రోడ్డు ప్రమాదంలో నన్నపనేని అల్లుడికి గాయాలు | injuries in a road accident to the Nannapaneni daughter's husband | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో నన్నపనేని అల్లుడికి గాయాలు

Published Tue, Jul 1 2014 3:14 AM | Last Updated on Fri, Aug 10 2018 8:08 PM

injuries in a road accident to the Nannapaneni daughter's husband

హైదరాబాద్: కారు అదుపుతప్పి రోడ్డు పక్కనున్న కాలువలో పడిపోయిన ఘటనలో అందులో ప్రయాణిస్తున్న టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి అల్లుడు, వైఎస్సార్‌సీపీ నేత సుధ భర్త లతీష్‌రెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. లతీష్‌రెడ్డి డ్రైవర్‌తో కలిసి గుంటూరు నుంచి హైదరాబాద్‌కు జైలో కారులో వస్తున్నారు.

సోమవారం ఉదయం వేగంగా వచ్చిన కారు కొత్తగూడెం వద్ద వంతెనపై అదుపుతప్పి పడిపోయింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న లతీష్‌రెడ్డి కాలికి, తలకు గాయాలయ్యాయి. దీంతో ఆయనను హయత్‌నగర్‌లోని సన్‌రైజ్ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి అమీర్‌పేటలోని స్టార్ ఆసుపత్రికి తరలించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement