Anasuya Bharadwaj: Latest Look From Flashback Movie Photos Goes Viral - Sakshi
Sakshi News home page

Anasuya Bharadwaj: షాకిస్తున్న అనసూయ లేటెస్ట్‌ లుక్‌, ఈ రేంజ్‌లో గ్లామర్ ఇచ్చిందా!

Published Sat, Dec 18 2021 2:03 PM | Last Updated on Sat, Dec 18 2021 4:39 PM

Anasuya Bharadwaj Latest Look From Flashback Movie Photos Goes Viral - Sakshi

Anasuya Bharadwaj Shocking Look Goes Viral: ప్రముఖ యాంకర్‌ అనసూయ భరద్వాజ్‌ గ్లామర్‌ షో గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బుల్లితెరపై యాంకర్‌గా రాణిస్తున్న అనసూయ పొట్టిపొట్టి దస్తులు, చీరకట్టులు అందాల అరబోస్తూ ఏ రేంజ్‌లో గ్లామర్‌ ఒలకబోతుందో తెలిసిందే. ఇక సినిమాల్లో కూడా నటిగా రాణిస్తున్న అనసూయ పాత్ర నచ్చితే అది గ్లామరైన, డీగ్లామరైన సై అంటుంది. పాత్ర ప్రాధాన్యత ఉందంటే చాలు ఏ స్థాయిలో ఎక్స్‌పోజింగ్‌ ఇవ్వమన్న ఇస్తుంది.. లేదా గ్రామీణ మహిళగా ఎంతటి డీగ్లామర్‌కైన ఒకే చెబుతుంది. ఇలా విమర్శలు, ప్రశంసలు అందుకుంటూ అనసూయ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా నటిగా దూసుకుపోతోంది.

చదవండి: బన్నీ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌.. ఓటీటీలోకి పుష్ప మూవీ

ఈ క్రమంలో ఆమె తాజాగా నటించిన పాన్‌ ఇండియా చిత్రం ‘పుష్ప. ఈ మూవీలో ద్రాక్షాయణిగా అనసూయ డిఫరెంట్‌ లుక్‌లో కనిపించింది. ఇదిలా ఉంటే ఈ మూవీ విడుదలకు ముందు ఆమెకు సంబంధించిన రెండు ఫొటోలు బయటకు వచ్చాయి. అయితే అది చూసి అందరూ షాకయ్యారు. ఏంటి అనసూయ పుష్పలో ఈ రేంజ్‌ ఎక్స్‌పోజింగ్‌ ఇచ్చిందా?అని ముక్కున వేలెసుకుంటున్నారంతా. తీరా గమనించి చూడగా ఈ లుక్‌లో తేడా కనిపించింది. ఇవి ఎక్కడివని అని ఆరా తీయగా అసలు విషయం బయటకొచ్చింది. ఇది ఆమె తాజాగా నటిస్తున్న ‘ఫ్లాష్‌ బ్యాక్‌’ చిత్రం లోనిది.

చదవండి: త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న యంగ్‌ హీరో, ఇలా హింట్‌ ఇచ్చాడుగా..

ప్రముఖ కొరియోగ్రాఫర్‌, దర్శకుడు ప్రభుదేవా, నటి రెజీనా ప్రధాన పాత్రలో వస్తున్న ఈ చిత్రంలో అనసూయ ఓ కీలక పాత్ర పోషిస్తోంది. ఇటీవల ప్రభుదేవా, రెజీనా లుక్‌తో పాటు అనసూయకు సంబంధించిన లుక్‌ను కూడా విడుదల చేశారు. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమాలో అనసూయకు సంబంధించిన మరో ఫొటో కూడా బయటకు వచ్చింది. ఈ రెండు ఫొటోలను కలిపి నెటిజన్లు సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ వైరల్‌ చేస్తున్నారు. ఇందులో అనసూయ మత్తిచ్చే రేంజ్‌లో గ్లామర్‌ను ప్రదర్శించింది. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తూ కామెంట్స్‌ చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement