
అవును... హీరోయిన్ తమన్నా ఏమీ మాట్లాడరు. మీరు ఏం మాట్లాడినా వినిపించుకోరు. ఓన్లీ సైగలే. అయ్యో... తమన్నాకి ఏమైంది? ఎందుకీ కోపం అనుకుంటున్నారా? ఓ క్యారెక్టర్ కోసం కెమెరా ముందు ఇలా చేస్తున్నారామె. చక్రి తోలేటి దర్శకత్వంలో ప్రభుదేవా, తమన్నా, భూమిక ముఖ్య తారలుగా రూపొందుతున్న హిందీ చిత్రం ‘కామోషీ’. ఈ సినిమాలో మూగ–చెవిటి అమ్మాయి పాత్రలో తమన్నా కనిపించనున్నారని టాక్. హిందీలో తమన్నా అయితే.. తమిళ్‌లో నయనతార ఈ పాత్ర చేశారు.
‘కొలైయుదిర్ కాలమ్’ పేరుతో తమిళంలో ఈ సినిమా రూపొందింది. తమిళ వెర్షన్ రిలీజ్‌కి రెడీగా ఉంది. ఈలోపు హిందీ రీమేక్ మొదలైంది. హిందీ చిత్రాల్లో తక్కువగా కనిపించే తమన్నా.. ఈ మూవీ రిలీజ్ తర్వాత బోలెడన్ని చాన్స్‌లు చేజిక్కించుకుంటారనే అంచనాలు ఉన్నాయి. ఈ సంగతి ఇలా ఉంచితే.. ‘బాహుబలి’లో నటనకుగానూ ఈ ఏడాది దాదాసాహెబ్ ఫాల్కే ఎక్స్‌లెన్స్ అవార్డు తమన్నాకు దక్కిన విషయం తెలిసిందే. ప్రస్తుతం చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘సైరా’లోను, బాలీవుడ్ హిట్ ‘క్వీన్’ తెలుగు రీమేక్‌లోనూ నటిస్తున్నారు తమన్నా.
Comments
Please login to add a commentAdd a comment