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేసేలా చైతన్య పరచాలి. నెల రోజుల పాటు మీ సమయాన్ని కేటాయించి, ఈ ఎన్నికపై దృష్టి పెట్టాలి. ► బద్వేలు ఉప ఎన్నికకు పార్టీ ఇన్ఛార్జిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉంటారు. వచ్చే సోమవారం నుంచి పార్టీ తరఫున కార్యక్రమాలు మొదలు పెట్టాలి. మన ప్రభుత్వం వచ్చాక ప్రజలకు ఎలాంటి మేలు జరిగిందో తెలియజేయాలి. ► ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి (మైనార్టీ వ్యవహారాలు) అంజాద్ బాషా, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని), ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ ఈ ఏడాది మార్చిలో బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య అనారోగ్యంతో మృతి చెందడంతో ఉప ఎన్నిక జరుగుతోంది. ఇందుకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం షెడ్యూల్ విడుదల చేసింది. శుక్రవారం (నేడు) నోటిఫికేషన్ జారీ కాగానే, నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. అక్టోబర్ 8వ తేదీ నామినేషన్ల దాఖలుకు తుది గడువు. 11న నామినేషన్ల పరిశీలన, 13న ఉప సంహరణకు గడువుగా నిర్ణయించారు. అక్టోబర్ 30న పోలింగ్ నిర్వహిస్తారు. నవంబర్ 2న ఓట్ల లెక్కింపు ఉంటుంది. -
యువతరం మెచ్చే అంశాలతో ‘మాతృదేవోభవ’
శ్రీవాసవి మూవీస్ పతాకంపై కె.హరనాథ్ రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ చోడవరపు వెంకటేశ్వరావు నిర్మాతగా అరంగేట్రం చేస్తున్న చిత్రం ‘మాతృదేవోభవ’. 'ఓ అమ్మ కథ' అన్నది ఉప శీర్షిక. సీనియర్ నటి సుధ తన కెరీర్ లో తొలిసారి టైటిల్ రోల్ ప్లే చేస్తున్న ఈ చిత్రం ద్వారా పతంజలి శ్రీనివాస్-అమృతా చౌదరి హీరోహీరోయిన్లుగా పరిచయమవుతున్నారు. ప్రముఖ రచయిత మరుదూరి రాజా సంభాషణలు సమకూర్చిన ఈ చిత్రంలో సుమన్, రఘుబాబు, పోసాని, చమ్మక్ చంద్ర ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. షూటింగ్ తోపాటు పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం గురించి దర్శకుడు కె.హరనాథ్ రెడ్డి మాట్లాడుతూ... ‘ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న కొన్ని అవమానవీయ సంఘటనలకు అద్దం పడుతూ ప్రముఖ రచయిత కె.జె.ఎస్.రామారెడ్డి (సితారె) రాసిన కథతో ఈ చిత్రాన్ని రూపొందించాం. భర్తను కోల్పోయి పిల్లల కోసమే బ్రతికి, వాళ్ళను ప్రయోజకులుగా తీర్చిదిద్దిన ఓ మాతృమూర్తికి పిల్లల వల్ల ఎదురైన చేదు సంఘటనల సమాహారమే మా "మాతృదేవోభవ". సుధ గారి అభినయం, మరుదూరి రాజా సంభాషణలు ఈ చిత్రానికి ఆయువుపట్టుగా నిలుస్తాయి. హీరో హీరోయిన్లుగా పరిచయమవుతున్న పతంజలి శ్రీనివాస్-అమృతా చౌదరి చాలా బాగా చేశారు. యువతరం మెచ్చే అంశాలు కూడా "మాతృదేవోభవ"లో పుష్కలంగా ఉన్నాయి. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. త్వరలోనే సెన్సార్ చేయిస్తాం. మా నిర్మాత చోడవరపు వెంకటేశ్వరావు గారికి చక్కని శుభారంభం ఇచ్చే చిత్రమవుతుంది" అన్నారు. సూర్య, జెమిని సురేష్, శ్రీహర్ష, సత్యశ్రీ, సోనియా చౌదరి, అపూర్వ, కీర్తి, జబర్దస్త్ అప్పారావు, షేకింగ్ శేషు తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సంగీతం: జయసూర్య, సమర్పణ: ఎం.ఎస్.రెడ్డి, నిర్మాత: చోడవరపు వెంకటేశ్వరావు, స్క్రీన్ ప్లే-డైరెక్షన్: కె.హరనాథరెడ్డి. -
నాపై హత్యాయత్నం చేశారు: నటి శ్రీసుధ
సాక్షి, కృష్ణాజిల్లా: నటి శ్రీ సుధ విజయవాడ పోలీసులను ఆశ్రయించారు. కనకదుర్గ ఫ్లైఓవర్‌పై తన కారును గుద్దిన దుండగులు హత్యాయత్నానికి ఒడిగట్టారని ఫిర్యాదు చేశారు. సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కె. నాయుడుపై తనకు అనుమానం ఉందని పోలీసులకు తెలిపారు. కాగా తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి అయిదేళ్లు సహజీవనం చేసి శ్యామ్ కె.నాయుడు మోసం చేశాడంటూ శ్రీసుధ గతంలో హైదరాబాద్‌లోని ఎస్ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేసు ఉపసంహరించుకోవాల్సిందిగా తనను బెదిరించాడని, దీంతో తనకు అతడి వల్ల ప్రాణహాని ఉందంటూ మరోసారి పోలీసులను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ కేసుకు, విజయవాడ ఘటనకు సంబంధం ఉందంటూ విజయవాడ వన్ టౌన్ పోలీస్ స్టేషనులో శ్రీసుధ గురువారం ఫిర్యాదు చేశారు. తనను హత్యచేసే క్రమంలో భాగంగానే యాక్సిడెంట్ చేయించి ఉంటాడంటూ శ్యామ్ కె. నాయుడిపై సందేహం వ్యక్తం చేశారు. ఇక శ్యామ్ కె. నాయుడుపై హైదరాబాద్‌లో పెట్టిన కేసు దర్యాప్తు కోసం ఎస్ఆర్ నగర్ సీఐ మురళీకృష్ణ తన దగ్గర డబ్బులు వసూలు చేశారని ఆమె ఆరోపించిన సంగతి తెలిసిందే. అంతేకాక ఈ కేసులో నిందితుడు, తనతో రాజీ కుదుర్చుకున్నట్లు నకిలీ పత్రాలు సృష్టించారని ఆరోపించారు. ఈ మేరకు నాంపల్లిలోని ఏసీబీ అధికారులకు ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. చదవండి: అనూష కేసు: రెండేళ్లు గా వేధిస్తున్నాడు! -
శ్యామ్ కే నాయుడిపై మోసం కేసు
సాక్షి, హైదరాబాద్: పెళ్లి పేరుతో తనను మోసం చేశాడని సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కే నాయుడుపై సినీ ఆర్టిస్ట్ సాయి సుధ ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఎస్ఆర్నగర్ పోలీసులు శ్యామ్ కే నాయుడిని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. ఐదేళ్ల నుంచి శ్యామ్‌తో సహజీవనం చేస్తున్నానని, ఈ విషయం శ్యామ్ సోదరుడు చోటా కే నాయుడికి తెలుసునని సాయిసుధ తెలిపారు. పెళ్లిచేసుకోమని గట్టిగా అడిగితే తనను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నారని చెప్పారు. శ్యామ్‌తో తాను మాట్లాడిన ఫోన్ సంభాషణల రికార్డ్స్ ఉన్నాయని వెల్లడించారు. ఇంట్లో సమస్యలు ఉన్నాయని చెప్పి తనకు శ్యామ్ దగ్గరయ్యాడని అన్నారు. చాలాసార్లు కేసు పెట్టడానికి ప్రయత్నించినా తనను చోటా కే నాయుడు వారించారని, ఇప్పుడేమో కేసు పెట్టుకుంటే పెట్టుకో అంటున్నారని వాపోయారు. తనకు న్యాయం చేయాలని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో సాయి సుధ కోరారు. కాగా, పోకిరీ, దేశముదురు, సూపర్, బిజినెస్‌మాన్ తదితర సినిమాలకు శ్యామ్ కే నాయుడు కెమెరామన్‌గా పనిచేశారు. 2017లో టాలీవుడ్లో సంచలనం రేపిన హైదరాబాద్ డ్రగ్స్ కేసులో కేసులోనూ ఆయన పేరు వినిపించింది. ప్రత్యేక దర్యాప్తు సంస్థ(సిట్) అధికారులు 10 గంటలకు పైగా ఆయనను ప్రశ్నించారు. ఎవడే సుబ్రమణ్యం సినిమాతో గుర్తింపు పొందిన సాయి సుధ.. విజయ్ దేవరకొండ ‘అర్జున్‌రెడ్డి’లో కీలకపాత్ర పోషించారు. (రాకేష్ మాస్టర్‌పై మాధవీలత ఫైర్) -
తహసీల్దార్ సుధను అరెస్టు చేశాం
సాక్షి, సిటీబ్యూరో: చిట్టీల పేరుతో చీటింగ్ చేసి చిక్కిన తహసీల్దార్ లింగాల సుధ అరెస్టు విషయాన్ని హైదరాబాద్ నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) అధికారులు యాదాద్రి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ మేరకు కేసు దర్యాప్తు అధికారిగా ఉన్న ఏసీపీ జి.వెంకటేశ్వర్లు గురువారం లేఖ రాశారు. ఈమె తన సమీప బంధువులతో పాటు మరికొందరితో కలిసి సనత్‌నగర్ కేంద్రంగా అక్రమంగా చిట్టీల దందా నిర్వహించడంతో పాటు రూ.2 కోట్లు స్వాహా చేసిన కేసులో అరెస్టైన విషయం విదితమే. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి అరెస్టై, 48 గంటలకు మించి రిమాండ్‌లో ఉంటే వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రాథమికంగా సంబంధిత శాఖాధిపతి సదరు ఉద్యోగిపై సస్పెన్షన్ వేటు వేస్తారు. ఇందుకుగాను పోలీసులు అరెస్టుకు సంబంధించి అధికారిక సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. యాదాద్రి జిల్లా డిజాస్టర్ మేనేజ్మెంట్ విభాగంలో తహశీల్దార్‌గా పని చేస్తున్న సుధను సీసీఎస్ పోలీసులు బుధవారం అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. న్యాయస్థానం 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో చంచల్గూడలోని మహిళా జైలుకు పంపారు. శుక్రవారంతో సుధ 48 గంటల పాటు జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న నేపథ్యంలో సీసీఎస్ పోలీసులు యాదాద్రి కలెక్టర్‌కు ఈ విషయం తెలియపరుస్తూ లేఖ రాశారు. మరోపక్క ఈ స్కామ్‌లో నిందితుల చేతిలో మోసపోయిన వారిలో అత్యధికులు ప్రభుత్వ ఉద్యోగులు, పదవీ విరమణ చేసిన వారే ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది సుధ ప్రోద్బలంతోనే చిట్టీలో సభ్యులుగా చేరినట్లు పోలీసులు చెబుతున్నారు. మరోపక్క చిట్టీలు పాడుకున్న వారిలో కొందరికి డబ్బు చెల్లించడానికి ముఠా సభ్యులు చెక్కులు జారీ చేశారు. ఈ ఖాతా సైతం సుధతో పాటు మరో నిందితుడి పేరుతో ఉన్న జాయింట్ ఖాతా కావడం గమనార్హం. వీరు చిట్టీ పాడుకున్న వారిలో కొందరికి నగదు ఇవ్వకుండా నెలకు నూటికి రూ.2 వడ్డీ ఇస్తామంటూ తమ వద్దే డిపాజిట్‌గా ఉంచుకున్నారు. దీంతో ఈ కేసులో సీసీఎస్ పోలీసులు డిపాజిట్‌దారుల పరిరక్షణ చట్టంలోని సెక్షన్లను సైతం పొందుపరిచారు. వీటి ప్రకారం నమోదైన కేసుల్లో నిందితుల ఆస్తుల్ని స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే సుధతో పాటు ఇతరుల పేర్లతో సిటీ, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న కొన్ని స్థిరాస్తులను గుర్తించిన సీసీఎస్ పోలీసులు వాటి జాబితా రూపొందించారు. వీటిని సీజ్ చేయడానికి అను మతి కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాయాలని నిర్ణయించారు. సర్కారు అనుమతితో సీజ్ చేసిన తర్వాత ఆ జాబితాలను కోర్టుకు సమర్పిస్తామని, ఇతర చర్యల తర్వాత న్యాయస్థానం వాటిని వేలం లో విక్రయించడం ద్వారా వచ్చిన మొత్తాన్ని బా«ధితులకు పంచుతుందని అధికారులు తెలిపారు. -
దళితుల కోసం జీవితం అంకితం
