prabudeva
-
శ్రీవారి సన్నిదిలో ప్రభుదేవా..
-
సుందరం మాస్టర్‌పై నటి సుధ సంచలన వ్యాఖ్యలు, సెట్లో అందరి ముందే..
Actress Sudha Sensational Comments On Sundaram Master: సీనియర్ నటి సుధ ప్రముఖ కొరియోగ్రాఫర్, ప్రభుదేవ తండ్రి సుందరం మాస్టర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ ఓ మూవీ సెట్లో ఆయన తనని ఘోరంగా అవమానించారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘తమిళంలో ఓ సినిమా పాటను షూట్ చేస్తున్న సమయంలో సుందరం మాస్టర్ నాతో డ్యాన్స్ మూమెంట్స్ చేయిస్తున్నారు. అయితే అవి నాకు అర్థం కాకపోవడంతో ఐదుకు పైగా టేకులు తీసుకున్నాను. దీంతో ఆయన కోపంతో నాపై అందరి ముందే అరిచారు. చదవండి: దర్శకుడు మోసం చేశాడు, ఆ ఫొటోలు నా జీవితానికి మచ్చ తెచ్చాయి: నటి అంతేకాదు నాపై అనుచిత వ్యాఖ్యలు కూడా చేశారు. ‘నువ్వు వ్యభిచారానికి కూడా పనికి రావు’ అంటూ అనకుడని మాట అన్నారు’ అని చెప్పుకొచ్చారు. ఇక ఆయన మాటలు భరించలేకపోయానని, ఆ సమయంలో ప్రభు, పి.వాసు సహా పలువురు పెద్దలు సెట్లో ఉన్నారని ఆమె పేర్కొన్నారు. దీంతో ఏడుస్తూ ఇంటికి వెళ్లానని, ఈ విషయం తన తల్లికి చెప్పుకుని బాధపడ్డానంటూ ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న ఆర్టిస్టు అయినా, పెద్ద ఆర్టిస్టు అయినా నటీనటులను అలా అనడం తప్పని, ఆయన నాపై వాడకూడని పదాలు వాడారంటూ సుధ వాపోయారు. చదవండి: బాబోయ్ ఇలియాన సాహసం, అలాంటి ఫొటో షేర్ చేసిందేంటి! ఇక ఎప్పటికీ ఆయన సినిమాల్లో నటించకూడదని నిర్ణయించుకున్నన్నారు. అయితే ఓ రోజు ఆయన దర్శకత్వం వహిస్తున్న ఓ సినిమాలో తల్లి పాత్ర కోసం సుందరం మాస్టర్ తనని కలిశారని, ఆయనని చూడగానే సినిమా చేయనని చెప్పానన్నారు. కానీ ఆయన తనను అన్న వ్యాఖ్యలకు పశ్చాత్తాపపడ్డారని, అందుకు క్షమాపణలు చెప్పేందుకు వచ్చినట్లు సుందరం మాస్టర్ తనతో అన్నట్లు చెప్పారు. ఆయన క్షమాపణలు చెప్పాగానే ఆయన సినిమా చేసేందుకు ఓకే చెప్పానని తెలిపింది. ఆ సినిమా షూటింగ్ సమయంలో రెండు పేజీల డైలాగ్ ఫస్ట్ షాట్‌కే చెప్పడంతో ఆయనే స్యయంగా వచ్చి ప్రశంసించడమే కాకుండా, అందరి ముందు అవమానించినందుకు క్షమాపణలు కూడా కోరారని నటి సుధ వెల్లడించారు. -
షాకిస్తున్న అనసూయ లేటెస్ట్ లుక్, ఈ రేంజ్లో గ్లామర్ ఇచ్చిందా!
