ఎన్నో వందలాది చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది నటి సుధ. బాలనటిగా అలరించిన ఆమె పద్నాలుగేళ్ల వయసులోనే హీరోయిన్‌గానూ మారింది. ఆ తర్వాత అత్తగా, అమ్మగా, వదినగా ఇలా ఎన్నో పాత్రల్లో ఒదిగిపోయి ప్రేక్షకులకు మరింత దగ్గరైంది సుధ. తాజాగా ఆమె తన జీవితంలోని ఒడిదుడుకులను కళ్లకు కట్టినట్లు వివరించింది.
ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. 'ఇన్నేళ్ల కెరీర్‌లో చాలా సంపాదించుకున్నాను, కానీ బిజినెస్‌లు పెట్టి ఉన్నదంతా పోగొట్టుకున్నాను. ఢిల్లీలో ఒక హోటల్ పెట్టినప్పుడు లాభం వస్తే దాంతో మరో హోటల్ పెట్టాను. అప్పుడు నష్టాలొచ్చి నిండా మునిగాను. కొన్నాళ్లపాటు నేను హైదరాబాద్‌లోనే ఉన్నాను. కానీ కుటుంబ సమస్యలు, అమ్మాయి పెళ్లి ఉండటంతో చెన్నైకి మారాల్సి వచ్చింది. అబ్బాయి యూఎస్‌లో ఉన్నాడు.'
'చిన్నప్పుడే అమ్మ హార్ట్ ఎటాక్‌తో చనిపోయింది. ఆమె పోయిన తర్వాత కొడుకులున్నా నాన్నకు సపోర్ట్ లేకుండా పోవడంతో ఆయనని నేనే చూసుకున్నాను. నాన్నకు బాగానే ఆస్తుపాస్తులు ఉండేవి. కానీ క్యాన్సర్ వల్ల అది కరిగిపోయింది. అమ్మ పోయినప్పుడు కూడా అంత బాధపడలేదు, కానీ నాన్న పోయాక లైఫ్ అంటే ఏంటో తెలిసొచ్చింది. ఒంటరి జీవితాన్ని గడుపుతున్నాను. మనుషుల్ని నమ్మకూడదని అర్థమైంది. నాన్నకు క్యాన్సర్ అనగానే బంధువులంతా దూరం పెట్టారు.. వీటినుంచి నేను చాలా గుణపాఠాలు నేర్చుకున్నాను. నా భర్త, కొడుకులు కూడా నాకు దూరంగా ఎక్కడో యూఎస్‌లో ఉన్నారు. కానీ వాళ్లకూ నాలాంటి పరిస్థితే వస్తుంది. మాతృదేవోభవ సినిమాలోని చాలా సంఘటనలు నా నిజ జీవితంలో జరిగినవే..' అంటూ కన్నీళ్లు పెట్టుకుంది సుధ.
Comments
Please login to add a commentAdd a comment