‘ఒట్టి మాటలు కట్టిపెట్టి గట్టి మేలు తలపెట్టవోయ్’ అనే మాటను ఆచరణాత్మకంగా చేసి చూపారు సుధావర్గీస్. నారీ గుంజాన్ స్వచ్ఛంద సంస్థను స్థాపించి దళితులకు తన జీవితాన్ని అంకితం చేశారు. వారి వికాసం కోసం ఒకవైపు పాటుపడుతూనే మరోవైపు వారి హక్కుల సాధనే శ్వాసగా జీవనం సాగిస్తున్నారు. కేరళలోని కొట్టాయంకు చెందిన సుధా వర్గీస్ మూడు దశాబ్దాల కిందట బిహార్‌లో స్థిరపడ్డారు. ఈ రాష్ట్రంలో ముసహరాలుగా పిలిచే దళితుల వికాసమే లక్ష్యంగా ఆమె పని చేస్తున్నారు. యుక్తవయస్సులో ఉండగా బిహార్‌కు వెళ్లిన సుధకు అక్కడి కులవ్యవస్థ గురించి తెలిసింది అంతంతమాత్రమే. ఆరంభంలో ఆమెకు ఎన్నో అవాంతరాలు, ఇబ్బందులు ఎదురయ్యాయి. అయినా వాటిని లెక్కచేయలేదు. భాష అర్థమవకపోవడంతో పట్టుదలతో మెల్లమెల్లగా నేర్చుకున్నారు. ముసహరాల హక్కులను కాపాడాలనే లక్ష్యంతో న్యాయవాద డిగ్రీ చదివారు. దీంతో న్యాయపరమైన అడ్డంకులను అధిగమించడం ఆమెకు మరింత సులువైంది. ఆ తర్వాత ముసహరాల సాధికారత కోసం చెమటోడ్చారు. 1987లో నారీ గుంజాన్ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. దళిత మహిళలకు వారి హక్కులపై అవగాహన కల్పించారు. 2005లో పట్నా శివారులోని దానాపూర్‌లో దళిత బాలికల కోసం ప్రత్యేకంగా ఓ పాఠశాల నెలకొల్పారు. దానికి ప్రేరణ అని నామకరణం చేశారు. ఆర్థిక సమస్యల కారణంగా కూలీకి వెళుతున్న బాలికలకు ఉచితంగా విద్యాబోధన చేశారు. నారీ గుంజాన్ సంస్థ ప్రస్తుతం బిహార్‌లోని ఐదు జిల్లాల్లో పనిచేస్తోంది. ఈ సంస్థ ఆధ్వర్యంలో 850 స్వయం సహాయక బృందాలు పనిచేస్తున్నాయి. ఈ గ్రూపులు అంగన్వాడీ పాఠశాలలనూ నడుపుతున్నాయి. వయోజన విద్యా కార్యక్రమాలను చేపడుతున్నాయి. ఆమె అంకితభావం గురించి తెలియడంతో ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ గయలోనూ ఇలాంటి పాఠశాలను నెలకొల్పాల్సిందిగా కోరారు. దానాపూర్, గయల్లోని రెండు పాఠశాలల్లో ప్రస్తుతం మూడు వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. మరోవైపు నారీ గుంజాన్ సంస్థ యువతకు సంగీతం, క్రీడలు, నాట్యం, కళలు వంటి అంశాలపై శిక్షణ ఇచ్చింది. ఆయా విభాగాల్లో తర్ఫీదు పొందిన యువతీయువకులు దేశ, విదేశాల్లో నిర్వహించిన అనేకపోటీల్లో పాల్గొని సత్తా చాటారు. సుధ 2006లో అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం నుంచి పద్మశ్రీ పురస్కారం పొందారు. ‘ఏదో ఒకటి చేయాలనిపించింది’ ఈ విషయమై సుధ మాట్లాడుతూ ‘ముసహరాలతో పరిచయమయ్యేదాకా అస్పృశ్యత, వివక్ష అనే పదాలు నాకు కొత్త. వారికి ఏదో ఒకటి చేయాలనిపించింది. దీంతో వారి ఇళ్ల వద్దే నివాసం ఏర్పరుచుకున్నా. వారి హక్కుల కోసం పోరాడుతున్నా. వారి అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తూనే ఉంటా’ అని అన్నారు. –సాక్షి, స్టూడెంట్ ఎడిషన్ -
ఆర్బీఐ తొలి సీఎఫ్ఓగా సుధా బాలకృష్ణన్
సాక్షి, న్యూఢిల్లీ : భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) కీలక నియామకాన్ని చేపట్టింది. తన మొట్టమొదటి చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్(సీఎఫ్‌వో) సుధ బాలకృష్ణన్‌ను నియమించింది. మే 15 న సెంట్రల్ బ్యాంకులో చేరగా, ఆమె పదవీ మూడు సంవత్సరాలు ఉండనుందని ఎకనామిక్స్ టైమ్స్ నివేదించింది. కేంద్ర బ్యాంకులో అత్యంత కీలకమైన పదవికి నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (ఎన్ఎస్డీఎల్) మాజీ అధికారి సుధా బాలకృష్ణన్ ఆర్బీఐ తొలి సీఎఫ్‌వోగా ఎంపిక కావడం విశేషం. అకౌంటింగ్ విధానాలు, నిబంధనలకు లోబడి కేంద్ర బ్యాంకు బ్యాలెన్స్ షీట్ ఇన్ ఛార్జ్ గా సుధా బాలకృష్ణన్ వ్యవహరిస్తారు. ముఖ్యంగా బ్యాంక్ అకౌంటింగ్ విధానాన్ని రూపొందించడం, అంతర్గత ఖాతాలను నిర్వహించడం, ఆర్ధిక ఫలితాల గురించి నివేదించటం, వివిధ ఖాతాల ఖాతాల ద్వారా, బ్యాలెన్స్ షీట్ , లాభ, నష్టాల ఖాతాల పరిశీలన లాంటి కీలక బాధ్యతలను నిర్వహిస్తారు. రాబడి వసూళ్లు లాంటి ప్రభుత్వ లావాదేవీలతోపాటు విదేశాలలోనూ అత్యున్నత బ్యాంకు పెట్టుబడులను కూడా పర్యవేక్షించే బాధ్యత కూడా నిర్వహించనున్నారు. కాగా 2016, సెప్టెంబరులో ఆర్బీఐ గవర్నర్‌గా ఉర్జిత్ పటేల్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఇది అతిపెద్ద సంస్థాగత మార్పుగా చెప్పవచ్చు. గతంలో ఆర్బీఐ గవర్నర్‌గా రఘురామ్ రాజన్ ఉన్న సమయంలో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (పీవోవో) పదవిని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు, కానీ ఆ ప్రతిపాదనను ప్రభుత్వం ఆమోదించలేదని ఎకనామిక్స్ టైమ్స్ తన నివేదిక పేర్కొంది. మరోవైపు గత ఏడాది జులై ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఎస్ఎస్ ముద్రా పదవీవిరమణతో ఈ స్థానాన్ని భర్తీ చేయడానికి డిప్యూటీ గవర్నర్ పదవికి అర్హులైన అభ్యర్థులనుంచి దరఖాస్తులను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. -
విడాకులివ్వాలంటూ వేధిస్తున్నారు
రాయచోటిటౌన్ : విడాకులు ఇవ్వాలంటూ కట్టుకున్న భర్త, అత్త, ఆడపడుచుతో కలసి వేధిస్తున్నాడని గుండ్లూరు సుధ అనే మహిళ బుధవారం రాయచోటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె కథనం మేరకు.. చిత్తూరు జిల్లా మదనపల్లె చెందిన సుధకు పెద్దమండెంకు చెందిన గౌదుగొండ్ల కృష్ణతో ఏడేళ్ల క్రితం వివాహమైంది. జీవపాధి కోసం రాయచోటి వచ్చేశారు. కృష్ణ బేల్దారి పనికి వెళ్లడంతో పాటు మార్బల్ పనికి కూడా వెళ్లేవాడు. ఈ క్రమంలో ఒక్కోసారి వారం రోజులు కూడా ఇంటికి వచ్చేవాడు కాదు. ఈ క్రమంలో ఆమెను అత్త కాంతమ్మ మాటలతో వేధించేది. తన భర్తకు చెప్పినా తన తల్లి తోబుట్టువు మాటలను నమ్మి తననే కొట్టేవాడు. అయితే ఆమెకు శివమౌళిక ( 10) నెలల చిన్నారి పాప పుట్టిన తరువాత ఈ తగాదా మరింత పెద్దదైంది. దీంతో మంగళవారం ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసి తన పుట్టింటికి వెళ్లిపోతానని తనకు రావాల్సిన ఇంటిలోని సామాన్లు ఇప్పించాలని పోలీసులను కోరింది. ఆమె కోరిక మేరకు సామాన్లు ఇప్పించాలంటూ అత్త, ఆడపడుచుకు నచ్చజెప్పి పంపారు. అప్పటికే రాత్రి కావడంతో ఆమె సమీప బంధువుల ఇంటిలోనే తలదాచుకుంది. తెల్లవారి ఇంటిలో నుంచి బిడ్డతో పాటు బయటకు రాగా అప్పటికే కాపు కాసిన కృష్ణ తన వద్ద ఉన్న కత్తితో ఒక్క సారిగా దాడి చేశాడు. అడ్డుకోవడానికి ప్రయత్నించిన ఆమె తండ్రిపై కూడా కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో చిన్నారి శివమౌళిక చేతికి గాయమైంది. కాగా, తన భార్య బంధువులే తనపై దాడి చేశారంటూ సుధ భర్త కృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఇరువురిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అతడి పేరు మానవత
వర్షం అవిరామంగా కురుస్తోంది. మహల్ గ్రామం చుట్టూ వున్న కొండలపై మబ్బులు బద్దకంగా దొర్లిపోతున్నాయి. ‘‘ఏమైనా నువ్వు యిలా వొంటరిగా వచ్చేయడం ఏం సబబుగా లేదు తల్లీ. నీ అదృష్టం బాగుండి కారు చిత్తూరు దగ్గర ఆగిపోబట్టి రాత్రి ఏ హోటల్లోనో ఆగి సురక్షితంగా రాగలిగావు యిదే ఏ రిమోట్ ప్లేస్‌లోనో జరిగుంటే ఏమయ్యేదో నీకర్థం కాదు’’ ఉదయం నుంచీ మాధవి, సుధనలా మందలించడం ఎనిమిదోసారి.‘‘జరిగినదానికి తానూ బాధపడుతోంది కదవే, వదిలెయ్’’ అక్కను విసుక్కున్నాడు కృష్ణమూర్తి. సుధ మరీ డల్ అయిపోవడం గమనించిన మాధవి పాతభవంతి నుంచి పనిమనిషి చేత టిఫినూ, కాఫీలు తెప్పించింది. ఇంతలో గేటు దగ్గరెవరో తారాడుతుండడం గమనించి ముందుకు నడిచాడు కృష్ణమూర్తి. ఆ ఆగంతకుడెవరో వచ్చి వరండా మెట్ల మీదే నిలుచున్నాడు. సుధ నిర్ఘాంతపోయింది. వర్షంలో ఎంతగా తడవొచ్చునో అంతగానూ తడిసి వున్నాడతను. ‘‘రాత్తిరి బిత్తరంలో దీన్ని మరిసిపొయ్యినారు, బంగారపు వస్తువుగద! తొందరపడతావుంటారని మద్దానమే బయల్దేరినా మద్దిన ఈ వాన మల్లా పనిపాటు చేసింది’’ తన చేతిలోని బంగారుగొలుసును సుధ చేతికిస్తూ ఆలస్యానికి సంజాయిషీ యిచ్చుకుంటున్నట్టుగా అన్నాడతను. మాధవి అయోమయంగా సుధకేసి చూసింది. ‘‘వస్తున్నప్పుడు కారు ట్రబులిచ్చిందని చెప్పానుగా. అప్పుడు యితనూ యింకా కొందరూ వెనుకనుంచీ త్రోసారు. అప్పుడు పడిపొయ్యుంటుంది’’ తత్తరపాటును కప్పిపుచ్చుకుంటూ అంది సుధ. ఏదో పనివున్నదానికి మల్లే లోపలకెళ్లి కాట్ మీద బోర్లాపడింది. ‘అసలేం జరిగిందని కృష్ణమూర్తి అతణ్ని అడిగేస్తాడు. హోటల్లో ఆగిపోయినట్టు కల్పించి చెప్పినదంతా అబద్ధమని తెలిసిపోతుంది. తెలిసిన తర్వాత తల ఎత్తి మాట్లాడగలదా? ఐనా యితడిలా దాపురిస్తాడని తానేం కలగందా? పేద్ద నిజాయితీపరుడిలా పట్టుకొచ్చాడు.’ గడిచిన భయంకరమైన రాత్రి గుర్తుకు వచ్చింది. ఆకాశం పగిలినట్టు కుండపోతగా వర్షం. ఏడుగంటలే అయినా అర్ధరాత్రిలా ఉంది. చిత్తూరు నుంచీ మహలుకెళ్లే రోడ్డుమీద హెడ్‌లైట్స్ వేస్తున్న వెలుతురు మరక ఆధారంగా కారు దూసుకుపోతూంది. అరగంటలో మహల్లో వుంటానన్న నమ్మకం వొక్కటే సుధకు ధైర్యం యిస్తోంది. ఆమె భయాందోళనలకు పతాక ఘట్టంలా కారు రోడ్డుకడ్డం పడివున్న తాటిచెట్టును ఢీకొని నిలిచిపోయింది. ఏడవడానికి కూడా నోరు పెగలడం లేదు. ఇంతలో ఓ మెరుపు మెరిసింది. ఆ వెలుగులో పక్కనున్న మిట్టమీద ఒక గుడిసె కన్పించింది. అయిదారు నిమిషాల విచికిత్స అనంతరం తెగింపు తెచ్చుకుని కారు లాక్ చేసి, సెనగ చేలు కడ్డంగా నడిచి గుడిసె చేరుకుంది. కొత్తమనిషిని గుర్తు పట్టినట్టు దొడ్డిలోని మేకలు అరిచాయి.గడపకు కొంచెం అటువైపుగా నులకమంచం మీద పడుకున్న మనిషి కన్పించాడు బోర్లా పడుకుని. నేలమీద పెట్టిన గోధుమరంగు పుస్తకం జూసి చూరుకు వ్రేలాడుతున్న లాంతరు వెలుగులో ఏదో పద్యాల్ని కాబోలు కూనిరాగంతో చదువుకుంటున్నాడు. వణుకుతూ యింట్లోకి జొరబడింది సుధ. అతడు లేచి నిలుచున్నాడు. ఇరవైకి మించని వయసు. నల్లటి శరీరం. వుంగరాల జుత్తు. ‘‘కారు నిలిచిపోయింది’’ అప్పుడే మాటలు నేర్చిన పసిపిల్లలా అంది. అతడు రోడ్డుకేసి చూపు సారించాడు. కన్ను పొడుచుకున్నా కన్పించని చీకటి.‘‘ఎక్కడినుంచి వొస్తావుండారు?’’ ‘‘మెడ్రాసు. మహల్కెళ్లాలి మా మామగారింటికి’’. ‘‘పెసిడెంటువాళ్లింటికా?’’ వచ్చిన మనిషెవరో అర్థంగావడంతో అతడు మంచం మీద దుప్పటి దులిపివేశాడు. ‘‘కూచోండి. వొరసం ఈ రాత్తరికి తగ్గేట్టు లేదు. దూరం పయానాలకు బొయ్యేటప్పుడు అడమనిషి వొంటిగా వొచ్చుండగూడదు’’ సుధ ఇంకా ద్వారం వద్దనే నిలబడి చీర కుచ్చిళ్లను, పమిటను పిండుకోసాగింది. ‘‘పెట్లో మా ఆడోళ్ల కోకలుండాయి. మీ గుడ్డలు ఆరేవరకూ అవి కట్టుకుందురా?’’ అని ప్రశ్నార్థకంగా జూసి, చెక్కపెట్టి మీదినుంచీ ట్రంకును దించి వున్నవాటిలో మంచి చీరను తీసి ఆమెకిచ్చాడు. సుధ తటపటాయించడం చూసి, ‘‘ఈ తేమగుడ్డల్లో తెల్లారగట్ల నానితే రేపు మద్దానానికి జరం ఖాయం’’ ఆమెకు ఏకాంతం కల్పించడం కోసం కాబోలు, రావిఆకుల మోపును తీసుకుని మేకల దొడ్డిలోకి పోయాడు. పొయ్యి ముట్టించి ఎసరు బెడ్తూ, ‘‘మేము మాలోళ్లము, మా యిండ్లలో మీరు భోజనం జేద్దురా’’ అని నవ్వుతూ ‘‘కారు నిల్సిపోంగా యిట్టొచ్చినారుగానీ– చెన్నపట్నం పుట్టిమునిగితే మటుకు మీరు మా గడప దొక్కుతారా?’’ అతడు తనకంటే రెండు మూడేళ్లయినా చిన్నవాడుగా వుండొచ్చు. కానీ ఆ మాట్లాడుతున్న తీరు తనకన్నా యిరవై ముప్పై ఏళ్లు పెద్దవాడు మాట్లాడుతున్నట్టుగా ఉంది. మరో పది నిమిషాల్లో వంట పూర్తి చేసి అతడు సుధను భోజనాని కాహ్వానించాడు. బాగా ఆకలయిందేమో గబగబా అన్నం ముగించింది. సొమ్మసిల్లినట్టుగా మంచం మీద వాలిపోయింది. హఠాత్తుగా ఏ రాత్రివేళప్పుడో మెలకువ వచ్చింది. గుడిసె కప్పు ఈదురుగాలికి లేచిపోయేలా ఉంది. అతడు నేలమీద పడుకుని వున్నాడు. చిరుగుల చాప. కప్పుకోను దుప్పటి లేదు. నిద్ర పోతున్నాడా? నటిస్తున్నాడా? విద్యుదాఘాతం తిన్నదానిలా గజగజ వణికిపోయింది. దుప్పటిని గొంతువరకూ లాక్కుంది. ‘అతడు తలుచుకుంటే యింకేమైనా వుందా? భగవంతుడా, నిరపాయకరంగా తెల్లారేట్టు చూడు’. ఉదయం అతడు మరికొందరి సాయంతో చెట్టును అవతలికి లాగించేశాడు. అందరూ పది గజాలు తోయగానే కారు స్టార్టు అయింది. లాంఛనంగా కృతజ్ఞత చెప్పుతూ రెండు పది రూపాయల నోట్లను అతని చేతిలో కుక్కింది. అతడు వారిస్తూ ఏదో చెప్పబోయాడు. కారు స్టార్ట్ అయిన ఉత్సాహంలో ఆ మాటలను సరిగ్గా విన్పించుకున్నట్టు లేదు.‘‘అతడు వెళ్లిపోయాడా?’’ ‘‘మా మామయ్య కష్టపడి సంపాదించిన సొత్తు కాబట్టి మళ్లీ చేతికొచ్చింది. కృష్ణతో అతనికేమన్నా ఇచ్చి పంపమని చెప్పాను. భోజనం చేసి ముగ్గురమూ క్యారమ్స్ ఆడుకుందాం’’ అంటూ సుధ చేయి పట్టుకుని బంగళా నుంచి పాత భవంతిలోకి లాక్కుపోయింది మాధవి. రాత్రి గోడ గడియారం పన్నెండు గంటలు కొట్టిన తర్వాత వీధి తలుపు తెరుచుకుంది. కృష్ణమూర్తి ‘నాగయ్యా నాగయ్యా’ అని పిలుస్తూ వరండాలోకి వచ్చాడు. వెనుకనే వచ్చిన రాజమ్మ ‘నాగయ్య సందేళ కూతురింటికి పోయినాడయ్యా’ అంది. కృష్ణమూర్తి వీధిలైటు వేశాడు. వరండాలో మూల ఎవరో నిద్రపోతున్నారు. అతణ్ని లేపాడు. ‘ఏమయ్యా, నువ్వింకా మీ ఊరికి పోలేదా? వానలో అంతదూరం పోలేక పొయ్యుంటావు. నువ్విప్పుడు మల్లిమడుగు వెళ్లి– మునసామి తెల్సునా? అతడితో చెప్పి ప్రెసిడెంటు వాళ్లింట్లో ఎవర్నో తేలు కరిచిందని ఈడ్సుకురా’’ అన్నాడు. ‘‘తేలా? నాకు తెలవని తేలు వైద్దమా? కొత్తకోట పెద్ద చెంగయ్య మా నాయినే గదా. బాటరీ ఒకటి తేండి. మందాకు పెరుక్కొస్తా’’ అన్నాడు. ‘‘ఏ ఆకో, దొరుకుతుందా’’ అన్నాడు కృష్ణమూర్తి. ‘‘ఈడలేకపోతే మావూరికన్నా పొయ్యి పెరక్కరానా. అయిదు నిమిసాల్లో వస్తా సూడండి’’. వర్షంలో చీకట్లో కలిసిపోయాడు. సుధ, మాధవి చేతిలో పడివుంది. కాళ్లూ చేతులూ చల్లబడ్డాయి. ‘ఏమని బయల్దేరిందో– అన్నీ గండాలే’. మరో పది నిమిషాల్లో మందాకు కోసం పోయినవాడు తలుపులు త్రోసుకుని లోపలికొచ్చాడు. ఆకులు దంచి మందు తయారుచేసి సుధచేత మింగించాడు. కిరోసిన్ దీపంలో ఆకువాడ్చి కాలికి కట్టు కట్టాడు. పావు గంటకు సుధకు స్పృహ వచ్చింది. రాజమ్మ కళ్లు తుడుచుకుంటూ ఆకులు దంచిన చోట శుభ్రం చేయసాగింది. ‘ఇదేదో కాగితం ఆకుల్తో బాటు దంచేసుండావు సూడు’. పెడనవ్వు నవ్వి వీధిలోకి గిరవాటేశాడు. రూపాయి నోట్లున్న జేబులోనే మందాకు కోసుకొచ్చాడు. నోట్లు కూడా ఆకుల్తో బాటే దంచబడ్డాయి! సుధ దీనంగా అతడికేసి చూస్తూవుంది. ‘‘నాకేమైనా పెట్టాలనిపిస్తే ఇంత అన్నం పెట్టించండి. నిన్న పొద్దున తిన్న అన్నమే. ఈ వొరసం పున్నాన పగులంతా కోమిటోళ్ల సత్రంలో గొంతు కూసొనుంటి. రాత్తిరి మనింటికాడ ఎవురన్నా బయటికొస్తారేమోనని దీపాలు ఆర్పేదాకా సూస్తావుంటి. ఈ పొద్దు నాకూ నా మేకలకూ ఉపాసమే’’ అన్నాడు. చెళ్లుమని చెంపదెబ్బ కొట్టినట్టయింది సుధకు. అతడు యింత చేసినందుకు తానేం చేయగల్గింది? రాజమ్మ అతని ముందు విస్తరి వేసి అన్నం పెడుతోంది. తలవాల్చుకుని బురద బురదగా వున్న అరుగుపై మిడికాళ్ల మీద కూచొని వున్నాడతను. అంతవరకూ దూరంగా పడుకున్న కుక్క అతని దగ్గరికొచ్చి తోకాడించసాగింది. ‘‘చివరకు కుక్కకు పడేసినట్లు నీకు యింత అన్నం పడేస్తున్నాం గదా’’ భోరున ఏడ్చేస్తూ సుధ అతణ్ని డైనింగ్ హాల్లోకి లాక్కుపోయింది. వర్షం అవిరామంగా కురుస్తోంది. మహల్ గ్రామం చుట్టూ వున్న కొండలపై మబ్బులు బద్దకంగా దొర్లిపోతున్నాయి. ‘‘ఏమైనా నువ్వు యిలా వొంటరిగా వచ్చేయడం ఏం సబబుగా లేదు తల్లీ. నీ అదృష్టం బాగుండి కారు చిత్తూరు దగ్గర ఆగిపోబట్టి రాత్రి ఏ హోటల్లోనో ఆగి సురక్షితంగా రాగలిగావు యిదే ఏ రిమోట్ ప్లేస్‌లోనో జరిగుంటే ఏమయ్యేదో నీకర్థం కాదు’’ ఉదయం నుంచీ మాధవి, సుధనలా మందలించడం ఎనిమిదోసారి. ‘‘జరిగినదానికి తానూ బాధపడుతోంది కదవే, వదిలెయ్’’ అక్కను విసుక్కున్నాడు కృష్ణమూర్తి. సుధ మరీ డల్ అయిపోవడం గమనించిన మాధవి పాతభవంతి నుంచి పనిమనిషి చేత టిఫినూ, కాఫీలు తెప్పించింది. ఇంతలో గేటు దగ్గరెవరో తారాడుతుండడం గమనించి ముందుకు నడిచాడు కృష్ణమూర్తి. ఆ ఆగంతకుడెవరో వచ్చి వరండా మెట్ల మీదే నిలుచున్నాడు. సుధ నిర్ఘాంతపోయింది. వర్షంలో ఎంతగా తడవొచ్చునో అంతగానూ తడిసి వున్నాడతను. ‘‘రాత్తిరి బిత్తరంలో దీన్ని మరిసిపొయ్యినారు, బంగారపు వస్తువుగద! తొందరపడతావుంటారని మద్దానమే బయల్దేరినా మద్దిన ఈ వాన మల్లా పనిపాటు చేసింది’’ తన చేతిలోని బంగారుగొలుసును సుధ చేతికిస్తూ ఆలస్యానికి సంజాయిషీ యిచ్చుకుంటున్నట్టుగా అన్నాడతను. మాధవి అయోమయంగా సుధకేసి చూసింది. ‘‘వస్తున్నప్పుడు కారు ట్రబులిచ్చిందని చెప్పానుగా. అప్పుడు యితనూ యింకా కొందరూ వెనుకనుంచీ త్రోసారు. అప్పుడు పడిపొయ్యుంటుంది’’ తత్తరపాటును కప్పిపుచ్చుకుంటూ అంది సుధ. ఏదో పనివున్నదానికి మల్లే లోపలకెళ్లి కాట్ మీద బోర్లాపడింది. ‘అసలేం జరిగిందని కృష్ణమూర్తి అతణ్ని అడిగేస్తాడు. హోటల్లో ఆగిపోయినట్టు కల్పించి చెప్పినదంతా అబద్ధమని తెలిసిపోతుంది. తెలిసిన తర్వాత తల ఎత్తి మాట్లాడగలదా? ఐనా యితడిలా దాపురిస్తాడని తానేం కలగందా? పేద్ద నిజాయితీపరుడిలా పట్టుకొచ్చాడు.’ గడిచిన భయంకరమైన రాత్రి గుర్తుకు వచ్చింది. ఆకాశం పగిలినట్టు కుండపోతగా వర్షం. ఏడుగంటలే అయినా అర్ధరాత్రిలా ఉంది. చిత్తూరు నుంచీ మహలుకెళ్లే రోడ్డుమీద హెడ్‌లైట్స్ వేస్తున్న వెలుతురు మరక ఆధారంగా కారు దూసుకుపోతూంది. అరగంటలో మహల్లో వుంటానన్న నమ్మకం వొక్కటే సుధకు ధైర్యం యిస్తోంది. ఆమె భయాందోళనలకు పతాక ఘట్టంలా కారు రోడ్డుకడ్డం పడివున్న తాటిచెట్టును ఢీకొని నిలిచిపోయింది. ఏడవడానికి కూడా నోరు పెగలడం లేదు. ఇంతలో ఓ మెరుపు మెరిసింది. ఆ వెలుగులో పక్కనున్న మిట్టమీద ఒక గుడిసె కన్పించింది. అయిదారు నిమిషాల విచికిత్స అనంతరం తెగింపు తెచ్చుకుని కారు లాక్ చేసి, సెనగ చేలు కడ్డంగా నడిచి గుడిసె చేరుకుంది. కొత్తమనిషిని గుర్తు పట్టినట్టు దొడ్డిలోని మేకలు అరిచాయి. గడపకు కొంచెం అటువైపుగా నులకమంచం మీద పడుకున్న మనిషి కన్పించాడు బోర్లా పడుకుని. నేలమీద పెట్టిన గోధుమరంగు పుస్తకం జూసి చూరుకు వ్రేలాడుతున్న లాంతరు వెలుగులో ఏదో పద్యాల్ని కాబోలు కూనిరాగంతో చదువుకుంటున్నాడు. వణుకుతూ యింట్లోకి జొరబడింది సుధ. అతడు లేచి నిలుచున్నాడు. ఇరవైకి మించని వయసు. నల్లటి శరీరం. వుంగరాల జుత్తు. ‘‘కారు నిలిచిపోయింది’’ అప్పుడే మాటలు నేర్చిన పసిపిల్లలా అంది. అతడు రోడ్డుకేసి చూపు సారించాడు. కన్ను పొడుచుకున్నా కన్పించని చీకటి. ‘‘ఎక్కడినుంచి వొస్తావుండారు?’’ ‘‘మెడ్రాసు. మహల్కెళ్లాలి మా మామగారింటికి’’. ‘‘పెసిడెంటువాళ్లింటికా?’’ వచ్చిన మనిషెవరో అర్థంగావడంతో అతడు మంచం మీద దుప్పటి దులిపివేశాడు. ‘‘కూచోండి. వొరసం ఈ రాత్తరికి తగ్గేట్టు లేదు. దూరం పయానాలకు బొయ్యేటప్పుడు అడమనిషి వొంటిగా వొచ్చుండగూడదు’’ సుధ ఇంకా ద్వారం వద్దనే నిలబడి చీర కుచ్చిళ్లను, పమిటను పిండుకోసాగింది. ‘‘పెట్లో మా ఆడోళ్ల కోకలుండాయి. మీ గుడ్డలు ఆరేవరకూ అవి కట్టుకుందురా?’’ అని ప్రశ్నార్థకంగా జూసి, చెక్కపెట్టి మీదినుంచీ ట్రంకును దించి వున్నవాటిలో మంచి చీరను తీసి ఆమెకిచ్చాడు. సుధ తటపటాయించడం చూసి, ‘‘ఈ తేమగుడ్డల్లో తెల్లారగట్ల నానితే రేపు మద్దానానికి జరం ఖాయం’’ ఆమెకు ఏకాంతం కల్పించడం కోసం కాబోలు, రావిఆకుల మోపును తీసుకుని మేకల దొడ్డిలోకి పోయాడు. పొయ్యి ముట్టించి ఎసరు బెడ్తూ, ‘‘మేము మాలోళ్లము, మా యిండ్లలో మీరు భోజనం జేద్దురా’’ అని నవ్వుతూ ‘‘కారు నిల్సిపోంగా యిట్టొచ్చినారుగానీ– చెన్నపట్నం పుట్టిమునిగితే మటుకు మీరు మా గడప దొక్కుతారా?’’ అతడు తనకంటే రెండు మూడేళ్లయినా చిన్నవాడుగా వుండొచ్చు. కానీ ఆ మాట్లాడుతున్న తీరు తనకన్నా యిరవై ముప్పై ఏళ్లు పెద్దవాడు మాట్లాడుతున్నట్టుగా ఉంది. మరో పది నిమిషాల్లో వంట పూర్తి చేసి అతడు సుధను భోజనాని కాహ్వానించాడు. బాగా ఆకలయిందేమో గబగబా అన్నం ముగించింది. సొమ్మసిల్లినట్టుగా మంచం మీద వాలిపోయింది. హఠాత్తుగా ఏ రాత్రివేళప్పుడో మెలకువ వచ్చింది. గుడిసె కప్పు ఈదురుగాలికి లేచిపోయేలా ఉంది. అతడు నేలమీద పడుకుని వున్నాడు. చిరుగుల చాప. కప్పుకోను దుప్పటి లేదు. నిద్ర పోతున్నాడా? నటిస్తున్నాడా? విద్యుదాఘాతం తిన్నదానిలా గజగజ వణికిపోయింది. దుప్పటిని గొంతువరకూ లాక్కుంది. ‘అతడు తలుచుకుంటే యింకేమైనా వుందా? భగవంతుడా, నిరపాయకరంగా తెల్లారేట్టు చూడు’. ఉదయం అతడు మరికొందరి సాయంతో చెట్టును అవతలికి లాగించేశాడు. అందరూ పది గజాలు తోయగానే కారు స్టార్టు అయింది. లాంఛనంగా కృతజ్ఞత చెప్పుతూ రెండు పది రూపాయల నోట్లను అతని చేతిలో కుక్కింది. అతడు వారిస్తూ ఏదో చెప్పబోయాడు. కారు స్టార్ట్ అయిన ఉత్సాహంలో ఆ మాటలను సరిగ్గా విన్పించుకున్నట్టు లేదు. ‘‘అతడు వెళ్లిపోయాడా?’’ ‘‘మా మామయ్య కష్టపడి సంపాదించిన సొత్తు కాబట్టి మళ్లీ చేతికొచ్చింది. కృష్ణతో అతనికేమన్నా ఇచ్చి పంపమని చెప్పాను. భోజనం చేసి ముగ్గురమూ క్యారమ్స్ ఆడుకుందాం’’ అంటూ సుధ చేయి పట్టుకుని బంగళా నుంచి పాత భవంతిలోకి లాక్కుపోయింది మాధవి.రాత్రి గోడ గడియారం పన్నెండు గంటలు కొట్టిన తర్వాత వీధి తలుపు తెరుచుకుంది. కృష్ణమూర్తి ‘నాగయ్యా నాగయ్యా’ అని పిలుస్తూ వరండాలోకి వచ్చాడు. వెనుకనే వచ్చిన రాజమ్మ ‘నాగయ్య సందేళ కూతురింటికి పోయినాడయ్యా’ అంది. కృష్ణమూర్తి వీధిలైటు వేశాడు. వరండాలో మూల ఎవరో నిద్రపోతున్నారు. అతణ్ని లేపాడు. ‘ఏమయ్యా, నువ్వింకా మీ ఊరికి పోలేదా? వానలో అంతదూరం పోలేక పొయ్యుంటావు. నువ్విప్పుడు మల్లిమడుగు వెళ్లి– మునసామి తెల్సునా? అతడితో చెప్పిప్రెసిడెంటు వాళ్లింట్లో ఎవర్నో తేలు కరిచిందని ఈడ్సుకురా’’ అన్నాడు.‘‘తేలా? నాకు తెలవని తేలు వైద్దమా? కొత్తకోట పెద్ద చెంగయ్య మా నాయినే గదా. బాటరీ ఒకటి తేండి. మందాకు పెరుక్కొస్తా’’ అన్నాడు. ‘‘ఏ ఆకో, దొరుకుతుందా’’ అన్నాడు కృష్ణమూర్తి. ‘‘ఈడలేకపోతే మావూరికన్నా పొయ్యి పెరక్కరానా. అయిదు నిమిసాల్లో వస్తా సూడండి’’. వర్షంలో చీకట్లో కలిసిపోయాడు.సుధ, మాధవి చేతిలో పడివుంది. కాళ్లూ చేతులూ చల్లబడ్డాయి. ‘ఏమని బయల్దేరిందో– అన్నీ గండాలే’. మరో పది నిమిషాల్లో మందాకు కోసం పోయినవాడు తలుపులు త్రోసుకుని లోపలికొచ్చాడు. ఆకులు దంచి మందు తయారుచేసి సుధచేత మింగించాడు. కిరోసిన్ దీపంలో ఆకువాడ్చి కాలికి కట్టు కట్టాడు. పావు గంటకు సుధకు స్పృహ వచ్చింది. రాజమ్మ కళ్లు తుడుచుకుంటూ ఆకులు దంచిన చోట శుభ్రం చేయసాగింది. ‘ఇదేదో కాగితం ఆకుల్తో బాటు దంచేసుండావు సూడు’. పెడనవ్వు నవ్వి వీధిలోకి గిరవాటేశాడు. రూపాయి నోట్లున్న జేబులోనే మందాకు కోసుకొచ్చాడు. నోట్లు కూడా ఆకుల్తో బాటే దంచబడ్డాయి! సుధ దీనంగా అతడికేసి చూస్తూవుంది. ‘‘నాకేమైనా పెట్టాలనిపిస్తే ఇంత అన్నం పెట్టించండి. నిన్న పొద్దున తిన్న అన్నమే. ఈ వొరసం పున్నాన పగులంతా కోమిటోళ్ల సత్రంలో గొంతు కూసొనుంటి. రాత్తిరి మనింటికాడ ఎవురన్నా బయటికొస్తారేమోనని దీపాలు ఆర్పేదాకా సూస్తావుంటి. ఈ పొద్దు నాకూ నా మేకలకూ ఉపాసమే’’ అన్నాడు. చెళ్లుమని చెంపదెబ్బ కొట్టినట్టయింది సుధకు. అతడు యింత చేసినందుకు తానేం చేయగల్గింది? రాజమ్మ అతని ముందు విస్తరి వేసి అన్నం పెడుతోంది. తలవాల్చుకుని బురద బురదగా వున్న అరుగుపై మిడికాళ్ల మీద కూచొని వున్నాడతను. అంతవరకూ దూరంగా పడుకున్న కుక్క అతని దగ్గరికొచ్చి తోకాడించసాగింది. ‘‘చివరకు కుక్కకు పడేసినట్లు నీకు యింత అన్నం పడేస్తున్నాం గదా’’ భోరున ఏడ్చేస్తూ సుధ అతణ్ని డైనింగ్ హాల్లోకి లాక్కుపోయింది. మహేంద్ర -
పురుషులకు దీటుగా...
కడప ,ప్రొద్దుటూరు క్రైం : ప్రొద్దుటూరు మండలంలోని అమృతానగర్‌కు చెందిన కొండిశెట్టి సుధ అనే మహిళ ఆటో నడుపుతూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మగాళ్లకు దీటుగా స్వశక్తితో ఆటో నడపడాన్ని చూసి పలువురు ప్రశంసిస్తున్నారు. అమృతానగర్‌కు చెందిన సుధాకు రామాంజనేయులుతో వివాహం అయింది. అతను ఎలక్ట్రికల్ ఉద్యోగం నిర్వహించే వాడు. వారికి లహరి అనే కుమార్తె ఉంది. సంతోషంగా ముందుకు సాగుతున్న తరుణంలో ఆ చిన్న కుటుంబంలో అనుకోని విషాదం నెలకొంది. ఆమె భర్త రామాంజనేయులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ సంఘటన 9 ఏళ్ల క్రితం జరిగింది. భర్త మరణంతో కుటుంబ భారం ఆమెపై పడింది. కుమార్తెను బాగా చదివించాలని భావించింది. మో టార్‌సైకిల్‌ను నడపడం నేర్చుకుంది. నిత్యావసర సరుకులు టీవీఎస్‌లో పెట్టుకొని పల్లెలకు వెళ్లి విక్రయించ డం అలవాటు చేసుకుంది. తర్వాత ఆటో కొనుగోలు చేసి నేర్చుకుంది. అందులో తీసుకెళ్లి సరుకులు విక్రయిం చింది. అయితే చాలా మంది అప్పు పెట్టారు. ఇలా రూ.2.50 లక్షల దాకా నష్టపోయింది. ఆటో డ్రైవింగే జీవనాధారం నిత్యావసరాల వ్యాపారం చేస్తే బాకీలు పెరిగిపోతాయని భావించి మానేసింది. ఇంట్లో ఖాళీగా కూర్చుంటే సంసారం గడచదని భావించింది. ఎలాగో ఆటో నడపడం వచ్చు కాబట్టి ప్రయాణికుల కోసం తిప్పాలని నిర్ణయించుకుంది. ఈ ఆలోచనను ఆచరణలో పెట్టింది. మూడేళ్ల నుంచి ఇదే ఆటోను నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటోంది. రోజంతా ఆటో తిరిగితే రూ. 300–400 దాకా సంపాదిస్తోంది. -
భర్త హత్యకు భార్య ప్లాన్ చేసింది
కృష్ణరాజపుర: తమ అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని తన భర్తను హత్య చేయించడానికి ఓ భార్య ప్రయత్నించిన ఘటన శనివారం కాడుగోడి పోలీస్‌స్టేషన్ పరిధిలోని బెళతూరులో జరిగింది. వివరాల్లోకి వెళితే.. బెళతూరు గ్రామానికి చెందిన సోమశేఖర్‌కు అదే గ్రామానికి చెందిన సుధాతో పది సంవత్సరాల క్రితం వివాహమైంది. అయితే ఇటీవలె ఆమెకు అరుణ్ అనే వ్యక్తితో ఏర్పడ్డ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. వీరి వ్యవహారం ఇటీవల భర్త సోమశేఖర్‌కు తెలియడంతో కొద్ది కాలంగా భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. శుక్రవారం రాత్రి కూడా ఇదే విషయమై ఇరువురి మధ్య గొడవ జరగడంతో సుధా భర్త సోమశేఖర్‌ను హత్య చేయాలంటూ ప్రియుడు అరుణ్‌కు సూచించింది.దీంతో అరుణ్ శుక్రవారం రాత్రి పనిపై బయటకు వచ్చిన సోమశేఖర్‌పై తన సహచరులతో కలసి అరుణ్ ఇనుపరాడ్లు,కత్తులతో దాడి చేసారు. దీంతో సోమశేఖర్ సృహ తప్పి పడిపోవడంతో సోమశేఖర్ మరణించాడని భావించిన నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న కాడుగోడి పోలీసులు సోమశేఖర్‌ను కే.ఆర్.పుర ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు. -
డైరెక్టర్స్ హీరో
పదిమందిలో మంచి పేరు తెచ్చుకోవడానికి నైజం ఏదైనా నిజం బయట పడకుండా పబ్లిక్ లైఫ్‌లో యాక్ట్ చేసేస్తుంటారు. వెంకటేశ్ అలా కాదు. సత్యాన్ని అన్వేషించాలనుకుంటాడు. అందుకే... సత్యానికి దగ్గరగా ఉండాలనుకుంటాడు. అందుకే ఆయన డైరెక్టర్స్ హీరో అయ్యాడు. పాత్రల్లో ఎలాగూ మంచి నటన ఉంటుంది. జీవితంలో మంచి పాత్ర చాలు. నటన అక్కర్లేదు. వెంకీ పాలసీ, ఫిలాసఫీ కూడా ఇదే. ⇒ వెంకీగారు... మెయి న్స్ట్రీమ్ హీరోల్లో ఇద్దరు లేడీ డైరెక్టర్స్‌తో సినిమాలు చేసింది మీరే. ఫీమేల్ డైరెక్టర్స్‌ని ఎంకరేజ్ చేయాలనా? వెంకీ: (నవ్వుతూ) నేను మంచి సినిమాలను ప్రోత్సహిస్తాను. క్రమశిక్షణ, అంకితభావానికి ప్రాధాన్యం ఇస్తాను. అది ఎవరిలో ఉన్నా ఎంకరేజ్ చేస్తా. సుధలో నేను ఆ లక్షణాలు చూశా. 24 గంటలూ ఆమె సినిమా గురించే ఆలోచిస్తుంది. ప్లస్ తను తీసుకొచ్చిన కథ బాగుంది. ⇒ ఫీమేల్ డైరెక్టర్, స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్... సుధ హ్యాండిల్ చేయగలుగుతుందా? అని చిన్న సందేహం కూడా కలగలేదా? వెంకీ: ఇప్పుడు మీరు అడుగుతుంటే ఆలోచిస్తున్నాను. యాక్చువల్‌గా సుధ వచ్చినప్పుడు నాకేమీ అనిపించలేదు. ఫీమేల్ డైరెక్టర్ అని ఆలోచించలేదు. స్టోరీ నచ్చింది. ముందు సినిమాల్లో చేసినట్టు కాకుండా కొత్తగా, నేను టోటల్ డిఫరెంట్‌గా కనిపించాలని, నటించాలని అను కుంది సుధ. ఆ విషయాన్ని చాలా క్లారిటీగా చెప్పింది. ⇒ ‘అమ్మాయిలు అవకాశాలు రాలేదు... అంటుంటారు. వస్తే ఉపయోగించుకోరు’ అని ‘గురు’ సినిమాలో ఓ డైలాగ్ చెప్పారు. ఇన్ జనరల్ విమెన్ గురించి చెప్పండి? వెంకీ: సహజంగా మహిళలు మగవాళ్ల కన్నా స్ట్రాంగ్. అందులో సందేహం లేదు. 20– 30 ఏళ్లుగా మహిళలు సమాజంలో ఎలాంటి పాత్ర పోషిస్తున్నారో చూస్తూనే ఉన్నాం. వాళ్లకు ఓ ఛాన్స్ ఇచ్చి చూడండి... అద్భుతాలు సృష్టిస్తారు. సమాజం మహిళల పాత్రను గుర్తించి అంగీకరించాలి. నేనెప్పుడూ మహిళలను ఎంకరేజ్ చేస్తాను. వాళ్లు ఏం చేసినా బాగా చేస్తారు. లైఫ్‌లో ఏం చేయాలనుకుంటున్నారనే ఛాయిస్ వాళ్లకే ఇవ్వాలి. ⇒ మరి... ఈ సినిమాలో రితికా సింగ్‌ను కాలితో తన్నే సీన్ చేయడానికి ఇబ్బంది పడలేదా? వెంకీ: ఆ సీన్ కుదరదంటే కుదరదని సుధతో అన్నాను. కానీ, చేయకపోతే సీన్ పేలవంగా ఉంటుందని చెప్పింది. (మధ్యలో సుధ కల్పించుకుంటూ)... మామూలుగా వెంకీ ఏ సీన్ అయినా సింగిల్ టేక్‌లో చేసేస్తారు. కానీ, ఈ సీన్‌కి టేక్స్ మీద టేక్స్ తీసుకున్నారు. రితిక ఏమో ‘కమాన్ హిట్ మి’ అన్నప్పటికీ వెంకీ చేయడానికి ఇష్టపడలేదు. చివరికి ఎలాగో ఒప్పించాం. ఇష్టం లేకుండా చేసిన సీన్ కాబట్టి, ఎక్కువ టేక్స్ తీసుకున్నారు. ⇒ ‘గురు’ పాత్రకు వెంకీయే కరెక్ట్ అని ఎలా ఊహించారు? సుధ: నిజం చెప్పాలంటే... నేను గుడ్ యాక్టర్స్తోనే పని చేయడానికి ఇష్టపడతాను. అలాంటివాళ్లు పక్కన ఉంటే నాకు ఎనర్జీ వస్తుంది. బ్యాడ్ యాక్టర్స్‌ను భరించలేను. వెంకీ జీనియస్ యాక్టర్. ‘క్షణ క్షణం’లో వెంకీ యాక్టింగ్ ఇష్టం. ఆయనకు ఓ క్యారెక్టర్ ఇస్తే అందులోంచి అటూ ఇటూ వెళ్లరు. ఆ పాత్రకు ఏం చేయాలో అదే చేస్తారు. ఆయన సినిమాలు చూసి, నేను తెలుసుకున్న విషయం అది. అందుకే ‘గురు’గా ఆయనే కరెక్ట్ అనుకున్నా. ఒకవేళ వెంకీ చేయకపోతే ‘గురు’ వచ్చేది కాదు. ⇒ తమిళంలో ఈ సినిమాని మాధవన్‌తో తీశారు. తెలుగులో వెంకీ పెద్ద స్టార్ కాబట్టి, మీకేమైనా భయం అనిపించిందా? సుధ: మొదట ఆయన ఈ సినిమా చేయడానికి అంగీకరిస్తే... సగం యుద్ధం గెలిచినట్టే అనుకున్నా. కథకు తగ్గట్టు ఎలా నటించాలో తర్వాత ఎలానూ చెబుతారు. అఫ్కోర్స్... భయం ఉంటుంది. కొత్త వ్యక్తిని ఎవర్ని కలిసినా నాలో భయం ఉంటుంది. అయితే సినిమా బాగా రావాలనే స్వార్థమే... ఆ భయాన్ని తీసి పక్కన పడేసింది. (వెంకటేశ్ మధ్యలో కల్పించుకుంటూ) మొదట్లో కొన్ని నా దగ్గర చెప్పలేదు. వారం తర్వాత ఓ రోజు ‘మీరు ఫుల్ స్క్రిప్ట్ చదవాలి. అది కూడా షూటింగ్‌కి ముందే మొత్తం చదవాలి. పక్కన ఆర్టిస్టులుంటారు. వాళ్లతో కలసి రిహార్సల్స్ చేయాలి’ అంది. సరే చూద్దామన్నా. చాలాసార్లు రిహార్సల్స్ చేయాలని అడిగింది. నేనెప్పుడూ అలా చేయలేదు. దాంతో ఇబ్బందిగా ఉంటుందేమో అనిపించింది. ఇంపార్టెంట్ సీన్స్ ఇంటికి తీసుకువెళ్లి ప్రిపేర్ కావడం కామనే. కానీ, నా లైఫ్‌లో ఫుల్ స్క్రిప్ట్ ఎప్పుడూ చదవలేదు. అసలు నాకు తెలుగు రాదు. ఫుల్ స్క్రిప్ట్ చదవడం, రిహార్సల్స్.. ఇదంతా ఎప్పటికి పూర్తవుతుందని సుధని అడిగితే... ‘ఏం ఫర్వాలేదు’ అంది. ఇంటికి వెళ్లి బాగా ఆలోచించాను. ఎక్కడో కొడుతుందేమో, డేంజర్ అవుతుందేమో అనుకున్నా. కానీ, ఒక్కసారి స్క్రిప్ట్ చదవి, షూటింగ్ మొదలు పెట్టాక ఎంతో ఎనర్జీ వచ్చింది. ఏదో ఐఏయస్, ఐపీయస్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయినట్లు అనిపించింది. ⇒ భల్లాలదేవ (వెంకీ అన్న సురేశ్‌బాబు కొడుకు)తో మీ రిలేషన్ గురించి? వెంకీ: తను నా కొడుకులాంటివాడే. ‘సాలా ఖడూస్’ గురించి చెప్పి, ‘ఈ సినిమా చూడు’ అన్నాడు. అంతకుముందే సుధ నాకు ఈ సినిమా గురించి చెప్పింది. ‘నేను కూడా ఇదే చేయాలనుకుంటున్నార్రా’ అన్నాను. అన్నయ్య, నేను బాగా డిస్కస్ చేసుకుంటాం. రానా కూడా తన సినిమాల గురించి చెబుతుంటాడు. సుధ: 2010లో ఇదే రూమ్‌లో రానాకి ‘గురు’ కథ చెప్పాను. రానా యంగ్ కాబట్టి, కొంచెం లవ్, రొమాన్స్ యాడ్ చేశాను. స్క్రిప్ట్ నచ్చినప్పటికీ అప్పట్లో రానాకి ఈ సినిమా చేయడం కుదరలేదు. తర్వాత రెండేళ్లకు వెంకీకి ఈ కథ చెప్పా. నా ఫ్రెండ్ ఒకరు రమణ మహర్షి డైరీ ప్రతి ఏడాదీ ఇస్తుంటారు. ప్రతి రోజూ ఆ డైరీలో రాసుకుంటాను. వెంకీ దగ్గర కథ చెప్పడానికి వెళ్లినప్పుడు ఆ డైరీ తీసుకెళ్లాను. రమణ మహర్షి డైరీ ఏంటి? అని అడిగారాయన. ఏదో శక్తి నడిపించినట్లుగానే ముందు రానా దగ్గరకు వచ్చిన కథ... ఆ తర్వాత మూడేళ్లకు వెంకీకి కుదరడం భలే గమ్మత్తుగా అనిపించింది. సుధ: సాధారణంగా వెంకీ ఉదయం తొమ్మిది పదింటికి షూటింగ్ చేయడానికి ఇష్టపడతారు. మేము 7 గంటలకే రమ్మన్నాం. ఆయన 6.45కే వచ్చి... ‘‘నేను ఎలా చేస్తే బాగుంటుంది? నువ్వేం అనుకుంటున్నావ్?’ అనడిగేవారు. యాక్టర్ అలా రెస్పాండ్ కాకపోతే డైరెక్టర్ ఏమీ చేయలేరు. ⇒ హిందీ హీరోల్లా తెలుగు హీరోలు ప్రయోగాలు చేయరంటారు. ‘దంగల్’కి ఆమిర్‌ఖాన్ పొట్ట పెంచినట్లుగా ఏదైనా క్యారెక్టర్ డిమాండ్ చేస్తే మీరూ చేస్తారా? వెంకీ: అలాంటి కథ వస్తే తప్పకుండా చేస్తాను. రైటర్స్, డైరెక్టర్స్ రావాలి. ఒకప్పుడు నేను చేసిన సినిమాలు తీసుకోండి. ‘చంటి’ ఒప్పుకున్నప్పుడు, ‘నువ్వేమో మ్యాన్లీగా ఉంటావ్. అమాయకుడి పాత్ర వర్కవుట్ కాదని చాలామంది అనుకుంటున్నార్రా. జాగ్రత్త’ అన్నారు నాన్నగారు. ఇండస్ట్రీలో చాలామంది వద్దన్నారు. నాకు సబ్జెక్ట్ నచ్చింది. అప్పట్లో అదో ప్రయోగం. అలాగే, ‘శ్రీను’ సినిమా కూడా. నాకు సబ్జెక్ట్ ముఖ్యం. డిఫరెంట్‌గా యాక్ట్ చేసే స్కోప్ ఉందనిపిస్తే కచ్చితంగా ఒప్పుకుంటా. ‘గురు’ విషయానికొస్తే... అందరూ ప్రశంసిస్తున్నారు. చిరంజీవిగారైతే ‘హ్యాట్సాఫ్ టు యు. ఆ లుక్, నాన్నలాంటి వయసు అనే డైలాగ్ ఒప్పుకోవడం... మామూలు విషయం కాదు. చాలా రిస్క్. నువ్వు ఎప్పుడూ రిస్క్ తీసుకుంటావ్’ అన్నారు. మెగాస్టార్‌కి నా ఛాయిస్ నచ్చింది. హీరోగా నేను తీసుకున్న రిస్క్‌ని ఆయన చాలా అభినందించారు. సుధ: యాక్చువల్లీ చిరంజీవిగారి వైఫ్ (సురేఖ) ఈ సినిమా చూడ్డానికి పెద్ద ఆసక్తి చూపలేదు. ‘బాక్సింగ్ మూవీ కదా, ఏముంటుందిలే’ అనుకున్నారట. సినిమా చూశాక... ‘ఇది బాక్సింగ్ మూవీ కాదు.. మంచి ఎమోషన్’ అంటూ ఏడ్చారు. ఆమెకు అంత బాగా నచ్చింది. ⇒ వెంకీగారూ! ఆ మధ్య దాదాపు ఒకే రకం సినిమాలు చేశారు. అప్పుడు బోర్ అనిపించలేదా? వెంకీ: నాకైతే ‘ఇక చాలు.. రిటైర్ అయిపోతే బెస్ట్’ అనిపించిన సందర్భాలు చాలా ఉన్నాయి. చేసే నాకూ, చూసే ప్రేక్షకులకూ విసుగు అనిపించే సినిమాలు చేయడం ఎందుకు? కొన్ని సినిమాలు ఆడినా, కిక్ అనిపించలేదు. నన్ను నేను డిఫరెంట్‌గా చూసుకోవాలని ఉంది. కొత్తగా ఏదైనా చేయాలి. అలా కుదరనప్పుడు ‘ఇక చాలు’ అనుకుంటుంటాను. అలా అనుకున్న ప్రతిసారీ మంచి ఛాన్స్ వస్తుంటుంది. ఆ సినిమా భలే కిక్ ఇస్తుంది. ఆ ఉత్సాహంతో మళ్లీ చేస్తుంటా. ⇒ 30 ఏళ్లుగా సినిమాలు చేస్తూ, రిటైర్ అవ్వడం అంత ఈజీయా? వెంకీ: మంచి సినిమాలు రానప్పుడు ఏం చేస్తాం? లైఫ్ ఎలా వెళితే అలా తీసుకోవాలి. పెద్దగా ఆలోచించకూడదు. ⇒ అంటే.. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలను ఇష్టపడడంలేదా? వెంకీ: కమర్షియల్ అంటే ఏంటి? ఇప్పుడు ‘గురు’ కమర్షియల్ సినిమానే. క్లాస్, మాస్, కమర్షియల్ అనేది ఎప్పుడో పోయింది. కథలో ఉన్న ఎమోషన్ ప్రేక్షకులకు కనెక్ట్ అయితే అది కమర్షియల్ సినిమానే. ⇒ ఓకే... మీ రియల్ లైఫ్ గురువుల గురించి తెలుసుకోవాలని ఉంది! వెంకీ: మైసూరులో ఒక గురువుగారు ఉండేవారు. ఆయన తిరిగి రాని లోకాలకు వెళ్లారు. హిమాలయాలవీ తిరిగాను కదా. రామకృష్ణ పరమ హంస, వివేకానంద, పరమహంస యోగానంద... వీళ్ల టీచింగ్స్ చదివి, చాలా ఇన్స్పైర్ అయ్యాను. రమణ మహర్షి టీచింగ్స్ చదవడం మొదలుపెట్టాక, అవి నాకు పర్ఫెక్ట్ అనిపించాయి. మహమ్మద్ ప్రవక్త, రూమీ, జీసెస్ల టీచింగ్స్లా ఆయనవి కూడా ఉంటాయి. దేహానికి మించినది ఏదో ఉందని తెలుసుకున్నాను. భూమి మీద పుట్టాం కాబట్టి, ఈ ఫిజికల్ డ్రామా చేయాల్సిందే. కర్మానుసారం అన్నీ జరుగుతుంటాయి. శ్రీరాముడు–శ్రీకృష్ణుడు రాజ్యాలు ఏలారు. సేమ్ టైమ్ సత్యం తెలుసుకున్నారు. మనిషి ఈ రెండూ చేయాలి. ఇప్పుడు వాళ్ల దారిలో వెళుతూ నేను చేస్తున్నది అదే. శరీరీం–ఆత్మ... ఈ రెండింటి బాధ్యతలనూ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్లాలి. ⇒ మీ గురువు సుధగారు? సుధ: సాయిబాబా. ప్రతి రోజూ ఆయన పుస్తకంలో ఒక పేజీ చదువుతాను. డిస్ట్రబ్డ్‌గా ఉన్నప్పుడు పుస్తకం తెరిస్తే, సమాధానం దొరుకుతుంది. నా విషయంలో ఎన్నో అద్భుతాలు జరిగాయి. ఏదో పవర్ ఉందని నమ్ముతాను. ⇒ క్రికెట్ బాగా ఆడతారు కదా! ఈ మధ్య ఎప్పుడు ఆడారు? వెంకీ: ఈ మధ్య ఎక్కువగా చూడటమే. ఆడటంలేదు. స్పోర్ట్స్ ఇంజ్యూరీస్ తగ్గడానికి చాలా టైమ్ పడుతోంది. దానివల్ల షూటింగ్‌కి ఇబ్బందవుతుందేమో అని పెద్దగా ఆడటంలేదు. ఈ 5న జరగబోయే ఐపీఎల్ మ్యాచ్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఇంకొన్ని రోజులు నేను ఈ మ్యాచ్‌లు చూస్తూ, బిజీగా ఉంటా. ఆ తర్వాతే సినిమాలు. ⇒ సినిమాల్లో సెంచురీ కొట్టేస్తారా? వెంకీ: అది నా చేతుల్లో లేదు. చేసే పని సిన్సియర్‌గా చేయాలి. ఇప్పుడు ‘గురు’ చేశాను కాబట్టి, నాకోసం కొత్త స్క్రిప్ట్స్ రెడీ చేస్తారని నమ్ముతున్నాను. ⇒ శారీరకంగా, మానసికంగా బలహీనమైనప్పుడు..? వెంకీ: ‘వేకప్ స్టేట్’, ‘స్లీపింగ్ స్టేట్’ అని రెండు ఉంటాయి. మెలకువ దశలో ఉన్నప్పుడు జరిగినవన్నీ నిద్ర స్థితిలో మరచిపోతాం. ఉదాహరణకు, కోట్లకు కోట్లు అప్పు ఉందనుకోండి. నిద్రపోయేటప్పుడు అది గుర్తుకు రాదు కదా. అలాగే పిల్లలకు ఆరోగ్యం బాగాలేనప్పుడు, మెలకువగా ఉన్నంత వరకూ ఆందోళనపడతాం. నిద్రపోయాక మరచిపోతాం. వేకప్ స్టేట్‌లో జరగాల్సిన డ్రామా జరుగుతూ ఉంటుంది. దాన్నుంచి ఎవరూ తప్పించుకోలేరు. కాకపోతే ‘వేకప్ స్టేట్’, ‘స్లీపింగ్ స్టేట్’ గురించి అర్థం చేసుకున్నవాళ్లు వీటికి తక్కువ రియాక్ట్ అవుతారు. మనిషిగా పుట్టాం కాబట్టి, సమస్యలు తప్పవు. పుట్టేటప్పుడు మన బ్యాగేజ్లో ఏం రాసి ఉందో అవన్నీ అనుభవించాల్సిందే. మనం బలంగా ఉండాలంటే తప్పించలేని వాటి గురించి ఎక్కువగా ఆందోళన పడటం అనసవరం. ⇒ అన్నీ ఉన్న మీలాంటివాళ్లు ఎన్నైనా చెబుతారు.. వెంకీ: (నవ్వుతూ).. ఏదైనా రోగం వస్తే అన్నీ ఉన్నోళ్లు డబ్బూ పేరూ... ఏమీ వద్దు. ఆ రోగం పోతే చాలనుకుంటారు కదా. అసలు మనం రేపు చచ్చిపోతాం అనుకుంటే, ప్రపంచం గురించి తక్కువ ఆలోచిస్తాం. రేపు మనం చచ్చిపోతాం అనుకుని బతికితే ఇవాళ వర్రీ అవ్వం. ఎందుకంటే రేపు అనేది ఉండదు. ఇదిగో నేనిప్పుడు మీతో మాట్లాడుతున్నాను. బిస్కెట్స్ తిన్నాను, మంచినీళ్లు తాగాను, టీ తాగాను. ఈ క్షణం వరకూ అంతా బాగానే ఉంది కదా. రేపటి గురించి ఎందుకు అనుకుంటే,æలైఫ్ లీడ్ చేయడం ఈజీ. ⇒ మీకు ఎక్కువ హిట్లు ఉన్నాయి. అయినప్పటికీ అభిమానులు పెద్దగా హడావిడి చేసినట్లు కనిపించరెందుకు? వెంకీ: ఫ్యాన్స్ వాళ్ల కుటుంబాలతో గడపాలని కోరుకుంటాను. అది రైటో రాంగో తెలియదు కానీ, నేను బాగా పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు వాళ్లు చాలా హంగామా చేయాలనుకున్నారు. నేను ఒప్పుకునేవాణ్ణి కాదు. ‘మీ ఫ్యామిలీస్ చూసుకోండి’ అనేవాణ్ణి. ఫ్యాన్స్ నిరుత్సాహపడేవాళ్లు. ఎలాంటి హడావిడీ చేసేవాళ్లు కాదు. అది అలా కంటిన్యూ అయిపోయింది. ఇంకో విషయం ఏంటంటే... నేను రికార్డ్స్ గురించి అంత పర్టిక్యులర్‌గా ఎప్పుడూ ఆలోచించను. ⇒ మీ ఫ్యాన్స్‌లో ఎక్కువమంది ఆడవాళ్లు ఉన్నారు కదా! వెంకీ: అది కరెక్టే. ఫస్ట్ డే వాళ్లు సినిమా చూడ్డానికి రారు. అందరూ ఇంట్లో ఉంటారు. ప్లస్ హంగామా, హడావిడి చేయరు (నవ్వుతూ). ఒక యాక్టర్ తను చేసే సినిమాల పట్ల తను హ్యాపీగా ఉండాలి. సుధ: మొన్న పబ్లిక్ థియేటర్‌కి వెళితే, ఒక ప్రెగ్నెంట్ లేడీ సినిమా చూడ్డానికి వచ్చింది. కొడుకు పుడితే ‘జూనియర్ వెంకటేశ్’ అని పేరు పెట్టుకుంటా అంది. ఇంకా చాలామంది లేడీస్ సినిమా చూడ్డానికి వచ్చారు. వాళ్లు మాట్లాడుతుంటే, వెంకీకి ఎంత మంచి ఫీమేల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో అర్థమైంది. ⇒ నెక్ట్స్ మీ ప్రాజెక్ట్స్ గురించి? వెంకీ: ఇప్పుడు నేను హాలిడే మూడ్‌లో ఉన్నాను. సురేశ్ ఏవేవో స్రిప్ట్స్ వింటున్నాడు. నేను కొన్నాళ్లు రిలాక్స్ అయ్యాక వాటి మీద దృష్టి పెడతా. సుధ: ఇంకా ఏమీ అనుకోలేదు. అవకాశాలైతే ఉన్నాయి. – డి.జి. భవాని -
వివాహిత ఆత్మ‘హత్య’
- ఆత్మహత్య చేసుకుందంటూ పుట్టింటికి తప్పుడు సమాచారం - హత్య చేసి.. ఆపై ఆత్మహత్యగా చిత్రీకరణ - మా బిడ్డను భర్త, అత్తమామలే కొట్టి చంపారని హతురాలి తండ్రి ఆరోపణ - అనుమానాలు బలం చేకూర్చుతున్న నిందితుల పరారీ ఉదంతం అమరాపురం : అమరాపురం మండలం వీరాపురంలో సుధ(33) అనే వివాహిత ఆత్మ‘హత్య’ కలకలం రేపింది. పుట్టింటి నుంచి మెట్టినింటికి వచ్చిన కొన్ని గంటల వ్యవధిలోనే ఆమె ఉరికి వేలాడటం అనేక అనుమానాలకు తావిస్తోంది. మృతురాలి ఒళ్లంతా గాయాలుండడం.. భర్త, అత్త, మామ పరారీ కావడం అనుమానాలకు బలం చేకూర్చుతోంది. ఇది కచ్చితంగా హత్యేనని మృతురాలి తండ్రి సహా బంధువులు, గ్రామస్తులు అంటున్నారు. జరిగిందేమిటంటే... అమరాపురం మండలం వలస గ్రామానికి చెందిన బొప్పన్న కుమార్తె సుధ వివాహం ఇదే మండలం వీరాపురానికి చెందిన రంగస్వామితో పదేళ్ల కిందట అయింది. వారికి రాకేశ్ అనే ఒక కుమారుడు కూడా ఉన్నాడు. పెళ్లైనప్పటి నుంచి దంపతులు బతుకుదెరువు కోసం కర్ణాటక రాష్ట్రం బెంగళూరుకు వలస వెళ్లారు. అక్కడి ఓ ఫ్యాక్టరీలో పని చేసుకుని జీవనం సాగిస్తున్నారు. ఉగాదికి ఊరికొచ్చి... ఉగాది పండుగ కోసం సుధ, రంగస్వామి, వారి కుమారుడు వీరాపురానికి మంగళవారం వచ్చారు. గురువారం ఆమె తన పుట్టింటికెళ్లింది. భర్త పిలుపుతో ఆమె తన కుమారుడు, మరో బంధువుతో కలసి వీరాపురానికి శుక్రవారం సాయంత్రం బైక్‌లో వచ్చింది. అంతలోనే ఆత్మహత్య అంటూ ఫోన్.. శనివారం తెలతెలవారుతుండగానే అల్లుడి నుంచి బొప్పన్నకు ఫోన్ వచ్చింది. ‘మీ కుమార్తె ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందంటూ’ తెలిపాడు. బొప్పన్న సహా బంధువులు వెంటనే బయలుదేరి వీరాపురం చేరుకున్నారు. మృతురాలి ఒంటిపై గాయాలుండడం చూసి వారు నిశ్చేష్టులయ్యారు. తమ బిడ్డను అల్లుడు, అత్త, మామలే కొట్టి చంపేశారని బొప్పన్న ఆరోపించారు. ఇదే విషయాన్ని ఆయన రాతమూలకంగా ఏఎస్ఐ ఈరన్నకు ఫిర్యాదు చేశారు. నిందితుల పరారీ మృతదేహాన్ని వదిలేసి రంగస్వామి, అతని తల్లిదండ్రులు పరారీ కావడం అనుమానాలకు బలం చేకూర్చింది. ఇది కచ్చితంగా హత్యేనని గ్రామస్తులు కూడా ఆరోపించారు. పోలీసులు అనుమానాస్పద స్థితి మృతిగా కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మడకశిర ఆస్పత్రికి తరలించారు. -
వివాహిత ఆత్మ'హత్య'
► హత్య చేసి.. ఆపై ఆత్మహత్యగా చిత్రీకరణ ► ఆత్మహత్య చేసుకుందంటూ పుట్టింటికి తప్పుడు సమాచారం ► మా బిడ్డను భర్త, అత్తమామలే కొట్టి చంపారని హతురాలి తండ్రి ఆరోపణ ► అనుమానాలు బలం చేకూర్చుతున్న నిందితుల పరారీ ఉదంతం అనంతపురం: హత్య చేసి ఆత్మహత్య గా చిత్రికరించిన సంఘటన అమరాపురం మండలంలోని వీరాపురంలో వెలుగులోకి వచ్చింది. సుధ(33) అనే వివాహిత ఆత్మ'హత్య' కలకలం రేపింది. పుట్టింటి నుంచి మెట్టినింటికి వచ్చిన కొన్ని గంటల వ్యవధిలోనే ఆమె ఉరికి వేలాడటం అనేక అనుమానాలకు తావిస్తోంది. మృతురాలి ఒళ్లంతా గాయాలుండడం. భర్త, అత్త, మామ పరారీ కావడం అనుమానాలకు బలం చేకూర్చుతోంది. ఇది కచ్చితంగా హత్యేనని మృతురాలి తండ్రి సహా బంధువులు, గ్రామస్తులు అంటున్నారు. గ్రామానికి చెందిన బొప్పన్న కుమార్తె సుధ వివాహం వీరాపురం గ్రామానికి చెందిన రంగస్వామితో పదేళ్ల కింద జరిగింది. వారికి రాకేశ్ అనే ఒక కుమారుడు ఉన్నాడు. పెళ్లైనప్పటి నుంచి దంపతులు బతుకుదెరువు కోసం బెంగళూరుకు వలస వెళ్లారు.అక్కడి ఓ ఫ్యాక్టరీలో పని చేసుకుని జీవనం సాగిస్తున్నారు. ఉగాదికి ఊరికొచ్చి... ఉగాది పండుగ కోసం సుధ, రంగస్వామి, వారి కుమారుడు వీరాపురానికి మంగళవారం వచ్చారు. గురువారం ఆమె తన పుట్టింటికెళ్లింది. భర్త పిలుపుతో ఆమె తన కుమారుడు, మరో బంధువుతో కలసి వీరాపురానికి శుక్రవారం సాయంత్రం బైక్‌లో వచ్చింది. అంతలోనే ఆత్మహత్య అంటూ ఫోన్.. శనివారం తెలతెలవారుతుండగానే అల్లుడి నుంచి బొప్పన్నకు ఫోన్ వచ్చింది. మీ కుమార్తె ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందంటూ తెలిపాడు. బొప్పన్న సహా బంధువులు వెంటనే బయలుదేరి వీరాపురం చేరుకున్నారు. మృతురాలి ఒంటిపై గాయాలుండడం చూసి వారు నిశ్చేష్టులయ్యారు. తమ బిడ్డను అల్లుడు, అత్త, మామలే కొట్టి చంపేశారని బొప్పన్న ఆరోపించారు. ఇదే విషయాన్ని ఆయన రాతమూలకంగా ఏఎస్ఐ ఈరన్నకు ఫిర్యాదు చేశారు. నిందితుల పరారీ మృతదేహాన్ని వదిలేసి రంగస్వామి, అతని తల్లిదండ్రులు పరారీ కావడం అనుమానాలకు బలం చేకూర్చింది. ఇది కచ్చితంగా హత్యేనని గ్రామస్తులు కూడా ఆరోపించారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మడకశిర ఆస్పత్రికి తరలించారు. -
భర్త ఇంటి వద్ద భార్య నిరాహార దీక్ష
మదనపల్లి టౌన్: చిత్తూరు జిల్లా మదనపల్లి మండలం కొత్తపల్లి పంచాయతీ రంగారెడ్డి కాలనీలో వివాహిత భర్త ఇంటి ముందు ధర్నాకు దిగింది. సుధ(25) అనే యువతికి రెండు సంవత్సరాల క్రితం బాలప్రసాద్ అనే యువకుడితో వివాహం జరిగింది. వీరికి ఒక బాబు ఉన్నాడు. ప్రసవం కోసం పుట్టింటికి వెళ్లిన నాటి నుంచి కాపురానికి తీసుకెళ్లటం లేదని బాధితురాలు సుధ తెలిపింది. సుధ కుటుంబసభ్యులు సుమారు 10 మంది కలిసి బాల ప్రసాద్ ఇంటి ముందు నిరాహార దీక్షకు దిగారు. -
పాముకాటుకు మహిళారైతు మృతి
పొలంలో పని చేసుకుంటున్న మహిళా రైతు పాము కాటుకు గురై మృతిచెందిన సంఘటన ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం మల్కాపురం గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వీరమాసు సుధ(26) బావి వద్ద పని చేసుకుంటున్న సమయంలో పాము కాటు వేయడంతో.. ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో ఆమెను ఆస్పత్రికి తరలించడానికి ప్రయత్నించగా.. అప్పటికే మృతిచెందింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
పెళ్లి బట్టలు కుట్టించుకునేందుకు వెళ్లి..
నర్సాపూర్: పెళ్లి బట్టలు కుట్టించుకునేందుకు వెళ్లిన యువతి ఇంటికి తిరిగిరాలేదు. దీంతో అదృశ్యం కేసు నమోదు చేశారు. సోమవారం స్థానిక ఎస్ఐ ప్రభాకర్‌రెడ్డి తెలిపిన వివారల ప్రకారం.. మండలంలోని చిట్కూల్ గ్రామానికి చెందిన కామగొల్ల కిష్టయ్య పెద్దకూతురు సుధ (21) ఇంటర్మీడియట్ వరకు చదివింది. జోగిపేటలోని ఓప్రైవేటు ఆసుపత్రిలో నర్స్‌గా పనిచేస్తోంది. ఆమెకు ఇటీవలె కొల్చారం మండలం కోనాపూర్ గ్రామానికి చెందిన యువకుడితో పెళ్లి నిశ్చయం అయ్యింది. పిబ్రవరి నెలలో పెళ్లి నేపథ్యంలో కుటుంబ సభ్యులు ఏర్పాట్లుచేస్తున్నారు. అందులో భాగంగా సుధ డిసెంబర్ 26వ తేదిన జోగిపేటలో బట్టలు కుట్టించుకునేందుకు వెళ్తున్నానని ఇంట్లో చెప్పివెళ్లింది. తిరిగి ఇంటికి రాలేదు. బందువులు తెలిసిన చోట వెతికినా ఆచూకి తెలియరాలేదు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదుచేసుకొని విచారిస్తున్నారు. -
వివిధ సుధ
‘మహిళలకి ఇంటర్వ్యూ ఉండదా?!’ అని జేఆర్డీ టాటానే నిలదీసింది. గోల్డ్‌మెడలిస్ట్, ఇంజినీరింగ్‌లో టాపర్, పెద్ద ఉద్యోగం... అయినా మానేసుకుంది! వాళ్లాయన కోసం ఉద్యోగం మానేసుకుంది. వాళ్ల ఇన్ఫోసిస్ ఇప్పుడు నక్షత్రాలతో ముగ్గులు వేసుకునేంత ఎత్తుకు ఎదిగింది. వెంటనే... సుధ మళ్లీ భూమికి దిగొచ్చేసింది. పిల్లల, పేదల, వృద్ధుల, మహిళల, విధివంచితుల ఆశల పల్లకీని మోస్తోంది. ప్రభుత్వాలకు, పెద్దపెద్ద సంస్థలకు సేవామార్గాలు వేస్తోంది. సదా మీ సేవలో... అనే సుధ తను. చదువుంది, డబ్బుంది, హోదా ఉంది, సేవా తత్వం ఉంది.. అయినా... మూడొందల అరవై ఐదు రోజుల్లో... 365 సినిమాలు చూస్తుంది! ఆమె వివిధ. మన వివిధ సుధ. గోవాలోని పణజిలో ఫిబ్రవరి 1 నుంచి 5 వరకు తొమ్మిదవ ‘కొశాంబీ ఫెస్టివల్’ జరుగుతోంది. డి.డి. కొశాంబీ (1907-1966) చరిత్రకారుడు. ఆలోచనాపరుడు. సంఘశ్రేయోభిలాషి. ఆయన ఆలోచనలపై ఈ ఐదు రోజులూ ఐదుగురు సుప్రసిద్ధులు ప్రసంగిస్తారు. వారిలో ఒకరు ‘ఇన్ఫోసిస్ ఫౌండేషన్’ చైర్పర్సన్ సుధామూర్తి కూడా ఒకరు. సుధ ప్రారంభోపన్యాసం చేస్తారు. ‘ది సర్కిల్ ఆఫ్ లైఫ్’ అనే అంశం మీద మాట్లాడతారు. ఈ సందర్భంగా సుధామూర్తి లైఫ్ సర్కిల్ చుట్టూ చిన్న రౌండప్. శిలను ఉలి చెక్కుతుంది. ఉలిని ఆలోచన కదిలిస్తుంది. సుధామూర్తిని కూడా ఆమెకు ఎదురైన అనుభవాలు ఆలోచనలై మలిచాయి. పైకి ఆమె సాధారణ స్త్రీగా కనిపించవచ్చు. కానీ లోలోపల మూర్తీభవించిన ఒక సమున్నత సేవానురాగ వ్యక్తిత్వం ఆమె. సుధ అనుభవాలు కొన్ని.. ఆమె రాసిన ‘వైజ్ అండ్ అదర్వైజ్’ పుస్తకంలో ఉన్నాయి. వాటిల్లో ఎక్కువ భాగం ఆమెకు తారసపడిన వ్యక్తులకు సంబంధించినవే. హనుమంతప్ప అనే పిల్లవాడు ఉండేవాడు. అతడి చదువుకు, హాస్టల్ ఖర్చులకు సుధ డబ్బు పంపేవారు. ఓసారి ఆ డబ్బు వెనక్కి వచ్చేసింది! కారణం తెలుసుకుని ఆశ్చర్యపోయారు సుధ. ‘స్కూల్‌కి సెలవులిచ్చారు. సెలవుల్లో డబ్బు అవసరం ఉండదు... అందుకే తిప్పి పంపాను మేడమ్. క్షమించండి’ అని ఆ పిల్లవాడి సమాధానం. ఆ నిజాయితీకి ఆమె కదిలిపోయారు. సుధను ఆమె జీవితంలో కదిలించిన సంఘటనల్లో రెండు రకాలవీ ఉన్నాయి. మంచివీ, చెడువీ! భోరున వర్షం కురుస్తుంటే ఇల్లు తడిసి, కప్పు కారిపోతున్నా, ‘వానా వానా వల్లప్పా..’ అని ఆనందంతో నృత్యం చేసిన ఓ నిరుపేద కుటుంబాన్ని చూసి తన స్నేహితురాలు మీరా... పేదరికానికీ, ఆనందానికీ సంబంధమే లేదన్న జీవిత సత్యాన్ని గ్రహించిన విషయాన్ని సుధ తన అనుభవాలలో రాసుకున్నారు. విమానంలో తన సహ ప్రయాణికులైన అపరిచిత యువ దంపతులు... ‘వీరనారి’ ఝాన్సీ లక్ష్మీబాయి పేరే వినలేదని తెలిసి విస్మయం చెందారు. ఇంకా... రక్షాబంధన్ రోజే ఓ తమ్ముడు తన అక్కను పడువు వృత్తిలోకి నడిపించడం, తమిళనాడులోని స్వామిమలై సమీపంలోని ఒక ఆలయంలో అంధుడైన పూజారి.. తను ఇచ్చిన ఐదు వందల నోటును తడిమి చూసి, ‘అంత డబ్బును తనకు అక్కర్లేదు’ అని ఐదు పావలా బిళ్లలను మాత్రమే తీసుకోవడం వంటి పరస్పర విరుద్ధ సంఘటనలు సుధలో ఆలోచనలను రేకెత్తించి ఆమె వ్యక్తిత్వాన్ని రూపుదిద్దాయి. మహిళలు ఎందుకు వద్దు? సుధా కులకర్ణి. బెంగుళూరు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ క్యాంపస్ విద్యార్థిని. లేడీస్ హాస్టల్లో ఉండి పోస్ట్‌గ్రాడ్యుయేషన్ చేస్తోంది. ఓరోజు ఆమె... లెక్చర్ హాల్ కాంప్లెక్స్ నుంచి హాస్టల్‌కు తిరిగి వెళుతుంటే నోటీస్ బోర్డులో టెల్కో (ఇప్పటి టాటా మోటార్స్) కంపెనీ ఉద్యోగ ప్రకటన కనిపించింది. ‘‘కష్టించి పని చేయగల అత్యుత్తమ ప్రతిభావంతులైన యువ ఇంజినీర్లకు టెల్కో ఆహ్వానం పలుకుతోంది. ఆసక్తిగల గలవారు దరఖాస్తు చేసుకోవచ్చు’’ అన్నది సారాంశం.దాని కిందే చిన్న నోట్ : మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేయనవసరం లేదు. నోట్ చదవగానే సుధ తీవ్రమైన ఆవేదనకు లోనయ్యారు. అందులోని లైంగిక వివక్షను ఆమె సహించలేకపోతోంది. నిజానికి ఆమెకా ఉద్యోగం చెయ్యాలని లేదు. కానీ నోట్ చూశాక ఆ కంపెనీ యజమానికి కనువిప్పు కలిగించాలని గట్టిగా నిర్ణయించుకుంది. హాస్టల్ గదికి రాగానే పోస్ట్ కార్డు అందుకుని జె.ఆర్.డి. టాటాకు ఉత్తరం రాయడం మొదలు పెట్టింది. టెల్కో టాటా వాళ్లది కాబట్టి, టాటాకు అధినేత జె.ఆర్.డి. కాబట్టి నేరుగా ఆయన్నే ఉద్దేశించే రాసింది. వాస్తవానికి అప్పటి టెల్కో ఛైర్మన్ సుమంత్ మూల్గావ్కర్. ‘‘టాటాలంటే గొప్పవాళ్లు. ఇండియాకు రక్తమాంసాలు ఇచ్చినవాళ్లు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ వంటి విద్యాసంస్థల ఆవిర్భావం టాటాల పుణ్యమే. అదృష్టవశాత్తూ నేనక్కడే చదువుకుంటున్నాను. కానీ టెల్కో వంటి టాటా కంపెనీ లైంగిక వివక్షను పాటించడం నాకు ఆశ్చర్యంగా ఉంది’’.ఇంతవరకు రాసి సుధ ఆ ఉత్తరాన్ని డెరైక్టుగా జె.ఆర్.డి.కి పోస్ట్ చేశారు. తర్వాత ఆ విషయం మరిచిపోయారు. వారం తర్వాత... సుధకి టెలిగ్రామ్ వచ్చింది. టెల్కో ఇంటర్వ్యూకి రమ్మని!! పుణె దగ్గర పింప్రీలో ఇంటర్వ్యూ. సుధ వెళ్లింది. బోర్డు సభ్యులలో ఒకరు సుధను చూస్తూ -‘‘ఈ అమ్మాయే జె.ఆర్.డి.కి ఉత్తరం రాసింది’’అని పక్కన ఉన్నవాళ్లకు చెప్పడం ఆమె గమనించింది. ఏదో పిలవడానికి పిలిచారు కానీ, తనకా ఉద్యోగం రాదని సుధ అనుకుంది. అందుకే నిర్లక్ష్యంగా సమాధానాలిచ్చింది. పనిలో పనిగా అమ్మాయిలను ఉద్యోగాలకు వద్దనడం న్యాయమేనా? అని అడిగింది.ఇంటర్వ్యూ చేస్తున్నవాళ్లలో ఒక పెద్దాయన సౌమ్యంగా సమాధానం చెప్పారు. ‘‘చూడమ్మా... ఇది కో-ఎడ్యుకేషన్ కాలేజీ కాదు. కర్మాగారం. మీలాంటి ప్రతిభ గల అమ్మాయిల్ని రిసెర్చ్ లేబరేటరీలలోకి తీసుకోగలం కానీ, చూస్తూ చూస్తూ యంత్రాల మధ్యకు పంపలేం కదా. అందుకే అలా నోట్ పెట్టాం’’ అన్నారు. ‘‘ఎక్కడో ఒక చోట ఈ సంప్రదాయానికి బ్రేక్ పడాలి కదా’’ అంది సుధ. ఆమె అన్నట్లే బ్రేక్ పడింది. ఆమెకా ఉద్యోగం వచ్చింది. తర్వాత సుధా కులకర్ణి... సుధామూర్తి అయింది. అయితే పుణె నుంచి బాంబే బదలీ అయ్యేవరకు ఆమెకు జె.ఆర్.డి. దర్శనభాగ్యమే కలగలేదు. కంపెనీ ఛైర్మన్ సుమంత్ మూల్గావ్కర్కు ఏవో నివేదికలు అందించడం కోసం బాంబే హౌస్ ఫస్ట్ ఫ్లోర్లో వేచి ఉన్నప్పుడు అకస్మాత్తుగా ఓరోజు అమెకు జె.ఆర్.డి. కనిపించారు. అదే మొదటిసారి సుధ ఆయన్ని చూడ్డం! ఫస్ట్ ఉమన్ ఇంజినీర్ ‘‘జే.. టెల్కో ఫ్యాక్టరీలో చేరిన మొట్టమొదటి ఉమన్ ఇంజినీర్’’ అంటూ సుధను పరిచయం చేశారు సుమంత్. సుధలో వణుకు మొదలైంది. దేవుడా పోస్ట్ కార్డ్ సంగతి ఎత్తకుండా చూడు అనుకుంది. జె.ఆర్.డి. చిరునవ్వు నవ్వి సుమంత్‌తో మాటల్లో పడిపోయారు. ఆ తర్వాత అప్పుడప్పుడు టాటాహౌస్‌లో జె.ఆర్.డి. తారసపడుతూనే ఉన్నారు సుధకు. రాజీనామా! 1982లో టెల్కో నుంచి బయటికి వచ్చారు సుధ. నిజానికి అంతమంచి ఉద్యోగం మానేసి వెళ్లడం ఆమెకు ఇష్టం లేదు. కానీ తప్పని పరిస్థితి. ఫైనల్ సెటిల్మెంట్లన్నీ అయ్యాక బాంబే హౌస్ మెట్లు దిగుతుంటే జె.ఆర్.డి. ఎదురయ్యారు ఆమెకు. ఏదో ఆలోచనలో ఉన్నారు. ఆయన దగ్గర వీడ్కోలు తీసుకోవడం కోసం ఆగారు సుధ. ‘‘ఎలా ఉన్నావమ్మాయ్’’ అని అడిగారు జె.ఆర్.డి. ‘‘ఉద్యోగం మానేస్తున్నాను సర్’’ అని చెప్పింది సుధ.‘‘మానేసి?’’ ‘‘పుణె వెళ్లిపోతున్నాను సర్. నా హస్బెండ్ అక్కడ ఒక కంపెనీ స్టార్ట్ చేశారు. పేరు ఇన్ఫోసిస్’’. అరవై ఐదేళ్ల సుధామూర్తి ప్రస్తుతం ‘ఇన్ఫోసిస్ పౌండేషన్’కు ఛైర్ పర్సన్. ‘గేట్ ఫౌండేషన్’ సభ్యురాలు. అనాథాశ్రమాలను నడుపుతున్నారు. కంప్యూటర్ విద్యను ఒక ఉద్యమంలా కర్నాటక లోని ప్రభుత్వ పాఠశాలలకు అందుబాటులోకి తెస్తున్నారు. ఇవి వృత్తి వ్యాపకాలు. సుధ చక్కటి రచయిత్రి. కథలు రాస్తారు. కన్నడలో ఆమె రాసిన ‘డాలర్ సొసె’ ఇంగ్లిషు లోకి ‘డాలర్ బహు’ (డాలర్ కోడలు)గా తర్జుమా అయింది. జీ టీవీలో సీరియల్‌గా వచ్చింది. మరాఠీ సినిమా ‘పితృరూణ్’, కన్నడ చిత్రం ‘ప్రార్థన’లో ఆమె నటించారు. ఇవి ప్రవృత్తి జ్ఞాపకాలు. ఈ వ్యాపకాలు, జ్ఞాపకాల మధ్య సుధ తనని తాను నిత్యనూతనం చేసుకుంటున్నారు. సుధామూర్తికి ఇరవై వరకు ప్రతిష్టాత్మకమైన అవార్డులు వచ్చాయి. వాటిల్లో ఒకటి ‘పద్మశ్రీ’. సామాజిక కార్యకర్తగా... సుధ విషయంలో కార్యకర్త అనేమాట చిన్నదవుతుంది. ఏ పని చేసినా ఆమె దాన్నొక ఉద్యమంగానే నడిపారు. అలాగని తననొక ఉద్యమకారిణిగా ఆమె అంగీకరించరు. ఆరోగ్యం, విద్య, స్త్రీ సాధికారత, పరిశుభ్రత, కళలు-సంస్కృతి, పేదరిక నిర్మూలన, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి.. సుధ కృషి చేస్తున్న రంగాలు. ఆమె ప్రతి మాటా ఒక కోట్ లా ఉంటుంది. ‘పోరాటమే జీవితం’ అంటారు సుధామూర్తి. ‘మన పోరాటం మన జీవితం కోసం మాత్రమే కాకూడదు’ అని కూడా అంటారు. జె.ఆర్.డి. టాటా ఆమెకు ఆదర్శం. టెల్కోలో ఉద్యోగం మానేస్తూ బయటికి వస్తున్నప్పుడు ఆయన చెప్పిన మాట సుధకు ఈనాటికీ వేద వాక్కు. ‘డబ్బుకు మనం సొంతదారులం కాదు. సంరక్షకులం మాత్రమే. నువ్వు విజయం సాధించినప్పుడు, ఆ విజయంలో సమాజం నీకిచ్చిన సహకారం కూడా ఉంటుంది కాబట్టి, ఆ సహకారాన్ని తిరిగి నువ్వు నీ సమాజానికి ఇవ్వాలి’ అని జేఆర్డీ చెప్పిన మాటను నేనెప్పటికీ మరువలేను అంటారు సుధామూర్తి తన ప్రతి ప్రసంగంలో, ప్రతి ప్రస్తావనలో. చుట్టూ మసులుతున్న మనుషుల్లోని మంచితనాన్ని గమనించేంత సమయం, సానుకూల దృష్టి ఉంటే మనలో ప్రతి ఒక్కరి జీవితం సమాజానికి ఉపయోగపడుతుందన్నన్న విషయాన్ని సుధామూర్తి జీవనశైలి ప్రతిఫలిస్తుంది. సుధ 1950 ఆగస్టు 19న షిమోగా (కర్నాటక)లో జన్మించారు. తండ్రి ఆర్.హెచ్. కులకర్ణి. తల్లి విమల కులకర్ణి. తమ్ముడు శ్రీనివాస్ కులకర్ణి. కాలిఫోర్నియాలో ఆస్ట్రోఫిజిక్స్ ప్రొఫెసర్. అక్కా తమ్ముడు చిన్నప్పుడు అమ్మమ్మ, తాతయ్యల దగ్గర పెరిగారు. ఆ జ్ఞాపకాలతో సుధ ‘హౌ ఐ టాట్ మై గ్రాండ్‌మదర్ టు రీడ్ అండ్ అదర్ స్టోరీస్’. రాశారు. ఇవి పిల్లల కథలు. ఇదే ఆమె తొలి రచన. ఆ తర్వాత ఇప్పటి వరకు కన్నడంలో 16, ఇంగ్లిషులో 13 రచనలు చేశారు సుధ. ఆమె భర్త నారాయణమూర్తి ఐటీ దిగ్గజం. ఇన్ఫోసిస్ కో ఫౌండర్. సుధ కొడుకు రోహన్. కోడలు లక్ష్మీ వేణు. కూతురు అక్షత. అల్లుడు రిషి సునక్. రోహన్, అక్షత అక్కాతమ్ముళ్లు. సినిమాలంటే ఇష్టం! సుధామూర్తి దగ్గర 500 సినిమా డీవీడీలు ఉన్నాయి. ఇంట్లో హోమ్ థియేటర్ ఉంది. ‘‘రోజుకు కనీసం ఒక సినిమా అయినా చూస్తాను. సినిమాలు నాకు ఎప్పటికీ బోరు కొట్టవు. నిజానికి నేను సినిమా జర్నలిస్టును కావాలనుకున్నాను’’ అని ఓసారి ‘ఫిల్మ్‌ఫేర్’ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు సుధ. -
సైబర్ రాముడు
తెలుగుజాతికి అయోధ్యాపురి భద్రగిరి అయితే.. హైదరాబా దీలకు భద్రాద్రి హైటెక్‌సిటీ దగ్గర వెలసిన శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయం. భద్రగిరి రామయ్య పాదాలు కడిగేందుకు గోదారి పొంగితే.. ఈ సైబర్ రాముడి పాదాల చెంతన పుట్టిన ఐటీ ప్రవాహం ప్రపంచవ్యాప్తమైంది. భద్రుడు కొలిచిన రాముడికి రామదాసు ఆలయం కట్టిస్తే..ముమ్మూర్తులా అదే రూపంతో ఉన్న రాముడిని సిటీవాసుల దరి చేర్చాడు ఓ రామభక్తుడు. ఆ ఆలయ విశేషాలు శ్రీరామనవమి సందర్భంగా.. ..:: త్రిగుళ్ల నాగరాజు చతుర్భుజములతో.. వామహస్తాల్లో చక్రం, ధనస్సు, దక్షిణ హస్తాల్లో శంఖం, బాణం ధరించి.. ఎడమ తొడపై సీతమ్మతల్లి ఆసీనురాలు కాగా.. లక్ష్మణస్వామి సమేతుడై దాశరథి.. భద్రాచలంలో ఆత్మారాముడిగా భక్తుల పూజలందుకుంటున్నాడు. భద్రగిరిలో కొలువుదీరిన ఈ రాముడి ప్రతిరూపమే సైబర్సిటీలో కొలువుదీరింది. 14 ఏళ్ల సమయం.. నాలుగు దశాబ్దాల కిందట 1972లో రామభక్తుడు న్యాపతి రామారావు మదిలో ఓ రామాలయం నిర్మించాలనే భావన కలిగింది. ఇదే విషయం తను ఎంతగానో ఆరాధించే కంచి పరమాచార్య, నడిచే దైవం చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారికి విన్నవించుకున్నారు. భద్రాచలం వెళ్లి దర్శనం చేసుకోలేని భక్తుల కోసం భద్రాద్రి రాముడి ప్రతిరూపంగా ప్రతిష్ఠించమని సెలవిచ్చారు స్వామి. ఆలయ నిర్మాణానికి ఇప్పుడు హైటెక్‌సిటీగా పిలుస్తున్న కొండాపూర్ గ్రామం అయితే బాగుంటుందని సూచించారు. అప్పుడది అరణ్యం. భవిష్యత్తులో ఈ ప్రదేశం ప్రపంచ ప్రఖ్యాతి చెందుతుందని స్వామి ఆనాడే చెప్పారట. స్వామి అనుగ్రహంతో కొండాపూర్‌లో ఏడెకరాల స్థలం కొనుగోలు చేశారు రామారావు. తర్వాత పదేళ్లకు 1982 ఏప్రిల్ 8న ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమం కోసం కంచి స్వామివారు శంఖం కూడా పంపించారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక నుంచి నిర్మాణరంగ నిపుణులను తీసుకొచ్చారు రామారావు. కారణాంతరాలు ఏవైనా, కాకతాళీయమైనా.. ఆలయ నిర్మాణానికి సరిగ్గా.. 14 ఏళ్లు పట్టింది. వనవాసం పూర్తిచేసుకున్న నీలిమేఘశ్యాముడు పట్టాభిరాముడైనట్టు 1996 ఏప్రిల్ 22న కంచి స్వాములు జయేంద్ర సరస్వతి, విజయేంద్ర సరస్వతి స్వాముల చేతుల మీదుగా లక్ష్మణ సమేతుడైన సీతారాముల విగ్రహ ప్రతిష్ఠాపన జరిగింది. నాటి నుంచి ఈ ఆలయాన్ని భక్తులు అపరభద్రాద్రిగా కొలుస్తున్నారు. అద్వైత క్షేత్రం.. ఆధునిక ప్రపంచానికి ప్రతీకగా భాసిల్లుతున్న సైబరాబాద్‌లో ఆధ్యాత్మిక సుగంధాలు పంచుతోంది ఈ రామాలయం. ‘19 ఏళ్లుగా శ్రీరామ నవమి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని చెబుతున్నారు దేవస్థానం కమిటీ చైర్మన్, న్యాపతి రామారావు కుమారుడు డా.శ్రీనివాసరావు. ‘మా నాన్నగారు న్యాపతి రామారావు సంకల్పం, కంచి స్వామి వారి అనుగ్రహంతో ఈ ఆలయం నిర్మితమైంది. ఇప్పటికే దేవాలయ ఆవరణలో సుదర్శన నరసింహస్వామి, గోదాదేవి ఆలయాలు నిర్మించాం. అద్వైత భావాన్ని చాటుతూ ఇటీవల ఆలయ ప్రాంగణంలో శివాలయం (ఏకాంబరేశ్వర స్వామి) నిర్మించాం. రానున్న రోజుల్లో ఈ ఆధ్యాత్మిక కేంద్రాన్ని మరింత విస్తరిస్తాం’ అని తెలిపారు శ్రీనివాసరావు. కల్యాణం చూతము రారండి.. శ్రీరామనవమి సందర్భంగా స్వామివారి కల్యాణానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆలయం చుట్టూ చలువ పందిళ్లు వేసి అందంగా ముస్తాబు చేశారు. ‘స్వామివారి కల్యాణ వేడుకలో భాగంగా గత ఆదివారం అంకురార్పణ చేశాం. నాటి నుంచి ప్రతి రోజూ విశేష వాహన సేవలు నిర్వహిస్తున్నాం. శనివారం ఉదయం 9.45 గంటలకు స్వామివారి కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహిస్తామ’ని తెలిపారు దేవస్థానం కమిటీ సెక్రటరీ భానుమూర్తి. అందరి దేవుడు.. అందరికీ శ్రీ రామనవమి శుభాకాంక్షలు. నేను 19 ఏళ్లుగా ఈ ఆలయానికి వస్తున్నాను. ఈ ఆలయంలోకి అడుగుపెట్టడంతోనే ప్రశాంతత కలుగుతుంది. ఇక్కడి రాములవారి మూలవిరాట్‌ను దర్శించుకోవడం ఓ భాగ్యంగా భావిస్తాను. రాముడు అందరి దేవుడు. మానవుడి నడవడి ఎలా ఉండాలో రాముడు నడిచి చూపించాడు. ఆయన చూపిన బాట యుగధర్మాలకు అతీతమైంది. నాటికీ నేటికీ ఏనాటికీ అనుసరణీయమైనది. - సుధ, సినీనటి -
మరో నలుగురికి చోటు
వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శులుగా నియామకం సాక్షి గుంటూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గంలో జిల్లాకు చెందిన మరో నలుగురు నాయకులకు చోటు దక్కింది. ఈ నలుగురూ రాష్ట్ర కార్యదర్శులుగా నియమితులయ్యారు. వినుకొండ నియోజకవర్గ నాయకురాలు డాక్టర్ నన్నపనేని సుధ, సత్తెనపల్లి నియోజకవర్గానికి చెందిన ఆరిమండ వరప్రసాద్‌రెడ్డి, గుంటూరు తూర్పు నియోజక వర్గానికి చెందిన ఎమ్.డి. నసీర్ అహ్మద్, నరసరావుపేట పార్లమెంట్ ఇన్చార్జి ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిల సోదరుడు ఆళ్ల పేరిరెడ్డిలను రాష్ట్ర కార్యదర్శులుగా నియమించినట్టు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మంగళవారం ప్రకటించింది. -
రోడ్డు ప్రమాదంలో నన్నపనేని అల్లుడికి గాయాలు
హైదరాబాద్: కారు అదుపుతప్పి రోడ్డు పక్కనున్న కాలువలో పడిపోయిన ఘటనలో అందులో ప్రయాణిస్తున్న టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి అల్లుడు, వైఎస్సార్సీపీ నేత సుధ భర్త లతీష్‌రెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. లతీష్‌రెడ్డి డ్రైవర్‌తో కలిసి గుంటూరు నుంచి హైదరాబాద్‌కు జైలో కారులో వస్తున్నారు. సోమవారం ఉదయం వేగంగా వచ్చిన కారు కొత్తగూడెం వద్ద వంతెనపై అదుపుతప్పి పడిపోయింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న లతీష్‌రెడ్డి కాలికి, తలకు గాయాలయ్యాయి. దీంతో ఆయనను హయత్‌నగర్‌లోని సన్‌రైజ్ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి అమీర్‌పేటలోని స్టార్ ఆసుపత్రికి తరలించారు. -
పోల్చుకుంటే... పోగొట్టుకోవడమే!
‘‘నాకు కుదరదులే సుధా! సాయంత్రం మీ బావగారి ఫ్రెండ్సెవరో భోజనానికి వస్తానన్నారట. మీరు వెళ్లండి పార్టీకి’’... అక్కయ్య మాట వినగానే నీరసం వచ్చేసింది సుధకి. బంధువుల ఇంట్లో పార్టీ. వాళ్లు తనకంటే అక్కయ్యకే క్లోజ్. అందుకే తనతో వెళ్దామనుకుంది. కానీ ఆమె రాననేసరికి.... ఒక్కతే వెళ్లడం ఎందుకు, అక్కయ్య ఇంటికి వెళ్లి, తనకి సాయం చేస్తే బెటరనుకుని బయలుదేరింది. సాయంత్రం రమ్య ఇంటికి వచ్చిన సుధకి అక్కడ హడావుడేమీ కనిపించలేదు. చీరకి ఫాల్స్ కుట్టుకుంటోంది రమ్య. వాళ్లాయన రమేశ్ పక్కనే కూచుని పేపర్ చదువుతున్నాడు. పిల్లలు టీవీ చూస్తున్నారు. ‘‘ఏంటింత కూల్‌గా ఉన్నారు? ఎవరో భోజనానికి వస్తున్నారని అన్నారు? వంట మొదలుపెట్టలేదా?’’ అంది సుధ ఇంట్లోకి వస్తూనే. ఆమె రాకని ఊహించని రమ్య అవాక్కయ్యింది. ‘‘భోజనానికి వస్తున్నారా? ఎవరు? అలాంటిదేం లేదే’’... అన్నాడు రమేశ్ నింపాదిగా. ‘‘అదేంటి... మీ ఫ్రెండ్స్ ఎవరో వస్తున్నారని చెప్పింది అక్క. అందుకే తనకి సాయం చేద్దామని పార్టీకి వెళ్లకుండా ఇటొచ్చాను’’ అంది సుధ ఆశ్చర్యంగా. అర్థం కానట్టు చూశాడు రమేశ్. రమ్య మాత్రం దించిన తల ఎత్తలేదు. సుధకి విషయం అర్థమయ్యింది. గత కొన్నాళ్లుగా అక్కయ్య తనతో ముభావంగా ఉంటోంది. ఒకే ఊరిలో ఉంటూండటంతో తరచూ ఇంటికొచ్చేది. పండుగలప్పుడు, సెలవులప్పుడు అందరూ కలిసి ఎంజాయ్ చేసేవారు. కానీ ఇప్పుడవన్నీ తగ్గిపోయాయి. పైగా ఏ పార్టీకో, ఫంక్షన్‌కో పిలిచినా రానంటోంది. ఇప్పుడేమో ఇంత పెద్ద అబద్ధం చెప్పి తనని అవాయిడ్ చేసింది. అక్క మనసులో ఏదో ఉందని అర్థమైంది సుధకి. అదేమిటని తరచి తరచి అడిగింది. చివరకు ఆమెతో నిజం చెప్పించింది. రమ్యకు చెల్లెలంటే ప్రేమే. కానీ ఆమెను, ఆమె భర్తను చూసినప్పుడల్లా ఏదో బాధ. కారణం... వారి అంతస్తుల మధ్య తారతమ్యం. రమ్య భర్త రమేశ్ ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగి. నెలకి ఇరవై వేలు జీతం. కానీ సుధ భర్త విక్రమ్... వ్యాపారి. రెండు మూడు పెద్ద షాపింగ్‌మాల్స్ ఉన్నాయి సిటీలో. అలాగని వాళ్లేమీ ఎక్కువగా ఫీలవరు. కానీ రమ్య మాత్రం వాళ్ల దగ్గర తక్కువగా ఫీలవుతోంది. దానికి కారణం లేకపోలేదు. ఎక్కడికైనా వెళ్లినప్పుడు సుధ చాలా ఖరీదైన బట్టలు కట్టుకుంటుంది. నగలు వేసుకుంటుంది. పైగా మోడ్రన్‌గా ఉంటుంది. రమ్య దగ్గర అవేమీ ఉండవు. తను సాదా సీదా గృహిణిలా ఉంటుంది. దాంతో కొందరు మీ అక్కాచెల్లెళ్లిద్దరికీ పోలికే లేదు అంటూంటారు. ఆ పోలిక తమ ఆర్థిక స్తోమత గురించేనని రమ్యకు తెలుసు. అది ఆమెలో న్యూనతను పెంచింది. క్రమంగా చెల్లెలి మీద అసూయనూ కలిగించింది. ఆ పైన వారిద్దరి మధ్య దూరాన్ని కూడా ఏర్పరచింది. ఇలాంటి ఫీలింగ్స్ చాలామందిలో ఉంటాయి. అక్కాచెల్లెళ్లలోనే కాదు, తోడికోడళ్ల మధ్య కూడా ఇలాంటి తారతమ్యాలు అగాథాన్ని సృష్టిస్తుంటాయి. ఒకరు ఆర్థికంగా బాగుండి, మరొకరు కాస్త తక్కువలో ఉంటే... అవతలివారిలో కాస్త అసూయ కలగడం సహజం. అయితే అది హద్దు దాటి బంధాలను విచ్ఛిన్నం చేస్తేనే ప్రమాదం. అయినా నిజానికి అది అసూయపడాల్సిన విషయం కాదు. ఆనంద పడాల్సిన విషయం. మనవాళ్లు బాగుంటే మనకే కదా సంతోషం! అలా ఆలోచించడం మానేసి వారితో మాట్లాకుండా, వారికి దూరంగా ఉండిపోయి, వారితో పోల్చుకుని బాధపడుతూ ఉండటం వల్ల ఒరిగేదేటేంటి.. అందమైన అనుబంధాన్ని పాడు చేసుకోవడం, అమితమైన ఆనందాన్ని మిస్ చేసుకోవడం తప్ప! -
పరుగులు నిలబెట్టాయి
