Senior actress Sudha
-
తినడానికి తిండి లేక మంగళసూత్రం అమ్మాల్సి వచ్చింది: నటి
దాదాపు వెయ్యి సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల మనసులో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది సీనియర్ నటి సుధ. బాలనటిగా, హీరోయిన్గా, అత్తగా, అమ్మగా, వదినగా.. ఇలా ఎన్నో పాత్రల్లో ఇట్టే ఒదిగిపోయిన ఆమె జీవితంలో మాత్రం ఎన్నో కష్టనష్టాలను చవిచూసింది. దీని గురించి తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'నేను డైమండ్ స్పూన్‌తో పుట్టాను. పెద్ద ఇల్లు, ఇంటినిండా పనివాళ్లు, ముగ్గురు డ్రైవర్లు.. ఇలా చాలా రాజసంగా బతికాం. మా నాన్నకు నలుగురు కొడుకుల తర్వాత నేను పుట్టాను. అందుకే నాకు అమృతం అన్న అర్థం వచ్చేలా సుధ అని పేరు పెట్టారు. ఇంట్లో 20 తులాల బంగారు నగలు వేసుకుని తిరిగేదాన్ని. ఆస్తి, ఐశ్వర్యం అన్నీ చూశాను. కానీ తమ్ముడు పుట్టిన కొంతకాలానికే నాన్నకు క్యాన్సర్ అని తెలిసింది. అప్పటినుంచి ఆస్తి అంతా కరిగిపోవడం మొదలైంది. నేను ఆరో తరగతి చదివే సమయంలో అమ్మ తన మంగళసూత్రం అమ్మి మాకు భోజనం పెట్టింది. అలా అన్నీ ఉన్న స్టేజ్ నుంచి ఏమీ లేని స్థాయికి వచ్చాం. అమ్మ థియేటర్ ఆర్టిస్ట్ కావడంతో నన్ను కూడా యాక్టింగ్ ఫీల్డ్‌కు తీసుకొచ్చింది. డబ్బు, పేరు రావడంతో చుట్టాలు తిరిగి మావంక చూడటం మొదలుపెట్టారు. చిన్నతనంలో సుఖసంతోషాలతో పాటు ఎన్నో కష్టాలు పడ్డాము. ఆ మధ్య ఢిల్లీలో హోటల్ ప్రారంభించడంతో ఉన్న డబ్బంతా పోయింది. ఒక్క సంతకంతో వందల కోట్లు నష్టపోయాను. ఇంకా కొన్ని అప్పులైతే ఇప్పుడిప్పుడే వాటినుంచి బయటపడ్డాను. నా కొడుకు విదేశీ అమ్మాయిని పెళ్లి చేసుకుని అక్కడే సెటిలైపోయాడు. నాతో గొడవపడి వెళ్లిపోయాడు. ఇప్పటికీ మాట్లాడట్లేదు' అని చెప్తూ ఎమోషనలైంది సుధ. చదవండి: రాకీ భాయ్ స్థానంలో వేరే హీరో.. షాకిచ్చిన నిర్మాత తమ్ముడి బర్త్‌డే పార్టీలో శ్రీముఖి రచ్చ -
జూనియర్ ఎన్టీఆర్‌పై సీనియర్ నటి సుధ ఆసక్తికర వ్యాఖ్యలు
నటి సుధ.. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. దాదాపు 500లకు పైగా చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది ఆమె. బాలనటిగా అలరించిన ఆమె పద్నాలుగేళ్ల వయసులోనే హీరోయిన్‌గానూ అలరించింది. అప్పట్లో తమిళ్, తెలుగులో పలువురు స్టార్ హీరో సరసన నటించిన ఆమె ప్రస్తుతం అక్క, అత్త, అమ్మ, వదిన వంటి పాత్రల్లో మెప్పిస్తోంది. ఈ నేపథ్యంలో ఆమెకు ఫ్యామిలీ ఆడియన్స్ ఫాలోయింగ్ ఎక్కువే అని చెప్పాలి. చదవండి: రష్మికకు రిషబ్ శెట్టి గట్టి కౌంటర్, ట్వీట్ వైరల్ ఇదిలా ఉంటే ఇటివల ఓ యూట్యూబ్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో సుధ మాట్లాడుతూ.. తాను నాలుగు తరాల హీరోలతో నటించానంటూ ఆనందం వ్యక్తం చేసింది. ఇలాంటి ఘనత తనకే దక్కిందంటూ సుధ మురిసిపోయింది. అలాగే ఇప్పుటి హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్ అంటే తనకు చాలా ఇష్టమని చెప్పింది. తారక్‌తో ఆమె బాద్షా చిత్రంలో స్క్రీన్ షేర్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా బాద్షా మూవీ షూటింగ్ సమయంటో చోటుచేసుకున్న ఓ సంఘటనను గుర్తు చేసుకుంటూ తారక్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు సుధ జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ.. ‘తారక్ చాలా గొప్ప నటుడు. నిజానికి తనని వారు అని అనాలి. కానీ నా కొడుకు లాంటి వాడు కాబట్టి వాడు అంటున్నాను. తనతో నేను బాద్షా మూవీలో కలిసి నటించాను. తారక్ సెట్‌కి వస్తే చాలు గోలగోలగా ఉండేది. సెట్లో చాలా అల్లరి చేసేవాడు. అలాగే హుందాగా కూడా వ్యవహరించేవాడు. అంత పెద్ద స్టార్ అయినప్పుటికి సెట్లో అందరితో కలివిడిగా ఉంటాడు. బాద్షా షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరుగుతుంది. నేనూ తారక్ స్టేజ్‌పై డాన్స్ చేసే సీన్ అది. చదవండి: మహేశ్-రాజమౌళి మూవీ నుంచి బిగ్ అప్డేట్ బయటపెట్టిన రచయిత మొదటి టేక్ బాగా వచ్చింది. కానీ నేను మరో టేక్కు వెళ్దాం అన్నారు. ఎందుకు బాగానే వచ్చింది కదా అన్నాడు తారక్. కానీ, ఎందుకో నేను మళ్లి చెద్దాం అన్నాను. అప్పుడు ప్రాక్టీస్ చేస్తుండగా నా కాలు స్లిప్ అయ్యి బెణికింది. వెంటనే కాలు వాచిపోయింది. అది చూసి ఎన్టీఆర్ పరిగెత్తుకుంటూ వచ్చి నా కాలు పట్టుకుని స్ప్రే చేసి జాగ్రత్తగా కూర్చోబెట్టాడు. అంత గొప్ప స్టార్‌కి అదంతా చేయాల్సిన అవసరం లేదు. ఏ బాబు చూడండమ్మా అని చెప్పచ్చు. చాలా మంది చూసి చూడనట్లు వెళ్లిపోతారు. కానీ, తారక్ అలాంటి వ్యక్తి కాదు. ఆ భగవంతుడు తారక్ చల్లగా చూడాలి’ అంటూ ఆమె చెప్పుకొచ్చింది. -
సుందరం మాస్టర్‌పై నటి సుధ సంచలన వ్యాఖ్యలు, సెట్లో అందరి ముందే..
Actress Sudha Sensational Comments On Sundaram Master: సీనియర్ నటి సుధ ప్రముఖ కొరియోగ్రాఫర్, ప్రభుదేవ తండ్రి సుందరం మాస్టర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ ఓ మూవీ సెట్లో ఆయన తనని ఘోరంగా అవమానించారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘తమిళంలో ఓ సినిమా పాటను షూట్ చేస్తున్న సమయంలో సుందరం మాస్టర్ నాతో డ్యాన్స్ మూమెంట్స్ చేయిస్తున్నారు. అయితే అవి నాకు అర్థం కాకపోవడంతో ఐదుకు పైగా టేకులు తీసుకున్నాను. దీంతో ఆయన కోపంతో నాపై అందరి ముందే అరిచారు. చదవండి: దర్శకుడు మోసం చేశాడు, ఆ ఫొటోలు నా జీవితానికి మచ్చ తెచ్చాయి: నటి అంతేకాదు నాపై అనుచిత వ్యాఖ్యలు కూడా చేశారు. ‘నువ్వు వ్యభిచారానికి కూడా పనికి రావు’ అంటూ అనకుడని మాట అన్నారు’ అని చెప్పుకొచ్చారు. ఇక ఆయన మాటలు భరించలేకపోయానని, ఆ సమయంలో ప్రభు, పి.వాసు సహా పలువురు పెద్దలు సెట్లో ఉన్నారని ఆమె పేర్కొన్నారు. దీంతో ఏడుస్తూ ఇంటికి వెళ్లానని, ఈ విషయం తన తల్లికి చెప్పుకుని బాధపడ్డానంటూ ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న ఆర్టిస్టు అయినా, పెద్ద ఆర్టిస్టు అయినా నటీనటులను అలా అనడం తప్పని, ఆయన నాపై వాడకూడని పదాలు వాడారంటూ సుధ వాపోయారు. చదవండి: బాబోయ్ ఇలియాన సాహసం, అలాంటి ఫొటో షేర్ చేసిందేంటి! ఇక ఎప్పటికీ ఆయన సినిమాల్లో నటించకూడదని నిర్ణయించుకున్నన్నారు. అయితే ఓ రోజు ఆయన దర్శకత్వం వహిస్తున్న ఓ సినిమాలో తల్లి పాత్ర కోసం సుందరం మాస్టర్ తనని కలిశారని, ఆయనని చూడగానే సినిమా చేయనని చెప్పానన్నారు. కానీ ఆయన తనను అన్న వ్యాఖ్యలకు పశ్చాత్తాపపడ్డారని, అందుకు క్షమాపణలు చెప్పేందుకు వచ్చినట్లు సుందరం మాస్టర్ తనతో అన్నట్లు చెప్పారు. ఆయన క్షమాపణలు చెప్పాగానే ఆయన సినిమా చేసేందుకు ఓకే చెప్పానని తెలిపింది. ఆ సినిమా షూటింగ్ సమయంలో రెండు పేజీల డైలాగ్ ఫస్ట్ షాట్‌కే చెప్పడంతో ఆయనే స్యయంగా వచ్చి ప్రశంసించడమే కాకుండా, అందరి ముందు అవమానించినందుకు క్షమాపణలు కూడా కోరారని నటి సుధ వెల్లడించారు. -
ఒంటరి జీవితం, వాళ్లకు నాలాంటి పరిస్థితే వస్తుంది: నటి సుధ కంటతడి
ఎన్నో వందలాది చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది నటి సుధ. బాలనటిగా అలరించిన ఆమె పద్నాలుగేళ్ల వయసులోనే హీరోయిన్‌గానూ మారింది. ఆ తర్వాత అత్తగా, అమ్మగా, వదినగా ఇలా ఎన్నో పాత్రల్లో ఒదిగిపోయి ప్రేక్షకులకు మరింత దగ్గరైంది సుధ. తాజాగా ఆమె తన జీవితంలోని ఒడిదుడుకులను కళ్లకు కట్టినట్లు వివరించింది. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. 'ఇన్నేళ్ల కెరీర్లో చాలా సంపాదించుకున్నాను, కానీ బిజినెస్‌లు పెట్టి ఉన్నదంతా పోగొట్టుకున్నాను. ఢిల్లీలో ఒక హోటల్ పెట్టినప్పుడు లాభం వస్తే దాంతో మరో హోటల్ పెట్టాను. అప్పుడు నష్టాలొచ్చి నిండా మునిగాను. కొన్నాళ్లపాటు నేను హైదరాబాద్‌లోనే ఉన్నాను. కానీ కుటుంబ సమస్యలు, అమ్మాయి పెళ్లి ఉండటంతో చెన్నైకి మారాల్సి వచ్చింది. అబ్బాయి యూఎస్‌లో ఉన్నాడు.' 'చిన్నప్పుడే అమ్మ హార్ట్ ఎటాక్‌తో చనిపోయింది. ఆమె పోయిన తర్వాత కొడుకులున్నా నాన్నకు సపోర్ట్ లేకుండా పోవడంతో ఆయనని నేనే చూసుకున్నాను. నాన్నకు బాగానే ఆస్తుపాస్తులు ఉండేవి. కానీ క్యాన్సర్ వల్ల అది కరిగిపోయింది. అమ్మ పోయినప్పుడు కూడా అంత బాధపడలేదు, కానీ నాన్న పోయాక లైఫ్ అంటే ఏంటో తెలిసొచ్చింది. ఒంటరి జీవితాన్ని గడుపుతున్నాను. మనుషుల్ని నమ్మకూడదని అర్థమైంది. నాన్నకు క్యాన్సర్ అనగానే బంధువులంతా దూరం పెట్టారు.. వీటినుంచి నేను చాలా గుణపాఠాలు నేర్చుకున్నాను. నా భర్త, కొడుకులు కూడా నాకు దూరంగా ఎక్కడో యూఎస్‌లో ఉన్నారు. కానీ వాళ్లకూ నాలాంటి పరిస్థితే వస్తుంది. మాతృదేవోభవ సినిమాలోని చాలా సంఘటనలు నా నిజ జీవితంలో జరిగినవే..' అంటూ కన్నీళ్లు పెట్టుకుంది సుధ. -
ప్రేమిస్తే
ప్రేమలోని విభిన్న కోణాన్ని ఆవిష్కరిస్తూ రూపొందుతోన్న చిత్రం ‘ప్రేమిస్తే పోయే కాలం’. జి. రవిచంద్ర దర్శకత్వంలో తులసి ప్రొడక్షన్స్ పతాకంపై రమణేశ్వరి సమర్పణలో డి.ఇ. రాజు ఈ సినిమా నిర్మిస్తున్నారు. ప్రవీణ్‌కుమార్, శ్వేత ఇందులో హీరో హీరోయిన్లు. కీలకమైన తల్లి పాత్రను సీనియర్ నటి సుధ పోషిస్తున్నారు. దర్శ, నిర్మాతలు మాట్లాడుతూ -‘‘తల్లీ కొడుకులు అనుబంధాన్ని సరికొత్త రీతిలో ఆవిష్కరించే సినిమా ఇది. ప్రేమ, యువతరం భావోద్వేగాలకు పెద్ద పీట వేస్తున్నాం. ఈ నెల 14న పాటలను, ఈ నెలాఖరున చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: డా. అశోక్, సంగీతం: కె. కార్తీక్.