Anasuya Bharadwaj Shocking Look Goes Viral: ప్రముఖ యాంకర్ అనసూయ భరద్వాజ్ గ్లామర్ షో గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బుల్లితెరపై యాంకర్‌గా రాణిస్తున్న అనసూయ పొట్టిపొట్టి దస్తులు, చీరకట్టులు అందాల అరబోస్తూ ఏ రేంజ్లో గ్లామర్ ఒలకబోతుందో తెలిసిందే. ఇక సినిమాల్లో కూడా నటిగా రాణిస్తున్న అనసూయ పాత్ర నచ్చితే అది గ్లామరైన, డీగ్లామరైన సై అంటుంది. పాత్ర ప్రాధాన్యత ఉందంటే చాలు ఏ స్థాయిలో ఎక్స్పోజింగ్ ఇవ్వమన్న ఇస్తుంది.. లేదా గ్రామీణ మహిళగా ఎంతటి డీగ్లామర్కైన ఒకే చెబుతుంది. ఇలా విమర్శలు, ప్రశంసలు అందుకుంటూ అనసూయ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా నటిగా దూసుకుపోతోంది. చదవండి: బన్నీ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ఓటీటీలోకి పుష్ప మూవీ ఈ క్రమంలో ఆమె తాజాగా నటించిన పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప. ఈ మూవీలో ద్రాక్షాయణిగా అనసూయ డిఫరెంట్ లుక్‌లో కనిపించింది. ఇదిలా ఉంటే ఈ మూవీ విడుదలకు ముందు ఆమెకు సంబంధించిన రెండు ఫొటోలు బయటకు వచ్చాయి. అయితే అది చూసి అందరూ షాకయ్యారు. ఏంటి అనసూయ పుష్పలో ఈ రేంజ్ ఎక్స్పోజింగ్ ఇచ్చిందా?అని ముక్కున వేలెసుకుంటున్నారంతా. తీరా గమనించి చూడగా ఈ లుక్‌లో తేడా కనిపించింది. ఇవి ఎక్కడివని అని ఆరా తీయగా అసలు విషయం బయటకొచ్చింది. ఇది ఆమె తాజాగా నటిస్తున్న ‘ఫ్లాష్ బ్యాక్’ చిత్రం లోనిది. చదవండి: త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న యంగ్ హీరో, ఇలా హింట్ ఇచ్చాడుగా.. ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడు ప్రభుదేవా, నటి రెజీనా ప్రధాన పాత్రలో వస్తున్న ఈ చిత్రంలో అనసూయ ఓ కీలక పాత్ర పోషిస్తోంది. ఇటీవల ప్రభుదేవా, రెజీనా లుక్‌తో పాటు అనసూయకు సంబంధించిన లుక్‌ను కూడా విడుదల చేశారు. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమాలో అనసూయకు సంబంధించిన మరో ఫొటో కూడా బయటకు వచ్చింది. ఈ రెండు ఫొటోలను కలిపి నెటిజన్లు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. ఇందులో అనసూయ మత్తిచ్చే రేంజ్లో గ్లామర్‌ను ప్రదర్శించింది. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. -
‘మిస్టర్ ప్రేమికుడి’గా ప్రభుదేవా
ప్రభుదేవా, అదా శర్మ, నిక్కీ గల్రాని హీరో హీరోయిన్లుగా నటించిన తమిళ చిత్రం ‘చార్లీ చాప్లిన్ 2’. శక్తి చిదంబరం దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఎమ్.వి. కృష్ణ సమర్పణలో వి. శ్రీనివాసరావు, గుర్రం మహేశ్ చౌదరి ‘మిస్టర్ ప్రేమికుడు’ పేరుతో తెలుగులో ఈ నెల 29న విడుదల చేస్తున్నారు. వి. శ్రీనివాసరావు, గుర్రం మహేష్ చౌదరి మాట్లాడుతూ.. ‘‘పూర్తి స్థాయి కామెడీ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రమిది. పాటలతో పాటు సెకండాఫ్‌లో వచ్చే సన్నివేశాలు సినిమాకు హైలెట్‌గా నిలుస్తాయి. ప్రభుదేవా నటన, డ్యాన్స్‌తో పాటు అదా శర్మ, నిక్కీ గల్రాని అందం, అభినయం సినిమాకు ప్రత్యేక ఆకర్షణ. చాలా కాలం తర్వాత ప్రభుదేవా తరహా హాస్యంతో పాటు ఆయన డ్యా¯Œ ్సని మరోసారి తెలుగు ప్రేక్షకులు చూస్తారు’’ అన్నారు. -
చెన్నైలో ప్రారంభమైన ప్రభుదేవ కొత్త సినిమా
సాక్షి, చెన్నై: నటుడు, దర్శకుడు ప్రభుదేవా హీరోగా ఓ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ సోమవారం చెన్నైలో పూజా కార్యక్రమాలను జరుపుకుంది. ప్రముఖ గీత రచయిత, నటుడు పా.విజయ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో ప్రభుదేవాకు జంటగా మహిమా నంబియార్ నటిస్తోంది. ఎంఎస్ మూవీస్ పతాకంపై కె.మురుగన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి గణేషన్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో కలైయరసన్, అర్జయ్ వంటి తదితర నటులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. -
ప్రభుదేవాతో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన నికీషా
సాక్షి, సినిమా: నటి నికీషా పటేల్ ప్రభుదేవాను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే అందులో ఎలాంటి వాస్తవం లేదని తన ట్వీటర్ ద్వారా క్లారిటీ ఇచ్చింది. నికీషా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మీకు ఏ హీరో నటన అంటే ఇష్టం అని అడిగితే.. వెంటనే చాలా మంది హీరోల నటన నాకు ఇష్టం. ముఖ్యంగా ప్రభుదేవా అంటే చాలా ఇష్టం. ఆయన, మా కుటుంబం మధ్య మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దీంతోపాటు ప్రభుదేవాతో నటిస్తారా అని అడగగా.. సినిమా ఏంటి? నేను ఆయన్ని పెళ్లి చేసుకోవడానికైనా రెడీ అని నికీషా పటేల్ పేర్కొంది. అది ఇప్పుడు సోషల్ మీడియాల్లో వైరల్ అవడంతో నికీషా దానిపై క్లారిటీ ఇచ్చింది. ‘ప్రభుదేవా గురించి నేను అన్న మాటలపై చాలా వార్తాలు పుట్టుకొస్తున్నాయి. వీటిపై ఓ క్లారిటీ ఇవ్వాల్సిన సమయం వచ్చింది. వాటిలో ఎలాంటి నిజం లేదు. నేను నా కుటుంబంతో చాలా బిజీగా ఉన్నాను.’అని తన ట్వీటర్లో పేర్కొంది. ‘ప్రభుదేవా సర్ గురించి నేను అన్న మాటలపై చాలా వార్తా పత్రికలు, మీడియా వెబ్సైట్లు చాలా రకాలుగా వార్తలు రాసేస్తున్నాయి. నేను ప్రభుదేవానే కాదు ఎవరినీ పెళ్లి చేసుకోవడం లేదు. ఆయన నాకు మంచి స్నేహితుడు, శ్రేయోభిలాషి మాత్రమే. నేను ప్రభుదేవాను సర్ అని పిలుస్తాను.’ అని తన పీఆర్వో రమేష్ బాల ట్వీటర్ ద్వారా తెలిపారు. నికీషాపటేల్ పులి సినిమాలో పవన్‌కల్యాణ్‌కు జంటగా నటించి తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన విషయం తెలిసిందే. నికీషా పటేల్ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలో సినిమాల్లో నటించింది. ప్రస్తుతం ‘తేరీ మెహర్బానియా 2’ అనే బాలీవుడ్ సినిమాలో నటిస్తున్నారు. Im so fed up with media calls last few days its about time i clarify this is not true...this news has been completely misunderstood. I'm busy with work and family. pic.twitter.com/9pTjFHWu1W — Nikesha Patel (@NikeshaPatel) May 13, 2018 Actress @NikeshaPatel issues a clarification.. " After many papers and websites carrying Prabhu deva sir news, I think it's time to clarify that's it's not true ...I'm not marrying anyone....he's purely just a friend...And a wellwisher. I call him sir only.. " @proyuvraaj pic.twitter.com/6lwAPNK7Sb — Ramesh Bala (@rameshlaus) May 13, 2018 -
మాటలు వద్దోయ్... సైగలు చాలోయ్!
అవును... హీరోయిన్ తమన్నా ఏమీ మాట్లాడరు. మీరు ఏం మాట్లాడినా వినిపించుకోరు. ఓన్లీ సైగలే. అయ్యో... తమన్నాకి ఏమైంది? ఎందుకీ కోపం అనుకుంటున్నారా? ఓ క్యారెక్టర్ కోసం కెమెరా ముందు ఇలా చేస్తున్నారామె. చక్రి తోలేటి దర్శకత్వంలో ప్రభుదేవా, తమన్నా, భూమిక ముఖ్య తారలుగా రూపొందుతున్న హిందీ చిత్రం ‘కామోషీ’. ఈ సినిమాలో మూగ–చెవిటి అమ్మాయి పాత్రలో తమన్నా కనిపించనున్నారని టాక్. హిందీలో తమన్నా అయితే.. తమిళ్లో నయనతార ఈ పాత్ర చేశారు. ‘కొలైయుదిర్ కాలమ్’ పేరుతో తమిళంలో ఈ సినిమా రూపొందింది. తమిళ వెర్షన్ రిలీజ్‌కి రెడీగా ఉంది. ఈలోపు హిందీ రీమేక్ మొదలైంది. హిందీ చిత్రాల్లో తక్కువగా కనిపించే తమన్నా.. ఈ మూవీ రిలీజ్ తర్వాత బోలెడన్ని చాన్స్‌లు చేజిక్కించుకుంటారనే అంచనాలు ఉన్నాయి. ఈ సంగతి ఇలా ఉంచితే.. ‘బాహుబలి’లో నటనకుగానూ ఈ ఏడాది దాదాసాహెబ్ ఫాల్కే ఎక్స్‌లెన్స్ అవార్డు తమన్నాకు దక్కిన విషయం తెలిసిందే. ప్రస్తుతం చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘సైరా’లోను, బాలీవుడ్ హిట్ ‘క్వీన్’ తెలుగు రీమేక్‌లోనూ నటిస్తున్నారు తమన్నా. -
నిన్ను నేను ఆడిస్తాగా అన్నారు: నటి
తమిళసినిమా: నిన్ను నేను ఆడిస్తాగా అని హన్సికను ప్రభుదేవా అన్నారన్న విషయాన్ని ఆ అమ్మడే స్వయంగా చెప్పారు. హన్సిక ప్రస్తుతం ప్రభుదేవాతో గులేబకావళి చిత్రంలో రొమాన్స్ చేస్తున్నది. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సందర్భంగా హన్సిక మాట్లాడుతూ మరో ఐదేళ్ల వరకూ నటిగా బాగా శ్రమించాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. ఇంతకుముందు ప్రభుదేవా దర్శకత్వంలో ఎంగేయుమ్ కాదల్ చిత్రంలో నటించానని, ఆయన నిర్మాతగా బోగన్ చిత్రంలో జయం రవికి జంటగా నటించానని గుర్తు చేశారు. తాజాగా ప్రభుదేవాతోనే గులేబకావళి చిత్రంలో నటించడం సరికొత్త అనుభవంగా ఉందని పేర్కొన్నారు. ప్రతి రోజూ ప్రభుదేవా సెట్లోకి వచ్చేటప్పుడు తాను ఎవరో ఒకరిలా మిమిక్రీ చేస్తుంటాననీ చెప్పింది. అది చూసి ఆయన నవ్వుకుంటారని హన్సిక అన్నది. ఆయనతో నటించేటప్పుడు మాత్రం కాస్త గాభరా పడుతుంటానన్నారు. ముఖ్యంగా పాటల చిత్రీకరణలో డాన్స్ చేసేటప్పుడు తడబడుతుంటానన్నారు. అయితే ప్రభుదేవా మాత్రం చాలా కూల్‌గా ఉంటారని, నీకు ఎలాంటి భయం అవసరం లేదు.. నేను నిన్ను ఆడిస్తాగా అని ఎంతో ఎంకరేజ్ చేస్తారని హన్సిక చెప్పారు. -
స్టార్ స్టార్ సూపర్ స్టార్ - ప్రభుదేవ