లత. పుణె. వయసు అరవై పైనే! సుధ... హైదరాబాద్. వయసు? వయసిక్కడ పాయింట్ కాదు. సుధ యాక్సిడెంట్ అయిన మనిషి. వెన్నుపూసలకు గాయాలు! కాలి చీలమండల్లో రాడ్లు! లత ఎవరో, సుధ ఎవరో. కామన్ పాయింట్ మాత్రం ‘పరుగులు’. మామూలు పరుగులు కావు. జీవితం పెట్టించిన పరుగులు. భర్త ప్రాణాలు దక్కించుకోడానికి లత... అరైవె ఏళ్ల మహిళలిచ్చిన స్ఫూర్తితో సుధ... ‘మారథాన్’ బరుల్లోకి దిగారు. విజేతలుగా నిలబడ్డారు. ‘ఐదునెలల దాకా మంచం దిగకూడదు. నడవడానికి ఏడాది పైనే పడుతుంది. ఆ తర్వాత కూడా బరువులు ఎత్తకూడదు. పరుగెత్తకూడదు’ డాక్టర్లు చెప్పిన మాటలు చెవిలో పడగానే మరోసారి రెండంతస్తుల మేడ మీద నుంచి కిందకి పడిపోయినట్లు అనిపించింది సుధకు. మామూలు మనిషి అవ్వడం గగనం అంటున్న డాక్టర్ మాటల్ని లెక్కచేయకుండా ఆమె సాధించిన విజయాల్ని చూస్తుంటే మనిషికి మనోధైర్యానికి మించిన మందు మరొకటి లేదనిపిస్తుంది. గత పదిహేనేళ్ల సుధ జీవితంలోకి చూస్తే ప్రమాదాలకు భయపడాల్సిన పని లేదనిపిస్తుంది. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే... ‘‘మా స్నేహితురాలు కొనుక్కున్న ఫ్లాట్ చూడ్డానికి నేను, నా భర్త చంద్రశేఖర్ వెంగళరావునగర్ వెళ్లాం. నిర్మాణం ఇంకా పూర్తవ్వలేదు. రెండోఅంతస్తు దాకా ఎక్కి, వెనక్కి తిరిగి చూస్తూ కింది మెట్టు మీదకు అడుగేశాను. మెట్లకు రెయిలింగ్ లేకపోవడం వల్ల కిందకు పడిపోయాను. రెండురోజులదాకా స్పృహ లేదు. తెలివి వచ్చాక డాక్టర్లు చెప్పిన మాటలు వింటే మళ్లీ నిద్ర పట్టలేదు. కానీ ధైర్యం కూడగట్టుకున్నాను. ఐదు నెలలు గడిచాక మెల్లగా నడవడం మొదలుపెట్టాను. వెన్ను చివర (ఎల్2, ఎల్2, ఎల్3, ఎల్5 డిస్క్‌లు) వీపుమీద చెయ్యిపెట్టి తడుముతుంటే బయటికి వచ్చినట్టు తగిలాయి. కాలు చీలమండ దగ్గర రాడ్స్ వేశారు. జాగ్రత్తగా ఉండాలన్నారు డాక్టర్లు. మరోపక్క అధికంగా బరువు పెరిగా. గాయాల సంగతి పక్కన పెట్టి బరువు తగ్గించుకోవాలనుకుని వాకింగ్ మొదలుపెట్టాను. క్రమంగా బరువు తగ్గాను. అయినా వాకింగ్ మానలేదు. అదే నా కొత్తజీవితానికి పునాది వేసింది. స్వచ్ఛంద సేవకు వెళ్లి... నాకు ప్రమాదం జరిగిన తర్వాత మేం దక్షిణాఫ్రికా వెళ్లి తొమ్మిదేళ్లు ఉండి వచ్చాం. అక్కడ ఒక ప్రైవేటు కంపెనీలో పనిచేసి, 2009లో హైదరాబాద్ వచ్చేశాక, వాకింగ్పై దృష్టి పెట్టాను. ఆ సమయంలోనే ఒక ఫ్రెండ్ సలహాతో హైదరాబాద్ రన్నర్ క్లబ్ ఆధ్వర్యంలో జరుగుతున్న మారథాన్ పోటీలు చూడ్డానికి వెళ్లా. ఆ మారథాన్‌లో యాభై అరవై ఏళ్ల వయసున్న మహిళల్ని చూసి ఆశ్చర్యపోయాను. ఇంతలో ఎయిర్టెల్వారు మారథాన్ నిర్వహిస్తున్నారని తెలిసి అందులో పాల్గొన్నాను. ఆఫ్ మారథాన్ అంటే ఇరవై ఒకటిన్నర కిలోమీటర్లు రెండున్నర గంటల్లో పరిగెట్టాను. మధ్యలో నాలుగైదుసార్లు వెన్ను నొప్పి వచ్చింది. కాలు కూడా నొప్పి పెట్టింది. రెండు నిమిషాలు పరుగు ఆపి నడకలోకి వచ్చి మళ్లీ మొదలెట్టి మెడల్ సంపాదించాను. ఇది జరిగింది 2011లో. ఆ తర్వాత మరో మారథాన్‌లో కూడా పాల్గొన్నాను. మారథాన్ వల్ల నా ఒంట్లో గాయాలు ఎక్కువవుతాయని డాక్టర్లు చెబుతుంటే...నేను మాత్రం ఆ గాయాలకు అదే మందని నమ్మాను. పద్దెనిమెది మెడల్స్‌తో... మారథాన్కంటే ముందు హైదరాబాద్ రన్నర్ క్లబ్లో సభ్యురాలిగా చేరాను. దాంతో దేశంలో ఎక్కడెక్కడ మారథాన్లు జరుగుతున్నాయో సభ్యుల ద్వారా తెలిసేది. అప్పుడప్పుడు వారితో కలిసి ఎక్కడ మారథాన్ ఉంటే అక్కడికి వెళ్లేదాన్ని. ఆ తర్వాత దేశంలో ఎక్కడెక్కడ మారథాన్ పోటీలు జరుగుతున్నాయో తెలుసుకుని ఒంటరిగా వెళ్లడం కూడా మొదలుపెట్టాను. పునె, భువనేశ్వర్, సతార, పాండిచ్చేరి, హిమాలయ, చెన్నై, గోవా, తంజావూర్, కోయంబత్తూర్...ఇలా అన్ని ప్రాంతాల్లో నిర్వహించిన మారథాన్‌లో పాల్గొని 18 మెడల్స్ మెడలో వేయించుకున్నాను. ఇల్లు... వాకిలి గత ఏడాది పన్నెండు మారథాన్లలో పాల్గొన్నాను. నా భర్త, నా పిల్లలు నా గెలుపుని బాగా ఎంజాయ్ చేస్తారు. మా పెద్దమ్మాయి స్నిగ్ద కరాటే బ్లాక్ బెల్టర్. చిన్నమ్మాయి సమీర మూడోతరగతి చదువుతోంది. మారథాన్ నా జీవితంలో చాలా మార్పు తీసుకొచ్చింది. ప్రస్తుతం నా కొత్త లక్ష్యం సైక్లింగ్. అందులో కూడా ఊహించని విజయాలు చూడాలన్నది నా కోరిక. ఒక పక్క గాయాలు నన్ను వేధిస్తున్నా...వాటిని అధిగమించడానికి వైద్యుల సలహాలకంటే ఈ పరుగుపందాలే ఎక్కువ ఉపశమనం ఇస్తున్నాయి. ఈ పదిహేనేళ్లలో జీవితం నాకు నేర్పింది పడడం, లేవడం ఒక్కటే కాదు. గాయాన్ని లెక్కచేయకపోవడం. అది మనసుకైనా, శరీరానికైనా. మరో ముఖ్యమైన విషయం మహిళ జీవితంలో తనకంటూ కొంత చోటు ఏర్పాటుచేసుకోవాలి. అందులో తల్లితండ్రులు, పిల్లలు, భర్త, సమాజం... అంటూ ఏమీ ఉండకూడదు. అందులో జీవిత లక్ష్యాలు, ఇష్టాలు, అవసరాలు మాత్రమే ఉండేలా చూసుకోవాలి. రోజులో ఒక పది నిమిషాలు అలా ఉండగలిగినా ఆమెలోని శక్తి పూర్తిస్థాయిలో బయటికొస్తుంది’’ అని ముగించారు సుధ. కష్టాల్లోనూ కుంగిపోక ధైర్యంగా ముందడుగు వేసిన ఆమె అడుగుల వేగం ఇంకా పెరగాలని కోరుకుందాం. - భువనేశ్వరి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి; ఫొటోలు: ఎస్.ఎస్. ఠాకూర్ ఒకసారి ఏమైందంటే... హిమాలయాలకు వెళ్లినపుడు అనుకోకుండా ఒక కొండదగ్గర దారి తప్పాను. వారిని వెతికే ప్రయత్నంలో కాలు జారి లోయలో పడిపోయాను. నా ఫోన్ సిగ్నల్ సరిగా లేదక్కడ. ఎంత అరిచినా ఎవరూ రావడం లేదు. నా గ్రూప్వారంతా నాకోసం వెతుకుతున్నారు. ఇంతలో సిగ్నల్ దొరికింది. నా తోటివారికి ఫోన్‌చేశాను. వాళ్లొచ్చి నన్ను పైకి తీసుకొచ్చారు. ఆ దెబ్బతో మారథాన్‌కి బ్రేక్ పడుతుందనుకున్నారంతా. నేను మాత్రం థ్రిల్లింగ్‌గా ఫీలయ్యాను. మారథానక్ ఆపలేదు సరికదా, ఈ మధ్యనే సైక్లింగ్ కూడా చేయాలనిపించి ప్రాక్టీస్ మొదలెట్టాను. రోజూ ఉదయం ఎనిమిది కిలోమీటర్లు సైక్లింగ్ చేస్తున్నాను. *************** కూలినాలి చేసుకునే ఆమెకు మారథాన్ అంటే ఏమిటో కూడా తెలియదు. భర్త ఆరోగ్య పరీక్షలకు కావలసిన ఖర్చులే కళ్లముందున్నాయి. పరుగెత్తగలనన్న ధైర్యమే పోటీలో పాల్గొనేలా చేసింది. అడుగులు వడివడిగా పడేలా చూసింది. భర్తపై ఉన్న అనురాగమే అరవై ఏళ్ల ఆమెను మారథాన్‌లో గెలిపించింది. ఆమే పుణేకు చెందిన లతా కారే. ఓ పరుగు ఆమె జీవితాన్ని మార్చింది. కట్టుకున్న భర్త కోసం మారథాన్‌లో తీసిన పరుగు, ఆమె జీవితాన్ని మార్చేసింది. ఆమె సాహసం మహిళలకు ఆదర్శంగా నిలబెట్టేలా చేసింది. భర్త మీద ఉన్న అనురాగం, ఆరు పదులు దాటిన వయసులో పరుగెత్తేలా చేసింది. మారథాన్ అంటేనే తెలియని ‘లతా కారే’ పుణే జిల్లా బారామతిలో జరిగిన మూడు కిలోమీటర్ల మారథాన్‌లో విజయం సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. భర్తకు వైద్యపరీక్షలు చేయించేందుకు 5000 రూపాయల కోసం పరుగెత్తిన ఆమెను ఆదుకునేందుకు అనేక ఆపన్నహస్తాలు ముందుకువ చ్చాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహకారంతో స్థానిక పాత్రికేయులు ఆమె పేరుపై బ్యాంకు అకౌంట్ ప్రారంభించారు. వారం తిరగకుండానే మూడు లక్షల రూపాయలకు పైగా ఆమె ఖాతాలో జమయ్యింది. ఇంకా జమ అవుతూనే ఉంది. బుల్డానా నుంచి దాంపత్య జీవనం ప్రారంభం... వాషీంజిల్లాకి చెందిన లతాకు భగవాన్‌తో వివాహం జరిగింది. ప్రభుత్వం అందించే ఉపాధి హామీ పథకం పనులతో సహా ఏ పని లభిస్తే ఆ పనిచేస్తూ వీరు జీవితం గడపసాగారు. వీరికి ముగ్గురు కూతుళ్లు, ఒక కుమారుడు. పిల్లలకు చదువు చెప్పించాలనుకున్నారు. కాని వచ్చే కూలి డబ్బులతో ఇల్లు గడవడమే కష్టంగా ఉండేది. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ... ఎలాగైతేనేం... పిల్లలకు పెళ్లిళ్లు చేశారు. ఆ తర్వాత పనులు దొరకడం కష్టమైంది. బారామతికి... బారామతిలో పని లభిస్తుందని తెలిసి, నాలుగేళ్ల కిందటే పొట్ట చేత పట్టుకుని అక్కడికి మకాం మార్చారు. కుటుంబమంతా కూలి చేస్తున్నప్పటికీ వీరి సంపాదన ఇంటి ఖర్చులకే సరిపోయేదికాదు. ఇంతలో లతాభర్త భగవాన్‌కు గుండెపోటు వచ్చింది. వైద్యులు ఆమె భర్తకు ఎంఆర్ఐ తదితర పరీక్షలు చేయాలని, ఇందుకోసం మూడు వేల రూపాయలు ఖర్చవుతుందని చెప్పడంతో ఆమెకు ఏమి చేయాలో అర్థం కాలేదు. ఆదర్శంగా నిలబడింది... పుట్టెడు కష్టంలో ఉన్న లతాకు... శరద్‌పవార్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని సీనియర్ సిటిజన్ల కోసం 2013 డిసెంబరు 16న ‘శరద్ మారథాన్’ పేరుతో, బారామతిలో 3 కిలోమీటర్ల పరుగుపందెం ఏర్పాటుచేశారని, తాము కూడా ఆ పోటీలో పాల్గొంటున్నామని ఇరుగుపొరుగు వారు చెప్పారు. దీంతో పరుగుపందెంలో పాల్గొంటే 5000 రూపాయలు గెలవచ్చన్న ఆశ కలిగింది. ప్రేమ, పట్టుదలలే గెలిపించాయి... కూలినాలి చేసుకునే ఆమెకు, మారథాన్ అంటే ఏమిటో కూడా తెలియకపోయినా, పరుగెత్తగలనన్న ధైర్యమే పోటీలో పాల్గొనేలా చేసింది. కాని కుటుంబసభ్యులు ‘ఈ వయసులో పరుగెత్తడం ఏమిటి’ అని వారించారు. మారథాన్ మరో రెండురోజుల్లో ఉందనగా ఆమెకు జ్వరం వచ్చింది. కుటుంబ సభ్యులందరూ వెళ్లవద్దని ఆమెపై ఒత్తిడి పెంచడంతో, సరే అంది. ఆ రాత్రికి ఊరుకుని, మరుసటి రోజు ఉదయం, జ్వరానికి మాత్రలు తెచ్చుకుంటానని చెప్పి, సరాసరి మారథాన్ జరిగే స్థలానికి వె ళ్లింది. మారథాన్‌లో అందరూ ఒక్కసారిగా పరుగు ప్రారంభించారు. లతా కూడా పరుగు తీయడం ప్రారంభించింది. కాళ్లకు చెప్పులు లేకుండా తొమ్మిది గజాల చీరతో మారథాన్ రేసులో పరుగెత్తుతున్న ఆమెను అందరూ ఆశ్చర్యంగా చూడసాగారు. ఇవేవీ పట్టించుకోకుండా తన భర్త వైద్యపరీక్షలను తలుచుకుంటూ నెత్తిపై కొంగుకప్పుకుని ఎలాగైనా ఈ రేసులో విజయం సాధించాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్లసాగింది. అంతలోనే ‘మారథాన్ విజేత లతా కారే’ అనే ప్రకటన వెలువడింది. ఆమె ఆనందానికి అవధులు లేవు. భర్త వైద్య పరీక్షల కోసం మారథాన్‌లో పాల్గొని, విజేతగా నిలవడంతో మీడియాతోపాటు ప్రజలు కూడా ఆమెను అభినందనలతో ముంచెత్తారు. నిర్వాహకులు ఐదు వేల రూపాయల నగదును బహుమతిగా ఆమెకు అందించారు. - గుండారపు శ్రీనివాస్, సాక్షి, ముంైబె మారిన జీవన శైలి... మారథాన్ రేసు లతాకు రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిపెట్టింది. స్థానికంగా ఉన్న ప్రదీప్ గురవ్ (దివ్య మరాఠి), జితేంద్ర జాదవ్ (ఐబిఎన్ లోకమత్) అనే ఇద్దరు పాత్రికేయులతోపాటు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బారామతి శాఖ అధికారి కులకర్ణి సహకారంతో ఆమె పేరుపై అకౌంట్ ప్రారంభించారు. దీంతో అనేక ఆపన్న హస్తాలు ముందుకు వచ్చాయి. వారం తిరగకుండానే సుమారు మూడువందల మందికిపైగా సుమారు రూ. మూడు లక్షల వరకు జమ చేశారు. తనకు, తన కుటుంబానికి సహకారం అందించి ఆదుకున్న వారందరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపింది.