Prabhudeva's Mr Premikudu Movie Released On Oct 29th - Sakshi
Sakshi News home page

‘మిస్టర్‌ ప్రేమికుడి’గా ప్రభుదేవా

Published Thu, Oct 21 2021 11:40 AM | Last Updated on Thu, Oct 21 2021 1:00 PM

Prabhudeva And Adah Sharma Mr Premikudu Release On 29th October - Sakshi

ప్రభుదేవా, అదా శర్మ, నిక్కీ గల్రాని హీరో హీరోయిన్లుగా నటించిన తమిళ చిత్రం ‘చార్లీ చాప్లిన్‌ 2’. శక్తి చిదంబరం దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఎమ్‌.వి. కృష్ణ సమర్పణలో వి. శ్రీనివాసరావు, గుర్రం మహేశ్‌ చౌదరి ‘మిస్టర్‌ ప్రేమికుడు’ పేరుతో తెలుగులో ఈ నెల 29న విడుదల చేస్తున్నారు.

వి. శ్రీనివాసరావు, గుర్రం మహేష్‌ చౌదరి మాట్లాడుతూ.. ‘‘పూర్తి స్థాయి కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన చిత్రమిది. పాటలతో పాటు సెకండాఫ్‌లో వచ్చే సన్నివేశాలు సినిమాకు హైలెట్‌గా నిలుస్తాయి. ప్రభుదేవా నటన, డ్యాన్స్‌తో పాటు అదా శర్మ, నిక్కీ గల్రాని అందం, అభినయం సినిమాకు ప్రత్యేక ఆకర్షణ. చాలా కాలం తర్వాత ప్రభుదేవా తరహా హాస్యంతో పాటు ఆయన డ్యా¯Œ ్సని మరోసారి తెలుగు ప్రేక్షకులు చూస్తారు’’ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement