Senior Actress Sudha: Shocking Comments On Famous Coreographer Sundharam Master Deets Inside - Sakshi
Sakshi News home page

Actress Sudha: అనకూడని మాటలు అన్నారు, ఘోరంగా అవమానించారు: నటి ఆవేదన

Published Sat, Feb 5 2022 5:08 PM | Last Updated on Sat, Feb 5 2022 6:38 PM

Senior Actress Sudha About Famous Coreographer Sundharam Master - Sakshi

Actress Sudha Sensational Comments On Sundaram Master: సీనియర్‌ నటి సుధ ప్రముఖ కొరియోగ్రాఫర్‌, ప్రభుదేవ తండ్రి సుందరం మాస్టర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ ఓ మూవీ సెట్‌లో ఆయన తనని ఘోరంగా అవమానించారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘తమిళంలో ఓ సినిమా పాటను షూట్‌ చేస్తున్న సమయంలో సుందరం మాస్టర్‌ నాతో డ్యాన్స్‌ మూమెంట్స్‌ చేయిస్తున్నారు. అయితే అవి నాకు అర్థం కాకపోవడంతో ఐదుకు పైగా టేకులు తీసుకున్నాను. దీంతో ఆయన కోపంతో నాపై అందరి ముందే అరిచారు. 

చదవండి: దర్శకుడు మోసం చేశాడు, ఆ ఫొటోలు నా జీవితానికి మచ్చ తెచ్చాయి: నటి

అంతేకాదు నాపై అనుచిత వ్యాఖ్యలు కూడా చేశారు. ‘నువ్వు వ్యభిచారానికి కూడా పనికి రావు’ అంటూ అనకుడని మాట అన్నారు’ అని చెప్పుకొచ్చారు. ఇక ఆయన మాటలు భరించలేకపోయానని, ఆ సమయంలో ప్రభు, పి.వాసు సహా పలువురు పెద్దలు సెట్‌లో ఉన్నారని ఆమె పేర్కొన్నారు. దీంతో ఏడుస్తూ ఇంటికి వెళ్లానని, ఈ విషయం తన తల్లికి చెప్పుకుని బాధపడ్డానంటూ ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న ఆర్టిస్టు అయినా, పెద్ద ఆర్టిస్టు అయినా నటీనటులను అలా అనడం తప్పని, ఆయన నాపై వాడకూడని పదాలు వాడారంటూ సుధ వాపోయారు. 

చదవండి: బాబోయ్‌ ఇలియాన సాహసం, అలాంటి ఫొటో షేర్‌ చేసిందేంటి!

ఇక ఎప్పటికీ ఆయన సినిమాల్లో నటించకూడదని నిర్ణయించుకున్నన్నారు. అయితే ఓ రోజు ఆయన దర్శకత్వం వహిస్తున్న ఓ సినిమాలో తల్లి పాత్ర కోసం సుందరం మాస్టర్ తనని కలిశారని, ఆయనని చూడగానే సినిమా చేయనని చెప్పానన్నారు. కానీ ఆయన తనను అన్న వ్యాఖ్యలకు పశ్చాత్తాపపడ్డారని, అందుకు క్షమాపణలు చెప్పేందుకు వచ్చినట్లు సుందరం మాస్టర్‌ తనతో అన్నట్లు చెప్పారు. ఆయన క్షమాపణలు చెప్పాగానే ఆయన సినిమా చేసేందుకు ఓకే చెప్పానని తెలిపింది. ఆ సినిమా షూటింగ్ సమయంలో రెండు పేజీల డైలాగ్ ఫస్ట్ షాట్‌కే చెప్పడంతో ఆయనే స్యయంగా వచ్చి ప్రశంసించడమే కాకుండా, అందరి ముందు అవమానించినందుకు క్షమాపణలు కూడా కోరారని నటి సుధ వెల్లడించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement